టీడీపీ నేత కృష్ణను అరెస్టు చేయాలంటూ ఏఎస్‌ఐ మణికుమారికి ఫిర్యాదు చేస్తున్న దళితులు
మునగపాక (యలమంచిలి) : భారత మాజీ ఉప ప్రధాని బాబూ జగ్జీవన్‌రామ్ చిత్రపటాన్ని ధ్వంసం చేయటమే కాకుండా దళితులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన టీడీపీ నేత మద్దాల కృష్ణను అరెస్టు చేయాలని కోరుతూ శుక్రవారం మండలంలోని నాగులాపల్లిలో పూడిమడక రోడ్డుపై దళితులు ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న అనకాపల్లి రూరల్ సీఐ రామచంద్రరావు జోక్యం చేసుకుని ఆందోళనకారులను శాంతపరిచారు. వివరాలను ఫిర్యాదుదారు డు డొక్కా దేముడు విలేకరులకు తెలియ జేశారు. జగ్జీవన్‌రామ్ జయంతి వేడుకల్లో భాగంగా మండలంలోని నాగులాపల్లి పాలసంఘ ఆవరణలో దళితుల ఆధ్వర్యంలో చిత్రపటం ఏర్పాటు చేసి నివాళు లర్పించామన్నారు. సాయంత్రం ఇదే గ్రామానికి చెందిన టీడీపీ నేత మద్దాల కృష్ణ జగ్జీవన్‌రామ్ చిత్రపటం ధ్వంసం చేయడంతో పాటు దళితులపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు.
దళితులపై చేసిన వ్యాఖ్యలకు నిర సనగా శుక్రవారం దళితులు పూడిమడకరోడ్డుపై నాగులాపల్లి వద్ద ఆందోళనకు దిగారు. దళితులపై దూషణలు చేసిన కృష్ణను తక్షణమే అరెస్టు చేయాలని లేకుం టే ఆందోళన తీవ్రతరం చేస్తామంటూ హెచ్చరించారు. ఆందోళన నేపథ్యంలో వాహనాలు నిలిచిపోవడంతో ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. అనకాపల్లి సీఐ రామచంద్రరావు సంఘటన స్థలానికి చేరుకొని అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. ఆందోళనలో దళిత నేత దేముడు, కోనపల్లి నాగేశ్వరరావు, గోసాల గోపాలరావు, కశింకోట నరేష్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఏఎస్‌ఐ మణికుమారికి దళితులను కించపరిచిన కృష్ణను అరెస్టు చేయాలని కోరుతూ ఫిర్యాదు చేశారు. ఇదిలా ఉండగా తాను నాగులా పల్లి వెళ్లలేదని కృష్ణ ఫోన్‌లో తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment