
సాక్షి, విశాఖపట్నం: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దళిత ద్రోహి అని మండిపడ్డారు మంత్రి మేరుగు నాగార్జున. దళితుల అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధమా అని బాబుకు సవాల్ విసిరారు. దళితుల కోసం సీఎం జగన్ రూ.53వేల కోట్లు ఖర్చు చేశారని తెలిపారు. చంద్రబాబు హయాంలో దళితుల కోసం ఏం చేశారో చెప్పాలని నిలదీశారు.
చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్ దళితులను అవమానించేలా మాట్లాడిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. ఇద్దరూ దళిత వ్యతిరేకులని ద్వజమెత్తారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు దళితుల అభివృద్ధి కోసం గానీ, సంక్షేమం కోసం గానీ ఒక్క పనైనా చేశారా? అని మేరుగు ప్రశ్నించారు. దళివుల పేరుతో టీడీపీ కార్యకర్తలే దోపిడీకి పాల్పడ్డారని ధ్వజమెత్తారు.
చదవండి: ‘ఎన్టీఆర్ మాట్లాడిన వీడియోలు విడుదల చేసే దమ్ముందా?’
Comments
Please login to add a commentAdd a comment