సాక్షి, అమరావతి: బాబు జగ్జీవన్ రామ్ 113వ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఘన నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆయన సేవలను సీఎం జగన్ గుర్తు చేసుకున్నారు. ‘అట్టడుగు వర్గాల అభ్యున్నతి, అణగారిన ప్రజల సమాన హక్కుల కోసం బాబు జగ్జీవన్ రామ్ చేసిన పోరాటం మర్చిపోలేనిది. స్వాతంత్య్ర సమరయోధుడిగా, ఉపప్రధానిగా దేశసేవకు అంకితమైన ఆయన జీవితం స్ఫూర్తిదాయకం. నేడు బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా ఆయనకి ఘన నివాళి’ అని సీఎం జగన్ ట్వీట్ చేశారు. (వివక్షను జయించిన జగ్జీవన్)
కాగా సీఎం జగన్ ఆదివారం ఉదయం తన నివాసంలో బాబు జగ్జీవన్ రామ్ చిత్రపటానికి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మంత్రి విశ్వరూప్, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ఎంపీ నందిగం సురేష్, ఎమ్మెల్యే మేరుగ నాగార్జున తదితరులు పాల్గొన్నారు.
అట్టడుగు వర్గాల అభ్యున్నతి, అణగారిన ప్రజల సమాన హక్కుల కోసం బాబు జగ్జీవన్ రామ్ చేసిన పోరాటం మర్చిపోలేనిది. స్వాతంత్య్ర సమరయోధుడిగా, ఉపప్రధానిగా దేశసేవకు అంకితమైన ఆయన జీవితం స్ఫూర్తిదాయకం. నేడు బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా ఆయనకి ఘన నివాళి.
— YS Jagan Mohan Reddy (@ysjagan) April 5, 2020
Comments
Please login to add a commentAdd a comment