గుంటూరు, సాక్షి: ఆధునిక కవి, స్వరకర్త, సంగీతకారుడు, సామాజిక తత్వవేత్త శ్రీ భక్త కనకదాస జయంతి సందర్భంగా.. వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎక్స్ వేదికగా నివాళులర్పించారు.
శ్రీకృష్ణ భగవానుడికి కనకదాస గొప్ప భక్తుడని, ఆధునిక కవిగా ప్రజలలో భక్తి , సామాజిక బాధ్యతా, సమత్వం పెంపొందిస్తూ ఆయన చేసిన కీర్తనలు.. ఆ మహనీయుడి మార్గం సదా ఆచరణీయం అని తన ట్వీట్‌లో వైఎస్ జగన్ పేర్కొన్నారు.
కురుబ గౌడ దాస కుటుంబంలో జన్మించి శ్రీకృష్ణ భగవానుడికి గొప్ప భక్తుడు, ఆధునిక కవి, సంగీతకారుడు, స్వరకర్త శ్రీ భక్త కనకదాస జయంతి సందర్బంగా నివాళులు. ప్రజలలో భక్తి , సామాజిక బాధ్యతా , సమత్వం పెంపొందిస్తూ ఆయన చేసిన కీర్తనలు, ఆ మహనీయుడి మార్గం సదా ఆచరణీయం. pic.twitter.com/lq9enqM7Br
— YS Jagan Mohan Reddy (@ysjagan) November 18, 2024
అంతకు ముందు.. తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో కనకదాస జయంతి కార్యక్రమం జరిగింది. కనకదాస చిత్రపటానికి వైఎస్ జగన్ నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి ఉషాశ్రీచరణ్, హిందూపురం వైఎస్సార్‌సీపీ ఇంఛార్జ్ టి.ఎన్.దీపిక, పలువురు వైఎస్సార్‌సీపీ నాయకులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment