Babu Jagjivan Ram birth anniversary
-
బాబు జగ్జీవన్ జయంతి.. సీఎం జగన్ నివాళి
సాక్షి, తాడేపల్లి: ఏప్రిల్ 5వ తేదీన బాబు జగ్జీవన్ రామ్ 115వ జయంతి వేడుకల సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నివాళులు అర్పించారు. ‘‘స్వాతంత్ర్య సమర యోధుడు, జనం కోసమే తన జీవితాన్ని అంకితం చేసిన నాయకుడు బాబు జగ్జీవన్ రామ్ గారు. సుదీర్ఘకాలం పార్లమెంటేరియన్‌గా, ఉప ప్రధానిగా ఆయన దేశానికి అందించిన సేవలు చిరస్మరణీయం. నేడు ఆయన జయంతి సందర్భంగా నివాళులు’’ అంటూ ట్వీట్ చేశారు సీఎం జగన్. స్వాతంత్ర్య సమర యోధుడు, జనం కోసమే తన జీవితాన్ని అంకితం చేసిన నాయకుడు బాబు జగ్జీవన్ రామ్ గారు. సుదీర్ఘకాలం పార్లమెంటేరియన్‌గా, ఉప ప్రధానిగా ఆయన దేశానికి అందించిన సేవలు చిరస్మరణీయం. నేడు ఆయన జయంతి సందర్భంగా నివాళులు. — YS Jagan Mohan Reddy (@ysjagan) April 5, 2022 -
జగ్జీవన్ ఆశయాలకు జగన్ ఊపిరి
సాక్షి, అమరావతి: బాబూ జగ్జీవన్‌రామ్ ఆశయాలకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఊపిరిపోస్తున్నారని ప్రభుత్వ సలహాదారు, వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డి అన్నారు. రాజ్యాధికారంలో దళిత, బలహీనవర్గాలకు పెద్దపీట వేస్తూ ప్రతీ క్షణం వారి పక్షమేనని రుజువు చేస్తున్నారని తెలిపారు. జగ్జీవన్‌రామ్ 113వ జయంతి కార్యక్రమం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో సోమవారం ఘనంగా జరిగింది. పలువురు నాయకులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సజ్జల మాట్లాడుతూ... కులాలకతీతంగా పేదరికాన్ని పారదోలాలని జగ్జీవన్‌రామ్, అంబేడ్కర్ తలపెట్టిన యజ్ఞాన్ని సీఎం జగన్ మరింత స్ఫూర్తితో ముందుకు తీసుకెళ్తున్నారని కొనియాడారు. ఆయన ఇంకేమన్నారంటే... దళితులకు సమాన అవకాశాలు ‘‘భవిష్యత్ తరాలను దృష్టిలో ఉంచుకుని ఆ మహనీయులు గొప్ప దార్శనికత చూపారు. కానీ 70 ఏళ్ల భారత రాజకీయ వ్యవస్థ ఆ మహా సంకల్పాన్ని అరకొరగానే అమలు చేసింది. ఇన్నేళ్లయినా కొన్ని వర్గాలు ఆర్థిక, సామాజిక సమానత్వం పొందలేదన్నది చేదు వాస్తవమే. వైఎస్ జగన్ అధికారంలోకొచ్చిన 21 నెలల్లోనే జగ్జీవన్ రామ్ ఆశయాలకు ఊపిరి పోశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, పేదల పిల్లలు చదువుకునే ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా తీర్చిదిద్దారు. దళితులకు అన్ని చోట్లా సమాన అవకాశాలు ఇవ్వడంలో జగన్ తనకు తానే సాటి అన్పించుకున్నారు. సమాజంలో అణచివేతకు గురైన మహిళలను పైకి తేవాలనేది ఆయన తలంపు. మునిసిపల్ ఎన్నికల్లో 78 శాతం ఎస్సీ, ఎస్టీలు, బలహీనవర్గాలకే అవకాశం కల్పించారు. నామినేటెడ్ పోస్టుల్లోనూ ఇదే ఒరవడి కొనసాగించారు. రాబోయే కాలంలోనూ ఇదే కొనసాగుతుంది. అందుకే సీఎం వైఎస్ జగన్‌ను కొత్తతరం నేతగా ప్రజలు గుర్తిస్తున్నారు’’ అని సజ్జల పేర్కొన్నారు. నూతక్కి అశోక్‌కుమార్ రచించిన ‘దార్శనిక నేత డాక్టర్ బాబూజగ్జీవన్‌రామ్’ అనే పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించారు. ఎంపీ నందిగం సురేష్ మాట్లాడుతూ అన్ని రంగాల్లోనూ దళితులు ఎదగాలని సీఎం జగన్ కోరుకుంటున్నారన్నారు. తనలాంటి నిరుపేద దళితుడిని ఎంపీని చేయడం అందుకు నిదర్శనమని తెలిపారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి, ఎమ్మెల్యే మేరుగ నాగార్జున, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ కనకారావు, ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ చల్లా మధుసూధన్‌రెడ్డి, నేతలు పాల్గొన్నారు. -
బాబు జగ్జీవన్‌కు సీఎం జగన్ నివాళి
సాక్షి, అమరావతి: బాబు జగ్జీవన్ రామ్ 113వ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఘన నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆయన సేవలను సీఎం జగన్ గుర్తు చేసుకున్నారు. ‘అట్టడుగు వర్గాల అభ్యున్నతి, అణగారిన ప్రజల సమాన హక్కుల కోసం బాబు జగ్జీవన్ రామ్ చేసిన పోరాటం మర్చిపోలేనిది. స్వాతంత్య్ర సమరయోధుడిగా, ఉపప్రధానిగా దేశసేవకు అంకితమైన ఆయన జీవితం స్ఫూర్తిదాయకం. నేడు బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా ఆయనకి ఘన నివాళి’ అని సీఎం జగన్ ట్వీట్ చేశారు. (వివక్షను జయించిన జగ్జీవన్) కాగా సీఎం జగన్ ఆదివారం ఉదయం తన నివాసంలో బాబు జగ్జీవన్ రామ్ చిత్రపటానికి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మంత్రి విశ్వరూప్, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ఎంపీ నందిగం సురేష్, ఎమ్మెల్యే మేరుగ నాగార్జున తదితరులు పాల్గొన్నారు. అట్టడుగు వర్గాల అభ్యున్నతి, అణగారిన ప్రజల సమాన హక్కుల కోసం బాబు జగ్జీవన్ రామ్ చేసిన పోరాటం మర్చిపోలేనిది. స్వాతంత్య్ర సమరయోధుడిగా, ఉపప్రధానిగా దేశసేవకు అంకితమైన ఆయన జీవితం స్ఫూర్తిదాయకం. నేడు బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా ఆయనకి ఘన నివాళి. — YS Jagan Mohan Reddy (@ysjagan) April 5, 2020 -
దేశంలోనే ఏపీని అగ్రభాగాన నిలపాలనేది నా దార్శనికత
సాక్షి, హైదరాబాద్: దేశంలోనే ఆంధ్రప్రదేశ్‌ను అన్నింటా అగ్రభాగాన నిలపాలనేది తన దార్శనికత అని ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉద్ఘాటించారు. శుక్రవారం ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. ‘‘ఒక పారదర్శకమైన, సాంకేతికాభివృద్ధితో ముందుకెళుతున్న, అవినీతి లేని వికేంద్రీకృతమైన ప్రభుత్వ పాలనను మీ ముంగిళ్లలోనే అందించాలనేది నా ఆకాంక్ష. నిలకడగా రాణించే అభివృద్ధితో మన రాష్ట్రం దేశంలోనే అగ్రభాగాన ఉండేలా చేయాలనేది నా ఆలోచన’’ అని జగన్ ఈ ట్వీట్లో పేర్కొన్నారు. జగ్జీవన్‌రామ్‌కు జగన్ నివాళి.. అణగారిన వర్గాల సంక్షేమం, వారి సమానత్వం కోసం ఒక సామాజిక కార్యకర్తగా పోరాటం చేసిన మహానుభావుడు బాబూ జగ్జీవన్‌రామ్ అని వైఎస్ జగన్మోహన్రెడ్డి కీర్తించారు. జగ్జీవన్‌రామ్ జయంతిని పురస్కరించుకుని ఆయన్ను జగన్ స్మరించుకుంటూ నివాళులర్పించారు. రాజ్యాంగంలో అణగారిన వర్గాలకు ప్రాతినిధ్యం తేగలిగారని శ్లాఘిస్తూ శుక్రవారం ట్వీట్ చేశారు. -
‘జగ్జీవన్‌రామ్ బాటలో నడుద్దాం’
సాక్షి, హైదరాబాద్: బాబు జగ్జీవన్‌రామ్ ఆశయ సాధనకు కృషి చేస్తామని ఆర్టీసీ కార్మికులు పేర్కొన్నారు. బాబు జగ్జీవన్‌రామ్ జయంతి సందర్భంగా శుక్రవారం రాణిగంజ్ డీపో వన్‌లో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా డీపో మేనేజర్ పొన్నగంటి మల్లేశం మాట్లాడుతూ.. బాబు జగ్జీవన్‌రామ్ చూపిన బాటలో నడవాలని అన్నారు. బడుగు, బలహీన వర్గాల శ్రేయస్సు కోసం పాటు పడిన బాబు జగ్జీవన్‌రామ్ బాటలో నడవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పొన్నగంటి మల్లేశంతో పాటు సుద్దాల సురేశ్, పీవీరావు, గోపీ, సీఎస్ రెడ్డి, లక్ష్మణ్ నాయక్, రమేశ్, నరేందర్ తదితరులు పాల్గొన్నారు. -
జగ్జీవన్ రామ్‌ను స్మరించుకున్న వైఎస్ జగన్
సాక్షి, హైదరాబాద్ : బాబు జగ్జీవన్‌రామ్ జయంతి సందర్భంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఘనంగా నివాళులు అర్పించింది. బాబూ జగజ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా ఆయనను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి శుక్రవారం స్మరించుకున్నారు. అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం జగ్జీవన్ రామ్ చేసిన సేవలను వైఎస్ జగన్ కొనియాడారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. Remembering Babu Jagjivan Ram on his Jayanthi, a social activist who fought for the welfare and equality of the downtrodden, and brought about representation for them in the Constitution. — YS Jagan Mohan Reddy (@ysjagan) 5 April 2019 -
మంగళవారం ట్రాఫిక్ ఆంక్షలు
హైదరాబాద్ : బాబూ జగ్జీవన్ రామ్ జయంతిని పురస్కరించుకుని మంగళవారం ఎల్బీ స్టేడియం సమీపంలో ఉన్న ఆయన విగ్రహం వద్ద వివిధ కార్యక్రమాలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో సాధారణ ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా ఆ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తూ ట్రాఫిక్ చీఫ్ జితేందర్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. అబిడ్స్ నుంచి బీజేఆర్ విగ్రహం వైపు వచ్చే వాహనాలను గన్ ఫౌండ్రీ ఎస్బీహెచ్ నుంచి చాపెల్ రోడ్ మీదుగా మళ్లిస్తారు. అలాగే అబ్దుల్ రెహమాన్ పెట్రోల్ పంప్ నుంచి వచ్చే వహనాలను బీజేఆర్ విగ్రహం వైపుకు అనుమతించరు. నాంపల్లి మీదుగా మళ్లిస్తారు. మంగళవారం ఉదయం 5 గంటల నుంచి రాత్రి రాత్రి 10 గంటల వరకు ఈ ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని తెలిపారు.