
సాక్షి, తాడేపల్లి: ఏప్రిల్ 5వ తేదీన బాబు జగ్జీవన్ రామ్ 115వ జయంతి వేడుకల సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నివాళులు అర్పించారు.
‘‘స్వాతంత్ర్య సమర యోధుడు, జనం కోసమే తన జీవితాన్ని అంకితం చేసిన నాయకుడు బాబు జగ్జీవన్ రామ్ గారు. సుదీర్ఘకాలం పార్లమెంటేరియన్‌గా, ఉప ప్రధానిగా ఆయన దేశానికి అందించిన సేవలు చిరస్మరణీయం. నేడు ఆయన జయంతి సందర్భంగా నివాళులు’’ అంటూ ట్వీట్ చేశారు సీఎం జగన్.
స్వాతంత్ర్య సమర యోధుడు, జనం కోసమే తన జీవితాన్ని అంకితం చేసిన నాయకుడు బాబు జగ్జీవన్ రామ్ గారు. సుదీర్ఘకాలం పార్లమెంటేరియన్‌గా, ఉప ప్రధానిగా ఆయన దేశానికి అందించిన సేవలు చిరస్మరణీయం. నేడు ఆయన జయంతి సందర్భంగా నివాళులు.
— YS Jagan Mohan Reddy (@ysjagan) April 5, 2022