- హైదరాబాద్, రంగారెడ్డిలకు కలిపి రూ.20లక్షలు
సాక్షి, హైదరాబాద్: బీఆర్ అంబేద్కర్, బాబు జగ్జీవన్‌రాం జయంతి ఉత్సవాల నిర్వహణ కోసం నిధులు పెంచుతూ శనివారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఈ మేరకు సీఎం కేసీఆర్ ఈ నిధులను విడుదల చేసినట్టు సీపీఆర్‌ఓ శనివారం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ నెల 5న జగ్జీవన్‌రాం జయంతి, 14న అంబేద్కర్ జయంతి సందర్భంగా ఉత్సవాలు నిర్వహించేందుకు హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు రూ.10 లక్షల చొప్పున, 8 జిల్లాలకు లక్ష చొప్పున విడుదల చేసినట్టు ప్రకటనలో పేర్కొంది.
ఈ జయంతులను రాష్ర్టస్థాయి ఉత్సవాలుగా హైదరాబాద్‌లో జరిపేందుకు ఒక్కో ఉత్సవానికి రూ.10లక్షల చొప్పున మంజూరుచేసింది. ఆది వారం జరగనున్న జగ్జీవన్‌రాం జయంతి ఉత్సవాల్లో గవర్నర్ నరసింహన్, సీఎం కేసీఆర్ అతిథులుగా పాల్గొంటారు.