పేరు మార్చితే భారీ ఆందోళన
కాంగ్రెస్ నేతల హెచ్చరిక
పహాడీషరీఫ్: రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలోని దేశీయ టెర్మినల్‌కు ఎన్టీఆర్ పేరు పెడితే భారీ ఆందోళన చేపడతామని కాంగ్రెస్ రాజ్యసభ సభ్యులు వి.హనుమంతరావు, మాజీ మంత్రి దానం నాగేందర్ హెచ్చరించారు. 35 మంది పార్టీ నాయకులను శంషాబాద్ పోలీసులు అరెస్ట్ చేసి పహాడీషరీఫ్ పోలీస్‌స్టేషన్‌కు తరలిం చారు. విషయం తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పోలీస్‌స్టేషన్‌కు చేరుకున్నారు. అనంతరం టీ పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య, కాంగ్రెస్ శాసనసభ పక్షనేత కె.జానారెడ్డి, ఎమ్మెల్యేలు జీవన్‌రెడ్డి, గీతారెడ్డి, మల్లు భట్ట్టివిక్రమార్క స్టేషన్‌కు చేరుకొని హనుమంతరావుకు మద్దతు తెలిపారు.
ఈ సందర్భంగా వి.హనుమంత రావు మాట్లాడుతూ గ్రేటర్ హైదరాబాద్ నగరంలో ఉన్న ఆంధ్ర సెటిలర్ల ఓట్లు రాల్చుకునేందుకు చంద్రబాబునాయుడు కుట్రతో దేశీయటెర్మినల్‌కు ఎన్టీఆర్ పేరు పెడుతున్నారన్నారని ఆరోపించారు. కేంద్ర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతి రాజు తన పద్ధతి మార్చుకోకపోతే చెప్పులతో స్వాగతం పలకాల్సి ఉంటుందన్నారు. కేంద్రం తనవైఖరిని మార్చుకోకపోతే పెద్దఎత్తున ఆందోళన చేపడతామని దానం నాగేందర్ హెచ్చరించారు. టెర్మినల్ ఎన్టీఆర్ విమానాశ్రయం పేరుతో కేంద్రం జీవో జారీ చేయడం అభ్యంతరకరమని టీ పీసీసీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య,టీ కాంగ్రెస్ శాసనసభ పక్షనేత కె.జానారెడ్డి అన్నారు. పోలీసులు అరెస్ట్ చేసిన వారిలో ఎమ్మెల్సీ ఫారూక్ హుస్సేన్ అలీ, మాజీ ఎమ్మెల్యే అనిల్, పీసీసీ అధికార ప్రతినిధి జి.నిరంజన్, డిప్యూటీ మేయర్ రాజ్‌కుమార్ ఉన్నారు.