‘కేసీఆర్ పాలన డిక్టేటర్‌ను తలపిస్తోంది’
హైదరాబాద్: ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు పాలన డిక్టేటర్ పాలనను తలపిస్తోందని, కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు మండిపడ్డారు. ఆయన గురువారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ..‘‘ తెలంగాణ రాష్ట్ర సాధనకి ధర్నాచౌక్ వద్ద జరిపిన ధర్నాలు ఎంతో దోహదం చేశాయి.
ఇప్పుడు అదే ధర్నాలను చూసి ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు భయపడుతున్నారు. ప్రశ్నించే గొంతులను సీఎం అణిచివేస్తున్నారు. ధర్నా చౌక్ మూసివేత పై అన్నిపార్టీలు స్పందించాలి. ఉద్యమాలతో పుట్టిన తెలంగాణ రాష్ట్రంలో ధర్నా చౌక్‌ని మూసివేయడం సరికాదు. బీసీ సబ్ ప్లాన్ బడ్జెట్‌కి బీసీ నాయకుల సలహాలు తీసుకోకపోవడం దుర్మార్గమని, సీఎం కేసీఆర్ ఓటుబ్యాంక్ రాజకీయాలు మానుకోవాలని’’ వి.హనుమంతరావు సూచించారు.