బీసీ ఉద్యమాలను బలోపేతం చేస్తాం
బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేశన శంకరరావు
కర్నూలు(అర్బన్): బీసీ సమస్యలపై ఉద్యమాలను బలోపేతం చేయనున్నట్లు బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేశన శంకరరావు అన్నారు. బుధవారం స్థానిక టీజీవీ కళా క్షేత్రంలో సంఘం జిల్లా అధ్యక్షుడు వై నాగేశ్వరరావు అధ్యక్షతన జిల్లా విస్తృత స్థాయి సమావేశం జరిగింది. కర్నూలు, కడప. అనంతపురం జిల్లాల్లో బీసీలు అధికంగా ఉన్నారని, వీరంతా రాజకీయంగా ఎదగాలని శంకరరావు పేర్కొన్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో బీసీ భవ న్ల ఏర్పాటుకు కర్నూలు జిల్లాను మార్గదర్శకంగా చూపిస్తామన్నారు. బీసీలను అన్ని పార్టీలు చిన్నచూపు చూస్తున్నాయని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆదిశేషులు ఆవేదన వ్యక్తం చేశారు.
కర్నూలు కార్పొరేషన్ ఎన్నికల్లో బీసీలను గెలిపించుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని సంఘం నేత నక్కలమిట్ట శ్రీనివాసులు అన్నారు. పార్లమెంట్ సమావేశాల్లో బీసీ బిల్లు ప్రవేశపెట్టి చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించేలా అన్ని రాజకీయ పార్టీలపై ఒత్తిడి తీసుకురావాలని జాతీయ ప్రధాన కార్యదర్శి ఆల్మన్‌రాజు పేర్కొన్నారు. రూ.20 వేల కోట్లతో బీసీ సబ్‌ప్లాన్ అమలు చేయాలన్నారు. యువజన సంఘం రాష్ట్ర కార్యదర్శి ఎం రాంబాబు, జిల్లా ఉపాధ్యక్షుడు యు సురేష్, కేతూరి మధు, విజయకుమార్, వాడాల నాగరాజు, జీ శ్రీనివాసులు పాల్గొన్నారు.