bc problems
-
కార్పొరేటర్లకు రుణమాఫీ కాదు.. బీసీలకు ఆర్థిక చేయుత అందించాలి
-
అందుకోసమే సీఎం జగన్ నాకు ఎంపీ పదవి ఇచ్చారు: ఆర్ కృష్ణయ్య
న్యూఢిల్లీ: రానున్న పార్లమెంట్ సమావేశాల్లో బీసీ సమస్యలపై గళమెత్తుతానని వైఎస్సార్సీపీ ఎంపీ ఆర్. కృష్ణయ్య అన్నారు. బీసీ సమస్యలపై పోరాటానికే సీఎం జగన్ తనకు ఎంపీ పదవి ఇచ్చారని చెప్పారు. సమస్యల పరిష్కారం కోసం ఇప్పటికే ఇద్దరు కేంద్ర మంత్రులను కూడా కలిసినట్లు వివరించారు. దేశంలో బీసీ రిజర్వేషన్లు 18 నుంచి 22 శాతం మాత్రమే ఉన్నాయి. ఎస్సీ, ఎస్టీల మాదిరిగానే బీసీలకు సైతం జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించాలని కోరారు. ఈ మేరకు రాజ్యాంగ సవరణ చేస్తూ బీసీ బిల్లు పార్లమెంట్లో ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. 'రాజ్యసభలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన బీసీ బిల్లును పాస్ చేయాలి. బీసీ కులాలకు ప్రత్యామ్నాయ ఉపాధి కోసం పది లక్షల నుంచి 20లక్షలు ఇవ్వాలి. కార్పొరేట్లకు రుణమాఫీ కాదు, బీసీలకు ఆర్థిక అభివృద్ధికి చేయూత ఇవ్వాలి. బీసీలకు చారిత్రక అన్యాయం జరిగింది' అని ఎంపీ ఆర్ కృష్ణయ్య వ్యాఖ్యానించారు. చదవండి: (ఆ ఇద్దరూ ఏ రకంగా పోటీనో.. ఎవరికి పోటీనో చెప్పాలి: మాజీ మంత్రి వెల్లంపల్లి) -
‘20న ఏపీలో నిరసన కార్యక్రమాలు’
సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బీసీలకు తీవ్ర అన్యాయం చేశాడని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్ అధ్యక్షుడు జంగా కృష్ణమూర్తి విమర్శించారు. టీడీపీ ప్రభుత్వం బీసీలకు చేస్తున్న మోసాలను ఎండగట్టేందుకు ఈ నెల 20వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్టు తెలిపారు. ఇందులో రాష్ట్రంలోని బీసీ వర్గాలు పెద్ద ఎతున పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఆదివారం విజయవాడలోని వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వైఎస్సార్ సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి బీసీల స్థితిగతులపై అధ్యయన కమిటీ వేసే వరకు చంద్రబాబుకు బీసీలు గుర్తుకు రాలేదని ఎద్దేవా చేశారు. ఇప్పటి వరకు బీసీలను పట్టించుకోకుండా మోసం చేసిన చంద్రబాబు.. ఆదరణ అంటూ నయవంచన చేస్తున్నారని మండిపడ్డారు. బీసీలకు ఏం చేశాడని చంద్రబాబు జయహో బీసీ సభ పెడుతున్నాడని నిలదీశారు. చంద్రబాబును బీసీ ద్రోహిగా అభివర్ణించారు. బీసీలను బెదిరించి ఓట్లు వేయించుకునేందుకు టీడీపీ ప్రయత్నిస్తుందని ఆరోపించారు. టీడీపీ సభ్యత్వం కట్టలేదని పశ్చిమ గోదావరి జిల్లాలోని బీసీలపై దాడులు చేయడం దారుణమన్నారు. బీసీలకు కత్తెరలు, ఇస్త్రీపెట్టెలు ఇచ్చి సరిపెడతారా అని ప్రశ్నించారు. తమ పార్టీ బీసీలకు అండగా ఉంటుందని తెలిపారు. చంద్రబాబు నిజ స్వరూపాన్ని బట్టబయలు చేస్తామని అన్నారు. -
బీసీ ఉద్యమాలను బలోపేతం చేస్తాం
బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేశన శంకరరావు కర్నూలు(అర్బన్): బీసీ సమస్యలపై ఉద్యమాలను బలోపేతం చేయనున్నట్లు బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేశన శంకరరావు అన్నారు. బుధవారం స్థానిక టీజీవీ కళా క్షేత్రంలో సంఘం జిల్లా అధ్యక్షుడు వై నాగేశ్వరరావు అధ్యక్షతన జిల్లా విస్తృత స్థాయి సమావేశం జరిగింది. కర్నూలు, కడప. అనంతపురం జిల్లాల్లో బీసీలు అధికంగా ఉన్నారని, వీరంతా రాజకీయంగా ఎదగాలని శంకరరావు పేర్కొన్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో బీసీ భవ న్ల ఏర్పాటుకు కర్నూలు జిల్లాను మార్గదర్శకంగా చూపిస్తామన్నారు. బీసీలను అన్ని పార్టీలు చిన్నచూపు చూస్తున్నాయని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆదిశేషులు ఆవేదన వ్యక్తం చేశారు. కర్నూలు కార్పొరేషన్ ఎన్నికల్లో బీసీలను గెలిపించుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని సంఘం నేత నక్కలమిట్ట శ్రీనివాసులు అన్నారు. పార్లమెంట్ సమావేశాల్లో బీసీ బిల్లు ప్రవేశపెట్టి చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించేలా అన్ని రాజకీయ పార్టీలపై ఒత్తిడి తీసుకురావాలని జాతీయ ప్రధాన కార్యదర్శి ఆల్మన్రాజు పేర్కొన్నారు. రూ.20 వేల కోట్లతో బీసీ సబ్‌ప్లాన్ అమలు చేయాలన్నారు. యువజన సంఘం రాష్ట్ర కార్యదర్శి ఎం రాంబాబు, జిల్లా ఉపాధ్యక్షుడు యు సురేష్, కేతూరి మధు, విజయకుమార్, వాడాల నాగరాజు, జీ శ్రీనివాసులు పాల్గొన్నారు. -
లక్ష ఉద్యోగాల్లో ఒక్కటీ ఇవ్వలేదు: ఆర్.కృష్ణయ్య
సంగారెడ్డి (మెదక్): లక్ష ఉద్యోగాలు ఇస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చిన కేసీఆర్ గద్దెనెక్కిన తర్వాత ఒక్కరికి కూడా ఇవ్వలేదని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, టీడీపీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య అన్నారు. మెదక్ జిల్లా కేంద్రం సంగారెడ్డిలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. అదే విధంగా పార్లమెంట్లో బీసీల సమస్యలను ప్రస్తావించని వెనుకబడిన కులాలకు చెందిన ఎంపీలను రాళ్లతో కొట్టిస్తామని సంచలన వ్యాఖ్యలు చేశారు. తమకు జరుగుతున్న అన్యాయాన్ని ఎదురించేందుకు బీసీలంతా తీవ్రవాదులుగా మారుతారని ఆయన అన్నారు. తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలు బీసీ వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నాయని దుయ్యబట్టారు. ముఖ్యమంత్రులు కేసీఆర్, చంద్రబాబులను బీసీల సమస్యలపై నిలదీస్తామని ఆర్. కృష్ణయ్య ఈ సందర్భంగా చెప్పారు. వచ్చే నెలలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేస్తామని పేర్కొంటూ చట్ట సభల్లో రిజర్వేషన్ల కోసం పార్లమెంట్‌ను ముట్టడిస్తామని చెప్పారు.