bc sub plan
-
రూ.10 వేల కోట్లతో బీసీ సబ్‌ప్లాన్
కవాడిగూడ: పదివేల కోట్ల రూపాయలతో బీసీ సబ్‌ప్లాన్ ఏర్పాటు చేయాలని, బీసీలకు చట్టసభల్లో 50 శాతం రిజర్వేషన్లు కలి్పంచాలని బీసీ సంక్షేమ సంఘం నేత ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. అన్నిరంగాల్లో బీసీల వాటా, కోటా తగ్గించి బీసీల అణిచివేతకు పాల్పడటాన్ని నిరసిస్తూ శుక్రవారం ఇక్కడి ఇందిరాపార్కు ధర్నాచౌక్ వద్ద సంఘం జాతీయ ఉపాధ్యక్షులు గుజ్జ కృష్ణ, నీల వెంకటేశ్ ఆధ్వర్యంలో మహాధర్నా నిర్వహించారు. ధర్నానుద్దేశించి ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ బడ్జెట్లో బీసీల నిధుల్లో 50 శాతం కోత విధించడం ఎంతవరకు న్యాయమని ప్రశ్నించారు. ఏపీ సీఎం జగన్మోహన్రెడ్డి 50 శాతం నామినేటెడ్ పదవులను బీసీలకు ఇస్తున్నారని, కానీ కేసీఆర్ మాత్రం బీసీలను అడుగడుగునా తొక్కడానికి ప్రయతి్నస్తున్నారని విమర్శించారు. టీజేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రొ.కోదండరాం మాట్లాడుతూ ఆర్థిక మాంద్యం పేరుతో బడ్జెట్లో భారీగా కోతపెట్టారని, బీసీలకు అన్యా యం జరుగుతోందని అన్నారు. సంఘటితంగా ఉద్యమించపోతే హక్కులు పోతాయని అన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు మల్లు రవి, బీసీ నేతలు భూపే‹Ù, సాగర్, అంజి, నందగోపాల్, కోలా శ్రీనివాస్, మల్లేష్ యాదవ్, ఏపీ నేత వెంగళరావు, 32 కుల, 25 బీసీ, ఎంబీసీ, విద్యార్థి, యువజన సంఘాలు పాల్గొన్నాయి. -
సబ్ ప్లాన్ పేరిట బీసీలను మరోసారి మోసం చేశారు
-
‘అసెంబ్లీ సాక్షిగా బీసీలను మోసం చేసిన బాబు’
సాక్షి, విజయవాడ: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అసెంబ్లీ సాక్షిగా సబ్ ప్లాన్ పేరిట బీసీలను మరోసారి మోసం చేశారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు జంగా కృష్ణమూర్తి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బీసీలను వంచన చేయడం కోసమే సబ్ ప్లాన్ బిల్లును ప్రవేశపెట్టారని మండిపడ్డారు. శుక్రవారమిక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ బిల్లు ప్రవేశపెట్టేటప్పుడు ముఖ్యమంత్రిగాని, ఆర్థికమంత్రిగాని సభలో లేరంటేనే బీసీల పట్ల ప్రభుత్వ వైఖరి అర్థమవుతోందని విమర్శించారు. బీసీ బిల్లు అనేది ఓ నాటకమని ఆయన ఆరోపించారు. టీడీపీకి బీసీలే వెన్నుముక అంటూ వాళ్లని ఓటు బ్యాంక్‌గా వాడుకోవడం తప్పితే మరోటికాదన్నారు. ఏపీ బడ్జెట్లో ఖర్చులు మాత్రమే ఉంటున్నాయని కానీ కేటాయింపులు కానరావడం లేదన్నారు. మంత్రి అచ్చెన్నాయుడుకు సబ్ ప్లాన్ బిల్లుపై కనీస అవగాహన లేదని ఎద్దేవా చేశారు. బీసీ సబ్ ప్లాన్‌కు ఎంత కేటాయించారో మంత్రి చెప్పలేకపోవడం హాస్యాస్పదమన్నారు. టీడీపీ ప్రభుత్వ నాటకాలన్నీ తెరదించాల్సిన అవసరం ఉందన్నారు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను ఏ విధంగా దారిమళ్లించారో వైఎస్సార్ సీపీ అధికారంలోకి రాగానే తేలుస్తామని జంగా కృష్ణమూర్తి స్పష్టం చేశారు. -
బీసీలపై మరో వంచన వల!
-
అచ్చెంనాయుడికి ముచ్చెమటలు!
-
అసెంబ్లీ సాక్షిగా బీసీ సబ్‌ప్లాన్ బిల్లు డ్రామా బట్టబయలు
-
అసెంబ్లీ సాక్షిగా బీసీ సబ్‌ప్లాన్ బిల్లు డ్రామా బట్టబయలు
సాక్షి, అమరావతి : అసెంబ్లీ సాక్షిగా బీసీ సబ్‌ప్లాన్ బిల్లు డ్రామా బట్టబయలు అయింది. నిధులు ఎంతిస్తారో చెప్పకుండా బీసీ సబ్‌ప్లాన్ బిల్లును ప్రభుత్వం రూపొందించింది. బీసీ సబ్‌ప్లాన్‌పై అసెంబ్లీలో ప్రభుత్వ విప్ కూన రవి కుమార్ అడిగిన ప్రశ్నకు మంత్రి అచ్చెన్నాయుడు సమాధానం చెప్పలేకపోయారు. బీసీ సబ్‌ప్లాన్ బిల్లుపై ఏపీ అసెంబ్లీలో చర్చ జరిగింది. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ కూన రవికుమార్.. బీసీ సబ్‌ప్లాన్ బిల్లుపై అభ్యంతరాలు వ్యక్తం చేశారు. సబ్‌ప్లాన్‌లోని నిధులు జనాభా ప్రాతిపదికన ఇస్తారా?, రిజర్వేషన్ ప్రకారం ఇస్తారా? అని విప్ కూన ప్రశ్నించారు. దీనికి మంత్రి సమాధానం చెప్పలేక నీళ్లు నమిలారు. మధ్యలో మంత్రి పితాని సత్యనారాయణ కలుగజేసుకొని.. బిల్లులో అంకెలు లేవని చెప్పబోయారు. దీన్ని స్పీకర్ కోడెల శివప్రసాద్ తప్పుబట్టారు. కాగా బీసీ సబ్‌ప్లాన్ బిల్లు గొడవపై ఉలిక్కిపడ్డ సీఎం చంద్రబాబు నాయుడు.. మంత్రులు, అధికారులను ఛాంబర్‌కు పిలిపించుకొని మాట్లాడారు. బిల్లులో లోపం ఉందని చంద్రబాబుకు అధికారులు తెలిపారు. దీంతో బీసీ వెల్ఫేర్, లాసెక్రటరీలను పిలిచి మాట్లాడారు. అనంతరం ఎంత శాతం నిధులు కేటాయిస్తారో చెప్పకుండానే బిల్లును ఆమోదింపజేశారు. ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా ప్రశ్నించిన కూన రవిపై చంద్రబాబు సీరియస్ అయినట్లు తెలుస్తోంది. సీఎంతో మాట్లాడాక కూన రవి మెత్తపడ్డారు. ఏదో ఒక ప్రాతిపదికన నిధులు కేటాయించాలని రవి కోరారు. దీంతో మూడో వంతు బడ్జెట్ కేటాయింపుపై సవరణ చేస్తామని చెప్పి బిల్లును ఆమోదించారు. -
ఓటుతోనే కూల్చేస్తాం
టీడీపీ సర్కారు అనుసరిస్తున్న బీసీల అణచివేత వైఖరిపై రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు భగ్గుమన్నాయి. బీసీ సంక్షేమాన్ని గాలికి వదిలేసి సబ్‌ప్లాన్ నిధులను సైతం దారి మళ్లిస్తోందని కన్నెర్ర చేశారు. గత ఎన్నికల సమయంలో వందకుపైగా హామీలిచ్చిన చంద్రబాబు ఏఒక్కటీ అమలు చేయకుండా ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం పట్ల మండిపడ్డారు. బీసీలను చిన్నచూపు చూస్తున్న చంద్రబాబుకు గుణపాఠం తప్పదని పేర్కొన్నారు. తమ ఓటుతో గద్దెనెక్కిన టీడీపీ సర్కారుకు వచ్చే ఎన్నికల్లోఅదే ఓటుతో బుద్ధి చెబుతామని హెచ్చరించారు.బీసీ వర్గాలకు సంఘీభావంగా వైఎస్సార్సీపీ బీసీ సెల్ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన ధర్నాలు, ర్యాలీలు, నిరసన కార్యక్రమాలకు భారీ స్పందన వ్యక్తమైంది. అన్ని జిల్లాల్లో వైఎస్సార్ సీపీ నాయకులు, బీసీ సంఘాల నేతలు, ప్రజా సంఘాల నేతలు ఇందులో పాల్గొన్నారు. కుల వృత్తులతో నిరసన తెలిపారు. రాష్ట్రమంతా తన కుటుంబంగా భావించే వైఎస్ జగన్‌ను అధికారంలోకి తెస్తామని ప్రకటించారు. సాక్షి నెట్వర్క్ : రాష్ట్రంలో వెనుకబడిన తరగతులకు తెలుగుదేశం ప్రభుత్వం చేస్తున్న మోసంపై బీసీ వర్గాలు మండిపడ్డాయి. చంద్రబాబు సర్కారు బీసీలను కేవలం ఓటు బ్యాంకుగానే చూస్తోంది. వారికి ఇచ్చిన హామీలలో ఏ ఒక్కటీ నెరవేర్చలేదు. ఏటా 10 వేల కోట్లతో బీసీ సబ్‌ప్లాన్ అమలు చేస్తామన్న హామీని విస్మరించింది. విద్య, ఉద్యోగాల్లో 33 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తానని హామీ ఇచ్చి, మోసం చేసింది. పదోన్నతుల్లో రిజర్వేషన్లు ఇస్తామంటూ కల్లబొల్లి మాటలు చెప్పింది. బీసీలకు కొత్తగా ఆశ్రమ పాఠశాలలు, కళాశాలలు ఏర్పాటు చేస్తామన్న మాటనూ పక్కన పెట్టింది. నేతన్నలకు ఉచితంగా ఇళ్లు, మరమగ్గాలు ఇస్తామంటూ మాయ మాటలు చెప్పింది. మేకలు, గొర్రెల విక్రయ శాలలు ఏర్పాటు చేస్తామని, దీని ద్వారా వీటి పెంపకందార్లకు మేలు కలుగుతుందని ఆశలు కల్పించింది. కుల వృత్తి దారుల కోసం అన్ని మండల కేంద్రాల్లో అత్యాధునిక అభివృద్ధి కేంద్రాలు ఏర్పాటు చేస్తామంటూ కల్లబొల్లి కబుర్లు చెప్పింది. ఇవే కాదు.. ఇలాంటివి అనేక హామీలిచ్చి, ఓట్లేయించుకొని నాలుగున్నరేళ్లు మాయ మాటలతో గడిపేసింది. ఒక్క హామీ నెరవేర్చలేదు. దీంతో బీసీ వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీతో కలసి రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమం చేపట్టాయి. ఇందులో భాగంగా గురువారం అన్ని జిల్లా కేంద్రాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీతో కలసి నిరసన దీక్షలు, ర్యాలీలు నిర్వహించాయి. వంచనపై ప్రజాగ్రహం టీడీపీ గద్దెనెక్కాక బీసీలను వంచించడానికి నిరసనగా గుంటూరు, చిలకలూరిపేటల్లో వైఎస్సార్ సీపీ పిలుపుమేరకు ధర్నాలు చేపట్టి ర్యాలీలు నిర్వహించారు. గుంటూరు పార్లమెంట్ బీసీ సంఘ అధ్యక్షుడు కూరాకుల కోటేశ్వరరావు అధ్యక్షతన నిర్వహించిన ధర్నాలో ఎమ్మెల్యేలు ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే), షేక్ మొహమ్మద్ ముస్తఫా, గుంటూరు పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు లేళ్ల అప్పిరెడ్డి, పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్త కిలారి వెంకట రోశయ్య, పార్టీ నియోజకవర్గ సమన్వయకర్తలు చంద్రగిరి ఏసురత్నం, ఉండవల్లి శ్రీదేవి, మేకతోటి సుచరిత, పార్టీ ప్రధాన కార్యదర్శి ఆతుకూరి ఆంజనేయులు, చేనేత విభాగం రాష్ట్ర అధ్యక్షుడు చిల్లపల్లి మోహన్‌రావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం ర్యాలీగా వెళ్లి డీఆర్వో శ్రీలతకు వినతిపత్రం సమర్పించారు. చిలకలూరిపేటలో నియోజకవర్గ సమన్వయకర్త విడదల రజని ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. పార్టీ నరసరావుపేట పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు, ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, పార్లమెంట్ సమన్వయకర్త లావు శ్రీకృష్ణదేవరాయలు, పార్టీ ప్రధాన కార్యదర్శి మర్రి రాజశేఖర్, నియోజకవర్గ సమన్వయకర్తలు బొల్లా బ్రహ్మనాయుడు, నంబూరి శంకరరావు, జెడ్పీ ఫ్లోర్ లీడర్ దేవళ్ళ రేవతి, వైఎస్సార్సీపీ నేత నిమ్మకాయల చినరాజనారాయణ తదితరులు ఇందులో పాల్గొన్నారు. కర్నూలు, నంద్యాలలో కదం తొక్కిన బీసీలు బీసీల ద్రోహి చంద్రబాబుకు వచ్చే ఎన్నికల్లో గుణపాఠం చెప్పడం ఖాయమని వైఎస్సార్సీపీ కర్నూలు, నంద్యాల పార్లమెంటరీ జిల్లా అధ్యక్షులు బి.వై.రామయ్య, శిల్పా చక్రపాణిరెడ్డి పేర్కొన్నారు. పార్టీ ఆధ్వర్యంలో కర్నూలుతోపాటు నంద్యాలలో బీసీ మహార్యాలీ నిర్వహించారు. కర్నూలులోని పార్టీ కార్యాలయం నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ కొనసాగింది. ఈ సందర్భంగా బీవై రామయ్య, శిల్పా చక్రపాణిరెడ్డి మాట్లాడుతూ బీసీల చేతిలో చంద్రబాబుకు చావుదెబ్బ తప్పదని హెచ్చరించారు. ర్యాలీలో ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు కాటసాని రాంభూపాల్‌రెడ్డి, కాటసాని రామిరెడ్డి, శిల్పా రవిచంద్రకిశోర్‌రెడ్డి, గంగుల బిజేంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఒంగోలులో భారీ ప్రదర్శన గత ఎన్నికల సమయంలో చంద్రబాబు బీసీలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని వైఎస్సార్ సీపీ నేతలు డిమాండ్ చేశారు. పార్టీ బీసీ సెల్ ఆధర్వంలో ఒంగోలులో భారీ ర్యాలీ నిర్వహించారు. జిల్లా పార్టీ కార్యాలయం నుంచి కలెక్టరేట్ వరకు ఆందోళన నిర్వహించిన అనంతరం జేసీ–2 మార్కండేయులుకు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా మార్కాపురం ఎమ్మెల్యే జంకె వెంకటరెడ్డి మాట్లాడుతూ బీసీలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని టీడీపీ నెరవేర్చలేదని విమర్శించారు. విశాఖలో హోరెత్తిన బీసీ ర్యాలీ ఎన్నికల మేనిఫెస్టోలో బీసీలకు ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడంలో టీడీపీ సర్కారు వైఫల్యాన్ని నిరసిస్తూ వైఎస్సార్ సీపీ బీసీ విభాగం విశాఖలో భారీ ర్యాలీ నిర్వహించింది. బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు కె.రామన్నపాత్రుడు ఆధ్వర్యంలో జరిగిన ఈ ర్యాలీలో పార్టీ విశాఖ సిటీ అధ్యక్షుడు మళ్ల విజయప్రసాద్, పార్లమెంటు జిల్లా అధ్యక్షుడు తైనాల విజయకుమార్, పార్లమెంటు కో ఆర్డినేటర్ ఎంవీవీ సత్యనారాయణ, నగర కో ఆర్డినేటర్లు, పార్టీ అనుబంధ విభాగాల నేతలు, శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. బీసీల కులవృత్తులను ప్రతిబింబించేలా నిరసన ప్రదర్శన నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్‌కు చేరుకుని జిల్లా కలెక్టర్ ప్రవీణ్‌కుమార్‌కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా మళ్ల, తైనాల తదితరులు మాట్లాడుతూ ఏటా రూ.10 వేల కోట్లతో బీసీ సబ్‌ప్లాన్ అమలు చేస్తామని చెప్పిన చంద్రబాబు గత నాలుగేళ్లలో కనీసం పదివేల కోట్లు కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. బీసీలంటే బాబుకు చిన్నచూపు బీసీలంటే చంద్రబాబుకు చిన్నచూపు అని రాయచోటి, రైల్వేకోడూరు ఎమ్మెల్యేలు గడికోట శ్రీకాంత్‌రెడ్డి, కొరముట్ల శ్రీనివాసులు, వైఎస్సార్సీపీ రాజంపేట పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్నాథ్రెడ్డి విమర్శించారు. వైఎస్సార్ జిల్లా రాజంపేటలో పసుపులేటి సుధాకర్ ఆధ్వర్యంలో నిర్వహించిన బీసీ సామాజిక ర్యాలీకి హాజరైన ఎమ్మెల్యే గడికోట మాట్లాడుతూ బీసీలకు మంచి చేయాలనే ఉద్దేశంతో ప్రతిపక్షనేత వైఎస్ జగన్ అధ్యయన కమిటీని నియమించారని చెప్పారు. జస్టిస్ ఈశ్వరయ్య లేఖ ద్వారా బీసీలంటే చంద్రబాబుకు ఎంత చులకన భావం ఉందో బహిర్గతమైందన్నారు. ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు మాట్లాడుతూ చంద్రబాబును గద్దె దించేందుకు బీసీలు సమాయత్తం కావాలన్నారు. పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్నాథ్రెడ్డి మాట్లాడుతూ బీసీలను చిన్నచూపు చూడటం బాబుకు అలవాటన్నారు. బీసీలు రాబోయే ఎన్నికల్లో జగన్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని చెప్పారు. ర్యాలీ నియోజకవర్గ వైఎస్సార్సీపీ కార్యాలయం నుంచి మెయిన్‌రోడ్డు, పాతబస్టాండు, ఆర్‌ఎస్‌రోడ్డు మీదుగా సబ్‌కలెక్టరేట్‌కు చేరుకుంది. అనంతరం ఆర్డీవో కోదండరామిరెడ్డికి వినతిపత్రాన్ని అందచేశారు. ‘అనంత’లో నిరసన ర్యాలీ.. టీడీపీ సర్కారు బీసీలను మోసగించటానికి నిరసనగా అనంతపురం, హిందూపురంలో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీలు చేపట్టారు. అనంతపురం జిల్లా పరిషత్ కార్యాలయం నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ సాగింది. పార్లమెంటు సమన్వయకర్త తలారి పీడీ రంగయ్య, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు కిష్టప్ప, రాగే పరుశురాం, కళ్యాణదుర్గం సమన్వయకర్త ఉషశ్రీచరణ్, బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు పామిడి వీరా తదితరులు ఇందులో పాల్గొన్నారు. ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడి ర్యాలీకి సంఘీభావం తెలిపారు. హిందూపురంలో ఆర్అండ్బీ అతిథిగృహం నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. పార్టీ హిందూపురం పార్లమెంటు జిల్లా అధ్యక్షుడు శంకరనారాయణ, ఎమ్మెల్యే తిప్పేస్వామి, మాజీ మంత్రి నర్సేగౌడ్, మాజీ ఎమ్మెల్యే అబ్దుల్‌ఘని తదితరులు దీనికి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చంద్రబాబు బీసీల ద్రోహి అని మండిపడ్డారు. త్వరలో బీసీ గర్జన... వైఎస్సార్ సీపీ అధికారంలోకి రాగానే నాయీ బ్రాహ్మణ, రజక, వడ్డెర కులాలకు చట్టసభల్లో ప్రాతినిధ్యం కల్పిస్తామని మాజీ ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి చెప్పారు. టీడీపీ ప్రభుత్వం బీసీల పట్ల వ్యవహరిస్తున్న మోసపూరిత విధానాలను వ్యతిరేకిస్తూ వైఎస్సార్ జిల్లా కేంద్రం కడపలోని కలెక్టర్ కార్యాలయం ఎదుట వైఎస్సార్ సీపీ బీసీ విభాగం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అవినాష్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ ప్రజా సంకల్పయాత్ర పూర్తి కాగానే బీసీ గర్జన నిర్వహించి బీసీ డిక్లరేషన్ ప్రకటిస్తామని చెప్పారు. బీసీలంతా వైఎస్ జగన్‌ను ఆశీర్వదించి పార్టీని అధికారంలోకి తేవాలని కోరారు. మామకు వెన్నుపోటు పొడిచి పార్టీని లాక్కున్నట్లే చంద్రబాబు బీసీలకు కూడా వెన్నుపోటు పొడిచారని కమలాపురం ఎమ్మెల్యే పి.రవీంద్రనాథ్‌రెడ్డి పేర్కొన్నారు. నిరసన కార్యక్రమంలో కడప ఎమ్మెల్యే అంజద్‌బాషా, మైదుకూరు శాసనసభ్యుడు ఎస్. రఘురామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. విజయనగరం, పార్వతీపురంలో ర్యాలీలు.. బీసీలను అణచివేస్తున్న టీడీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా విజయనగరం, పార్వతీపురంలో నిర్వహించిన నిరసన ర్యాలీల్లో వైఎస్సార్ సీపీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నాయి. బీసీలు వచ్చే ఎన్నికల్లో టీడీపీకి ఓట్ల ద్వారా సమాధానం చెప్పాలని పార్టీ నేతలు సూచించారు. బీసీలకు జరుగుతున్న అన్యాయంపై విజయనగరం డీఆర్వో జె.వెంకటరావుకు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో రాజాం ఎమ్మెల్యే కంబాల జోగులు, వైఎస్సార్ సీపీ జిల్లా రాజకీయ వ్యవహారాల సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. పార్వతీపురంలో అరకు పార్లమెంటరీ జిల్లా బీసీ సెల్ అధ్యక్షుడు వాకాడ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీకి సాలూరు, పార్వతీపుం, కురుపాం, పాలకొండ నియోజకవర్గాల పరిధిలోని బీసీ నాయకులు, నేతలు అధిక సంఖ్యలో హాజరయ్యారు. అనంతరం ఆర్డీవో కార్యాలయం ఏవోకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో సాలూరు, పాలకొండ ఎమ్మెల్యేలు పీడికరాజన్నదొర, వి.కళావతి ఇతర నాయకులు పాల్గొన్నారు. తిరుపతిలో కుల వృత్తులతో నిరసన.. ప్రభుత్వం బీసీలకు చేసిన మోసాన్ని ఎండగడుతూ చిత్తూరు కలెక్టరేట్, తిరుపతిలోని సబ్‌కలెక్టరేట్ ఎదురుగా చేపట్టిన నిరసన కార్యక్రమాల్లో వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు. తిరుపతిలో బీసీ కుల వృత్తులను ప్రదర్శించారు. అన్నమయ్య సర్కిల్ నుంచి సబ్‌కలెక్టర్ ఆఫీసు వరకు ర్యాలీ నిర్వహించారు. చిత్తూరు కలెక్టరేట్ సమీపంలోని వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసిన అనంతరం నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. డబ్బులతో గెలవాలనుకునే చంద్రబాబుకు బుద్ధి చెప్పాలి... ఎన్నికల్లో డబ్బులు వెదజల్లి గెలవాలని ప్రయత్నిస్తున్న సీఎం చంద్రబాబుకు ప్రజలు బుద్ధి చెప్పాలని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. బీసీల ప్రయోజనాలను చంద్రబాబు హరిస్తున్నారని మండిపడ్డారు. వైఎస్సార్ సీపీ బీసీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు జంగా కృష్ణమూర్తి అ«ధ్యక్షతన విజయవాడలోని ధర్నా చౌక్‌లో వద్ద నిర్వహించిన ధర్నా కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఎన్నికల్లో బీసీలకు ఇచ్చిన హామీల అమలును మరచిన చంద్రబాబు వారిని కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే భావిస్తున్నారని మండిపడ్డారు. సమస్యలు తీర్చకపోగా కొత్తవి సృష్టించేలా చంద్రబాబు పాలన తయారైందని విమర్శించారు. చంద్రబాబు అవినీతిని ప్రత్యక్షంగా గమనించిన ఇద్దరు ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శులు చెబుతున్న విషయాలు వింటుంటే రాష్ట్రంలో ఏమేరకు అవినీతి జరిగిందో అర్ధమవుతోందన్నారు. రాష్ట్రమంతా తన కుటుంబంగా భావించే వైఎస్ జగన్‌కు అవకాశం ఇస్తే అభివృద్ధి, సంక్షేమం రెండూ ఉంటాయాన్నారు. అణగారిన ప్రజల అభివృద్థి పట్ల వైఎస్ జగన్‌కు స్పష్టమైన ఆలోచనలు ఉన్నాయన్నారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కొలుసు పార్ధసారధి, తిరువూరు ఎమ్మెల్యే కొక్కిలగడ్డ రక్షణనిధి, విజయవాడ పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు సామినేని ఉదయభాను, పార్టీ నేతలు వెలంపల్లి శ్రీనివాస్, మల్లాది విష్ణు, యలమంచిలి రవి, బొప్పన భవకుమార్, విజయవాడ పార్లమెంటు బీసీ సెల్ అ«ధ్యక్షుడు కసగోని దుర్గారావు గౌడ్, బీసీ సెల్ నగర అధ్యక్షుడు బోను రాజేష్, పార్టీ అనుబంధ విభాగాల నేతలు పాల్గొన్నారు. అనంతరం నేతలు ర్యాలీగా విజయవాడ సబ్‌కలెక్టర్ కార్యాలయానికి చేరుకొని వినతిపత్రం అందచేశారు. గత ఎన్నికల్లో బీసీలకు హామీ ఇచ్చి నెరవేర్చని వాటిలో ప్రధానమైనవి.. ►ఏటా రూ.10 వేల కోట్లతో బీసీ సబ్‌ప్లాన్ ►విద్య, ఉద్యోగాల్లో బీసీ రిజర్వేషన్లు 33 శాతానికి పెంపు.. పదోన్నతుల్లో రిజర్వేషన్లు ►బీసీలకు కొత్తగా రెసిడెన్షియల్ విద్యా సంస్థలు ► చేనేత కార్మికులకు రూ.1.5 లక్షలతో ఉచితంగా ఇళ్లు, మగ్గం ►రైతుబజార్ల తరహాలో మేకలు, గొర్రెల విక్రయ బజార్ల ఏర్పాటు ►అన్ని మండల కేంద్రాల్లో కుల ►వృత్తిదారులకు ఆధునిక అభివృద్ధి కేంద్రాలు ► బీసీ కులాలను ఒక గ్రూపునుంచి మరో గ్రూపులోకి మారుస్తాం -
'బలిపీఠం ఎక్కించేలా కేసీఆర్ పాలన'
హైదరాబాద్: తెలంగాణ ఏర్పడితే బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరుతుందనుకుంటే.. సీఎం కేసీఆర్ పాలన బడుగుల బతుకులను బలిపీఠం ఎక్కించేలా ఉందని కల్వకుర్తి ఎమ్మెల్యే వంశీచంద్ రెడ్డి ఎద్దేవా చేశారు. ఆయన ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ.. బలహీన వర్గాల అభ్యున్నతిలో కేసీఆర్ మాటలు కోటలు దాటినా.. చేతలు మాత్రం గడప దాటడం లేదన్నారు. బడ్జెట్ లో కేటాయించిన నిధులు రూ.6738 కోట్లు అయితే, ఖర్చు చేసింది రూ. 3 - 4 కోట్లు మాత్రమేనన్నారు. మేనిఫెస్టోలో రూ.25 వేల కోట్లు బడుగుల అభ్యున్నతికి ఖర్చు చేస్తామని చెప్పారని.. ఆచరణలో ఆ హామీ ఎటుపోయిందని కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రశ్నించారు. బీసీల పట్ల కేసీఆర్ చూపుతున్న ప్రేమ మొసలి కన్నీరు లాంటిదే అన్నారు. అసెంబ్లీలో బీసీలకు సబ్ ప్లాన్ అమలు చేస్తానని చెప్పిన కేసీఆర్.. దాన్ని తప్పించుకునేందుకే బీసీలకు తాయిలాలు ప్రకటిస్తున్నారని విమర్శించారు. జనాభా ప్రాతిపదికన బీసీలకు నిధులు కేటాయించి, ఖర్చు చేయాలని డిమాండ్ చేశారు. ఫీజ్ రీయింబర్స్ మెంట్ నీరు గార్చడం వల్ల బీసీ విద్యార్థులు విద్యకు దూరం అవుతున్నారని, ప్రభుత్వం బీసీలను ఓటు బ్యాంకుగా వాడుకోకుండా చిత్తశుద్ధితో ఆ వర్గాల అభివృద్ధికి కృషి చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. -
కాంగ్రెస్‌తోనే సామాజిక తెలంగాణ: మల్లు
హైదరాబాద్‌సిటీ: కాంగ్రెస్‌తోనే సామాజిక తెలంగాణ సాధ్యమని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క అన్నారు. హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడుతూ..బీసీ నిధులను ప్రభుత్వం దామాషా ప్రాతిపదికన కేటాయించడం లేదని తెలిపారు. కేటాయించిన నిధులను ఖర్చు చేయడంలో కూడా పూర్తిగా విఫలమైందని విమర్శించారు. ఉగాది వరకు జిల్లా స్థాయి నుంచి మండల స్థాయి వరకు పార్టీ జిల్లా కమిటీలను ఏర్పాటు చేసుకుంటామన్నారు. బీసీ సబ్ ప్లాన్ తీసుకురావడానికి ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామన్నారు. జ్యోతి రావు పూలే విగ్రహాలను ఓబీసీ డిపార్ట్మెంట్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేస్తామని తెలిపారు. సర్వే వివరాలను ప్రభుత్వం బయటపెట్టాలి: వీహెచ్ హైదరాబాద్‌సిటీ: ప్రభుత్వం సమగ్ర కుటుంబ సర్వే వివరాలను ఎందుకు బయటపెట్టడం లేదని కాంగ్రెస్ మాజీ ఎంపీ వి.హనుమంతరావు ప్రశ్నించారు. సమగ్ర సర్వే బయటపెడితే.. దాని ద్వారా బీసీల ప్రాతిపదికన ఉద్యోగాలు, బడ్జెట్ అడుగుతారనే సర్వే వివరాలు వెల్లడించడం లేదన్నారు. -
బీసీ సబ్‌ప్లాన్ కోసం ఉద్యమించాలి: చాడ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో బీసీ సబ్‌ప్లాన్ చట్టం సాధించే వరకు ఉద్యమించాల్సిన అవసరముందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి పిలుపునిచ్చారు. రాష్ట్ర జనాభాలో 51 శాతమున్న బీసీలకు విద్య, వైద్యపరంగా తీరని అన్యాయం జరుగుతోందని ఆరోపించారు. గీత కార్మిక, చేనేత, రజక, విశ్వబ్రాహ్మణ, మత్స్య కార్మిక ఫెడరేషన్లకు అరకొరగా కేటాయిస్తున్న నిధులతో ఎవ్వరికీ అందే పరిస్థితి లేదన్నారు. బీసీలకు జనాభా ప్రాతిపదికన బడ్జెట్ కేటాయించాలని డిమాండ్ చేశారు. శనివారం మగ్దూంభవన్‌లో వృత్తిసంఘాల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు బొమ్మగాని ప్రభాకర్ అధ్యక్షతన జరిగిన బీసీ సబ్‌ప్లాన్ సాధన సమాఖ్య రాష్ట్రస్థాయి ముఖ్యుల సమావేశంలో ఆయన మాట్లాడారు. చేతివృత్తిదారులకు జనాభా ప్రకారం బడ్జెట్లో నిధులు కేటాయించి, ఉపాధి అవకాశాలు కల్పించాలని ఈ సమావేశం తీర్మానించింది. -
సబ్ ప్లాన్‌తోనే బీసీల అభివద్ధి: తమ్మినేని
సుందరయ్య విజ్ఞాన కేంద్రం: సమాజంలో 52 శాతం ఉన్న వెనుకబడిన వర్గాల అభివృద్ధి కోసం బీసీ సబ్ ప్లాన్ చట్టాన్ని ఏర్పాటు చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. గురువారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సీపీఎం తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో మహాజన పాదయాత్రను పురస్కరించుకుని బీసీల సమస్యలపై సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ.. బీసీ సబ్‌ప్లాన్ చట్టం వస్తేనే వారు అభివృద్ధి చెందుతారని, దీని కోసం రెండేళ్లుగా ఉద్యమాలు చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. 92 శాతం ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల అభివృద్ధే తెలంగాణ అభివృద్ది అన్నారు. వెనకబడిన కులాల ప్రజల అభివృద్ది కోసం ప్రత్యేక చట్టాలు రావాలన్నారు. రాజ్యాధికార పార్టీ అధ్యక్షుడు వీజీఆర్ నారగోని మాట్లాడుతూ... ప్రజల్లో చైతన్యం తీసుకురావల్సిన బాధ్యత రాజకీయ పార్టీలపై ఉందన్నారు. బలహీన వర్గాల అభివృద్ధిపై ప్రభుత్వాలు స్పందించడం లేదని విమర్శించారు. ఉన్నత వర్గాల వారే అధికారంలోకి రావడం వల్ల బడుగుల జీవితం అరణ్య రోదనగా మారిందన్నారు. రాజ్యాధికారం బడుగుల చేతుల్లోకి రావాలంటే మన ఓట్లను మనమే వేసుకోవాల న్నారు. బీసీ సబ్ ప్లాన్ సాధన కమిటీ కన్వీనర్ కిల్లె గోపాల్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో నాయకులు జి. రాములు, పి. ఆశయ్య, ప్రొఫెసర్ ప్రభంజన్‌యాదవ్. ఎంవీ రమణ, ఆర్. శ్రీరాంనాయక్, లెల్లెల బాలకృష్ణ, పి. రామకృష్ణ, నరేందర్ తదితరులు పాల్గొన్నారు. -
బీసీ ఉద్యమాలను బలోపేతం చేస్తాం
బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేశన శంకరరావు కర్నూలు(అర్బన్): బీసీ సమస్యలపై ఉద్యమాలను బలోపేతం చేయనున్నట్లు బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేశన శంకరరావు అన్నారు. బుధవారం స్థానిక టీజీవీ కళా క్షేత్రంలో సంఘం జిల్లా అధ్యక్షుడు వై నాగేశ్వరరావు అధ్యక్షతన జిల్లా విస్తృత స్థాయి సమావేశం జరిగింది. కర్నూలు, కడప. అనంతపురం జిల్లాల్లో బీసీలు అధికంగా ఉన్నారని, వీరంతా రాజకీయంగా ఎదగాలని శంకరరావు పేర్కొన్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో బీసీ భవ న్ల ఏర్పాటుకు కర్నూలు జిల్లాను మార్గదర్శకంగా చూపిస్తామన్నారు. బీసీలను అన్ని పార్టీలు చిన్నచూపు చూస్తున్నాయని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆదిశేషులు ఆవేదన వ్యక్తం చేశారు. కర్నూలు కార్పొరేషన్ ఎన్నికల్లో బీసీలను గెలిపించుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని సంఘం నేత నక్కలమిట్ట శ్రీనివాసులు అన్నారు. పార్లమెంట్ సమావేశాల్లో బీసీ బిల్లు ప్రవేశపెట్టి చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించేలా అన్ని రాజకీయ పార్టీలపై ఒత్తిడి తీసుకురావాలని జాతీయ ప్రధాన కార్యదర్శి ఆల్మన్రాజు పేర్కొన్నారు. రూ.20 వేల కోట్లతో బీసీ సబ్‌ప్లాన్ అమలు చేయాలన్నారు. యువజన సంఘం రాష్ట్ర కార్యదర్శి ఎం రాంబాబు, జిల్లా ఉపాధ్యక్షుడు యు సురేష్, కేతూరి మధు, విజయకుమార్, వాడాల నాగరాజు, జీ శ్రీనివాసులు పాల్గొన్నారు. -
'ఇద్దరు సీఎంలు బిచ్చమెత్తుకుంటున్నారు'
బీసీ సంక్షేమ సంఘం నేత ఆర్.కృష్ణయ్య హుస్నాబాద్/చిగురుమామిడి: తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, కేసీఆర్ చట్టసభల్లో బీసీలకు 50శాతం రిజర్వేషన్లు కావాలని కేంద్రాన్ని కోరకుండా చిన్న చిన్న విషయాల కోసం చిప్ప చేతిలో పట్టుకుని బిచ్చమెత్తుకుంటున్నారని బీసీ సంక్షేమ సంఘం నేత ఆర్.కృష్ణయ్య విమర్శించారు. బీసీ చైతన్య యాత్రలో భాగంగా మంగళవారం ఆయన కరీంనగర్ జిల్లా చిగురుమామిడి, హుస్నాబాద్, తిమ్మాపూర్ లలో పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... దేశంలో 112 బీసీ కులాలున్నాయని, 120 సార్లు రాజ్యాంగాన్ని సవరించినా బీసీల సంక్షేమాన్ని ఎవరూ పట్టించుకోవడం లేదని ఆరోపించారు. దేశంలో 70 కోట్ల మంది బీసీలున్నారని, ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిన బీసీలకు 50శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రభుత్వం 20 వేల కోట్లతో బీసీ సబ్‌ప్లాన్‌ను ఏర్పాటు చేసి 80 శాతం సబ్సిడీపై రుణాలు అందించాలని కోరారు. రాష్ట్రంలో ఆయా ప్రభుత్వ శాఖల్లో రెండు లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని, వాటిని భర్తీ చేయడంలో సర్కారు విఫలమైందని విమర్శించారు. పార్లమెంట్, అసెంబ్లీలలో ఆంగ్లో ఇండియన్లకు నామినేటేడ్ పదవులను ఇచ్చి గౌరవిస్తున్నంత కూడా బీసీలను గౌరవించడం లేదన్నారు. బీసీ కార్పొరేషన్ ద్వారా నాలుగేళ్లుగా రుణాలు ఇవ్వడం లేదన్నారు. హర్యానా, గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రాల్లో కొన్ని కులాలను బీసీలో చేర్చాలని ఉద్యమిస్తే కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చిందన్నారు. ఆ రాష్ట్రాల పోరాట పటిమను స్ఫూర్తిగా తీసుకొని 2019 ఎన్నికల్లో బీసీల రాజ్యాధికారం కోసం బీసీలంతా సమష్టిగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. -
‘బీసీ సబ్ ప్లాన్ హామీ నిలబెట్టుకోవాలి’
సాక్షి, హైదరాబాద్: ఎన్నికలకు ముందు బీసీ సబ్‌ప్లాన్‌పై టీఆర్ఎస్ ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తవుతున్నా బీసీ సబ్‌ప్లాన్ ప్రతిపాదన కూడా చేయడం లేదని విమర్శించారు. జ్యోతిరావుపూలే జయంతి వేడుకలను గాంధీభవన్‌లో సోమవారం నిర్వహించారు. కాంగ్రెస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టివిక్రమార్క, మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, ఏఐసీసీ అధికార ప్రతినిధి మధుయాష్కీ, ఎస్సీ సెల్ చైర్మన్ ఆరేపల్లి మోహన్, మహిళా విభాగం అధ్యక్షురాలు నేరెళ్ల శారద, మాజీమంత్రి మర్రి శశిధర్‌రెడ్డి పూలే చిత్రపటానికి నివాళులర్పించారు. వెనుకబడిన వర్గాల అణిచివేతకు వ్యతిరేకంగా పోరాడిన మహనీయుడు పూలే అని కొనియాడారు. -
రూ.20 వేల కోట్లతో బీసీ సబ్‌ప్లాన్ ఏర్పాటు చేయాలి
మంత్రి జోగు రామన్నకు బీసీ నేతల వినతి సాక్షి, హైదరాబాద్: రాష్ర్టంలో రూ.20 వేల కోట్ల బడ్జెట్‌తో బీసీ సబ్‌ప్లాన్‌ను ఏర్పాటుచేయాలని బీసీ సంక్షేమశాఖ మంత్రి జోగురామన్నకు ఆర్.కృష్ణయ్య నేతృత్వంలోని ప్రతినిధిబృందం విజ్ఞప్తిచేసింది. బీసీ కార్పొరేషన్‌కు రూ.2 వేల కోట్లు కేటాయించాలని, బీసీ కాలేజీ హాస్టళ్ల స్వంతభవనాల నిర్మాణానికి రూ.500 కోట్లు కేటాయించాలని మంత్రికి విజ్ఞప్తి చేశారు. ఉన్నత చదువులకోసం రుణాలు పొందడానికి తల్లిదండ్రుల వార్షిక ఆదాయపరిమితిని రూ.2 లక్షలకు పెంచాలని కోరా రు. ఈ మేరకు సోమవారం సచివాలయంలో మంత్రి జోగురామన్నకు బీసీ సంక్షేమసంఘం నేత ఆర్.కృష్ణయ్య నేతృత్వంలో శ్రీనివాస్‌గౌడ్, గుజ్జకృష్ణ, ర్యాగరమేష్, శ్యామ్, పి.ఉష, రవి, ఎం.వీణ, మల్లేష్‌యాదవ్ వినతిపత్రాన్ని సమర్పించారు. కాగా, బీసీల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి తెలిపినట్లు కృష్ణయ్య వెల్లడించారు. -
మనిషికి విలువ కలిగించే చేనేతలు
మనిషికి తను వేసుకునే బట్టల ద్వారానే ఎనలేని విలువ, గౌరవం కలుగుతాయి. దశావతారాలు ఎత్తిన మహావిష్ణువుకు నూలు దారంతో స్వయంగా పట్టుపంచె నేసి కాను కగా ఇచ్చిన మార్కండేయ మహర్షి వారసు లైన చేనేతకారుల బతుకులు నేడు వెలసి పోతున్నాయి. దివంగత నేత వైఎస్ రాజశే ఖరరెడ్డి చేనేతకారులకు ప్రయోజనం కలిగిం చేందుకోసం ప్రతి ఆదివారం ఎమ్మెల్యే, ఎంపీలు ఖద్దరు దుస్తులు ధరించేలా ఆదేశాలు జారీ చేసి చేనేతలకు చేయూతనిచ్చిన విష యం పద్మశాలి కులస్తులు మరువరు. ప్రధాని నరేంద్ర మోదీ బీసీ సబ్ ప్లాన్ కోసం తెలం గాణ రాష్ట్రంలోని బీసీ కులస్తుల కోసం రూ. 20,000 కోట్లతో సబ్ ప్లాన్ అమలు చేయాలి. సిరిసిల్ల, దుర్బెడు, ఎలగెడు, హుజూరాబాద్, వరంగల్, భువనగిరి ప్రాంతాల్లో గల చేనేతల అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ ఆప్కో షాపుల ద్వారా చేనేతల వస్త్రాలు అమ్మించి ఆదుకోవాలి. గత మార్చి 2015లో తెలంగాణ సీఎం వరంగల్‌లో టెక్స్టైల్ పార్కు కోసం ఎంపీలతో ఆధ్యయనం జరి పించారు. అంతే కాకుండా ఆయన ప్రకటిం చిన డబుల్ బెడ్రూం ఇళ్ల పథకంలో భాగం గా మార్కండేయ టౌన్షిప్ పేరుతో చేనేత లకు ఇళ్లు నిర్మించి ఇవ్వాలి. బీసీ కార్పొరేషన్ ద్వారా ప్రతి బీసీ కులస్తుడికి పావలా వడ్డీతో రూ.50,000లు రుణం అందించాలి. తెలంగా ణ రాష్ట్రంలో పనిచేస్తున్న బీసీ విభాగంలోని పద్మశాలి కులస్తులకు వెంటనే పదోన్నతులు కల్పించాలి. బీసీలలోని అన్ని కులాల వారికి సబ్‌ప్లాన్ అమలు చేస్తూ, రూ.20,000 కోట్ల ను కేటాయించినట్లయితే వెనుకబడిన తరగ తుల వర్గాల ప్రజలు అభివృద్ధి చెందుతారు. అందుచేత వెంటనే సబ్‌ప్లాన్ అమలుకు ప్రధాని నరేంద్రమోదీ పూనుకోవాలి. - కోలపాక శ్రీనివాసమూర్తి బెల్లంపల్లి -
రూ.10వేల కోట్లతో బీసీ సబ్‌ప్లాన్ ఏర్పాటు చేయాలి
నల్లగొండ టుటౌన్ : బీసీల సమగ్రాభివృద్ధికి రూ.10 వేల కోట్లతో సబ్‌ప్లాన్ ఏర్పాటు చేయాలని బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు చక్రహరి రామరాజు డిమాండ్ చేశారు. మంగళవారం స్థానిక ఆ సంఘం కార్యాలయంలో నిర్వహించిన అత్యవసర సమావేశంలో ఆయన మాట్లాడారు. అనేక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నా.. బీసీ కార్పొరేషన్ ద్వారా ఏ ఒక్కరికి కూడా ప్రభుత్వం రుణాలు అందించకపోవడం అన్యాయమన్నారు. బీసీల స్వయం ఉపాధి కోసం దరఖాస్తు చేసుకున్నవారికి వెంటనే రుణాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. బీసీలకు కూడా కల్యాణ లక్ష్మి పథకం వర్తింపజేసి, భూమిలేనిపేద బీసీలకు మూడు ఎకరాల భూమి ఇవ్వాలని కోరారు. సమావేశంలో సంఘం నాయకులు కాసోజు విశ్వనాథం, వైద్యం వెంకటేశ్వర్లు, మైనం నారాయణ, సిరిప్రోలు వెంకటపతి, ఇంద్రయ్య, నాగులపల్లి శ్యాంసుందర్, దుడుకు లక్ష్మీనారాయణ, గండిచెరువు వెంకన్నగౌడ్, రమేష్, రాజేందర్ తదితరులు పాల్గొన్నారు. -
సీఎం పదవి బీసీలకే ఇవ్వాలి: ఆర్.కృష్ణయ్య
హైదరాబాద్: తెలంగాణలో సీఎం పదవి బీసీలకే ఇవ్వాలని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల పర్యవేక్షకుడు దిగ్విజయ్ సింగ్‌ను బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య కోరారు. గాంధీభవన్‌లో దిగ్విజయ్‌ను ఆయన కలిశారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ 50 శాతం టిక్కెట్లు బీసీలకే ఇవ్వాలని ఈ సందర్భంగా దిగ్విజయ్‌ను కోరారు. చట్టసభలో బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. రూ. 20 వేల కోట్లతో బీసీ సబ్‌ప్లాన్‌ను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఆర్.కృష్ణయ్య డిమాండ్లను హైకమాండ్ పరిశీలిస్తుందని దిగ్విజయ్ సింగ్ హామీయిచ్చారు. ప్రజలు వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ను గెలిపించాలన్నారు. సీఎం పదవి ఎవరికి ఇవ్వాలన్నది హైకమాండ్ పరిశీలిస్తుందని చెప్పారు. -
బీసీ సబ్‌ప్లాన్‌ను ప్రకటించి నిధులు విడుదల చేయాలి
చేవెళ్ల, న్యూస్‌లైన్: బీసీ సబ్‌ప్లాన్‌ను ప్రకటించి వెనుకబడిన తరగతుల అభివృద్ధి కోసం ప్రత్యేకంగా నిధులను కేటాయించాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య ప్రభుత్వాన్ని డిమాండ్‌చేశారు. ఈ నెల 24న నగరంలో జరిగే తెలంగాణ గౌడ సమర భేరి సన్నాహకాల్లో భాగంగా శనివారం స్థానిక కేజీఆర్ ఫంక్షన్ హాలులో జిల్లా సదస్సును నిర్వహించారు. ఈ సందర్బంగా ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ.. బీసీలకు చెందిన నిధులను వారి కోసమే ఖర్చు చేయడానికి బీసీ సబ్‌ప్లాన్‌ను ఏర్పాటు చేయాలన్నారు. వెనుకబడిన తరగతుల ప్రజల మధ్య ఐక్యత లేకపోవడంవల్లే రాజ్యాధికారానికి దూరంగా ఉన్నామని ఆవేదన వ్యక్తంచేశారు. కల్లుగీత వృత్తిని కార్పొరేట్ రంగంగా మార్చి అభివృద్ధిచేయాలని పేర్కొన్నారు. దశాబ్దాల తరబడి ఓట్లు మనవి, సీట్లు అగ్రవర్ణాలవారివంటూ దుయ్యబట్టారు. కల్లుగీత కార్మికులను, టీఎఫ్టీదారులను ఎక్సైజ్ అధికారులు మామూళ్ల పేరుతో వేధిస్తున్నారని ఆరోపించారు. కల్లును ఎక్సైజ్ నుంచి వేరుచేసి కో-ఆపరేటివ్ సొసైటీల పరిధిలోకి తీసుకురావడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. తాటిచెట్లు, ఈత చెట్లను పెంచడానికి ప్రభుత్వం ఎటువంటి చర్యలు చేపట్టడంలేదని తెలిపారు. హైదరాబాద్ నగరంలోని 105 కల్లు దుకాణాలను మూసివేసి గౌడ కులస్తులకు ప్రభుత్వాలు తీరని అన్యాయం చేసిందని ఆయన మండిపడ్డారు. బీసీ కులాలన్నీ విద్య, రాజకీయ, ఆర్థిక రంగాలలో మరింత ప్రగతి సాధించాలని, అందుకోసం అందరం ఐకమత్యంగా కదులుదామని పిలుపునిచ్చారు. అణచివేతకు గురవుతున్న బీసీలు: దేశిని చినమల్లయ్య గౌడ జేఏసీ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే దేశిని చినమల్లయ్యగౌడ్ ప్రసంగిస్తూ.. సమాజంలో 80 శాతం ఉన్న బీసీలు ఇప్పటికీ అణిచివేతకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. కల్లుగీత కార్మికుల సంక్షేమానికి ఏ ప్రభుత్వమూ సరైన చర్యలు తీసుకోవడంలేదని పేర్కొన్నారు. సామాజికంగా బలపడితేనే రాజ్యాధికారానికి దగ్గరవుతామన్నారు. ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలి: వెంకన్న గౌడ్ గౌడ, కల్లుగీత వృత్తిదారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అయిలి వెంకన్నగౌడ్ మాట్లాడుతూ.. కల్లుగీత వృత్తిదారులకు ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటుచేయాలని డిమాండ్‌చేశారు. గౌడ కులస్తులను అన్నిరంగాలలో సీమాంధ్ర పాలకులు ఎదగకుండా చేశారన్నారు. రాష్ట్రంలో 18 శాతమున్న గౌడ కులస్తులు దామాషా ప్రకారం 38 మంది ఎమ్మెల్యేలుగా ఉండాలని, కాని కేవలం ఐదుమంది మాత్రమే ఉండడం శోచనీయమన్నారు. గౌడ కులస్తులు తప్ప ఏ వృత్తిదారులూ ప్రభుత్వానికి పన్ను చెల్లించడంలేదని, ఇదెక్కడి న్యాయమని ప్రశ్నించారు. చెట్టుమీదినుంచి పడి మృతిచెందిన గీత కార్మికులకు కూడా ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా చెల్లించకపోవడం అత్యంత దారుణమైన విషయమని దుయ్యబట్టారు. ట్యాంక్‌బండ్‌పై పాపన్న విగ్రహం పెట్టాలి కల్లుగీత వృత్తిదారుల సంఘం జిల్లా అధ్యక్షుడు తాళ్ల శ్రీశైలంగౌడ్, తెలంగాణ గౌడ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు బుర్ర కొండయ్యగౌడ్, గౌడ జనహక్కుల పోరాటసమితి రాష్ట్ర అధ్యక్షుడు విజయకుమార్‌గౌడ్, సినీ నటుడు, అడ్వయిజరీ కమిటీ చైర్మన్ జైహింద్‌గౌడ్, గౌడ ఐక్య సాధన సమితి రాష్ట్ర కన్వీనర్ జుంబాల నారాయణ గౌడ్, రాష్ట్ర నాయకులు రామక్రిష్ణగౌడ్, రామాగౌడ్, ప్రకాశ్‌గౌడ్, రాంచంద్రయ్యగౌడ్, రాఘవేందర్‌గౌడ్, పల్లె లక్ష్మణరావుగౌడ్, బొబ్బిలి రమేష్‌గౌడ్, కొండకల్ శంకర్‌గౌడ్, కాసుల సురేందర్‌గౌడ్ తదితరులు మాట్లాడుతూ.. గౌడ కులస్తుల పోరాటం చేసిన యోధుడు సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహాన్ని ట్యాంక్‌బండ్‌పై ఏర్పాటుచేయాలని డిమాండ్ చేశారు. కల్లుగీత కార్మికులందరికీ ఇళ్లు, పింఛ న్లు కూడా అందించాలన్నారు. తెలంగాణ బిల్లును వెంటనే పార్లమెంటులో ప్రవేశపెట్టి ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటుచేయాలని కోరారు. -
31న బీసీల రాష్ట్ర స్థాయి సమావేశం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని వెనుకబడిన వర్గాల ప్రజల సమస్యలను చర్చించి భవిష్యత్ కార్యాచరణ రూపొందించేందుకు ఈనెల 31న హైదరాబాద్‌లో రాష్ట్ర స్థాయి విస్తృత సమావేశం నిర్వహించాలని బీసీ సంఘాలు నిర్ణయించాయి. ఈ సమావే శంలో ప్రధానంగా వచ్చే ఎన్నికలలో అన్ని రాజకీయ పార్టీల నుంచి బీసీలకు 150 అసెంబ్లీ, 22 ఎంపీ సీట్ల కేటాయింపు, చట్టసభల్లో రిజర్వేషన్లు, బీసీ సబ్‌ప్లాన్ తదితర అంశాలు ఎజెండాగా ఉంటాయని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సమావేశానికి ఎనిమిది మంది బీసీ మంత్రులు, 9 మంది ఎంపీలు, 70 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వివిధ యూనివర్సిటీల ప్రొఫెసర్లు, కులసంఘాల ముఖ్యులు హాజరవుతారని ఆయన వెల్లడించారు. -
చెక్ పవర్ ఇవ్వకుంటే హైదరాబాద్ దిగ్బంధం : ఆర్.కృష్ణయ్య
నిజామాబాద్, న్యూస్‌లైన్: గ్రామ సర్పంచులకు చెక్ పవర్ ఇవ్వకుంటే పదివేల మంది సర్పంచులతో హైదరాబాద్‌ను దిగ్బంధనం చేస్తామని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య ప్రభుత్వాన్ని హెచ్చరించారు. నిజామాబాద్‌లో జరిగిన బీసీగర్జన సభలో కొత్తగా ఎన్నికైన 400 మంది బీసీ సర్పంచులకు ఆత్మీయ సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కృష్ణయ్య మాట్లాడుతూ రాజ్యాంగబద్ధంగా సర్పంచులకు 29 అధికారాలు కల్పించాలన్నారు. బీసీ సబ్ ప్లాన్ బిల్లును పార్లమెంట్లో ప్రవేశ పెట్టాలని, ఇందుకు బీసీ నాయకులు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలన్నారు. బీసీలకు 150 ఎమ్మెల్యే సీట్లు ఇవ్వాలి తూప్రాన్: బీసీలకు వచ్చే ఎన్నికల్లో 150 అసెంబ్లీ, 22 పార్లమెంటు స్థానాలు కేటాయించాలని ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. మెదక్ జిల్లా తూప్రాన్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. వైఎస్సార్సీపీ, టీడీపీ బీసీలకు న్యాయం చేస్తామని ప్రకటించాయని, మిగిలిన పార్టీలు అదేబాటన నడవాలన్నారు. పీసీసీ మాజీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరిగిపోయిందని, సీమాంధ్ర నాయకులు ఎన్ని కుట్రలు చేసినా ఫలించవని, వారికి నిరాశ తప్పదన్నారు.