‘బీసీ సబ్ ప్లాన్ హామీ నిలబెట్టుకోవాలి’ | n. uttam kumar reddy fires on trs | Sakshi
Sakshi News home page

‘బీసీ సబ్ ప్లాన్ హామీ నిలబెట్టుకోవాలి’

Published Tue, Apr 12 2016 3:31 AM | Last Updated on Tue, Oct 16 2018 8:27 PM

‘బీసీ సబ్ ప్లాన్ హామీ నిలబెట్టుకోవాలి’ - Sakshi

‘బీసీ సబ్ ప్లాన్ హామీ నిలబెట్టుకోవాలి’

సాక్షి, హైదరాబాద్: ఎన్నికలకు ముందు బీసీ సబ్‌ప్లాన్‌పై టీఆర్‌ఎస్ ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి డిమాండ్ చేశారు. టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తవుతున్నా బీసీ సబ్‌ప్లాన్ ప్రతిపాదన కూడా చేయడం లేదని విమర్శించారు. జ్యోతిరావుపూలే జయంతి వేడుకలను గాంధీభవన్‌లో సోమవారం నిర్వహించారు. కాంగ్రెస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టివిక్రమార్క, మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, ఏఐసీసీ అధికార ప్రతినిధి మధుయాష్కీ, ఎస్సీ సెల్ చైర్మన్ ఆరేపల్లి మోహన్, మహిళా విభాగం అధ్యక్షురాలు నేరెళ్ల శారద, మాజీమంత్రి మర్రి శశిధర్‌రెడ్డి పూలే చిత్రపటానికి నివాళులర్పించారు. వెనుకబడిన వర్గాల అణిచివేతకు వ్యతిరేకంగా పోరాడిన మహనీయుడు పూలే అని కొనియాడారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement