కాంగ్రెస్‌తోనే సామాజిక తెలంగాణ: మల్లు | mallu bhatti vikramarka says social justice in telangana possible with congress | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌తోనే సామాజిక తెలంగాణ: మల్లు

Published Sun, Feb 5 2017 5:39 PM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

కాంగ్రెస్‌తోనే సామాజిక తెలంగాణ: మల్లు - Sakshi

కాంగ్రెస్‌తోనే సామాజిక తెలంగాణ: మల్లు

హైదరాబాద్‌సిటీ: కాంగ్రెస్‌తోనే సామాజిక తెలంగాణ సాధ్యమని  టీపీసీసీ వర్కింగ్‌  ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క అన్నారు. హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడుతూ..బీసీ నిధులను ప్రభుత్వం దామాషా ప్రాతిపదికన కేటాయించడం లేదని తెలిపారు. కేటాయించిన నిధులను ఖర్చు చేయడంలో కూడా పూర్తిగా విఫలమైందని విమర్శించారు.

ఉగాది వరకు జిల్లా స్థాయి  నుంచి మండల స్థాయి వరకు పార్టీ జిల్లా కమిటీలను ఏర్పాటు  చేసుకుంటామన్నారు. బీసీ సబ్ ప్లాన్ తీసుకురావడానికి ప్రభుత్వంపై ఒత్తిడి  తెస్తామన్నారు. జ్యోతి  రావు పూలే విగ్రహాలను ఓబీసీ డిపార్ట్మెంట్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేస్తామని తెలిపారు.

సర్వే వివరాలను ప్రభుత్వం బయటపెట్టాలి: వీహెచ్‌
హైదరాబాద్‌సిటీ: ప్రభుత్వం సమగ్ర కుటుంబ సర్వే వివరాలను ఎందుకు బయటపెట్టడం లేదని కాంగ్రెస్‌ మాజీ ఎంపీ వి.హనుమంతరావు ప్రశ్నించారు. సమగ్ర  సర్వే బయటపెడితే.. దాని ద్వారా బీసీల ప్రాతిపదికన ఉద్యోగాలు, బడ్జెట్  అడుగుతారనే సర్వే వివరాలు వెల్లడించడం లేదన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement