సాక్షి, హైదరాబాద్: మహారాష్ట్రలో తెలంగాణ సీఎం రేవంత్ ప్రచారం చేసిన నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌కు ఘోర పరాభవం ఎదురైంది. రేవంత్ ప్రచారం నిర్వహించిన షోలాపూర్ సిటీ నార్త్, షోలాపూర్ సౌత్, చంద్రాపూర్, భోకార్, నాయగావ్, నాందేడ్ నార్త్‌లో బీజేపీ అభ్యర్థులు విజయం దిశగా దూసుకెళ్తున్నారు.
కాగా.. జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల వేళ ఏఐసీసీ సీనియర్ అబ్జర్వర్‌గా డిప్యూటీ సీఎం భట్టి పని చేసిన సంగతి తెలిసిందే. అయితే క్షేత్ర స్థాయిలో పార్టీ అనుసరించాల్సిన వ్యూహాలు, ఇతర అంశాలను ఎప్పటి కప్పుడు అధిష్టానానికి చేర్చుతూ.. కింది స్థాయిలో హైకమాండ్ నిర్ణయాలను అమలు పరిచారు. జార్ఖండ్‌లో ఇండియా కూటమి హవా సాగుతోంది. ఇక్కడ ఎన్డీయే కూటమికి గట్టి షాక్ తగిలింది. హేమంత్ సోరెన్ నేతృత్వంలోని జేఎంఎం స్పష్టమైన ఆధిక్యం దిశగా దూసుకెళ్తోంది.
జార్ఖండ్ అసెంబ్లీ పోస్ట్ ఎలక్షన్ ఏఐసీసీ అబ్జర్వర్‌గా భట్టి విక్రమార్కకు కాంగ్రెస్ అధిష్టానం బాధ్యతలు అప్పగించింది. ఆయనతో పాటు పార్టీ సీనియర్ లీడర్లు తన్వీర్ అన్వర్, కృష్ణ అల్లవూర్ నియమించింది.
జార్ఖండ్‌లో ఇండియా కూటమి ప్రభుత్వం ఏర్పాటు దిశగా దూసుకెళ్తున్న క్రమంలో రాంచీలో కాంగ్రెస్ నేతలతో భట్టి విక్రమార్క భేటీ అయ్యారు. ఫలితాల సరళిపై ఎప్పటికప్పుడు ఆరా తీస్తూ.. మంత్రి పదవులపై భట్టి విక్రమార్క సమాలోచనలు జరుపుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment