సాక్షి, అమరావతి : అసెంబ్లీ సాక్షిగా బీసీ సబ్‌ప్లాన్ బిల్లు డ్రామా బట్టబయలు అయింది. నిధులు ఎంతిస్తారో చెప్పకుండా బీసీ సబ్‌ప్లాన్ బిల్లును ప్రభుత్వం రూపొందించింది. బీసీ సబ్‌ప్లాన్‌పై అసెంబ్లీలో ప్రభుత్వ విప్ కూన రవి కుమార్ అడిగిన ప్రశ్నకు మంత్రి అచ్చెన్నాయుడు సమాధానం చెప్పలేకపోయారు. బీసీ సబ్‌ప్లాన్ బిల్లుపై ఏపీ అసెంబ్లీలో చర్చ జరిగింది. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ కూన రవికుమార్.. బీసీ సబ్‌ప్లాన్ బిల్లుపై అభ్యంతరాలు వ్యక్తం చేశారు. సబ్‌ప్లాన్‌లోని నిధులు జనాభా ప్రాతిపదికన ఇస్తారా?, రిజర్వేషన్ ప్రకారం ఇస్తారా? అని విప్ కూన ప్రశ్నించారు. దీనికి మంత్రి సమాధానం చెప్పలేక నీళ్లు నమిలారు. మధ్యలో మంత్రి పితాని సత్యనారాయణ కలుగజేసుకొని.. బిల్లులో అంకెలు లేవని చెప్పబోయారు. దీన్ని స్పీకర్ కోడెల శివప్రసాద్ తప్పుబట్టారు.
కాగా బీసీ సబ్‌ప్లాన్ బిల్లు గొడవపై ఉలిక్కిపడ్డ సీఎం చంద్రబాబు నాయుడు.. మంత్రులు, అధికారులను ఛాంబర్‌కు పిలిపించుకొని మాట్లాడారు. బిల్లులో లోపం ఉందని చంద్రబాబుకు అధికారులు తెలిపారు. దీంతో బీసీ వెల్ఫేర్, లాసెక్రటరీలను పిలిచి మాట్లాడారు. అనంతరం ఎంత శాతం నిధులు కేటాయిస్తారో చెప్పకుండానే బిల్లును ఆమోదింపజేశారు. ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా ప్రశ్నించిన కూన రవిపై చంద్రబాబు సీరియస్ అయినట్లు తెలుస్తోంది. సీఎంతో మాట్లాడాక కూన రవి మెత్తపడ్డారు. ఏదో ఒక ప్రాతిపదికన నిధులు కేటాయించాలని రవి కోరారు. దీంతో మూడో వంతు బడ్జెట్ కేటాయింపుపై సవరణ చేస్తామని చెప్పి బిల్లును ఆమోదించారు.
Comments
Please login to add a commentAdd a comment