Kuna Ravi Kumar
-
అసెంబ్లీలో మళ్లీ కూన వర్సెస్ అచ్చెన్న!
అమరావతి, సాక్షి: ఉమ్మడి శ్రీకాకుళం ముఖ్య నేతల విబేధాలు.. అసెంబ్లీ సాక్షిగా మరోసారి బయటపడ్డాయి. ఆముదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ ఈసారి సొంత ప్రభుత్వంపైనే ఆరోపణలు చేయగా, మంత్రి అచ్చెన్నాయుడు కాస్త గట్టిగానే స్పందించారు.ఐస్ లైన్డ్ రిఫ్రిజిరేటర్ ల కొనుగోలు లో అక్రమాలు జరిగాయంటూ కూన రవికుమార్ ఇవాళ అసెంబ్లీలో ఆరోపణలు గుప్పించారు. ‘‘లక్షా 30 వేలకు పక్క స్టేట్‌లో కొంటే.. మన రాష్ట్రం లో 2 లక్షల 4 వేలకు ఎందుకు కొనుగోలు చేశారు?. గోద్రెజ్ లాంటి కంపెనీలను పక్కన పెట్టి కోల్డ్ చైన్ లాంటి కంపెనీలకు ఎందుకు అనుమతి ఇచ్చారు?’’ అని కూన ప్రశ్నించారు.దీనికి మంత్రి అచ్చెన్నాయుడు బదులిస్తూ.. ఐస్ లైన్డ్ రిఫ్రిజిరేటర్ లు హారిజాంటల్, వర్టికల్ అని రెండు మోడల్స్ ఉంటాయ్. హారిజాంటల్ ఐస్ లైన్డ్ రిఫ్రిజిరేటర్ లను మాత్రమే కొనుగోలు చేయాలని కేంద్రం కోరింది. ఫార్చ్యూన్ అనే కంపెనీ L1 కోట్ చేయడం తో వారికి టెండర్ వచ్చింది. మహారాష్ట్ర లో లక్షా 84 వేలు, కర్నాటక లో 2.27 లక్షలకు కొన్నారు... గోద్రెజ్ కంపెనీ వాళ్లకు టెండర్ రాలేదని రాద్ధాంతం చేసారు. విశాఖ లో ఒక గోద్రెజ్ డీలర్ దీన్ని వివాదం చేసినట్టు మా దృష్టికి వచ్చింది. దీనిపై మేము గోద్రెజ్ కంపెనీ కి లెటర్ రాసాం, మాకేం సంబంధం లేదని చెప్పారు. అయినా సభ్యులకు అనుమానాలు ఉన్నాయ్ కాబట్టి మరోసారి విచారణ చేయిస్తాం ’’ అని మంత్రి అచ్చెన్న అన్నారు. ఇక..ఈ సమావేశాల్లో మొన్నీమధ్యే ఇద్దరి మధ్య ఆసక్తికర సంవాదం చోటు చేసుకుంది. జీరో అవర్‌లో మంత్రుల తీరుపై టీడీపీ ఎమ్మెల్యే కూన రవి విమర్శలకు దిగారు. ‘అసెంబ్లీలో జీరో అవర్ డ్రైవర్ లేని కారులా ఉంది’ అని అన్నారాయన. దీనికి మంత్రి అచ్చెన్నాయుడు.. ‘‘‘‘మంత్రులం ఎవ్వరం పట్టించుకోవడం లేదనుకోకండి. ప్రతి ప్రశ్నను సంబంధించిన మంత్రికి పంపమని చెప్పారు. దాని ప్రకారం మంత్రులు చర్యలు తీసుకుంటారు’’ అని బదులిచ్చారు. అయితే ఇద్దరి మధ్య మాటలయుద్ధ తీవ్రతను తగ్గించేందుకు.. మధ్యలో స్పీకర్ అయ్యన్న జోక్యం చేసుకుని ఏదో జోక్ వేసే ప్రయత్నం చేశారు. -
ఏపీ శాసనసభలో టీడీపీ ఎమ్మెల్యే వర్సెస్ మంత్రి.. మధ్యలో స్పీకర్
అమరావతి, సాక్షి: ఏపీ అసెంబ్లీ సమావేశాలు రసవత్తరంగా సాగుతున్నాయి. శాసనసభను వైఎస్సార్సీపీ బహిష్కరించినప్పటికీ.. ‘ప్రతిపక్షం లేదే!’ అనే లోటును కూటమి నేతలే భర్తీ చేస్తున్నారు. గత ఐదు రోజులుగా జరుగుతున్న పరిణామాలే ఇందుకు నిదర్శనం.తాజాగా.. శాసనమండలి వాయిదాతో శనివారం ఐదో రోజు శాసనసభ మాత్రమే నడుస్తోంది. అయితే జీరో అవర్‌లో మంత్రుల తీరుపై టీడీపీ ఎమ్మెల్యే కూన రవి విమర్శలకు దిగారు. ‘అసెంబ్లీలో జీరో అవర్ డ్రైవర్ లేని కారులా ఉంది’ అని అన్నారాయన.‘‘ఎమ్మెల్యేలు జీరో అవర్ లో ప్రశ్నలు వేస్తున్నారు. కానీ మంత్రులు ఎవ్వరు లేచి నోట్ చేసుకున్నాం అని చెప్పడం లేదు. మరి ఎమ్మెల్యేలు సమస్యలు చెప్పి ఏం లాభం?. జీరో అవర్ లో చెప్పిన సమస్య పై వచ్చే సభ లోగా మంత్రులు సభ్యులకు పురోగతి పై స్పష్టత ఇవ్వాలి’’ అని కాస్త ఆవేశపూరితంగానే అన్నారు. అయితే.. ఈ వ్యాఖ్యలపై స్పీకర్ అయ్యన్నపాత్రుడు స్పందించారు. సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రులు ఖచ్చితంగా రాసుకోవాలని ఆదేశించారు. ఈ నేపథ్యంలో.. కూన రవి వ్యాఖ్యలపై మంత్రి అచ్చెన్నాయుడు స్పందించారు.‘‘మంత్రులం ఎవ్వరం పట్టించుకోవడం లేదనుకోకండి. ప్రతి ప్రశ్నను సంబంధించిన మంత్రికి పంపమని చెప్పారు. దాని ప్రకారం మంత్రులు చర్యలు తీసుకుంటారు’’ అంటూ గట్టిగానే బదులిచ్చారు. అయితే అచ్చెన్న మాట్లాడుతున్నంత సేపు.. కూన మాత్రం సీరియస్‌గా ముఖం పెట్టుకుని కనిపించారు.అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మొదలైననాటి నుంచే.. సభలో మునుపెన్నడూ చోటు చేసుకోని పరిణామాలు కనిపిస్తున్నాయి. స్పీకర్ అయ్యన్నపాత్రుడు బహిరంగంగానే కూటమి నేతలపై, మంత్రులపై అసహనం, ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే.. నిన్నటి బడ్జెట్ చర్చలో టీడీపీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ.. కొత్తగా డిప్యూటీ స్పీకర్‌గా ఎన్నికైన రఘురామ కృష్ణంరాజుపై అసహనం వ్యక్తం చేశారు. తన ప్రసంగాన్ని అడ్డుకోవడంతో.. తానేమీ ప్రతిపక్షం కాదని, మాట్లాడకుండా కూర్చోమంటే అదే పని చేస్తానని, అసెంబ్లీకి రావద్దంటే రానంటూ జ్యోతుల నెహ్రూ ఎమోషనల్ అయ్యారు.ఇదీ చదవండి: ఇసుక పాలసీ బాలేదన్న జ్యోతుల.. మైక్ కట్ చేసిన రఘురామ!ఇదీ చదవండి: బాబుగారి మాటలకు అర్థాలే వేరులే..! -
బరితెగించిన పచ్చ గూండాలు
సాక్షి, శ్రీకాకుళం జిల్లా: కాశీబుగ్గలో టీడీపీ కార్యకర్తలు బరితెగించారు. పోలీస్‌స్టేషన్‌లోనే వైఎస్సార్సీపీ కార్యకర్తలపై దాడికి దిగారు. పోలీసులు వద్దని వారించినా వినకుండా టీడీపీ నేతలు చితకబాదారు. టీడీపీ నేతలు దాడి చేస్తుంటే పోలీసులు ప్రేక్షక పాత్ర వహించారు.టీడీపీ నేతల కక్ష సాధిపుమరోవైపు, సనపల సురేష్‌పై టీడీపీ నేతలు కక్ష సాధిపు చర్యలకు పాల్పడుతున్నారు. ఇసుక అక్రమ రవాణాను అడ్డుకున్నాడని గతంలో సురేష్‌పై ఇసుక మాఫియా దాడి చేసింది. ఇసుక మాఫియాతో ఎమ్మెల్యే కూన రవికుమార్ దాడి చేయించాడని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోకుండా పోలీసులు తనను వేధిస్తున్నారని సురేష్ అంటున్నారు.విచారణకంటూ పిలిచి సురేష్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఎమ్మెల్యే కూన రవికుమార్ ఒత్తిడితోనే తనపై పోలీసులు కేసు నమోదు చేశారని బాధితుడు ఆరోపిస్తున్నాడు. బాధితుడు సురేష్‌కు షరతులతో కూడిన బెయిల్ మంజూరైంది. -
ఇసుక దందాను అడ్డుకుంటే అంతే..
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: రాష్ట్రంలో ఇసుక మాఫియా ఆగడాలకు అంతులేకుండా పోతోంది. అడ్డొస్తే ఎంతకైనా తెగిస్తున్నారనడానికి శ్రీకాకుళంలో తాజాగా చోటుచేసుకున్న ఘటనే ఉదాహరణ. నగరం నడిబొడ్డున ఈనెల 16న టీడీపీ నాయకుల దాడిలో ఆమదాలవలస నియోజకవర్గానికి చెందిన సనపల సురేష్ తీవ్రంగా గాయపడ్డారు. దాడి చేసిన వారిని అరెస్టు చేయలేదుగానీ సురేష్‌ను మాత్రం అరెస్టు మీద అరెస్టు చేస్తున్నారు. దాడికి తెగబడడమే కాక.. టీడీపీ అతనిపై ఎదురు కేసు పెట్టి శనివారం అరెస్టు చేయించింది. అలాగే, వారం రోజుల క్రితం ఓ పాత కేసులోనూ అరెస్టుచేశారు. దీంతో ఆ పార్టీ నేతల వేధింపులు భరించలేక సురేష్ టీడీపీ సభ్యత్వం తీసుకున్నా పచ్చమూకలు వదిలిపెట్టలేదు. పైగా.. ఇసుక దోపిడీకి అడ్డుతగిలితే ఎవరికైనా ఇదేగతి అని ఆ పార్టీ సంకేతాలిచ్చింది. అసలేం జరిగిందంటే.. జిల్లాలోని ఆమదాలవలస మండలం దూసి గ్రామం ఎస్సీ కాలనీ సమీపంలోని నాగావళి నదిలో ఇసుక అక్రమార్కులు ఇసుక తవ్వి బావాజీపేట రబ్బర్ తయారీ ఇండస్ట్రియల్ యార్డులో నిల్వచేసి ఉంచారు. ఇది చూసి బూర్జ మండలం గుత్తావెల్లికి చెందిన సనపల సురేష్ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఆమదాలవలస టీడీపీ ఎమ్మెల్యే కూన రవి అనుచరుడైన తొగరాం వాసి రవికాంత్ నేతృత్వంలోనే ఈ తంతు జరుగుతున్నట్లు శ్రీకాకుళం తహసీల్దారు గణపతి కూడా తేల్చారు. ఈ నేపథ్యంలో.. ఈనెల 16న ఇసుక నిల్వలను మీడియాకు చూపించడానికి సురేష్ వెళ్తుండగా ఆయనపై కొందరు దాడికి యత్నించారు. అక్కడి నుంచి సురేష్ తప్పించుకుని వస్తుంటే.. శ్రీకాకుళంలోని బలగ మెట్టు కూడలి వద్ద మళ్లీ అటకాయించి ఆయనను కారు నుంచి బయటకు లాగి మరీ దాడిచేశారు. సురేష్‌తో పాటు వచ్చిన చంద్రరావు అనే వ్యక్తిపైనా దాడిచేశారు. అంతకుముందు.. సెప్టెంబరు 27న కూడా కాఖండ్యాం ఇసుక ర్యాంపులో అక్రమాలను అడ్డుకున్నారని నారాయణపురం వద్ద సురేష్ కారును అడ్డగించి దాడిచేశారు. డీఎస్పీ వద్ద విచారణకని పిలిచి అరెస్టు..ఇసుక మాఫియాకు కొరకరాని కొయ్యగా తయారైన సురేష్‌ను శ్రీకాకుళంలో తనపై దాడి ఘటనకు సంబంధించి విచారణకని పోలీసులు పిలిచారు. టూటౌన్ పోలీసుస్టేషన్‌కు సురేష్ వచ్చారు. విచారణ పూర్తయ్యాక స్టేషన్ నుంచి బయటికి రాగానే రూరల్ పోలీసులొచ్చి అరెస్టుచేశారు. ఈనెల 16న జరిగిన ఘటనలో కారుతో గుద్దేసి ఇద్దరి ప్రమాదానికి కారణమయ్యాడనే కేసు కింద అరెస్టుచేసినట్లు ఎస్ఐ కె. రాము తెలిపారు.కక్షపూరితంగా అరెస్టు చేశారు..పోలీసులు నా భర్తను కక్షపూరితంగా అరెస్టుచేశారు. విచారణకని పిలిచి అరెస్టుచేశారు. ఈనెల 25వ తేదీ సాయంత్రం రెండో పట్టణ పోలీసులు ఫోన్ చేశారు. 26న డీఎస్పీ విచారణ ఉందని రమ్మన్నారు. దీంతో శనివారం మధ్యాహ్నం 12.30కు రెండో పట్టణ పోలీస్‌స్టేషన్‌కు సురేష్‌తో కలిసి వెళ్లాం. అక్కడ స్టేట్మెంట్ రాసుకుంటామని చెప్పి సాకు‡్ష్యలు ఎవరైనా ఉన్నారా అని అడిగారు. అక్కడే వందలాది మంది చూశారని చెప్పాం. సరే.. మీరు వెళ్లిపోండని సీఐ అనగానే బయటకు వచ్చేశాం. ఇంతలో రూరల్ ఎస్ఐ కె. రాము తమ సిబ్బందితో కలిసి నా భర్తను జీపులో ఎక్కించుకుని తీసుకుపోయారు. – మౌనిక , సనపల సురేష్ భార్య కక్షపూరితంగానే అరెస్టు.. పోలీసులు నా భర్తను కక్షపూరితంగా అరెస్టు చేశారు. విచారణకని పిలిచి అరెస్టుచేశారు. ఈనెల 25వ తేదీ సాయంత్రం రెండో పట్టణ పోలీసులు ఫోన్ చేశారు. 26న డీఎస్పీ విచారణ ఉందని రమ్మన్నారు. దీంతో శనివారం మ«ధ్యాహ్నం 12.30కు రెండో పట్టణ పోలీస్‌స్టేషన్‌కు సురేష్‌తో కలిసి వెళ్లాం. అక్కడ స్టేట్మెంట్ రాసుకుంటామని చెప్పి సాక్షులు ఎవరైనా ఉన్నారా అని అడిగారు. అక్కడే వందలాది మంది చూశారని చెప్పాం. సరే.. మీరు వెళ్లిపోండని సీఐ అనగానే బయటకు వచ్చేశాం. ఇంతలో రూరల్ ఎస్ఐ కె. రాము తమ సిబ్బందితో కలిసి నా భర్తను జీపులో ఎక్కించుకుని తీసుకుపోయారు. – మౌనిక, సనపల సురేష్ భార్య -
నన్ను చంపేందుకు.. పోలీసులతో కలిసి టీడీపీ ఎమ్మెల్యే స్కెచ్
-
మంత్రి అచ్చెన్నాయుడు - ఎమ్మెల్యే కూన రవికుమార్ మధ్య వార్
-
కూన ఎక్కడ..?
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: కేంద్ర, రాష్ట్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసి జిల్లాకు వచ్చిన కింజరాపు రామ్మోహన్నాయుడు, కింజరాపు అచ్చెన్నాయుడు పర్యటనలో మాజీ విప్, ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ కనిపించలేదు. ఉద్దేశపూర్వకంగా గైర్హాజరయ్యారా? మరేదైనా కారణం ఉందా అన్నది తెలీదు గానీ టీడీపీలో మాత్రం ఇది తీవ్ర చర్చకు దారితీసింది. మంత్రి పదవి ఆశించి భంగపడిన కూన రవికుమార్ గుర్రుగా ఉండటం వల్లనే రాకపోయి ఉండొచ్చనే వాదన వినిపిస్తోంది.మంత్రి పదవిపై ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కాళింగ సామాజిక వర్గం నుంచి తప్పనిసరిగా కేబినెట్లో బెర్త్ ఖాయమని భావించారు. కానీ అంచనాలు తలకిందలయ్యాయి. కింజరాపు ఫ్యామిలీకి ఇచ్చేందుకే మొగ్గు చూపారే తప్ప కూన రవికుమార్‌ను పరిగణనలోకి తీసుకోలేదు. దీంతో కాళింగ సామాజిక వర్గమంతా గుర్రుగా ఉంది. ప్రెస్మీట్లు, సమావేశాలు పెట్టి నిరసన కూడా తెలియజేశారు. చంద్రబాబు తీరుపై అసంతృప్తి వ్యక్తంచేయడమే కాకుండా సమయం వచ్చి నప్పుడు తామేంటో చూపిస్తామని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. కాళింగులు ఎన్ని చేసినా ఫలి తం కనిపించడంలేదు. చంద్రబాబు నుంచి సాను కూలత రావడం లేదు. చిన్నా చితకా పదవి ఇచ్చి సరిపుచ్చుకునేలా ఉన్నారు. ఈ క్రమంలో భారీ ఆశలు పెట్టుకున్న కూన రవికుమార్ కూడా ఆవేదన చెందుతున్నట్టు సమాచారం. కష్టకాలంలో పార్టీకి అండగా నిలిస్తే తమకిచ్చే గౌరవమిదా అని ఆయన వర్గీయులు బాధపడుతున్నారు.కూన రవికుమార్‌తో పాటు కాళింగ సామాజిక వర్గమంతా అసంతృప్తితో ఉన్న వేళ.. జిల్లాలోకి అడుగు పెట్టిన కింజరాపు రామ్మోహన్నాయుడు, అచ్చెన్నాయుడుకు స్వాగతం పలికేందుకు ఒక వర్గం హాజరు కాలేదు. సోమవారం రాత్రి జరిగిన ఆత్మీయ సభలోనూ పాల్గొనలేదు. మంగళవారం జిల్లా అధికారులతో జరిగిన తొలి సమావేశం ప్రాంగణానికి కూడా రాలేదు. ఏడు రోడ్ల కూడలి వద్ద మున్సిపల్ ఎగ్జిబిషన్ గ్రౌండ్లో జరిగిన కార్యకర్తల ఆత్మీయ సభకు జిల్లాలోని ఎమ్మెల్యేలు, ఎంపీ హాజరయ్యారు. కానీ, కూన రవికుమార్, బెందాళం అశోక్ ఎక్కడా కనిపించలేదు. మంగళవారం జెడ్పీలో జరిగిన అధికారుల సమావేశంలో కూడా వీరిద్దరూ పాల్గొనలేదు. కాళింగ సామాజిక వర్గానికి మొండి చేయి చూపారన్న అసంతృప్తితో ఉద్దేశకపూర్వకంగా గైర్హాజరయ్యారా? లేదంటే మరే కారణం చేతో రాలేదా? అన్నది తెలియదు గాని పార్టీ శ్రేణులు మాత్రం కాళింగులకు జరిగిన అవమానం వలనే దూరంగా ఉండి ఉండవచ్చని అని చర్చించుకుంటున్నాయి. -
బూతు ‘కూన’ల బరితెగింపు.. విద్యుత్తు శాఖ ఏఈకి బెదిరింపులు
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: అధికారంలో లేకున్నా వారి ఆగడాలకు అంతులేదు. ప్రభుత్వ ఉద్యోగులను బెదిరించడం, దూషించడం ‘బూతుల బ్రదర్స్’కు నిత్యకృత్యంగా మారింది. శ్రీకాకుళం జిల్లాలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే కూన రవికుమార్ ఆగడాలు రోజురోజుకూ మితిమీరుతున్నాయి. గతంలో పలువురు ప్రభుత్వ అధికారులను దుర్భాషలాడిన రవికుమార్ తాజాగా పొందూరు విద్యుత్తు శాఖ ఏఈని ఫోన్లో బెదిరించిన వైనం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఉద్యోగం చేయాలని లేదా..? ‘కాస్త మర్యాదగా ఉద్యోగాలు చేయడం నేర్చుకో..! నీకు సర్విసు లేదా? ఉద్యోగం చేయవా నువ్వు...? (రాయలేని భాషలో తిడుతూ) నాకు రూల్స్ చెబుతావా? తమాషాలు దొబ్బుతున్నావా? విద్యుత్ మీటర్ విషయంలో నా మనిషికే నోటీసు ఇస్తావా? డిస్ కనెక్ట్ చెయ్.. జీవితంలో ఇంత పెద్ద తప్పు చేశానా అని బాధపడే రోజు వస్తుంది చూడు నీకు... గుర్తు పెట్టుకో.. నువ్వు ముందు నోటీసు విత్‌డ్రా చేసుకో. ఎవడా డీఈ...? నా కొడుకు.. ఆడికి చెప్పు.. మళ్లీ నీకు చెబుతున్నా వెధవ వేషాలు వేశావా.. మళ్లీ జీవితంలో కోలుకోలేవు..’ అంటూ పొందూరు ఎలక్ట్రికల్ ఏఈ పైడి దుర్గా ప్రసాద్‌ను కూన రవికుమార్ బెదిరించాడు. ఈ ఘటన మూడు నెలల క్రితం జరగ్గా ఆ సంభాషణ ఆలస్యంగా వెలుగు చూసింది. ఇలాంటి వ్యక్తులు పొరపాటున ఎన్నికైతే ప్రజలను, ఉద్యోగులను బతకనిస్తారా? అనే చర్చ సర్వత్రా జరుగుతోంది. తాజా బాగోతమిది పొందూరులో ‘గరుడ’ పేరుతో రెస్టారెంట్‌ను ఏర్పాటు చేసిన టీడీపీ ఎంపీటీసీ బాడాన గిరి అనుమతి లేకుండా విద్యుత్ మీటర్‌ను అమర్చారు. పంచాయతీ అనుమతి లేదని లిఖితపూర్వకంగా ఫిర్యాదు అందడంతో వివరణ ఇవ్వాలని ఎలక్ట్రికల్ ఏఈ పైడి దుర్గా ప్రసాద్ నోటీసు ఇచ్చారు. దీంతో రంగంలోకి దిగిన కూన రవికుమార్ ఫోన్ చేసి అసభ్యంగా దూషించారు. ఈ అవమానాన్ని భరించలేక విద్యుత్ శాఖ అధికారి కుమిలిపోయారు. కూన బ్రదర్స్‌కు ఆనవాయితీనే.. ♦ శ్రీకాకుళం సర్కిల్ ఇన్స్పెక్టర్గా పనిచేసిన ఆర్ఈసీహెచ్ ప్రసాద్‌ను గతంలో కూన రవికుమార్ నోటికొచ్చినట్టు దూషించారు. నీకు ఉద్యోగం, యూనిఫాం లేకుండా చేస్తా... ఆఫ్టర్ టూ అండ్ ఆఫ్ ఇయర్స్ నీకు ఉద్యోగం ఉండదు.. గుర్తుపెట్టుకో అంటూ బెదిరించారు. ♦ కోవిడ్ సమయంలో మందీ మార్బలంతో పోలీసు స్టేషన్‌కు వచ్చిన రవికుమార్ శంకరగిరి మాన్యాలు పట్టిస్తానంటూ పోలీస్ అధికారులను బెదిరించారు. ‘మీ స్థాయి ఎంత..? మీరు ఎంత..?’ అంటూ నరసన్నపేట సీఐ, ఎస్లనుద్దేశించి నోరు పారేసుకున్నారు. ♦ పొందూరులో టీడీపీ కార్యాలయం నిర్వహిస్తున్న భవనాన్ని ఖాళీ చేయాలని కోరినందుకు ఆ ఇంటి యజమానికి ఫోన్లో వార్నింగ్ ఇచ్చారు. ♦ పింఛన్ల విషయంలో తన మాట వినలేదని మండల కార్యాలయంలోనే సరుబుజ్జిలి ఎంపీడీవో, ఈవోపీఆర్డీకి వార్నింగ్ ఇచ్చారు. ఆఫీసులోనే తలుపులు వేసి మరీ బాదేస్తా.. నన్ను ఎవరూ ఆపలేరు. చెట్టుకు కట్టి కాల్చేస్తా.. చెప్పింది చేయకపోతే నేనేంటో చూపిస్తానంటూ బెదిరించారు. ♦ పనుల విషయంలో తాను చెప్పినట్లు వినకుంటే కుర్చిలో కూర్చున్నా లాక్కుని వచ్చి తంతానంటూ పంచాయతీ కార్యదర్శులను కూన రవికుమార్ భయపెట్టారు. ♦ ఒక బిల్లు విషయంలో సరుబుజ్జిలి ఇన్చార్జి ఈవోపీఆర్డీపై తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. ♦ మట్టి అక్రమంగా తరలించిన వాహనాలను విడిచిపెట్టలేదని పొందూరు తహసీల్దార్‌పై బెదిరింపులకు పాల్పడ్డారు. ‘పట్టుకున్న వాహనాలను విడిచి పెట్టకపోతే లంచం డిమాండ్ చేశావని నీమీద కంప్లైంట్ చేస్తా. చెప్పు ఎంత కావాలి...? పది వేలు కావాలా? లక్ష కావాలా? ఎంత కావాలి...? ప్రాసెస్ గురించి నాకు చెబుతున్నావా? అంటూ రాయలేని భాషలో ఏకంగా ఎమ్మార్వోను దూషించారు. ♦కూన రవికుమార్ తమ్ముడు కూన వెంకట సత్యనారాయణ ఇటీవల పంచాయతీరాజ్ అసిస్టెంట్ ఇంజనీర్ కెసీహెచ్ మహంతిపై దాడి చేసే వరకు వెళ్లారు. తాను చేసిన పనులకు సంబంధించి ఏఈ అభ్యంతరం వ్యక్తం చేయడంతో పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ కార్యాలయంలోనే దౌర్జన్యం చేశారు. ‘ఎంత ధైర్యం రా...! నాకే నోటీసు ఇస్తావా..? ఏమనుకుంటున్నావ్.. నేను కూన రవికుమార్ బ్రదర్‌ని.. జాగ్రత్త... ఇక్కడే పాతేస్తా... ’ అంటూ సత్యనారాయణ రెచ్చిపోయాడు. -
నేను కూన రవికుమార్ బ్రదర్‌ని.. జాగ్రత్త.. ఇక్కడే పాతేస్తా..
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: ‘ఎంత ధైర్యం రా.. నాకే నోటీసు ఇస్తావా.. నువ్వు ఏమనుకుంటున్నావ్.. నేను కూన రవికుమార్ బ్రదర్‌ని.. జాగ్రత్త.. ఇక్కడే పాతేస్తా...’ అంటూ టీడీపీ నాయకుడు కూన రవి సోదరుడు, కాంట్రాక్టర్ కూన వెంకట సత్యనారాయణ ఓ పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ ఉద్యోగిపై రెచ్చిపోయారు. అంతటితో ఆగలేదు.. ఏకంగా కొట్టేసేంతలా చెయ్యి ఎత్తి బెదిరించారు. నోటికొచ్చినట్టు బూతులు తిట్టారు. రాయలేని భాషలో పరుష పదజాలంతో వీరంగం సృష్టించారు. తాను కాంట్రాక్ట్ తీసుకున్న రోడ్డు పనులను పర్యవేక్షిస్తున్న పంచాయతీరాజ్ అసిస్టెంట్ ఇంజినీర్ కేసీహెచ్ మహంతిపైనే దౌర్జన్యానికి దిగారు. ఈనెల 10న జరిగిన ఈ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. దీనిపై ‘సాక్షి’ ఆరా తీయగా అసలు విషయాలు తెలిశాయి. అలవాటు ప్రకారమే.. టీడీపీ నేతల రౌడీయిజం ఆగలేదు. పదవులు పోయి మూడేళ్లయినా అధికార దర్పం దిగలేదు. సామాన్య ప్రజలను తిట్టినట్టు అధికారులపై విరుచుకుపడుతున్నారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు, జిల్లా అధ్యక్షుడు కూన రవికుమార్ ఇప్పటికే అనేక మార్లు అధికారులకు బెదిరింపులు, దాడులు చేసిన ఘటనలు ప్రజలకు తెలుసు. కేసులు నమోదై, అరెస్టుల వరకు వెళ్లాయి. అయినా వారి పంథా మారడం లేదు. ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులపైన జులుం ప్రదర్శిస్తూనే ఉన్నారు. తాజాగా కూన రవికుమార్ మాదిరిగా ఆయన సోదరుడు కాంట్రాక్టర్ కూన వెంకట సత్యనారాయణ దౌర్జన్య కాండకు దిగారు. శ్రీకాకుళంలోని పంచాయతీరాజ్ డిప్యూటీ ఇంజినీర్ కార్యాలయంలో బరితెగించి వ్యవహరించారు. తాను వేస్తున్న రోడ్డు పనుల విషయంలో నిబంధనలు పాటించడం లేదని, నాణ్యతా లోపాలు ఉన్నాయని, వాటిని సరిచేసుకోవాలని చెప్పినందుకు అసిస్టెంట్ ఇంజినీర్ మహంతిని కొట్టేంత పనిచేశారు. కార్యాలయంలో అందరి ఉద్యోగుల ముందే అసిస్టెంట్ ఇంజినీర్ మీదకొచ్చి దౌర్జన్యం చేయడమే కాకుండా చెయ్యి ఎత్తి తన అహంకారాన్ని ప్రదర్శించారు. దౌర్జన్యానికి మారుపేరైన కూన రవికుమార్.. సోదరుడు కావడంతో తోటి సిబ్బంది కూడా చోద్యం చూశారే తప్ప తప్పు అని చెప్పలేకపోయారు. దీంతో తనకు జరిగిన అవమానాన్ని బయటకు చెప్పుకోలేక, పై అధికారులు ముందుకు రాక అసిస్టెంట్ ఇంజినీర్ మహంతి కుంగిపోతున్నారు. యూనియన్ లీడరైన తనకే ఇలా జరిగితే.. మిగతా ఉద్యోగుల మాటేంటని బాధపడుతున్నారు. పనుల్లో నిర్లక్ష్యం.. శ్రీకాకుళం మండలం ఎన్‌హెచ్–16 (శాస్త్రుల పేట) నుంచి సానివాడ మీదుగా వప్పంగి వరకు రూ.2.69 కోట్ల పీఎంజీఎస్‌వై నిధులతో బీటీ రోడ్డు నిర్మాణానికి గత ఏడాది మే 24న అగ్రిమెంట్ కుదిరింది. ఈ ప్రకారం ఏడాదిలోగా పనులను పూర్తి చేయాల్సిందిగా కాంట్రాక్టర్ కూన వెంకట సత్యనారాయణతో పీఆర్ పీఐయూ విభాగం అగ్రిమెంట్ అయ్యింది. అయితే కాలపరిమితి పూర్తయినప్పటికీ ఏడాది కాలంలో ఒక్క రాయి కూడా వేయలేదు. తీరా ఇంజినీరింగ్ అధికారులు గట్టిగా అడిగితే.. కోవిడ్ కారణంగా రోడ్డు నిర్మాణం ప్రారంభించలేదంటూ చెప్పుకొచ్చారు. ఈ ఏడాది నవంబర్ నెలాఖరు వరకు ఎలాంటి అపరాధ రుసుం లేకుండా పనులు చేపట్టేందుకు కాంట్రాక్టర్‌కు వెసలు బాటు కల్పించారు. దీంతో మే నెల నుంచి రోడ్డు పనులు ప్రారంభించినప్పటికీ.. నిబంధనలకు పూర్తిగా పాతరేశాడు. దీంతో ఏఈ మహంతి నిర్మాణ పనులపై తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తూ అలార్మింగ్ లెటర్(లోటుపాట్లు సరిచేసుకోండని చెప్పే పత్రం) ఇచ్చేందుకు ప్రయత్నిస్తుండగా.. ఆ విషయం తెలుసుకున్న కూన సత్యనారాయణ ఈ నెల 10న పీఆర్ డివిజనల్ కార్యాలయానికి వచ్చి వీరంగం వేశారు. ఏఈ మహంతిపై దురుసుగా ప్రవర్తించాడు. తొలుత అసిస్టెంట్ ఇంజినీర్‌తో వాగ్వాదం చేసి.. ఆ తర్వాత పళ్లు బిగించి కళ్లు ఎర్రజేసి, కొట్టడానికి చెయ్యెత్తారు. నోటికి వచ్చినట్లు బూతులు తిట్టి, పాతేస్తానంటూ బెదిరించి దౌర్జన్యానికి దిగారు. అసిస్టెంట్ ఇంజినీర్ చేసేదేమి లేక ‘కొట్టేయండి సార్.. కొట్టేస్తే మీకు హ్యాపీగా ఉంటుంది కదా’ అని నిస్సహాయంగా స్పందించారు. అయినా కూన వెనక్కి తగ్గలేదు. ఆ సమయంలో పీఏ టు ఈఈ, మరో ముగ్గురు నా కేడర్ ఏఈలు, క్లరికల్ స్టాఫ్ అంతా ఉన్నారు. కానీ కూనకు భయపడి ఎవరూ ఏమీ అనలేకపోయారు. దీంతో ఆ అసిస్టెంట్ ఇంజినీర్ తనకు జరిగిన అవమానాన్ని దిగమింగుకుని కుమిలిపోతున్నారు. (క్లిక్ చేయండి: అక్రమ వ్యాపారాలకు కేరాఫ్ అచ్చెన్న అనుచరుడు!) -
రవి కుమార్ నుంచి వివరణ తీసుకున్నాం: కాకాణి
సాక్షి, అమరావతి: ఏపీ అసెంబ్లీ స్పీకర్‌పై ఆరోపణలు చేసిన కూన రవికుమార్‌పై విచారణ జరిపినట్లు ప్రివిలేజ్ కమిటీ చైర్మన్ కాకాణి గోవర్ధన్‌రెడ్డి తెలిపారు. గురువారం ప్రివిలేజ్ కమిటీ సమావేశం ముగిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గతంలో వ్యక్తిగతంగా హాజరు కావాలని కూన రవి కూమార్‌కు సూచించామని తెలిపారు. అయితే ఆయన అప్పుడు రాలేదని చెప్పారు. కున రవికుమార్ ఈరోజు(గురువారం) వ్యక్తిగతంగా వచ్చి హాజరయ్యారని తెలిపారు. కునరవికుమార్ చేసిన ఆరోపణలను చాలా సీరియస్‌గా తీసుకున్నామని కాకాని గోవర్ధన్‌రెడ్డి అన్నారు. దానిపై ఆయన నుంచి వివరణ కూడా తీసుకున్నామని చెప్పారు. పెండింగ్‌లో ఉన్న అంశాలపై చర్చిస్తున్నామని, రవికుమార్ ఇచ్చిన వివరణను గోప్యంగా ఉంచుతామని తెలిపారు. దీనిపై త్వరలోనే ఒక నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు. ప్రివిలేజ్ కమిటీ ఎదుట ఉన్న పిటిషన్లు పరిష్కరిస్తున్నామని తెలిపారు. -
కాళ్లు విరగకొడతా.. ఉద్యోగం ఊడగొడతా.. సీఐపై శివాలెత్తిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే కూన
సాక్షి, శ్రీకాకుళం: టీడీపీ మాజీ ఎమ్మెల్యే కూన రవికుమార్ మళ్లీ తన నోటి దురుసును ప్రదర్శించారు. అసెంబ్లీ సమావేశాల తర్వాత టీడీపీ నేతలు చంద్రబాబుకు మద్దతుగా నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. శ్రీకాకుళంలో వంద మందితో కూన రవికుమార్ నిరసనకు దిగుతున్నట్టు పోలీసులకు సమాచారం అందింది. దీంతో శ్రీకాకుళం టూటౌన్ సీఐ ఆర్ఈసీహెచ్ ప్రసాద్ శనివారం కూన ఇంటి వద్దకు వెళ్లారు. శాంతిభద్రతల సమస్య దృష్ట్యా ఇంటిలోనే ఉండాలని కూనకు సూచించగా.. ఆయన సీఐపై నోరుపారేసుకున్నారు. ‘డ్యూటీయా? నా ఇంటి లోపలకు నువ్వు పోలీసులను పంపిస్తే నీ కాళ్లు ఇరగగొడతా.. ఏదైనా ఉంటే రోడ్డుపై చేస్కో.. రేప్పొద్దున కోర్టుకు రారా.. నిన్ను, నీ ఉద్యోగం, నీ యూనిఫాం లేకుండా చేస్తా.. రెండున్నరేళ్ల తర్వాత నీకు ఉద్యోగం ఉండదు గుర్తుపెట్టుకో.. నేను దృష్టి పెడితే అప్పటి వరకు కూడా అక్కర్లేదు.. నీ భుజం మీద యూనిఫాం ఎలా ఉంటుందో చూస్తా.. నీ అంతు చూస్తాను ఏమనుకుంటున్నావో’ అంటూ సీఐ ప్రసాద్‌ను నెట్టేశారు. ‘ఎవడైనా పోలీసు లోపలికి వస్తే మర్యాద ఉండదు’ అంటూ హూంకరించారు. (చదవండి: AP: గాల్లోని ‘ఆక్సిజన్’ను ఒడిసి పట్టారు!) ‘మీ ఇంటిలోకి ఎక్కడొచ్చాం. రోడ్డుపైనే ఉన్నాం. మీ ఇంటిలోకి రావాల్సిన పని మాకేంటి? మాకున్న సమాచారం మేరకు శాంతిభద్రతలను దృష్టిలో ఉంచుకుని మీరు బయటికి రాగానే అభ్యంతరం చెప్పాం.. అంతకుమించి ఏం జరగలేదు కదా?’ అని సీఐ సున్నితంగా చెబుతున్నా వినకుండా కూన రెచ్చిపోయారు. దీంతో సీఐ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. శనివారం అర్ధరాత్రి శ్రీకాకుళం శాంతినగర్‌లోని బం«ధువు ఇంటిలో ఉన్న కూన రవికుమార్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆదివారం శ్రీకాకుళం జిల్లా కోర్టులో హాజరుపరచగా న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. ఈలోపు టూటౌన్ పోలీసుస్టేషన్ వద్ద టీడీపీ నేతలు పెద్ద ఎత్తున గలాటాకు దిగి నానా రభస సృష్టించారు. (చదవండి: కొలువుల చదువులు.. డిగ్రీ పూర్తయిన వెంటనే ఉద్యోగం పొందేలా) -
నేడు ప్రివిలేజ్ కమిటీ విచారణ: కాకాణి
నెల్లూరు (సెంట్రల్): కొద్ది రోజుల క్రితం ప్రతిపక్ష ఎమ్మెల్యేలు చేసిన వ్యాఖ్యలపై మంగళవారం విచారణ జరుపుతున్నట్టు ప్రివిలేజ్ కమిటీ చైర్మన్, సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి తెలిపారు. నెల్లూరులోని ఆయన నివాసంలో సోమవారం మీడియాతో మాట్లాడుతూ టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్‌కు నోటీసులిచ్చినా విచారణకు హాజరు కాలేదన్నారు. ఆయన అందుబాటులో ఉండి కూడా హాజరు కాలేదని తెలుస్తోందని తెలిపారు. దీన్ని ధిక్కారం కింద నమోదు చేశామని, దీనిపై చర్చిస్తామన్నారు. గత ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ తనపై వచ్చిన ఆరోపణలను విడిచి పెట్టాలంటూ లేఖ రాశారని, దానిపైనా చర్చించి తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు. టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు గతంలో చేసిన వ్యాఖ్యలపై విచారం వ్యక్తం చేశారని, వీటిపై చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. -
కూన అండ్ కో.. దొరికింది దోచుకో!
సాక్షి, శ్రీకాకుళం : అధికారం దక్కింది అక్రమాల కోసమే అన్నట్టు ఐదేళ్ల పాటు టీడీపీ నాయకులు సాగించిన అవినీతి యజ్ఞం ప్రజల పాలిట శాపంగా మారింది. వారి హయాంలో జరిగిన పనుల వల్ల ఇప్పటికీ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా అమదాలవలస నియోజకవర్గంలో కూన రవికుమార్ ఫ్యామిలీ దందా ఏ స్థాయిలో జరిగిందో అక్కడి పనులే చెబుతున్నాయి. నాసిరకం పనులతో రూ.కోట్లు వెనకేసుకుని ఇప్పుడు అధికార పక్షంపై విమర్శలకు దిగుతున్నారు. పనుల్లో కొన్ని.. విపత్తు నివారణ పథకం కింద బొడ్డేపల్లి జెడ్పీ రోడ్డు నుంచి సింగూరు మీదుగా ఎన్‌హెచ్–5 రోడ్డు వరకు రూ. 2.73కోట్ల నిధులుతో తారు రోడ్డు వేశారు. ఈ రోడ్డు సింగూరు వద్ద రెల్లుగెడ్డ గట్టుమీదుగా వెళ్తుంది. నాసిరకంగా పనులు చేపట్టడంతో రోడ్డు ఒక భాగం ఏకంగా కూలిపోయింది. కూన రవికుమార్ సోదరుడు విజయలక్ష్మి కన్స్ట్రక్షన్స్ అధినేత కూన వెంకట సత్యనారాయణ ఈ పనులు చేపట్టారు. చదవండి: వామ్మో.. ఒకేచోట 100కుపైగా పాములు కింతలి నుంచి సీపన్నాయుడు పేట వరకు రూ.4 కోట్లు నాబార్డ్ నిధులతో రోడ్డు పనులు చేశారు. ఈ పనుల కాంట్రాక్ట్‌ను కూన రవికుమార్ సోదరుడు వెంకట సత్యనారాయణ దక్కించుకున్నాడు. నాసిరకం పనులు చేయడంతో రోడ్డు పరిస్థితి అధ్వానంగా తయారైంది. పొందూరు గ్రామంలో జమాల్ మిల్లు నుంచి కళాశాల రోడ్డులోని అమ్మాజమ్మ టిఫిన్ దుకాణం వరకు కుడి వైపు రూ.45 లక్షలతో సుమారు వెయ్యి మీటర్లు పొడవున కాలువలను నిర్మించారు. దీని కాంట్రాక్ట్‌ను కూన సోదరుడే దక్కించుకున్నాడు. ఈ కాలువలపై పలకలను వేయలేదు. సరిగా నిర్మాణం జరగకపోవడంతో నీరు ఎక్కడ పడితే అక్కడే నిలిచిపోయి బురదగా మారిపోతోంది. రాపాక నుంచి దళ్లవలస మీదుగా కింతలి వరకు రూ.7కోట్ల ఆర్ఐడీఎఫ్ నిధులతో రోడ్డు నిర్మించారు. కూన రవి కుమార్ సోదరుడు వెంకట సత్యనారాయణ ఈ రోడ్డు కాంట్రాక్ట్‌ను తీసుకున్నారు. నాసిరకం పనులు చేపట్టడంతో ఎక్కడ పడితే అక్కడ రోడ్డుపై పెద్ద పెద్ద గుంతలు ఏర్పడ్డాయి. రోడ్డు శిథిలమైపోవడంతో ఇటీవలే ప్యాచ్‌వర్కులు చేశారు. కొత్తగా మరికొన్ని చోట్ల గోతులు ఏర్పడ్డాయి. చదవండి: వైద్యం కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్లే అవసరం ఉండకూడదు: సీఎం జగన్ వాండ్రంగి కూడలి నుంచి జోగన్నపేట వరకు రోడ్డు, కాలువల నిర్మాణానికి రూ.4 కోట్లు నిధులు మంజూరయ్యాయి. దీని కాంట్రాక్ట్‌ను కూన రవికుమార్ సోదరుడే దక్కించుకున్నాడు. 2018–19లో అర్ధంతరంగా పనులు నిలుపుదల చేసారు. ఇంకా 200 మీటర్లు మేరకు రోడ్డును జోగన్నపేట వద్ద వేయాల్సి ఉంది. కాలువలను పూర్తి చేయలేదు. కొన్ని చోట్ల కాలువలు పూడుకుపోయాయి. అరకొరగా నిర్మించిన కాలువలపై పలకలను వేయలేదు. జరిగిన పనులు కూడా బాగాలేవు. కొంతమేర బిల్లు చెల్లించాల్సి ఉన్నప్పటికీ చేసినవి కూడా నాసిరకం పనులే. ఇలా చేసిన ప్రతి పనిలోనూ అక్రమాలు కనిపిస్తూనే ఉన్నాయి. నియోజకవర్గంలో వేసిన ప్రతి రోడ్డు వాళ్లే వేశారు. ఏ కాంట్రాక్ట్‌నైనా వాళ్లే చేయాలి. వారికే దక్కాలి. ఇతరులకు కాంట్రాక్ట్‌లు దక్కిన సందర్భాలు తక్కువే. అంతా వారి కనుసన్నల్లోనే జరిగింది. టెండర్ల ప్రక్రియ నామమాత్రమే. అంతా వారి చెప్పినట్టే జరిగేవి. అధికార వర్గాలు సైతం వంతపాడాయి. సాధారణంగా టెండర్లలో అన్నీ వర్గాలు పాల్గొనాలి. ఎవరు తక్కువ కోట్ చేస్తే వారికి దక్కాలి. కానీ ఇక్కడ టెండర్ల వేయడమే అధికారుల వంతు. ఎవరికి దక్కాలో నిర్ణయించేదంతా టీడీపీ పెద్దలదే. ఎవరెక్కడ టెండర్ వేయాలో నిర్ణయించేది వీళ్లే. అంతా ఒక సిండికేట్‌గా తయారై గూడు పుఠాణి నడిపారు. మొత్తానికి మంజూరైన పనులన్నీ వారే దక్కించుకుని ఆ పనుల్లో కోట్లు కొల్లగొట్టారు. నాసిరకం పనులు చేసి ప్రజాధనాన్ని దోచేశారు. ఇప్పుడా పనులతో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే అధికార పక్షంపై విమర్శలకు దిగుతున్నారు. -
కూన రవిపై ప్రివిలేజ్ కమిటీ ఆగ్రహం
సాక్షి, అమరావతి: ప్రివిలేజ్ కమిటీ సమావేశం ముగిసింది. తదుపరి సమావేశానికి వ్యక్తిగతంగా హాజరయ్యేందుకు అచ్చెన్నాయుడుకు అవకాశం ఇచ్చింది. అనంతరం కూన రవిపై ప్రివిలేజ్ కమిటీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రివిలేజ్ కమిటీ ఛైర్మన్ కాకాని గోవర్దన్ రెడ్డి అధ్యక్షతన మంగళవారం సమావేశం జరిగింది. వ్యక్తిగత కారణాలతో హాజరు కాలేనని అచ్చెన్నాయుడు సమాచారం అందించారు. వచ్చే నెల 14వ తేదీన హాజరు కావాల్సిందిగా అచ్చెన్నాయుడుకు నోటీసులిస్తున్నట్లు చైర్మన్ కాకాని గోవర్దన్ రెడ్డి తెలిపారు. కూన రవిని వ్యక్తిగతంగా హాజరు కాకపోవడాన్ని ప్రివిలేజ్ కమిటీ తీవ్రంగా పరిగణించింది. కూన రవిది ధిక్కారంగా భావిస్తున్నట్లు పేర్కొంది. ప్రివిలేజ్ కమిటీ ఆదేశాలను పాటించకుండా కూన రవి తీవ్ర నిర్లక్ష్యానికి పాల్పడ్డారని మండిపడింది. కూన రవిపై చర్యలు తీసుకునే అంశాన్ని ప్రివిలేజ్ కమిటీలో నిర్ణయం తీసుకోనాలని సభ ముందు ఉంచుతామని తెలిపింది. -
పరారీలో టీడీపీ నేత కూన రవికుమార్
సాక్షి, శ్రీకాకుళం: టీడీపీ శ్రీకాకుళం జిల్లా అధ్యక్షుడు కూన రవికుమార్ మరోసారి పరారయ్యారు. పరిషత్ ఎన్నికల పోలింగ్ రోజున పొందూరు మండలం పెనుబర్తి వైఎస్సార్సీపీ ఎంపీటీసీ, ఆ గ్రామ సర్పంచ్ భర్త మురళీకృష్ణపై కూన రవికుమార్ వర్గీయులు మారణాయుధాలతో దాడి చేసిన సంగతి తెలిసిందే. ఇదంతా కూన అక్కడ ఉండగానే జరిగింది. అంతేకాకుండా పోలీసుల విధులకు కూడా ఆయన ఆటంకం కలిగించారు. దీనిపై మురళీకృష్ణ పొందూరు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు తనను అరెస్టు చేస్తారనే భయంతో కూన ముందుగానే పారిపోయారు. శనివారం పోలీసులు ఆయన ఇంటికెళ్లి చూడగా.. అప్పటికే ఆయన పరారయ్యారు. (చదవండి: శ్రీకాకుళం జిల్లాలో టీడీపీకి షాక్..) -
శ్రీకాకుళం జిల్లాలో టీడీపీకి బిగ్ షాక్..
-
శ్రీకాకుళం జిల్లాలో టీడీపీకి షాక్..
సాక్షి, శ్రీకాకుళం: జిల్లాలోని ఆముదాల వలసలో టీడీపీకి షాక్ తగిలింది. టీడీపీ నేత కూన రవికుమార్ ప్రధాన అనుచరుడు కిల్లి రామ్మోహన్రావు టీడీపీకి రాజీనామా చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, అనుచరులతో చర్చించాక ఏ పార్టీలో చేరేది వెల్లడిస్తానని తెలిపారు. చంద్రబాబు వల్లే టీడీపీకి మనుగడ లేకుండా పోయిందని ఆయన విమర్శించారు. చంద్రబాబును చూసి టీడీపీకి ఓట్లు వేసే పరిస్థితి లేదన్నారు. రిగ్గింగ్‌తోనే ఎమ్మెల్యేగా అచ్చెన్నాయుడు, ఎంపీగా రామ్మోహన్ నాయుడు గెలిచారని ఆయన ఆరోపించారు. చదవండి: ‘రాజకీయ బతుకుదెరువు కోసమే టీడీపీ కుట్రలు’ నేను ఆరోగ్యంగా ఉన్నా: విజయసాయిరెడ్డి -
రాజీనామాకు సిద్ధం.. నాపై పోటీ చేసి గెలవగలరా..?
సాక్షి, శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): విశాఖ రాజధాని కోసం రాజీనామా చేయడానికి సిద్ధమని, తనపై పోటీ చేసి గెలవగలరా అని మత్స్య, పశు సంవర్ధక శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు టీడీపీ నాయకులకు సవాల్ విసిరారు. మంచికి బ్రాండ్ అంబాసిడర్ అయిన ధర్మాన కృష్ణదాస్ మాటలను వక్రీకరించడం సరికాదని హితవు పలికారు. శ్రీకాకుళంలోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో ఆయన ఆదివారం విలేకరులతో మాట్లాడారు. దాసన్న తన సొంత నియోజకవర్గంలో తన మనుషులతో మాట్లాడిన సంభాషణను ఎల్లో మీడియా వక్రీకరించి బూతులు మాట్లాడినట్లు చిత్రీకరించడం సరికాదన్నారు. టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు మంత్రిగా ఉన్నప్పుడు టెక్కలి నియోజకవర్గంలో ఓ మహిళతో ‘మా ప్రభుత్వం ఇచ్చిన పదివేలు తీసుకుని ఓటేయ్యవా.. అని అది నీ అమ్మ మొగుడు సొమ్మా’ అని అసభ్యకర పదజాలంతో మాట్లాడిన సంగతి అందరికీ గుర్తుందని అన్నారు. అదే పార్టీ కి చెందిన కూన రవికుమార్ ఫోన్ సంభాషణలు అందరికీ తెలుసని చురకలు అంటించారు. ఎవరైతే బాగా బూతులు మాట్లాడగలరో, వీధి రౌడీల్లా ప్రవర్తించగలరో అలాంటి వారిని చంద్రబాబు గుర్తించి అధ్యక్ష పదవులు కట్టబెడుతున్నారంటే ఆ పార్టీ తీరు అర్థమవుతోందని వ్యాఖ్యానించారు. దాసన్న రాజకీయ చరిత్రలో ఎక్కడా కాంట్రవర్సీ లేదన్నారు. ఏడాదిన్నర కాలంలోనే డిప్యూటీ సీఎంగా, మంత్రిగా ఆయన తన మార్క్ చూపించారని తెలిపారు. భావనపాడు పోర్టు, ఉద్దానం ప్రజలకు రూ.700 కోట్లతో మంచినీటి ప్రాజెక్టు, కిడ్నీ బాధితులకు ఆస్పత్రి, నేరడి బ్యారేజీ నిర్మాణం వంటి అనేక కార్యక్రమాలతో జిల్లా అభివృద్ధికి కృషి చేస్తున్నారని చెప్పారు. అమరావతిలో రియల్ వ్యాపారులు పెయిడ్ ఆర్టిస్టులతో డ్రామాలు చేయిస్తున్నారని తీవ్రంగా విమర్శించారు. కరోనా కాలంలో కనిపించని ఎంపీ రామ్మోహన్నాయుడు స్టేషన్ వద్దకు దౌర్జన్యం చేసేందుకు రావడం విడ్డూరంగా ఉందన్నారు. దాసన్న అందరి కుటుంబ సభ్యుడు.. అనంతరం ఎచ్చెర్ల ఎమ్మెల్యే గొర్లె కిరణ్‌కుమార్ మాట్లాడారు. రాజధాని విషయంలో డిబేట్ జరిగినప్పుడు విశాఖలో రాజధాని కావాలనుకుంటున్నారా లేదా అని టీడీపీ నేతలను ప్రశ్నిస్తే కిక్కుమని సౌండ్ లేదన్నారు. కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో పోలీస్ స్టేషన్ వద్ద క్రమశిక్షణ లేకుండా ప్రవర్తించడం వారి రౌడీయిజానికి నిదర్శనమన్నా రు. దాసన్న అందరికీ ఓ కుటుంబ సభ్యుడితో సమానమని, ఆయన నీతి నిజాయితీలను గుర్తించే సీఎం ఆయనకు డిప్యూటీ సీఎం, మంత్రి వంటి ఉన్నత పదవులు కట్టబెట్టారన్నారు. (క్షమాపణ చెప్పిన కబ్జా సబ్బం) అభివృద్ధి ఓర్వలేకే.. రాజాం ఎమ్మెల్యే కంబాల జోగులు మాట్లాడుతూ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ నిబద్ధత, క్రమశిక్షణ గల వ్యక్తి అని ఆయన నోట ఎప్పుడూ తప్పుడు మాటలు రావని అన్నా రు. కూన రవి, అచ్చెన్నాయుడుల అవినీతి అక్రమాలు గుట్టలుగుట్టలుగా ఉన్నాయన్నారు. ఎస్సీ, ఎస్టీలకు హోం శాఖ, డిప్యూటీ సీఎం, విప్ వంటి పదవులు ఇచ్చింది సీఎం జగన్మోహన్రెడ్డి ఒక్కరేనన్నారు. అనంతరం ఎమ్మెల్యే విశ్వాసరాయి కళావతి మాట్లాడుతూ ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్‌పై బురద జల్లే ప్రయత్నం మానుకోవాలని హిత వు పలికారు. జిల్లాలో ప్రస్తుతం జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేని తనంతో అవాకులు చెవాకులు మాట్లాడుతున్నారని విమర్శించారు. మీడియా సమావేశంలో పాల్గొన్న మంత్రి సీదిరి, ఎమ్మెల్యేలు గొర్లె కిరణ్‌కుమార్, కంబాల జోగులు, విశ్వాసరాయి కళావతి పార్టీ నేతలు పిరియా సాయిరాజ్, విక్రాంత్, దువ్వాడ శ్రీనివాస్, అంధవరపు సూరిబాబు తదితరులు వారికి ఆ స్థాయి లేదు.. వైఎస్సార్ సీపీ టెక్కలి నియోజకవర్గ ఇన్చార్జి దువ్వాడ శ్రీనివాస్ మాట్లాడుతూ మునిగిపోయిన నావకు డ్రైవర్ పదవి ఇచ్చినట్లు కాలం చెల్లిన పారీ్టలో అచ్చెన్నాయుడు, కూన రవికుమార్‌లు అధ్యక్షులుగా ఎంపికయ్యారని చమత్కరించా రు. డిప్యూటీ సీఎం దాసన్నపై విమర్శలు చేసే స్థాయి వారికి లేదన్నారు. ఈఎస్ఐ స్కామ్‌లో అడ్డంగా దొరికి జైలుకు వెళ్లి వచ్చిన అచ్చెన్నాయడు, ఇసుక దందా చేసుకుని, వీధి రౌడీ లా వ్యవహరించే కూన రవికుమార్‌లు దాసన్నపై ఫిర్యాదు చేయడం హాస్యాస్పదమన్నారు. డీసీఎంఎస్ చైర్మన్ పిరియా సాయిరాజ్, డీసీసీబీ చైర్మ న్ పాలవలస విక్రాంత్‌లు మాట్లాడుతూ దాసన్న పార్టీలో చేరినప్పటి నుంచి ఇప్పటివరకు మచ్చలేని నాయకుడిగా పేరు సంపాదించారని అన్నారు. అలాంటి వ్యక్తిపై దు్రష్పచారం చేయడం తగదన్నారు. (విశోక సంద్రం.. నగరం మదిలో ద్రోణం'రాజే') విశాఖలో రాజధాని వద్దంటూ కృష్ణదాస్‌పై చంద్రబాబు పోటీ చేసి గెలవగలరా అని సవాల్ విసిరారు. పార్టీ నేత అంధవరపు సూరిబాబు మా ట్లాడుతూ సీఎం వైఎస్ జగన్ ఆదర్శవంతమైన పాలన కొనసాగిస్తున్నారని, ఆయన ఆశయాలను డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ ముందుకు తీసుకెళ్తున్నారని అన్నారు. అలాంటి నేతపై అభాండాలు వేయడం తగదన్నారు. స మావేశంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మామిడి శ్రీకాంత్, ఎంవీ స్వరూప్, ఎన్ని ధనుంజయరావు, పొన్నాడ రుషి, హనుమంతు కిరణ్‌కుమార్, చింతాడ రవికుమార్, తంగుడు నాగేశ్వరరావు పాల్గొన్నారు. -
అలా మొక్కారు.. ఇలా తొక్కారు!
పై ఫొటో చూశారా? టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిని కాబోతున్నానన్న ఆలోచనతో కింజరాపు అచ్చెన్నాయుడు.. టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మె ల్యే గౌతు శ్యామ సుందర శివాజీకి పాద నమస్కారం చేసి ఆశీస్సులు తీసుకున్న దృశ్యమిది. ఈ చిత్రం చూస్తే ఆయనపై అచ్చెన్నాయుడుకు ఎంతో వినయ విధేయతలు ఉన్నాయనుకుంటారు. కానీ గౌతు శ్యామసుందర్ శివాజీ ఆశీస్సులు తీసుకున్న వారం రోజుల లోపలే ఆయన కుమార్తె శిరీషను పార్టీ జిల్లా అధ్యక్ష పదవి నుంచి ఊడగొట్టారు. కూన రవికుమార్‌ను పార్లమెంట్ నియోజకవర్గం అధ్యక్షుడి పేరుతో నియమించారు. సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం : టీడీపీ అధినేత చంద్రబాబు మార్కు రాజకీయం మరోసారి బయటపడింది. ఎవరికైతే నోరు ఉంటుందో వారిదే ఊరు అన్నట్లు పట్టం కడతారని, అవినీతి అక్రమాలు, ఇతరత్రా వ్యవహారాల్లో దూకుడుగా ఉండి కేసులు ఎదుర్కొంటున్న వాళ్లకే పార్టీలో పెద్దపీట వేస్తారని చంద్రబాబు మరోసారి నిరూపించారని ఆ పార్టీ వర్గాలే చర్చించుకుంటున్నాయి. అచ్చెన్నాయుడి అభిప్రాయం తీసుకోకుండా జిల్లా అధ్యక్ష పదవిని మార్చుతారనుకుంటే పొరపాటే. రాష్ట్ర అధ్యక్షుడినే చేస్తానని పరోక్ష సంకేతాలు ఇచ్చిన చంద్రబాబు.. అచ్చెన్నకు తెలియకుండా జిల్లా అధ్యక్ష పదవిని మార్చుతారని ఏ ఒక్కరూ భావించరు. అంతా అచ్చెన్నాయుడికి తెలిసే జరిగిందనేది పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ముందు పొగిడి.. గౌతు శ్యామ సుందర శివాజీ కుటుంబం అంతా.. ఇంతా అంటూ పలు వేదికలపై ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చిన చంద్రబాబు, అచ్చెన్నాయుడు అండ్ కో కనీసం మాట మాత్రం చెప్పకుండా గౌతు శిరీషను అధ్యక్ష పదవి నుంచి తొలగించారని ఆ పార్టీలో చర్చ జరుగుతోంది. దీన్ని బట్టి గౌతు కుటుంబంపై చంద్రబాబుకు ఏమాత్రం అభిమానం ఉందో తెలిసిపోతుంది. పదవి పోయిన శిరీష కూడా అసంతృప్తితో ఉన్నట్టు సమాచారం. మార్చాలనుకుంటే ఒక మాట చెప్పి చేస్తే బాగుండేదని తన సన్నిహితుల వద్ద ఆవేదన వ్యక్తం చేసినట్టు తెలిసింది. మొత్తానికి గౌతు శ్యామ సుందర శివాజీ కాళ్లకు అచ్చెన్నాయుడు మొక్కిన కొన్ని రోజులకే ఆమె కుమార్తె పదవి పోవడం టీడీపీలో చర్చనీయాంశంగా మారింది. (అచ్చెన్నపై యూటర్న్) టీడీపీ శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షుడిగా కూన శ్రీకాకుళం అర్బన్: తెలుగుదేశం పార్టీ శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షుడిగా కూన రవికుమార్‌ను ఎంపిక చేశారు. ఈ మేరకు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు ఆదివారం ఉత్తర్వులు విడుదల చేశారు. కూన రవికుమార్ గతంలో ఆమదాలవలస శాసనసభ్యునిగా ఎన్నికయ్యారు. అప్పటి ప్రభుత్వంలో విప్‌గా పనిచేశారు. ఆయన ఎంపిక పట్ల జిల్లా టీడీపీ నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు. -
అంతే వీరు.. మారదు తీరు
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: టీడీపీ కాంట్రాక్టర్ల తీరు మారలేదు. కూన రవికుమార్ సోదరుడిలో కనీసం మార్పు రాలేదు. కోట్లాది రూపాయలతో ఆయన వేసిన రోడ్లు మూన్నాళ్ల ముచ్చటగానే మిగిలిపోతున్నాయి. కొత్త రోడ్డు కొన్నాళ్లకే పా డైపోతే కాంట్రాక్ట్ అగ్రిమెంట్ ప్రకారం పూర్తి స్థాయి నాణ్య తా ప్రమాణాలతో మళ్లీ వేయాల్సి ఉంటుంది. కానీ వారి అవినీతి బుద్ధి ఎక్కడికీ పోలేదన్నట్టుగా మరమ్మతుల్లో కూ డా నాసిరకం పనులే చేపట్టారు. వీరి పనితనం వల్ల రూ. 2.86 కోట్లతో వేసిన రోడ్డు జనాలను వెక్కిరించేదిగా తయారైంది. విపత్తు నివారణ పథకం కింద పొందూరు మండలం కింతలి–బొడ్డేపల్లి జెడ్పీ రోడ్డు నుంచి సింగూరు మీదుగా ఎన్‌హెచ్–5 వరకు 4.75 కిలోమీటర్ల తారు రోడ్డు వేసే కాంట్రాక్ట్‌ను టీడీపీ నేత, మాజీ విప్ కూన రవికుమార్ సోద రుడు, విజయలక్ష్మి కన్స్ట్రక్షన్ అధినేత కేవీ సత్యనారాయణ దక్కించుకున్నారు. రూ. 2.86 కోట్లతో వేసిన రోడ్డు కొన్నాళ్లకే శిథిలమైపోయింది. గునపాలతో పెకిలించినట్టుగా ధ్వంసమైపోయింది. ఇదే విషయమై ఆగస్టు 31వ తేదీన ‘సాక్షి’ దినపత్రికలో ‘రోడ్డు శిథిలం–అవినీతి పదిలం’ శీర్షికన వార్త ప్రచురితమైంది. మరమ్మతు పనుల్లోనూ.. ‘సాక్షి’లో కథనం వచ్చాక హుటాహుటిన కాంట్రాక్టర్ కూన వెంకట సత్యనారాయణ ఆ రోడ్డు వద్దకు చేరుకుని, శిథిలమైన రోడ్డును పరిశీలించి, మరమ్మతులు చేపట్టేందుకు చర్య లు తీసుకున్నారు. దీంతో ఆ రోడ్డుకు మంచి రోజులొస్తాయని, తమ కష్టాలు తీరుతాయని స్థానికులు ఆశపడ్డారు. కానీ కాంట్రాక్టర్ అవినీతి బుద్ధి ఎక్కడికీ పోలేదు. ఎక్కడైతే రోడ్డు శిథిలమై కుంగిపోయిందో అక్కడే మట్టితో కప్పి మసిపూసి మారేడు కాయ చేశారు. వాస్తవంగా రోడ్డు కాంట్రాక్ట్ అగ్రిమెంట్ ప్రకారం వేసిన రోడ్డు పాడైతే దాన్ని పూర్తిస్థాయిలో నాణ్యతా ప్రమాణాలతో నిర్మించాల్సి ఉంది. కానీ ఇక్కడ మట్టితో మమ అనిపించేశారు. ఇంకేముంది ఇటీవల కురిసిన వర్షాలకు మళ్లీ రోడ్డు కుంగిపోయింది. వేసిన మట్టి కొట్టుకుపోతోంది. చేసిన ప్యా చ్ వర్క్ కూడా పనికి రాకుండా పోయింది. మరమ్మతుల్లో కూడా నాసిరకం పనులే చేశారు. ఫలితంగా ఆ రోడ్డు అక్క రకు రాకుండా పోతోంది. చెప్పేందుకే నీతులు చేసేవన్నీ అవినీతి పనులే అని మరోసారి నిరూపించుకున్నారు. టీడీ పీ హయాంలో జరిగిన నీరు చెట్టు పనులు మాదిరిగానే రోడ్డు పనులు చేపట్టి కోట్లాది రూపాయలకు కన్నం పెట్టేసిన ఘనుడిగా మరోసారి నిలిచిపోయారు. వెక్కిరిస్తున్న ‘కూన’ వేసిన రోడ్డు కూన రవికుమార్ సోదరుడు కె.వి.సత్యనారాయణ వేసిన రోడ్డు ఇప్పుడందర్ని వెక్కిరించేలా ఉంది. అటుగా వెళ్లిన వారంతా ఆ రోడ్డును చూసి ఆశ్చర్యపోతున్నారు. కోట్లాది రూపాయలతో వేసిన రోడ్డుకు ఈ పరిస్థితేంటని అవాక్కవుతున్నారు. అధికారంలో ఉన్నంతవరకు అడిగే వారు లేక ఇష్టారాజ్యమైపోయిందని, ఇప్పుడైనా నాణ్యమైన పనులు చేపట్టి, కోట్లాది రూపాయలకు ఫలితం వచ్చేలా చూడాల్సింది పోయి అదే అడ్డదార్లు తొక్కడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోందని స్థానికులు వాపోతున్నారు. ఇంజనీరింగ్ అధికారులు సైతం నాసిరకం మరమ్మతు పనులపై అభ్యంతరం తెలపకపోవడం అందరికీ విస్మయం కలిగిస్తోంది. -
మాజీ విప్ ‘కూన’పై కేసు నమోదు
పొందూరు/సాక్షి, అమరావతి: శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలం గోరింట గ్రామంలో రామసాగరం చెరువులోని మట్టిని లోడ్ చేస్తున్న వాహనాలను సీజ్ చేసినందుకు తహసీల్దార్ తామరాపల్లి రామకృష్ణపై దురుసుగా ప్రవర్తించి అనుచిత వ్యాఖ్యలు చేసిన ప్రభుత్వ మాజీ విప్ కూన రవికుమార్, అతని సోదరులు, అనుచరులపై పోలీసులు సోమవారం కేసు నమోదు చేశారు. వాహనాలను విడిచిపెట్టాలని.. లేకుంటే లంచం డిమాండ్ చేసినట్టు ఫిర్యాదు చేస్తానని టీడీపీ నేత కూన రవికుమార్ తహసీల్దార్‌ను బెదిరించినప్పటి ఆడియో క్లిప్పింగ్ ఆదివారం సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ ఘటనను రెవెన్యూ ఉద్యోగ సంఘాలు, ప్రజా సంఘాలు తీవ్ర స్థాయిలో విమర్శించాయి. స్పందించిన పోలీసులు రవికుమార్ కోసం ఆమదాలవలస, పొందూరు, శ్రీకాకుళంలలో సోమవారం వెదుకులాట ప్రారంభించారు. ఆయన ఆచూకీ లభ్యం కాకపోవడంతో కూన రవికుమార్‌తోపాటు అతని సోదరుడు కూన వెంకటసత్యారావు, అచ్చిపోలవలస మాజీ సర్పంచ్ గురుగుబెల్లి జగన్నాథం, కాంట్రాక్టర్ చంద్రారెడ్డి, కాంట్రాక్టర్ అసిస్టెంట్ల మీద ఐపీసీ సెక్షన్ 353, 506 కింద కేసు నమోదు చేసినట్టు జె.ఆర్.పురం సీఐ మల్లేశ్వరరావు తెలిపారు. తక్షణం అరెస్టు చేయాలి: ఉద్యోగ సంఘాలు విధి నిర్వహణలో ఉన్న తహసీల్దారు రామకృష్ణను బెదిరించిన మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత కూన రవికుమార్‌ను తక్షణం అరెస్టు చేయాలని ఉద్యోగ సంఘాల నేతలు డిమాండ్ చేశారు. సీజ్ చేసిన పొక్లెయిన్లు, టిప్పర్లను తక్షణమే వదిలేయాలంటూ మాజీ విప్ కూడా అయిన రవికుమార్ బెదిరించడం దారుణమన్నారు. ‘కూన రవికుమార్ ఇలా బెదిరింపులకు దిగడం, అధికారులను దుర్భాషలాడటం కొత్తకాదు. ఆయన వ్యవహార శైలి అధికారులను భయాందోళనలకు గురిచేస్తోంది. అందువల్ల ఆయన గత చరిత్రను పరిగణనలోకి తీసుకుని పీడీ చట్టం కింద చర్యలు తీసుకుని అరెస్టు చేయాలి’ అని ఆంధ్రప్రదేశ్ సచివాలయ ఉద్యోగ సంఘం అధ్యక్షుడు, రాష్ట్ర ఉద్యోగ, పెన్షనర్ల సమాఖ్య అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి డిమాండ్ చేశారు. భవిష్యత్తులో ప్రభుత్వ ఉద్యోగులపై బెదిరింపులకు, దాడులకు పాల్పడకుండా కూన రవికుమార్‌పై పీడీ చట్టం ప్రకారం ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ నేతలు బొప్పరాజు వెంకటేశ్వర్లు, చేబ్రోలు కృష్ణమూర్తి, వి.గిరికుమార్‌రెడ్డి డిమాండ్ చేశారు. -
కూన రవికుమార్‌పై కేసు నమోదు
-
పరారీలో టీడీపీ నేత కూన రవికుమార్
సాక్షి, శ్రీకాకుళం: పొందూరు తహసీల్దార్ తామరాపల్లి రామకృష్ణను అసభ్య పదజాలంతో దూషించిన టీడీపీ నేత కూన రవికుమార్‌పై కేసు నమోదయ్యింది. ఆయనను అరెస్ట్ చేసేందుకు పోలీసులు రంగం సిద్ధం చేశారు. సోమవారం ఉదయం అరెస్ట్ చేసేందుకు రవికుమార్ ఇంటిని పోలీసులు చుట్టుముట్టారు. అర్ధరాత్రే ఇంటి నుంచి వెళ్ళిపోయినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. రెండు రోజుల క్రితం బదిలీపై వెళ్లిన శ్రీకాకుళం జిల్లా పొందూరు తహసీల్దార్ రామకృష్ణను టీడీపీ నేత, ప్రభుత్వ మాజీ విప్ కూన రవికుమార్ బెదిరించారు. ఈ నెల 16న గోరింట గ్రామంలోని రామసాగరం చెరువులో రవికుమార్ సోదరుడికి చెందిన రెండు జేసీబీలు, నాలుగు టిప్పర్లతో మట్టిని అక్రమంగా తవ్వుతుండగా వీఆర్ఓ నుంచి ఫిర్యాదు రావడంతో తహసీల్దార్ అక్కడకు చేరుకుని వాహనాలను సీజ్ చేశారు. దీంతో రవికుమార్ తహసీల్దార్‌కు ఫోన్‌చేసి బెదిరించారు. ఆ ఆడియో ఆలస్యంగా ఇప్పుడు వెలుగుచూసింది. ‘వాహనాలు విడిచిపెట్టు.. లేకపోతే లంచం డిమాండ్ చేశావని నీ మీద కంప్లైంట్ చేస్తాను’ అని ‘కూన’ బెదిరించారు. ‘నా చేతిలో ఏం లేదు. సీజ్ చేసి అప్పగించేశాను’ అని తహసీల్దార్ చెప్పడంతో.. ‘కూన’ దుర్భాషలాడుతూ.. ‘నువ్వు సీజ్ చేశావుగానీ కంప్లైంట్ చేయలేదని నాకు తెలుసు. చెప్పు ఎంత కావాలి.. పది వేలు కావాలా, లక్ష కావాలా ఎంత కావాలి’ అంటూ బెదిరింపు ధోరణిలో మాట్లాడారు. కూన రవికుమార్‌పై రౌడీషీట్ ఓపెన్ చేయాలి కూన రవికుమార్‌ది రాక్షసతత్వం అని పొందూరు తహసీల్ధార్ రామకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయనకు ప్రభుత్వ అధికారులంటే చులకన అని,ప్రభుత్వ అధికారులను దూషించడం ఆయనకు అలవాటు అని మండిపడ్డారు. గతంలో కూడా ఆయన చాలాసార్లు నన్ను దుర్భాషలాడారని పేర్కొన్నారు. పాతేస్తానని రవికుమార్ తనను బెదిరించారని తెలిపారు. ఆఫీసులోకి చొరబడి దాడి చేయడానికి ప్రయత్నించారన్నారు. ఆయన అనుచరులు తన కారును వెంబడించి బెదిరింపులకు దిగారని రామకృష్ణ తెలిపారు. టీడీపీ నేత కూన రవికుమార్‌పై ఉద్యోగ సంఘాల ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఆయనపై రౌడీషీట్ ఓపెన్ చేయాలని డిమాండ్ చేశాయి -
తహసీల్దార్‌కు ‘కూన’ బెదిరింపులు
పొందూరు: రెండు రోజుల క్రితం బదిలీపై వెళ్లిన శ్రీకాకుళం జిల్లా పొందూరు తహసీల్దార్ తామరాపల్లి రామకృష్ణను టీడీపీ నేత, ప్రభుత్వ మాజీ విప్ కూన రవికుమార్ బెదిరించారు. ఈ నెల 16న గోరింట గ్రామంలోని రామసాగరం చెరువులో రవికుమార్ సోదరుడికి చెందిన రెండు జేసీబీలు, నాలుగు టిప్పర్లతో మట్టిని అక్రమంగా తవ్వుతుండగా వీఆర్ఓ నుంచి ఫిర్యాదు రావడంతో తహసీల్దార్ అక్కడకు చేరుకుని వాహనాలను సీజ్ చేశారు. దీంతో రవికుమార్ తహసీల్దార్‌కు ఫోన్‌చేసి బెదిరించారు. ఆ ఆడియో ఆలస్యంగా ఇప్పుడు వెలుగుచూసింది. ‘వాహనాలు విడిచిపెట్టు.. లేకపోతే లంచం డిమాండ్ చేశావని నీ మీద కంప్లైంట్ చేస్తాను’ అని ‘కూన’ బెదిరించారు. ‘నా చేతిలో ఏం లేదు. సీజ్ చేసి అప్పగించేశాను’ అని తహసీల్దార్ చెప్పడంతో.. ‘కూన’ దుర్భాషలాడుతూ.. ‘నువ్వు సీజ్ చేశావుగానీ కంప్లైంట్ చేయలేదని నాకు తెలుసు. చెప్పు ఎంత కావాలి.. పది వేలు కావాలా, లక్ష కావాలా ఎంత కావాలి’ అంటూ బెదిరింపు ధోరణిలో మాట్లాడారు. ‘నిబంధనల ప్రకారం వాహనాలను పోలీస్‌స్టేషన్‌కు అప్పగించాను. తర్వాత మీరు రిలీజ్ చేసుకోండి సార్’ అని తహసీల్దార్ చెప్పడంతో.. ‘ప్రాసెస్ గురించి నాకు చెబుతున్నావా..’ అంటూ రాయలేని రీతిలో ‘కూన’ అసభ్యంగా దూషించారు. దీంతో.. క్వారెంటైన్లో ఉన్న 13 మంది టీడీపీ వర్గీయులతో తనపై ఫిర్యాదులు చేయించారని తహసీల్దార్ రామకృష్ణ చెప్పారు. కాగా, కూన రవికుమార్ గతంలో కూడా ఇలాగే సరుబుజ్జిలి ఎంపీడీఓను.. అదే మండలానికి చెందిన పంచాయతీ విస్తరణాధికారిని బెదిరించారు. ఈ రెండు ఘటనల్లోనూ ఆయన అరెస్టయి బెయిల్‌పై బయటకు వచ్చారు. -
టీడీపీ నేత కూన రవికుమార్ అరెస్ట్