టీడీపీ జెండా పట్టుకోకపోతే పాతాళానికి తొక్కేస్తా అంటూ వైఎస్సార్‌సీపీ కార్యకర్త గంగిరెడ్ల శివను.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్ కూన రవి కుమార్ బెదిరించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోన్ ఆడియో సోషల్ మీడియాలో విస్తృతంగా తిరుగుతోంది. రవి బెదిరింపుల పట్ల ఆమదాలవలస, పొందూరులలో తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి.