వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిపై ఎల్లో మీడియా దుష్ర్పచారం చేస్తోందని ఆ పార్టీ సీనియర్ నేత తమ్మినేని సీతారాం తీవ్రంగా మండిపడ్డారు. రోజు రోజుకూ విశేష ప్రజాదారణ పొందుతున్న జగన్‌పై టీడీపీ ప్రభుత్వం, ఆ వర్గం మీడియా దాడికి దిగుతుందని విమర్శించారు. శుక‍్రవారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన తమ్మినేని.. భారతి సిమెంట్స్‌లో పెట్టుబడుల అంశానికి సంబంధించి వైఎస్ భారతి పేరును ఈడీ చార్జిషీట్‌లో చేర్చడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. ఇందులో అంతా సవ్యంగానే ఉన్నా భారతి పేరును చార్జిషీట్‌లో దాఖలు చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని ఆయన ప్రశ్నించారు. ఇక్కడ చట్టబద్ధం కానిది ఏముందో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ చెప్పాలని తమ్మినేని డిమాండ్ చేశారు