బీసీల గురించి, బీసీల చరిత్ర గురించి తెలియని చరిత్రహీనుడు చంద్రబాబునాయుడు అని వైఎస్సార్‌సీపీ సీనియర్ నేత తమ్మినేని సీతారాం మండిపడ్డారు. రామాయణ, భారత, భాగవత పురాణాల్లో బీసీలకు గొప్ప చరిత్ర ఉందని, అలాంటి బీసీలను నోటికొచ్చినట్టు మాట్లాడే చంద్రబాబు లాంటి వ్యక్తి మన ముఖ్యమంత్రి కావడం దురదృష్టకరమని అన్నారు. ఏలూరులో ఆదివారం వైఎస్సార్‌సీపీ చేపట్టిన ‘బీసీ గర్జన’ భారీ సభలో తమ్మినేని సీతారాం మాట్లాడారు.