బీసీ గర్జనతో టీడీపీ నేతల్లో వణుకు మొదలైందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ తెలిపారు. సభ గ్రాండ్ సక్సెస్‌తో సీఎం చంద్రబాబు నాయుడు తీవ్ర అసహనానికి లోనై ఏదేదో మాట్లాడుతున్నారన్నారు. సభకు జనం రాలేదని, అట్టర్ ఫ్లాఫ్ అంటూ ప్రగల్భాలు పలుకుతున్నారని విమర్శించారు.