వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్రతో బాబుల బాక్సులు బద్దలైపోయాయని, ఇంకేమైనా మిగిలి ఉంటే బీసీ గర్జన సభతో అవి కూడా పగిలిపోతాయని వైఎస్సార్‌సీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. ఎన్నికలు వస్తుండటంతో ఊసరవెల్లి కూడా సిగ్గుపడేలా చంద్రబాబు రంగులు మారుస్తున్నారని ధ్వజమెత్తారు.