
సాక్షి, శ్రీకాకుళం: ఆమదాలవలస మాజీ ఎమ్మెల్యే, ప్రభుత్వ మాజీ విప్ కూన రవికుమార్‌ను పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. ప్రభుత్వ ఉద్యోగిని అసభ్య పదజాలంతో దూషించిన ఆయనపై కేసు నమోదు అయింది. కూన రవికుమార్‌పై 353, 306, రెడ్ విత్ 109 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. కూనతో పాటు మాజీ ఎంపీటీసీ బొంగు వెంకటరత్నంపై కూడా ఆమదాలవలస పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. మరికాసేపట్లో వారిని ఆమదాలవలస కోర్టులో హాజరు పరచనున్నారు. కాగా శ్రీకాకుళం జిల్లా సరుబుజ్జిలి ఇన్‌ఛార్జ్ ఈఓపీఆర్‌డీ గూపపు అప్పలనాయుడును ఫోన్ చేసి బూతులు తిట్టిన వైనం ప్రస్తుతం వైరల్ అవుతోంది. (మరోసారి కూన రవికుమార్ రౌడీయిజం..)