సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: టీడీపీ జిల్లా అధ్యక్షుడు కూన రవికుమార్ మళ్లీ పరారయ్యారు. ఫ్రస్టేషన్‌తో దాడులకు దిగడం, ఆపై పారిపోవడంలో కూన రవికుమార్ హ్యాట్రిక్, డబుల్ హ్యాట్రిక్ సాధిస్తున్నారు. పోలీసు అధికారుల విధులకు ఆటంకం కలిగించిన అంశం, పెనుబర్తి వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీ అభ్యర్థిపై దాడి చేసిన ఘటనలో అరెస్టు అవుతారన్న భయంతో మళ్లీ ముందస్తుగానే అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఆయనపైన నమో దైన కేసుల మేరకు అరెస్టు చేసేందుకు శనివారం పోలీసులు ప్రయత్నించగా అప్పటికే ఎక్కడికో ఉడాయించేశారు. ఇప్పుడాయన కోసం పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు.
ఇప్పటికే పలు కేసుల్లో బెయిల్‌పై ఉన్న కూన రవికుమార్ వ్యవహార శైలిలో మార్పు రావడం లేదు. ఎప్పటిలాగే దురుసుగా వ్యవహరిస్తూ జిల్లాలో అశాంతికి కారణమవుతున్నారు. అటు వైఎస్సార్‌సీపీ నాయకులపైన, ఇటు అధికారులపైన దాడులకు ప్రోత్సహించడంతో ఆమదాలవలస నియోజకవర్గంలో శాంతిభద్రతల సమస్య నెలకొంటోంది.
పరిషత్ ఎన్నికల పోలింగ్ రోజున పొందూరు మండలం పెనుబర్తి వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీ, ఆ గ్రామ సర్పంచ్ భర్త తమ్మినేని మురళీకృష్ణపై కూన రవికుమార్ వర్గీయులు మారణాయుధాలతో దాడి చేశారు. ఆస్తులు కూడా ధ్వంసం చేశారు. ఇదంతా కూన రవికుమార్ అక్కడ ఉండగానే జరిగింది. అంతేకాకుండా ఇలా చూడు.. బైఎలక్షన్ వస్తుందని బెదిరింపులకు దిగారు. దీంతో కూన రవికుమార్ అండ్‌కోపై వైఎస్సార్ సీపీ ఎంపీటీసీ మురళీకృష్ణ పొందూరు పోలీ సు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
అలాగే దాడి జరిగిన రోజున శాంతి భద్రతలను కాపాడేందుకు ఇరువర్గాల వారిని అదుపులోకి తీసుకునేందుకు యత్నింస్తుండగా పోలీసు అధికారుల వి ధులకు కూడా కూన ఆటంకం కలిగించారు. ఈ రెండు విషయాల్లో తనను విచారించి, అరెస్టు చేస్తారన్న భయంతో కూన పరారీ అయిపోయారు. శనివారం శ్రీకాకుళం టౌన్ పోలీసులు కూన రవికుమార్ కోసం ఆయన ఇంటికి వెళ్లి గాలించారు. అప్పటికే కూన రవికుమార్ పరారీలో ఉండటంతో వెనక్కి వచ్చేశారు. ఆయన శుక్రవారమే ఉడాయించారని, ఎప్పటిలాగే ముందస్తు బెయిల్ కోసం ప్ర యతి్నస్తున్నారని ఆ పార్టీ కేడర్ చర్చించుకుంటోంది.
అప్పట్లో కూడా..
కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న గత ఏడాది అక్టోబర్‌లో డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్‌పై ఫిర్యాదు చేయడానికి నరసన్నపేట పోలీసు స్టేషన్ లోపలికి మూకుమ్మడిగా వెళ్లేందుకు టీడీపీ నాయకులు యతి్నస్తుండగా పోలీసులు అడ్డుకున్న నేపథ్యంలో కూన రవికుమార్ తీవ్రస్థాయిలో నోరు పారేసుకున్నారు. ‘ఏయ్ జాగ్రత్త.. శంకరిగిరి మా న్యాల్లో ఉంటారు జాగ్రత్త.. ఎవడక్కడ.. మీ స్థాయి ఎంత ..మీరు ఎంత..’ అని నరసన్నపేట సీఐ, ఎస్‌లను ఉద్దేశించి తీవ్రంగా మాట్లాడారు.
అంతకుముందు పొందూరులో టీడీపీ కార్యాలయంగా నడుస్తున్న తన భవనాన్ని ఖాళీ చేయాల ని కోరినందుకు ఆ ఇంటి యజమానికి ఫోన్‌లోనే వార్నింగ్ ఇచ్చారు. ‘నేను ఖాళీ చేయను, నువ్వు మర్యాదగా బీహేవ్ చేస్తే ఫరవాలేదు, నువ్వేగాని అక్కడేమైనా చేస్తే చాలా సీరియస్‌గా ఉంటుంది’ అని కూన రవికుమార్ బెదిరించారు. నువ్వు గనక బిల్డింగ్ దగ్గరకు వస్తే నీ సంగతి చూస్తా అంటూ బెదిరింపులకు దిగారు.
అంతకుముందు పింఛన్ల విషయంలో తన మాట వినలేదని మండల కార్యాలయంలోనే సరుబుజ్జిలి ఎంపీడీఓ, ఈఓపీఆర్‌డీకి వార్నింగ్ ఇచ్చా రు. ‘ఆఫీసులోనే తలుపులు వేసి మరీ బాదేస్తాను. నన్ను ఎవరూ ఆపలేరు. చెట్టుకు కట్టి కాల్చేస్తాను. చెప్పింది చేయకపోతే నేనెంటో చూపిస్తానంటూ’ అంటూ బెదిరించారు. పనుల విషయంలో తాను చెప్పినట్టు వినకపోతే కురీ్చలో కూర్చున్నా లా క్కుని వచ్చి తంతాను నా కొడకల్లారా అని.. పంచాయతీ కార్యదర్శులను కూన రవికుమార్ భ యపెట్టారు. ఒక బిల్లు విషయంలో సరుబుజ్జిలి ఇన్‌చార్జి ఈఓపీఆర్‌డీపైనా విరుచుకుపడ్డారు.
‘నీకెంత ఒళ్లు బలిసిందిరా నా కొడకా.. నిన్ను గొయ్యి తీసి పాతకపోతే నా పేరు కూన రవికుమా రే కాదు. నీ బతుకెంతరా నా కొడకా...’ అంటూ మట్టి అక్రమ రవాణాను అడ్డుకున్న పొందూరు తహశీల్దార్‌ను పరుష పదజాలంతో బెదిరించారు.
చదవండి:
దేవినేని ఉమాపై సీఐడీ కేసు
చంద్రబాబు, లోకేష్‌లపై కేసు నమోదు
Comments
Please login to add a commentAdd a comment