
సాక్షి, శ్రీకాకుళం: ఏడు రోజులుగా అజ్ఞాతంలో వున్న టీడీపీ శ్రీకాకుళం జిల్లా అధ్యక్షుడు కూన రవికుమార్ పొందూరు పోలీస్‌స్టేషన్‌లో గురువారం లొంగిపోయారు. ఆయనను పోలీసులు రాజాం కోర్టుకు తరలించారు. రాజాం మండలం పొగిరి ప్రభుత్వ ఆరోగ్య కేంద్రంలో రవికుమార్‌కు వైద్యులు కరోనా వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం రాజాం కోర్టుకు తరలించారు. పరిషత్ ఎన్నికల పోలింగ్ రోజున పొందూరు మండలం పెనుబర్తి వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీ అభ్యర్థి ఇంటిపై అనుచరులతో కలిసి కూన రవికుమార్ దాడి చేసిన ఘటనలో ఆయనపై కేసు నమోదయ్యింది. దీంతో పోలీసులు తనను అరెస్టు చేస్తారనే భయంతో కూన ముందుగానే పారిపోయిన సంగతి విదితమే.
Comments
Please login to add a commentAdd a comment