అమరావతి, సాక్షి: ఉమ్మడి శ్రీకాకుళం ముఖ్య నేతల విబేధాలు.. అసెంబ్లీ సాక్షిగా మరోసారి బయటపడ్డాయి. ఆముదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ ఈసారి సొంత ప్రభుత్వంపైనే ఆరోపణలు చేయగా, మంత్రి అచ్చెన్నాయుడు కాస్త గట్టిగానే స్పందించారు.
ఐస్ లైన్డ్ రిఫ్రిజిరేటర్ ల కొనుగోలు లో అక్రమాలు జరిగాయంటూ కూన రవికుమార్ ఇవాళ అసెంబ్లీలో ఆరోపణలు గుప్పించారు. ‘‘లక్షా 30 వేలకు పక్క స్టేట్‌లో కొంటే.. మన రాష్ట్రం లో 2 లక్షల 4 వేలకు ఎందుకు కొనుగోలు చేశారు?. గోద్రెజ్ లాంటి కంపెనీలను పక్కన పెట్టి కోల్డ్ చైన్ లాంటి కంపెనీలకు ఎందుకు అనుమతి ఇచ్చారు?’’ అని కూన ప్రశ్నించారు.
దీనికి మంత్రి అచ్చెన్నాయుడు బదులిస్తూ.. ఐస్ లైన్డ్ రిఫ్రిజిరేటర్ లు హారిజాంటల్, వర్టికల్ అని రెండు మోడల్స్ ఉంటాయ్. హారిజాంటల్ ఐస్ లైన్డ్ రిఫ్రిజిరేటర్ లను మాత్రమే కొనుగోలు చేయాలని కేంద్రం కోరింది. ఫార్చ్యూన్ అనే కంపెనీ L1 కోట్ చేయడం తో వారికి టెండర్ వచ్చింది. మహారాష్ట్ర లో లక్షా 84 వేలు, కర్నాటక లో 2.27 లక్షలకు కొన్నారు.
.. గోద్రెజ్ కంపెనీ వాళ్లకు టెండర్ రాలేదని రాద్ధాంతం చేసారు. విశాఖ లో ఒక గోద్రెజ్ డీలర్ దీన్ని వివాదం చేసినట్టు మా దృష్టికి వచ్చింది. దీనిపై మేము గోద్రెజ్ కంపెనీ కి లెటర్ రాసాం, మాకేం సంబంధం లేదని చెప్పారు. అయినా సభ్యులకు అనుమానాలు ఉన్నాయ్ కాబట్టి మరోసారి విచారణ చేయిస్తాం ’’ అని మంత్రి అచ్చెన్న అన్నారు. ఇక..
ఈ సమావేశాల్లో మొన్నీమధ్యే ఇద్దరి మధ్య ఆసక్తికర సంవాదం చోటు చేసుకుంది. జీరో అవర్‌లో మంత్రుల తీరుపై టీడీపీ ఎమ్మెల్యే కూన రవి విమర్శలకు దిగారు. ‘అసెంబ్లీలో జీరో అవర్ డ్రైవర్ లేని కారులా ఉంది’ అని అన్నారాయన. దీనికి మంత్రి అచ్చెన్నాయుడు.. ‘‘‘‘మంత్రులం ఎవ్వరం పట్టించుకోవడం లేదనుకోకండి. ప్రతి ప్రశ్నను సంబంధించిన మంత్రికి పంపమని చెప్పారు. దాని ప్రకారం మంత్రులు చర్యలు తీసుకుంటారు’’ అని బదులిచ్చారు. అయితే ఇద్దరి మధ్య మాటలయుద్ధ తీవ్రతను తగ్గించేందుకు.. మధ్యలో స్పీకర్ అయ్యన్న జోక్యం చేసుకుని ఏదో జోక్ వేసే ప్రయత్నం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment