
సాక్షి, విశాఖపట్నం: ఏపీలో మంత్రులు, టీడీపీ నేతల నారా లోకేష్( Nara Lokesh) భజన తారాస్థాయికి చేరింది. లోకేష్‌ను ముఖ్యమంత్రిని చేయాలని, డిప్యూటీ సీఎం చేయాలంటూ పచ్చ నేతలు కామెంట్స్ చేస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో మంత్రి అచ్చెన్నాయుడు (Kinjarapu Atchannaidu) కీలక వ్యాఖ్యలు చేశారు. టీడీపీకి చంద్రబాబు తర్వాత లోకేషే వారసుడు.. చిన్నపిల్నాడి అడిగినా చెప్తాడంటూ మంత్రి అచ్చెన్నాయుడు వ్యాఖ్యానించాడు.
కాగా, సీఎం చంద్రబాబు, నారా లోకేష్ పలువురు మంత్రులు దావోస్ టూర్‌కు వెళ్లిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలుగు పారిశ్రామికవేత్తల సదస్సుల్లో టీడీపీ నేతలు మరోసారి లోకేష్ భజన ఎత్తుకున్నారు. తమ నాయకుడు లోకేష్‌ను ముఖ్యమంత్రిని చేయాలని మంత్రి టీజీ భరత్ చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో ఎవరికి నచ్చినా.. నచ్చకపోయినా భవిష్యత్ ముఖ్యమంత్రి లోకేష్ అంటూ కుండబద్దలు కొట్టారు. దీంతో, ఆయన వ్యాఖ్యలు మరోసారి రాజకీయంగా ఆసక్తికరంగా మారాయి.
ఇదిలా ఉండగా.. మంత్రి నారా లోకేష్‌ను డిప్యూటీ సీఎం చేయాలని ఇప్పటికే పలువురు టీడీపీ నేతలు కామెంట్స్ చేశారు. మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్‌ఎన్ వర్మ, రాజమండ్రి అర్బన్ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు కూడా నారా లోకేశ్‌ను డిప్యూటీ సీఎంను చేయాలని బహిరంగంగా వ్యాఖ్యానించారు.

ఇదీ చదవండి: దావోస్.. అంతా తుస్
మరోవైపు.. నారా లోకేష్‌ను డిప్యూటీ సీఎం చేయాలనే కామెంట్స్‌పై అటు జనసేన నేతలు ఘాటుగా స్పందిస్తున్నారు. టీడీపీ నేతల వ్యాఖ్యలపై జనసేన నాయకుడు కిరణ్ రాయల్.. తమకు పవన్‌ను ముఖ్యమంత్రిగా చూడాలని తమకు ఉందని కామెంట్స్ చేయడం చర్చనీయాంశంగా మారింది. ఇదే సమయంలో టీడీపీ నేతలు అత్యుత్సాహం చూపిస్తే తగిన విధంగా వ్యవహరిస్తాం అంటూ కౌంటర్ కూడా ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment