సాక్షి, విజయవాడ: అచ్చెన్నాయుడు తమ్ముడికి చంద్రబాబు సర్కార్ బంపర్ ఆఫర్ ఇచ్చింది. రిటైర్ అయిన తర్వాత కూడా ఆయనకు కూటమి ప్రభుత్వం మళ్లీ ఉద్యోగం ఇచ్చింది. మంత్రి అచ్చెన్నాయుడు తమ్ముడు ప్రభాకర్ కొద్ది రోజుల కిందటే పదవి విరమణ చేసిన సంగతి తెలిసిందే.
అయితే, కింజరాపు ప్రభాకర్‌ను ఓఎస్‌డీగా నియమించింది. విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్‌మెంంట్‌లో ఓఎస్‌డీగా నియామకం చేసింది. విజిలెన్స్ కేసులతో కక్ష సాధింపు కోసమే కింజరాపు ప్రభాకర్‌ని సర్కార్ నియమించిందనే ఆరోపణలు ఉన్నాయి.
ఇదీ చదవండి: టార్గెట్ సజ్జల.. ఎల్లోమీడియాపై భగ్గుమన్న వైఎస్సార్‌సీపీ
Comments
Please login to add a commentAdd a comment