prabhakar naidu
-
అచ్చెన్నాయుడు తమ్ముడికి బంపర్ ఆఫర్
సాక్షి, విజయవాడ: అచ్చెన్నాయుడు తమ్ముడికి చంద్రబాబు సర్కార్ బంపర్ ఆఫర్ ఇచ్చింది. రిటైర్ అయిన తర్వాత కూడా ఆయనకు కూటమి ప్రభుత్వం మళ్లీ ఉద్యోగం ఇచ్చింది. మంత్రి అచ్చెన్నాయుడు తమ్ముడు ప్రభాకర్ కొద్ది రోజుల కిందటే పదవి విరమణ చేసిన సంగతి తెలిసిందే.అయితే, కింజరాపు ప్రభాకర్‌ను ఓఎస్డీగా నియమించింది. విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్మెంంట్లో ఓఎస్డీగా నియామకం చేసింది. విజిలెన్స్ కేసులతో కక్ష సాధింపు కోసమే కింజరాపు ప్రభాకర్‌ని సర్కార్ నియమించిందనే ఆరోపణలు ఉన్నాయి.ఇదీ చదవండి: టార్గెట్ సజ్జల.. ఎల్లోమీడియాపై భగ్గుమన్న వైఎస్సార్సీపీ -
కర్నూలు జిల్లాలో వైఎస్ఆర్ సీపీ నేత దారుణ హత్య
కర్నూలు: కర్నూలు జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ప్రభాకర్ నాయుడు గురువారం టీడీపీ నాయకుల చేతిలో దారుణ హత్యకు గురైయ్యారు. ఈ రోజు జిల్లాలోని తలుకూరు మైనింగ్ గనుల వద్ద ప్రభాకర్ నాయుడు అనుచరుడు భాస్కర్‌తో కలసి వెళ్తుండగా టీడీపీ నాయకులు ముకుమ్మడిగా మారణాయుధాలతో దాడి చేశారు. అనంతరం టీడీపీ నాయకులు అక్కడి నుంచి పరారైయ్యారు. ఈ దాడిలో ప్రభాకర్ నాయుడు అక్కడికక్కడే మరణించారు. భాస్కర్ పరిస్థితి విషమంగా ఉంది. స్థానికులు వెంటనే స్పందించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని భాస్కర్‌ను ఆస్పత్రికి తరలించారు. అతడి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. తమపై టీడీపీ నేతలే దాడి చేశారని భాస్కర్ ఆరోపించారు. ప్రభాకర్ నాయుడు మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకుని పోస్ట్‌మార్టం నిమిత్తం కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.