
అమరావతి, సాక్షి: విశాఖ స్టీల్‌ఫ్యాక్టరీ ప్రైవేటీకరణను అడ్డుకునే విషయంలో.. కూటమి ప్రభుత్వ వైఖరి అనుమానాస్పదంగా ఉందన్నారు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ వరుదు కల్యాణి. గురువారం వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీలు శాసన మండలిలో ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తీర్మానం డిమాండ్ చేయగా.. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఎమ్మెల్సీ కల్యాణి మీడియాతో మాట్లాడారు.
‘‘కూటమి ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి ప్రైవేటీకరణ వేగంగా దిశగా అడుగులు వేస్తున్నారు. అందుకే కూటమి ప్రభుత్వ తీరుపై అనుమానాలు కలుగుతున్నాయి. రెగ్యులర్ ఉద్యోగులకు 50% జీతం కోత పెట్టారు. 4500 కాంట్రాక్ట్ ఉద్యోగులకు నాలుగు నెలలుగా వేతనాలు లేవు. 500 మందిని డిప్యుటేషన్ మీద వెళ్లిపోమంటున్నారు. మరికొంత మందిని వీఆర్ఎస్ తీసుకోమని ఒత్తిడి తెస్తున్నారు
.. చంద్రబాబు,పవన్ పై కేంద్రం ఆధాపడి ఉంది. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపకపోతే మద్దతు ఉపసంహరించుకుంటామని చెబితే కేంద్రం ఎందుకు దిగిరాదు. ప్రధాని 29న విశాఖ వస్తున్నారంటున్నారు. స్టీల్ ప్లాంట్ పై చంద్రబాబు,పవన్ ప్రధానితో ప్రకటన చేయించాలి.
.. స్టీల్ ప్లాంట్ రాష్ట్ర ప్రజల సెంటిమెంట్. 32 మంది ప్రాణత్యాగాలతో స్టీల్ ప్లాంట్ సాధించుకున్నాం. ప్రైవేటీకరణ ఆపాల్సిన అవసరం చంద్రబాబు, పవన్ పై ఉంది. ఎన్నికల్లో చంద్రబాబు,పవన్ చెప్పిన మాటల వల్లే ఉత్తరాంధ్ర ప్రజలు ఓటేశారు. అలాంటిది.. కార్మికులను మోసం చేయడం చాలా దారుణం.
.. ఇద్దరు ఎంపీలున్న కర్ణాటక ఎంపీలు చేయగలిగింది మన వాళ్లెందుకు చేయలేరు?. చత్తీస్ ఘడ్ లోని నాగర్నా ప్లాంట్ పై కేంద్రం తన ప్రకటను వెనక్కి తీసుకుంది. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వల్లే 2024 వరకూ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగింది. వైఎస్ జగన్, వైఎస్సార్‌సీపీ ఎంపీలు ప్రైవేటీకరణను అన్నిరకాలుగా అడ్డుకోగలిగారు. ఇప్పుడు.. కూటమి నేతలు ప్రజలను మభ్యపెట్టడం మానుకోవాలి. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకోవాలి అని కల్యాణి డిమాండ్ చేశారు.

Comments
Please login to add a commentAdd a comment