privitization
-
అప్పటిదాకా బాబు, పవన్‌లను నమ్మం: విశాఖ ఉక్కు కార్మికులు
విశాఖపట్నం, సాక్షి: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో స్పష్టమైన ప్రకటన చేయకుండా అటు కేంద్రం నాన్చుతోంది. మరోవైపు ఇటు కూటమి ప్రభుత్వం ప్రైవేటీకరణ జరగబోదంటూ తెర వెనుక ప్రయత్నాలను ముమ్మరం చేసింది. ఈ క్రమంలో.. ‘‘విశాఖ ఉక్కుకు ప్యాకేజీ’’ అంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే ఈ ప్రచారంపై కార్మిక సంఘాలు భగ్గుమంటున్నాయి.ప్యాకేజీ అనేది కంటి తుడుపు చర్య. అది శాశ్వత పరిష్కారం ఎంత మాత్రం కాదు. ఇచ్చిన ప్యాకేజీ రెండు మూడు నెలలకు మించి సరిపోదు. ప్యాకేజీలతో ఒరిగేదేం లేదు. స్టీల్ ప్లాంట్(Steel Plant) బతకాలంటే సెయిల్ లో విలీనం ఒక్కటే మార్గమని సూచిస్తున్నాయి. అలాగే.. స్టీల్ ప్లాంట్ కు సొంతంగా గనుల కేటాయించాలన్న డిమాండ్‌ను మరోసారి ప్రస్తావించాయి.స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ(Steel Plant Privatization) జరగదని ఎన్నికలకు ముందు ఇచ్చిన మాటను కూటమి నేతలు నిలబెట్టుకోవాలని స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ జరగదని హామీ ఇస్తేనే.. చంద్రబాబు, పవన్ కల్యాణ్(Pawan Kalyan)ను నమ్ముతాం అని కార్మికులు చెబుతుండడం గమనార్హం.సాక్షి టీవీతో ఉక్కు పోరాట కమిటీ నేతలు మాట్లాడుతూ.. ముడి సరుకు కొనుగోలుకు ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు. ఇప్పుడు కేంద్రం ఇచ్చే ప్యాకేజీతో కొత్తగా స్టీల్ ప్లాంట్ కు ఒరిగేది లేదు. కార్పొరేట్ల ఒత్తిడి మేరకే..ప్యాకేజి ప్రకటించారు. ప్యాకేజీ మొత్తం బకాయిలకే పోతుంది... శాశ్వత పరిష్కారం చూపే వరకూ మా పోరాటం ఆగదు. ప్రజల్లో మమ్మల్ని చులకన చెయ్యాలని చంద్రబాబు చూస్తున్నారు. ప్రతీసారి డబ్బులు ఇవ్వలేమని చంద్రబాబు చెప్పారు. మాకు మళ్ళీ డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు విలీనం చెయ్యండి. మాకు అప్పు అవసరం లేదు. ఉన్న అప్పులను ఈక్విటీగా మార్చాలి. సెయిల్ లో విలీనం ఒక్కటే పరిష్కార మార్గం. అలాగే సొంత గనులు కేటాయించాలి అని ఉక్కు పోరాట కమిటీ నేతలు అంటున్నారు. -
‘మీ మద్దతే కదా ఉంది.. ప్రధాని మోదీని ఒప్పించలేరా?’
అమరావతి, సాక్షి: విశాఖ స్టీల్‌ఫ్యాక్టరీ ప్రైవేటీకరణను అడ్డుకునే విషయంలో.. కూటమి ప్రభుత్వ వైఖరి అనుమానాస్పదంగా ఉందన్నారు వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ వరుదు కల్యాణి. గురువారం వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు శాసన మండలిలో ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తీర్మానం డిమాండ్ చేయగా.. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఎమ్మెల్సీ కల్యాణి మీడియాతో మాట్లాడారు.‘‘కూటమి ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి ప్రైవేటీకరణ వేగంగా దిశగా అడుగులు వేస్తున్నారు. అందుకే కూటమి ప్రభుత్వ తీరుపై అనుమానాలు కలుగుతున్నాయి. రెగ్యులర్ ఉద్యోగులకు 50% జీతం కోత పెట్టారు. 4500 కాంట్రాక్ట్ ఉద్యోగులకు నాలుగు నెలలుగా వేతనాలు లేవు. 500 మందిని డిప్యుటేషన్ మీద వెళ్లిపోమంటున్నారు. మరికొంత మందిని వీఆర్ఎస్ తీసుకోమని ఒత్తిడి తెస్తున్నారు.. చంద్రబాబు,పవన్ పై కేంద్రం ఆధాపడి ఉంది. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపకపోతే మద్దతు ఉపసంహరించుకుంటామని చెబితే కేంద్రం ఎందుకు దిగిరాదు. ప్రధాని 29న విశాఖ వస్తున్నారంటున్నారు. స్టీల్ ప్లాంట్ పై చంద్రబాబు,పవన్ ప్రధానితో ప్రకటన చేయించాలి... స్టీల్ ప్లాంట్ రాష్ట్ర ప్రజల సెంటిమెంట్. 32 మంది ప్రాణత్యాగాలతో స్టీల్ ప్లాంట్ సాధించుకున్నాం. ప్రైవేటీకరణ ఆపాల్సిన అవసరం చంద్రబాబు, పవన్ పై ఉంది. ఎన్నికల్లో చంద్రబాబు,పవన్ చెప్పిన మాటల వల్లే ఉత్తరాంధ్ర ప్రజలు ఓటేశారు. అలాంటిది.. కార్మికులను మోసం చేయడం చాలా దారుణం... ఇద్దరు ఎంపీలున్న కర్ణాటక ఎంపీలు చేయగలిగింది మన వాళ్లెందుకు చేయలేరు?. చత్తీస్ ఘడ్ లోని నాగర్నా ప్లాంట్ పై కేంద్రం తన ప్రకటను వెనక్కి తీసుకుంది. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వల్లే 2024 వరకూ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగింది. వైఎస్ జగన్, వైఎస్సార్సీపీ ఎంపీలు ప్రైవేటీకరణను అన్నిరకాలుగా అడ్డుకోగలిగారు. ఇప్పుడు.. కూటమి నేతలు ప్రజలను మభ్యపెట్టడం మానుకోవాలి. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకోవాలి అని కల్యాణి డిమాండ్ చేశారు. -
ప్రైవేట్‌పరం కానున్న ఏపీ మెడికల్ కాలేజీలు!
అమరావతి, సాక్షి: జగన్ పాలనలో జరిగిన మంచిని నాశనం చేయాలనే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో.. ఆంధ్రప్రదేశ్‌లో మెడికల్ కాలేజీలను ప్రైవేట్‌పరం చేయాలని చంద్రబాబు ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు తొలి అడుగు పడింది కూడా. ఇవాళ జరిగిన ఏపీ కేబినెట్ భేటీలో పీపీపీ(Public–private partnership) మోడల్ అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించినట్లు తెలుస్తోంది.జగన్ హయాంలో ఏపీలో కొత్తగా 17 మెడికల్ కాలేజీల నిర్మాణం చేపట్టారు. వీటిలో ఐదు మెడికల్ కాలేజీలను గతేడాది ఆయన ప్రారంభించగా.. తరగతులు కూడా ప్రారంభం అయ్యాయి. అయితే మిగిలిన 12 కాలేజీలపై చంద్రబాబు ప్రభుత్వం దృష్టిసారించింది. వాటిని ప్రైవేట్ పరం చేసేందుకు పీపీపీ మోడల్‌ను తెరపైకి తెచ్చింది. పీపీపీ మోడల్లో మెడికల్ కాలేజీల నిర్వహణకు అధ్యయనం చేయాలని, ఇందుకుగానూ గుజరాత్ మోడల్‌ను పరిశీలిస్తామని మంత్రి పార్థసారథి ప్రకటించారు కూడా. రూ.8,480 కోట్లతో 17 కళాశాలలు ప్రజలకు ప్రభుత్వ రంగంలో మెరుగైన వైద్య వసతులు సమకూర్చడంపై ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో జగన్ మోహన్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. సుమారు రూ.8,480 కోట్లతో ప్రతి జిల్లాకు ఒక ప్రభుత్వ వైద్య కళాశాల ఉండేలా 17 కొత్త వైద్య కళాశాలలు ఏర్పాటు చేయడానికి ప్రణాళిక రూపొందించారు. ఈ కాలేజీల ద్వారా ఏకంగా 2,550 ఎంబీబీఎస్ సీట్లు కొత్తగా అందుబాటులోకి తేవాలనున్నారు. గతేడాది ఐదు కాలేజీలు ప్రారంభించగా.. ఈ ఏడాది మరో ఐదు, మిగిలిన ఏడు వైద్య కళాశాలలను 2025-26 విద్యా సంవత్సరం నుంచి ప్రారంభించాలనుకున్నారు. విజయనగరం మెడికల్ కాలేజీ ప్రారంభించినప్పటి ఫొటో -
భద్రావతి స్టీలు ప్లాంటుకు బిడ్లు కరువు
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ ఉక్కు సంస్థ సెయిల్‌కు చెందిన భద్రావతి స్టీల్ ప్లాంటు ప్రైవేటీకరణ ప్రతిపాదనను ప్రభుత్వం ఉప సంహరించింది. తగినంత స్థాయిలో బిడ్డర్ల నుంచి ఆసక్తి వ్యక్తం కాకపోవడమే ఇందుకు కారణం. కర్ణాటకలోని భద్రావతిలో ఉన్న విశ్వేశ్వరాయ ఐరన్ అండ్ స్టీల్ ప్లాంటు (వీఐఎస్‌పీ)లో సెయిల్‌కి ఉన్న 100 శాతం వాటాలను విక్రయించేందుకు 2019 జులైలో ఆసక్తి వ్యక్తీకరణ పత్రాలను (ఈవోఐ) ఆహ్వానించారు. దీనికి స్పందనగా పలు ఈవోఐలు వచ్చాయని, సంస్థ వివరాలను బిడ్డర్లు మదింపు కూడా చేశారని పెట్టుబడులు, ప్రభుత్వ ఆస్తుల నిర్వహణ విభాగం దీపం వెల్లడించింది. అయినప్పటికీ ఈ విషయంలో ముందుకెళ్లేందుకు అవసరమైనంత స్థాయిలో బిడ్డర్లు ఆసక్తి చూపలేదని పేర్కొంది. దీంతో ప్రత్యామ్నాయ మెకానిజం (సాధికారిక మంత్రుల బృందం) ఆమోదం మేరకు ఈవోఐని రద్దు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు దీపం వివరించింది. -
బ్యాంకుల ప్రైవేటీకరణ బిల్లుపై కేంద్రం క్లారిటీ
న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ బ్యాంకుల ప్రైవేటీకరణకు వీలుగా చట్ట సవరణలతో ఎటువంటి బిల్లును వర్షాకాల సమావేశాల్లో తీసుకురావడం లేదని కేంద్ర ప్రభుత్వం పార్లమెంటుకు తెలియజేసింది. పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో భాగంగా చేపట్టే అంశాల అజెండాలో ఈ తరహా బిల్లును ప్రవేశపెట్టడం, చర్చించడం, ఆమోదించడం అన్నవి లేవని ఆర్థిక శాఖ సహాయ మంత్రి భగవత్ కరాడ్ సభకు తెలిపారు. 2021–22 బడ్జెట్లో భాగంగా రెండు ప్రభుత్వరంగ బ్యాంకులను ప్రైవేటీకరించనున్నట్టు కేంద్ర సర్కారు ప్రకటించింది. ఇలా ప్రైవేటీకరణ ప్రతిపాదనలో ఐడీబీఐ బ్యాంకు సహా మరికొన్ని ఉన్నాయి. కానీ, వీటికి సంబంధించి ఎలాంటి పురోగతి లేదు. ప్రధాన మంత్రి ఆర్థిక సలహా మండలి ఎస్బీఐ మినహా మరే ఇతర ప్రభుత్వరంగ బ్యాంకుల ప్రైవేటీకరణపై సూచనలు ఇవ్వలేదని మరో ప్రశ్నకు సమాధానంగా మంత్రి చెప్పారు. చదవండి: క్యాష్ విత్‌డ్రా, శ్మశాన వాటికల జీఎస్టీపై మంత్రి నిర్మలా సీతారామన్ క్లారిటీ -
శ్రీలంకన్ ఎయిర్‌లైన్స్‌ను అమ్మేస్తాం!: ప్రధాని విక్రమసింఘే
కొలంబో: శ్రీ లంక ప్రభుత్వం నేషనల్ ఎయిర్‌లైన్స్‌ను అమ్మేయాలని అనుకుంటోంది. ప్రస్తుతం దేశం ఉన్న పరిస్థితుల్లో నష్టాలను భరించేందుకు.. ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టేందుకు ఈ నిర్ణయం తప్పదని ప్రధాని రణిల్ విక్రమసింఘే స్పష్టం చేశారు. సోమవారం జాతిని ఉద్దేశించి ప్రసంగించిన లంక ప్రధాని రణిల్ విక్రమసింఘే.. పలు కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. రాబోయే రోజుల్లో లంక దారుణమైన పరిస్థితిని ఎదుర్కోనుందని, ప్రజలను అబద్ధాలతో మభ్య పెట్టడం ఇష్టం లేక నిజాలు చెప్తున్నానంటూ ఖుల్లా ప్రకటనతో దేశ పరిస్థితి చెప్పేశారు ఆయన. ఈ క్రమంలో.. ప్రభుత్వ విమాన సంస్థను అమ్మేయాలనుకుంటున్నట్లు కూడా తెలిపారు. మార్చి 2021 చివరినాటికే విమానయాన సంస్థ.. 45 బిలియన్ రూపీస్ (124 మిలియన్ డాలర్లు) నష్టాల్లో ఉందని తెలిపారు. విమానంలో ఏనాడూ అడుగు పెట్టని నిరుపేదలు ఈ నష్టాన్ని భరించాల్సిన అవసరం ఏముంది? ఏం లేదు.. అంటూ ప్రైవేటీకరణ దిశగా సంకేతాలు ఇచ్చారాయన. 1975లో ఏర్పాటైన శ్రీలంకన్ ఎయిర్‌లైన్స్ ప్రపంచవ్యాప్తంగా 61 దేశాల్లోని 126 ప్రదేశాలకు విమాన సర్వీసులు నడుపుతోంది. 2006 తర్వాత తొలిసారి ఓ త్రైమాసికంలో లాభాలు వచ్చాయని గత నెలలో శ్రీలంకన్ ఎయిర్‌లైన్స్ ప్రకటించుకుంది కూడా. ఇదిలా ఉండగా.. విక్రమ్‌సింఘే శ్రీలంక ప్రధాని పదవి చేపట్టి వారం కూడా కాలేదు. కానీ, ఆయన ముందు పెను సవాల్లే ఉన్నాయి. సంక్షోభం నడుమే ప్రధాని పగ్గాలు అందుకున్న ఆయన.. వచ్చి రావడంతోనే ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు చెల్లించేందుకు కరెన్సీ ముద్రణ లాంటి సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు కూడా. డాలర్ల కొరత వేధిస్తున్న తరుణంలో.. రాబోయే ఒకటి రెండు రోజుల్లో 75 మిలియన్ డాలర్ల విదేశీ కరెన్సీ అవసరమని, ఇంధనాల మీద ప్రభుత్వం ఇక సబ్సిడీ భరించే స్తోమత లేదని, రాబోయే రోజుల్లో ధరల మోత తప్పదంటూ సంచలన ప్రకటనలు చేశాడు కూడా. Sri Lanka | Fuel stations put up 'No Petrol' posters amid severe shortage of petrol-diesel Petrol stocks only for a day, said PM Ranil Wickremesinghe y'day We're waiting since early hours of day, but petrol is yet to come. People are waiting in kilometers-long queue, say locals pic.twitter.com/Mqn2VNu62W — ANI (@ANI) May 17, 2022 చదవండి: ముందు ముందు మరింత ఘోరం.. చేతులెత్తేసిన శ్రీలంక కొత్త ప్రధాని! -
విశాఖలో రెండోరోజు సార్వత్రిక సమ్మె
-
గాజువాక: స్టీల్‌ప్లాంట్ నిరసనల్లో ఉద్రిక్తత.. టీడీపీ ఓవరాక్షన్
సాక్షి, విశాఖపట్నం: ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వామపక్షాలు, కార్మిక సంఘాలు రెండు రోజుల నిరసనలకు పిలుపు ఇచ్చిన విషయం తెలిసిందే. స్టీల్‌ప్లాంట్ నిరసనల్లో భాగంగా గాజువాక జంక్షన్ లో వైఎస్ఆర్సీపీ శ్రేణులు నిరసన ప్రదర్శనలు చేపట్టాయి. స్టీల్ ప్లాంట్ విషయంలో కేంద్రం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా నినాదాలు చేశాయి. అదే సమయంలో అటుగా వచ్చిన టీడీపీ కార్యకర్తలు.. రసాభాస సృష్టించారు. వైఎస్సార్సీపీ కార్యకర్తలను రెచ్చగొడుతూ నినాదాలు చేశారు. దీనిపై నిలదీసిన రోజా అనే వైఎస్సార్సీపీ మహిళా కార్యకర్తపై తెలుగుదేశం కార్యకర్తలు దౌర్జన్యానికి దిగారు. ఈ వ్యవహారం నేపథ్యంలో.. గాజువాక జంక్షన్ లో కొంతసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పోలీసులు నచ్చ చెప్పడంతో కొంతసేపటి తర్వాత పరిస్థితి అదుపులోకి వచ్చింది. ఈ ఘటనలో టీడీపీ నేతల తీరు పై గాజువాక ప్రజలు మండిపడుతున్నారు. స్టీల్ ప్లాంట్ విషయంలో కేంద్రం తీసుకున్న నిర్ణయంపై తమ అధినేత చంద్రబాబుపై ఒత్తిడి తేవాల్సిన కార్యకర్తలు ఆ పని చేయకపోగా.. పైగా అసత్య ఆరోపణలు చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజలు ఘోరంగా ఓడించినా ఇంకా బుద్ధి రాలేదని, స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం వైఎస్సార్ సీపీ కార్యకర్తలు ఆందోళన చేస్తుంటే ఓర్వలేక అసత్య ఆరోపణలు, విమర్శలు చేస్తున్నారని వైఎస్సార్సీపీ కార్యకర్తలు మండిపడ్డారు. -
స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా విశాఖ బంద్
-
కేంద్ర ప్రభుత్వంపై బీజేపీ నేత అసంతృప్తి
ఢిల్లీ: బీజేపీ నేత వరుణ్ గాంధీ మరోసారి కేంద్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వ సంస్థల ప్రైవేటీకరణను తీవ్రంగా తప్పుబట్టారు. పలు సంస్థలను ప్రైవేటీకరణ చేస్తే.. వాటిల్లో ఉద్యోగం చేసేవారు ఉపాధి కోల్పోతారని ఆవేదన వ్యక్తం చేశారు. ‘బ్యాంకింగ్ రంగం, రైల్వేలను ప్రైవేటీకరణ చేస్తే.. సుమారు ఐదు లక్షల మంది తమ ఉద్యోగాలను కోల్పోయారు. ఒక వ్యక్తి తన ఉపాధి కోల్పోయడంటే.. అతని కుటుంబంలోని మిగతా సభ్యులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొవల్సి వస్తుంది. వారి భవిష్యత్తు అంధకారంగా మారుతుంది. ప్రభుత్వాలు ప్రజా సంక్షేమాన్ని పెంపొందిస్తాయి కానీ, ప్రజల్లో ఆర్థిక అసమానతలను పెంచవు. పెట్టుబడిదారీ విధానాన్ని ప్రోత్సహించవు’ అని వరుణ్ గాంధీ ట్వీటర్లో పేర్కొన్నారు. గతంలో వరుణ్ గాంధీ వ్యవసాయ చట్టాలు, లఖిమ్‌పూర్ ఖేరీ ఘటనలపై కేంద్రాన్ని ప్రశ్నించిన సంగతి తెలిసిందే. केवल बैंक और रेलवे का निजीकरण ही 5 लाख कर्मचारियों को ‘जबरन सेवानिवृत्त’ यानि बेरोजगार कर देगा। समाप्त होती हर नौकरी के साथ ही समाप्त हो जाती है लाखों परिवारों की उम्मीदें। सामाजिक स्तर पर आर्थिक असमानता पैदा कर एक ‘लोक कल्याणकारी सरकार’ पूंजीवाद को बढ़ावा कभी नहीं दे सकती। — Varun Gandhi (@varungandhi80) February 22, 2022 -
నేడు 365 జెండాలతో 365 మంది నిరసన
-
Bank Strike: బ్యాంకులు బంద్.. సేవలకు విఘాతం
Bank Unions Strike: సమ్మె నోటీసుకు అనుగుణంగా బ్యాంకు ఉద్యోగులు ఇవాళ, రేపు బంద్ పాటించనున్నారు. అడిషనల్ చీఫ్ లేబర్ కమిషనర్‌తో బుధవారం జరిగిన చర్చలు విఫలం అయ్యాయని ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ కన్ఫెడరేషన్ జనరల్ సెక్రటరీ సౌమ్య దత్త ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే చివరి నిమిషం వరకు ఉత్కంఠ కొనసాగగా.. గురువారం ఉదయం సానుకూల నిర్ణయం ప్రభుత్వం నుంచి వెలువడకపోవడంతో బుధవారం ఉదయం నుంచి సమ్మెలోకి దిగాయి బ్యాంక్ యూనియన్లు. దాదాపు 10 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు గురు, శుక్రవారాల్లో (డిసెంబర్ 16, 17 తేదీలు) బ్యాంకుల సమ్మెలో పాల్గొననున్నారు. సమ్మె నేపథ్యంలో వినియోగదారులు తమ ఆర్థిక లావాదేవీల విషయంలో ముందస్తు చర్యలు తీసుకోవాలని బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాసహా పలు బ్యాంకులు విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే. మాకోసం కాదు.. రెండు ప్రభుత్వ రంగ బ్యాంకుల ప్రైవేటీకరణను నిరసిస్తూ తొమ్మిది యూనియన్ల ప్రాతినిధ్య వేదిక– యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (యూఎఫ్‌బీయూ) ఈ సమ్మె పిలుపు ఇచ్చింది. బ్యాంకుల ప్రైవేటీకరణ బిల్లు (బ్యాంకింగ్ లాస్ సవరణ బిల్లు, 2021)ను ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లో ప్రవేశపెట్టడానికి కూడా కేంద్రం సిద్ధమవుతోంది. అయితే ఈ బిల్లును ప్రవేశపెట్టబోమని ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇస్తేనే సమ్మె విరమణ ఉంటుందని యూనియన్లు స్పష్టం చేస్తుండగా, అటువంటి హామీ ప్రభుత్వం నుంచి రావట్లేదు. #BankStrike #16December pic.twitter.com/XB9tUOszGH — Rajesh Sinha (देवघर,झारखंड) (@theRajeshSinha) December 16, 2021 ప్రభుత్వ రంగం బ్యాంకుల్లో రెండింటిని.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రైవేటీకరించాలని ప్రభుత్వం బడ్జెట్ 2021-22లో కేంద్రం నిర్ణయించడం.. ఆ దిశగా ప్రక్రియను కూడా ప్రారంభించిన నేపథ్యంలో.. బ్యాంకుల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్నాయి సంఘాలు. దీనిపై ముందుగానే సమ్మె నోటీసు కూడా ఇచ్చాయి. ఈ సమ్మె తమ కోసం కాదని, బ్యాంకులను ప్రైవేట్‌పరం చేస్తే బలహీన వర్గాలకు రుణాల లభ్యత తగ్గుతుందని.. కోట్లాది మంది డిపాజిట్లు రిస్క్‌లో పడతాయని హెచ్చరిస్తోంది Union Forum Of Bank. మొత్తం తొమ్మిది యూనియన్లు యూఎఫ్‌బీయూ నేతృత్వంలో ఈ సమ్మెలో పాల్గొనబోతున్నారు. కుట్ర జరుగుతోంది ప్రైవేటీకరణ బిల్లును ఉపసంహరించుకోవడంతో పాటు ప్రభుత్వ రంగ బ్యాంకులను బలోపేతం చేయాలని కోరుతోంది. ఈ దేశంలో సామాన్యులకు సేవలందించడానికి ప్రభుత్వ రంగ బ్యాంకులు వుండడం చాలా అవసరమని పేర్కొంది. 1969లో బ్యాంకులను జాతీయకరణ చేసిన తర్వాతనే పేదలు, అవసరంలో వున్నవారికి బ్యాంకుల సేవలు అందాయన్న విషయం గుర్తుంచుకోవాలని సూచిస్తోంది. 1969లో 8 వేలుగా వున్న ప్రభుత్వ రంగ శాఖలు ప్రస్తుతం 1.18 లక్షలకు చేరాయంటేనే ఎంతగా అభివృద్ధి చెందాయో తెలుస్తోందని. కానీ, ప్రభుత్వ రంగ బ్యాంకులు సమర్ధవంతంగా పనిచేయడం లేదని, నష్టాల్లో నడుస్తున్నాయని చిత్రీకరించేందుకు కుట్రలు జరుగుతున్నాయని మండిపడుతున్నారు. మరోవైపు.. బ్యాంకు ఉద్యోగుల, అధికారుల సమ్మెకు రైల్వే యూనియన్ సహా ఇతర సంఘాలు కూడా మద్దతు ప్రకటిస్తున్నాయి. #BankStrike #BankPrivatisation #stoprivatisationofbank pic.twitter.com/5Gg1BNf9J8 — Singh Rashmi🇮🇳 (@rsrashmi9) December 16, 2021 ఈ సమ్మెతో స్టేట్ బ్యాంక్ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ బ్యాంక్, యూసీవో బ్యాంక్ సహా పలు ప్రైవేట్‌రంగ బ్యాంకుల సేవలకు విఘాతం కలగనుంది. బ్యాంకింగ్ సేవలతో పాటు ఏటీఎం, ఇతర సేవలపైనా ప్రభావం పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. రెండు బ్యాంకుల ప్రైవేటీకరణ.. నిర్మలా సీతారామన్ ఏం చెప్పారంటే.. -
రెండు రోజులు బ్యాంకుల సమ్మె.. ఎస్బీఐ రిక్వెస్ట్
SBI Statement On Two Days Bank Strike: పబ్లిక్ సెక్టార్‌లోని రెండు బ్యాంకుల ప్రైవేటీకరణ నిర్ణయానికి వ్యతిరేకంగా యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ United Forum of Bank Unions (UFBU) డిసెంబర్ 16, 17 తేదీల్లో బ్యాంకుల సమ్మెకు పిలుపు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ రెండు రోజులపాటు కార్యకలాపాలన్నీ ఆగిపోతాయని, సేవలు నిలిచిపోతాయని బ్యాంకులు కస్టమర్లకు అలర్ట్ సైతం జారీ చేశాయి. ఈ తరుణంలో అతిపెద్ద ప్రభుత్వ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ సమ్మెకు దూరం ఉండాలని తమ ఉద్యోగులకు విజ్ఞప్తి చేసింది ఎస్బీఐ. సమ్మెలో పాల్గొనడంపై పునరాలోచించుకోవాలని, తద్వారా లావాదేవీలకు, ఇతర సేవలకు విఘాతం కలగకుండా చూడాలని కోరింది. ‘కరోనా సమయంలో సమ్మెల వల్ల సేవలకు విఘాతం కలుగుతుంది. ఈ స్ట్రయిక్ పట్ల బ్యాంక్, ఇన్వెస్టర్లు, ఖాతాదారులకు ఎలాంటి ఆసక్తి ఉండబోదు. ఈ రెండు రోజులపాటు బ్యాంకులు సాధారణంగానే పని చేస్తాయని, అయితే కస్టమర్లకు అందించే సేవలపై సమ్మె ప్రభావం పడే అవకాశాలు ఉన్నాయి అని ప్రకటనలో పేర్కొంది ఎస్బీఐ. An appeal to all Bank Staff. pic.twitter.com/EZFGpfnK0a — State Bank of India (@TheOfficialSBI) December 13, 2021 ఈ నేపథ్యంలో కస్టమర్లను వీలైనంత మేర డిజిటల్ ట్రాన్జాక్షన్స్ వైపు మొగ్గు చూపాలని కోరింది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. అంతేకాదు ఈ రెండు రోజులపాటు అత్యవసరమైతేనే బ్యాంకులకు రావాలని కస్టమర్లకు సూచించింది. అయితే ఏటీఎంలలో క్యాష్ పరిస్థితి గురించి ఎలాంటి స్టేట్మెంట్ ఇవ్వలేదు. ఇదిలా ఉంటే ప్రైవేటీకరణ వ్యవహారాల క్యాబినెట్ కమిటీ రెండు బ్యాంకుల ప్రైవేటీకరణపై ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని ఆర్థికశాఖ నిర్మలాసీతారామన్ తెలిపారు. లోక్‌సభలో ఆమె ఈ మేరకు ఒక ప్రకటన చేశారు. చదవండి: బ్యాంకులపై ‘బెయిల్ అవుట్’ భారం! -
విశాఖ ఉక్కు పోరాటం @ 200 రోజులు
-
200 రోజులకు చేరుకున్న విశాఖ ఉక్కు ఉద్యమం
-
ఆస్తుల నగదీకరణ ఎందుకు ?
ఆగస్టు నెల చివరివారంలో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ జాతీయ ఆస్తుల నగదీకరణ విధానాన్ని (నేషనల్ మోనిటైజేషన్ పైప్‌లైన్) ప్రారంభించారు. కేంద్ర ప్రభుత్వ, ప్రభుత్వ రంగ ఆస్తుల నిర్వహణను ప్రైవేట్ యాజమాన్యా లకు అప్పగించడం ద్వారా 2021–22 నుంచి 2024–25 ఆర్థిక సంవత్సరాల మధ్య కాలంలో ఆరు లక్షల కోట్ల రూపాయల నగదు సమీకరించడమే దీని లక్ష్యం. 12 ప్రభుత్వ శాఖలకు చెందిన 20కి పైగా ఆస్తులు ఈ నగదీకరణలో భాగంగా ఉంటాయి. వీటిలో ప్రధానంగా రహదారులు, రైల్వేలు, విద్యు త్తు వ్యవస్థ ఉన్నాయి. 2022 నుంచి 2025 వరకు ఈ కార్యక్రమం అమలవుతుంది. ప్రైవేటుకు అప్పగించే ఆస్తులు ఇవే ఈ విధానం కింద భారతీయ రైల్వేకి చెందిన 400 స్టేషన్లు, 90 ప్రయాణికుల రైళ్లు, 265 గూడ్స్ షెడ్లు, 15 రైల్వే స్టేడియంలు ప్రైవేట్ సంస్థలకు అప్పగిస్తారు. ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలోని 25 విమానాశ్రయాలను ప్రైవేటీకరిస్తారు. ఢిల్లీ, హైదరాబాద్, బెంగళూరు తదితర విమానాశ్రయాల్లో ప్రభుత్వ వాటాలను పూర్తిగా విక్రయిస్తారు. 9 మేజర్ పోర్టుల్లో ఉన్న 31 ప్రాజెక్టులను పీపీపీ విధానంలో అప్పగిస్తారు. బీబీఎన్ఎల్, బీఎస్ఎన్ఎల్, డిపార్ట్మెంట్ ఆఫ్ టెలీ కమ్యూనికేషన్స్‌లో ఉన్న ఆస్తులన్నింటినీ ప్రైవేటు వారికి ఇచ్చేస్తారు. జాతీయ స్టేడియంలు, ప్రాంతీయ కేంద్రాలు, పట్టణ ప్రాంతాల్లోని కాలనీలు, అతిథిగృహాలు, హోటళ్లు వంటి వాటిని ప్రైవేటుకు అప్పగిస్తారు. అయితే జాతీయ నగదీకరణ విధానం కింద అప్పగిస్తున్న ఆస్తులు ఆ తర్వాత కూడా ప్రభుత్వ యాజమాన్యం కిందే ఉంటాయని ఆర్థికమంత్రి స్పష్టంచేశారు. కొంతకాలం ప్రైవేట్ నిర్వహణ కింద ఉన్న తర్వాత వీటిని తిరిగి ప్రభుత్వానికి ఇచ్చివేయవలసి ఉంటుంది. నగదు లభ్యత పెరుగుతుంది ఈ కొత్త విధానం కింద ప్రభుత్వం మౌలిక వసతుల రంగంలో పెడుతున్న వ్యయాన్ని పెంచేలా నగదు లభ్యతను మెరుగుపరుస్తుందని మంత్రి వ్యాఖ్య. మౌలిక వసతుల రంగంలో కేంద్ర ప్రభుత్వం పెడుతున్న వ్యయాన్ని ఇంకా పెంచాల్సిన అవసరముందని, ప్రభుత్వ రంగ మౌలిక వసతుల ఆస్తులను ప్రైవేట్ యాజమాన్యాలకు అప్పగించడం అతి ముఖ్యమైన ఆర్థిక ఎంపిక అని, నూతన మౌలిక వసతుల నిర్మాణానికి ఇది చాలా ముఖ్యమైనదని మంత్రి సెలవిచ్చారు. ఈ కొత్త విధానంలో భాగంగా విమానయాన రంగం నుంచే దాదాపు రూ. 20,800 కోట్ల ఆస్తులను ప్రైవేట్‌కి అప్పగించనున్నారు. టెలికం రంగం నుంచి రూ. 35,100 కోట్ల ఆస్తులను నగదీకరణ కింద అప్పగించనున్నారు. ఇకపోతే రైల్వే రంగం నుంచి రూ. లక్షా 50 వేల కోట్లు, రహదారుల రంగం నుంచి రూ. లక్షా 60 వేల కోట్లు, విద్యుత్ పంపిణీ రంగం నుంచి రూ. 45,200 కోట్ల విలువైన ఆస్తులను ప్రైవేట్ నిర్వహణకు అప్పగిస్తారు. ఆస్తుల నగదీకరణ విధానం ఆర్థిక వ్యవస్థను పునర్జీవింపజేసి, మహమ్మారి వల్ల దెబ్బతిన్న అభివృద్ధి పనులను వేగవంతం చేస్తుందని కేంద్రం అంచనా. దీనికి గాను ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థల ఆదాయాన్ని గణనీయంగా పెంచుకోవాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. నగదీకరణలో నాలుగు ప్రయోజనాలున్నాయి. 1. ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థల రాబడులను పెంచడం కోవిడ్ మహమ్మారి ప్రభావం కారణంగా కేంద్ర ప్రభుత్వ ఆర్థిక స్థితి, ప్రభుత్వ రంగ యాజమాన్యంలోని సంస్థల ఆర్థిక స్థితి విధ్వంసానికి గురైంది. 2020–21 ఆర్థిక సంవత్సరంలో స్థూల దేశీయోత్పత్తి 7.3 శాతానికి పడిపోయింది. ద్రవ్యలోటు జీడీపీలో 9.3 శాతానికి పెరిగింది. లాక్ డౌన్ల వల్ల ప్రభుత్వ రాబడులు క్షీణించిపోవడమే కాకుండా, పేదలకు ఉపశమనం కలిగించడానికి ప్రభుత్వం తన వ్యయాన్ని బాగా పెంచాల్సి వచ్చింది. దానికి తోడుగా ప్రభుత్వ, కేంద్రప్రభుత్వ రంగ సంస్థల విభాగాలు ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటూండటం కూడా తెలిసిన విషయమే. ఇవి భారీ స్థాయిలో రుణాలు, నష్టాల బారినపడి కునారిల్లుతున్నాయి. అందుకే ప్రభుత్వ రంగ సంస్థల అభివృద్ధి కోసం పెట్టుబడుల ఉపసంహరణ చర్యలు తప్పనిసరయ్యాయి. భారతదేశంలో నష్టాల బారిన పడుతున్న పీఎస్‌యూల సంఖ్య 2015–16లో 79 నుంచి 2019–20 సంవత్సరానికి 84కు చేరుకుంది. ఇదే కాలానికి లాభాలు ఆర్జిస్తున్న ప్రభుత్వ రంగ సంస్థల సంఖ్య 175 నుంచి 171కి పడిపోయిందని ఆర్థిక శాఖ సహాయ మంత్రి పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో వివరించారు. వీటిలో 30 ప్రభుత్వ రంగ సంస్థల నష్టం ఇప్పటికే రూ. 1,06,879 కోట్లకు చేరుకుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఆస్తుల నగదీకరణ విధానం ప్రభుత్వానికి అదనపు రాబడులను తీసుకువస్తుంది. 2. పీఎస్‌యూలకు బడ్జెటరీ మద్దతును తగ్గించడం ప్రభుత్వ రంగ సంస్థలు తమ మూలధన వ్యయ అవసరాలను నెరవేర్చుకోవడానికి, అంతర్జాతీయ సంస్థలకు రుణాలు తిరిగి చెల్లించడానికి, కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏటా కొంత నగదును వాటికి అప్పగిస్తోంది. రుణ సేవలు, వీఆర్ఎస్ పథకాలు, ఉపశమన చర్యలు, రాయితీలు, ప్రత్యేక ప్యాకేజీలు వంటివి వీటికి అదనం. ఉదాహరణకు, ఆర్థిక స్థితి దిగజారిపోయిన ఎంటీఎన్ఎల్, బీఎస్ఎన్ఎల్ సంస్థల పునరుద్ధరణ కోసం కేంద్రప్రభుత్వం రూ. 70 వేల కోట్ల ప్యాకేజీనీ ప్రకటించింది. ఆస్తుల నగదీకరణ వల్ల దేశ ఆర్థిక ఆరోగ్యం మెరుగుపడుతుంది. దీని వల్ల కేంద్ర ప్రభుత్వం పీఎస్‌యూలకు బడ్జెటరీ కేటాయింపులు కొన్ని సంవత్సరాల కాలంలో గణనీయంగా తగ్గుముఖం పడతాయని అంచనా. దీంతో కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏటా ఆర్థిక భారం నుంచి తప్పించుకోవచ్చు కూడా. పైగా కేంద్ర ప్రభుత్వ ఆర్థిక, ద్రవ్యస్థితి గణనీయంగా మెరుగుపడుతుంది. ప్రభుత్వం పీఎస్‌యూలకు తప్పనిసరిగా పెడుతున్న వ్యయాన్ని సామాజిక సంక్షేమ ప్రాజెక్టులు వంటివాటికి ఉపయోగించవచ్చు. 3. కొత్త మౌలిక వసతుల కల్పనకు నిధులు లభ్యం ప్రభుత్వం నగదీకరణ ద్వారా తన వద్ద నగదు నిల్వలను పెంచుకుంటే కొత్త ఆస్తులను సృష్టించవచ్చు. ఇది దానికదేగా ఉద్యోగాల కల్పనకు వీలు కల్పిస్తుంది. దీనివల్ల పెట్టుబడులను మరింతగా ఆకర్షించి, అభివృద్ధిని ముందుకు తీసుకుపోయే అవకాశం ఉంది. జీడీపీలో పెట్టుబడుల శాతం తగ్గుతూ వస్తోంది. అదే సమయంలో మహమ్మారి అనంతరం డిమాండు పునరుద్ధరణ చర్యలకు ప్రైవేట్ రంగం వేచి చూస్తోంది. ప్రభుత్వం రంగ సంస్థల వద్ద వనరులు తగ్గిపోయాయి.ఈ నేపథ్యంలో జాతీయ ఆస్తుల నగదీకరణ విధానం ఆర్థిక వ్యవస్థలోకి పెట్టుబడులను పునరుద్ధరిస్తుంది. కోవిడ్ –19 వల్ల ఏర్పడిన ఆర్థిక మందగమనం నుంచి భారత్ కోలుకునేలా చేయవచ్చు. పీఎస్‌యూలు నిర్మాణ రంగ నష్టాలను ఎదుర్కొంటున్నందున వాటి ఆస్తుల నగదీకరణను నిరంతరంగా చేపట్టాల్సి వస్తోంది. అదే సమయంలో ప్రైవేట్ రంగం నష్టభయం లేని ఆస్తుల అండతో ముందుకెళుతోంది. పైగా పర్యావరణ అనుమతులు, ప్రాజెక్టుల జాప్యం ద్వారా నష్టం, వ్యాజ్యాలు వంటివి ప్రైవేట్ రంగానికి ఉండవు. 4. ఉద్యోగాలు, పెట్టుబడులకు కొత్త అవకాశాలు ప్రభుత్వ ఆస్తుల నగదీకరణ ద్వారా ఆశిస్తున్న నగదు పరిమాణంతో ప్రభుత్వరంగ పరిశ్రమల విలువ అమాంతం పెరుగుతుంది. దీనివల్ల ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న గతి శక్తి ప్రణాళికకు గొప్ప చేయూత లభిస్తుంది. ఈ పథకం కింద కేంద్రప్రభుత్వం రూ. 100 లక్షల కోట్ల విలువైన మౌలిక వసతుల కల్పనను ప్రకటించింది. ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంలో సాగే ఆ సృజనాత్మక పద్ధతి వల్ల కార్పొరేట్ రంగం ఆకాంక్షలకు ఊతం లభిస్తుంది. ప్రైవేట్ రంగానికి ప్రభుత్వ ఆస్తులను కట్టబెట్టడం వల్ల ఆర్థిక వ్యవస్థ బహువిధాలుగా లాభపడుతుంది. ఇంతవరకు ఉపయోగంలో లేకుండా వృథాగా పడివున్న ఆస్తులను ప్రైవేట్ రంగం సమర్థంగా ఉపయోగించుకుని కొత్త ఉద్యోగావకాశాలను ఇతోధికంగా పెంచగలుగుతుంది. ప్రభుత్వ రంగ ఆస్తులను వీలైనంతవరకు విడుదల చేసి ఆర్థిక వ్యవస్థను ముందుకు తీసుకెళ్లేందుకు తగిన సమయం ఆసన్నమైందని, ప్రభుత్వం దృఢ నిర్ణయాలు తీసుకొనక తప్పటం లేదని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొనడం గమనార్హం. – అమితాబ్ తివారీ, ఆర్థిక రంగ విశ్లేషకులు (యాహూ సౌజన్యంతో) చదవండి : కేంద్రం చెబుతున్న మానిటైజేషన్‌తో ప్రయోజనం ఎవరికీ ? -
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను పునఃసమీక్షిస్తేనే మేలు
సాక్షి, అమరావతి: విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరించేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని పునఃసమీక్షించాల్సిన అవసరం ఉందని హైకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం నివేదించింది. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని లాభాల బాట పట్టించేందుకు ఆచరణ సాధ్యమైన ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలని తెలిపింది. ప్రత్యామ్నాయ మార్గాల అన్వేషణను నొక్కి చెబుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇప్పటికే ప్రధాన మంత్రికి లేఖ రాశారని వివరించింది. ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ రాష్ట్ర శాసనసభలో తీర్మానం సైతం చేశారని తెలిపింది. ముఖ్యమంత్రి చెప్పిన విధంగా ప్రత్యామ్నాయాలు చూడాలని కేంద్ర ప్రభుత్వాన్ని శాసనసభ కోరిందని వివరించింది. ఇప్పటికే ఈ వ్యవహారంలో కౌంటర్ దాఖలు చేసిన కేంద్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి లేవనెత్తిన అంశాలను పరిగణనలోకి తీసుకుంటున్నట్టు తన కౌంటర్లో ఎక్కడా పేర్కొనలేదంది. ఎంతోమంది ప్రాణ త్యాగాల ఫలితంగానే విశాఖ ఉక్కు కర్మాగారం ఏర్పడిందని, వేలాది మంది ప్రత్యక్షంగా, పరోక్షంగా ఈ పరిశ్రమ వల్ల ఉపాధి పొందుతున్నారని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ మాజీ ఐపీఎస్ అధికారి జేడీ లక్ష్మీనారాయణ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై విచారణ జరిపిన ప్రధాన న్యాయమూర్తి (సీజే) ధర్మాసనం ఈ వ్యవహారంలో కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున పరిశ్రమలు, వాణిజ్య శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ కరికాల వలవన్ కౌంటర్ దాఖలు చేశారు. క్యాప్టివ్ మైన్స్ లేకపోవడం వల్లే నష్టాలు... ‘విశాఖ ఉక్కు కర్మాగారం వల్ల 20వేల మందికి పైగా ప్రత్యక్షంగా, అనేక వేల మంది పరోక్షంగా ఉపాధి పొందుతున్నారు. ఈ కర్మాగార ప్రస్తుత ఉత్పత్తి సామర్థ్యం 7.30 మిలియన్ టన్నులు. ఆధునికీకరణ, విస్తరణ నిమిత్తం కర్మాగారం బ్యాంకుల నుంచి రుణాలు కూడా తీసుకుంది. 2014–15 నుంచి ఈ కర్మాగారం నష్టాలు ఎదుర్కొంటోంది. క్యాప్టివ్ మైనింగ్ లేకపోవడమే ఇందుకు ప్రధాన కారణం. ఈ కర్మాగారం పునరుద్ధరణ నిమిత్తం ప్రధానమంత్రికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ లేఖ రాస్తూ పలు సూచనలు చేశారు. లాభాల బాట పట్టించేందుకు వీలుగా విశాఖ ఉక్కు కార్యకలాపాలను కొనసాగించాలని కోరారు. క్యాప్టివ్ మైన్స్ కేటాయించాలని, ఆర్థిక పునర్నిర్మాణం చేపట్టాలని కోరారు. ఇదే అంశంపై కేంద్ర ఉక్కు శాఖ మంత్రికి కూడా ముఖ్యమంత్రి లేఖ రాశారు. క్యాప్టివ్ మైన్స్ కేటాయిస్తే నిర్వహణ వ్యయాలు గణనీయంగా తగ్గుతాయి. నెలకు రూ.200 కోట్ల వరకు లాభాలు ఆర్జించే అవకాశం ఉంటుంది. పెట్టుబడుల ఉపసంహరణ అన్నది ప్రభుత్వ విధానపరమైన నిర్ణయమే అయినప్పటికీ, విశాఖ ఉక్కు విషయంలో ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తే ప్రయోజనం ఉంటుంది’ అని కరికాల వలవన్ ప్రభుత్వం తరఫున దాఖలు చేసిన కౌంటర్లో పేర్కొన్నారు. ఈ వివరాలను పరిగణనలోకి తీసుకుని ఈ వ్యాజ్యంలో తగిన ఉత్తర్వులు జారీ చేయాలని ఆయన కోర్టును కోరారు. -
విశాఖ స్టీల్‌ప్లాంట్ హిల్‌టాప్ గెస్ట్‌హౌస్ వద్ద కార్మికుల నిరసన
-
విశాఖ స్టీల్‌ప్లాంట్ కార్మికుల పోరాటం మరింత ఉధృతం
-
ఢిల్లీని తాకిన విశాఖ స్టీల్‌ప్లాంట్ కార్మికుల ఉద్యమం
-
స్టీల్‌ప్లాంట్ అప్పులను ఈక్విటీలుగా మార్చాలని డిమాండ్
-
విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమం
-
తీవ్ర రూపం దాలుస్తున్న విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ ఉద్యమం
-
విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణపై హైకోర్టులో కేంద్రం అఫిడవిట్
-
ఉద్యమాన్ని తీవ్రం చేసేందుకు విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘాల సిద్ధం