అమరావతి, సాక్షి: జగన్ పాలనలో జరిగిన మంచిని నాశనం చేయాలనే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో.. ఆంధ్రప్రదేశ్‌లో మెడికల్ కాలేజీలను ప్రైవేట్‌పరం చేయాలని చంద్రబాబు ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు తొలి అడుగు పడింది కూడా. ఇవాళ జరిగిన ఏపీ కేబినెట్ భేటీలో పీపీపీ(Public–private partnership) మోడల్ అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించినట్లు తెలుస్తోంది.
జగన్ హయాంలో ఏపీలో కొత్తగా 17 మెడికల్ కాలేజీల నిర్మాణం చేపట్టారు. వీటిలో ఐదు మెడికల్ కాలేజీలను గతేడాది ఆయన ప్రారంభించగా.. తరగతులు కూడా ప్రారంభం అయ్యాయి. అయితే మిగిలిన 12 కాలేజీలపై చంద్రబాబు ప్రభుత్వం దృష్టిసారించింది. వాటిని ప్రైవేట్ పరం చేసేందుకు పీపీపీ మోడల్‌ను తెరపైకి తెచ్చింది. పీపీపీ మోడల్‌లో మెడికల్ కాలేజీల నిర్వహణకు అధ్యయనం చేయాలని, ఇందుకుగానూ గుజరాత్ మోడల్‌ను పరిశీలిస్తామని మంత్రి పార్థసారథి ప్రకటించారు కూడా.
రూ.8,480 కోట్లతో 17 కళాశాలలు
ప్రజలకు ప్రభుత్వ రంగంలో మెరుగైన వైద్య వసతులు సమకూర్చడంపై ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో జగన్ మోహన్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. సుమారు రూ.8,480 కోట్లతో ప్రతి జిల్లాకు ఒక ప్రభుత్వ వైద్య కళాశాల ఉండేలా 17 కొత్త వైద్య కళాశాలలు ఏర్పాటు చేయడానికి ప్రణాళిక రూపొందించారు. ఈ కాలేజీల ద్వారా ఏకంగా 2,550 ఎంబీబీఎస్ సీట్లు కొత్తగా అందుబాటులోకి తేవాలనున్నారు. గతేడాది ఐదు కాలేజీలు ప్రారంభించగా.. ఈ ఏడాది మరో ఐదు, మిగిలిన ఏడు వైద్య కళాశాలలను 2025-26 విద్యా సంవత్సరం నుంచి ప్రారంభించాలనుకున్నారు.
విజయనగరం మెడికల్ కాలేజీ ప్రారంభించినప్పటి ఫొటో
Comments
Please login to add a commentAdd a comment