PPP formula
-
మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేస్తే రాష్ట్రంలో ఉద్యమమే : జూపూడి
సాక్షి,అమరావతి : రాష్ట్ర విద్యార్థుల వైద్య విద్య కలలను సీఎం చంద్రబాబు ప్రభుత్వం చిధ్రం చేస్తుందంటూ వైఎస్సార్సీపీ నేత జూపుడి ప్రభాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హయాంలో తెచ్చిన 17 మెడికల్ కాలేజీల్ని ఎలా ప్రైవేట్ పరం చేస్తారని మండిపడ్డారు.17 మెడికల్ కాలేజీల ద్వారా 5వేల మంది డాక్టర్లు తయారవుతారు. పేదలకు వైద్యాన్ని అందిస్తారు. అలాంటి వైద్యవిద్యను అందించే మెడికల్ కాలేజీల్ని ప్రైవేట్ పరం చేస్తే పేదలకు వైద్యం ఎవరందిస్తారని ప్రశ్నించారు. పేద విద్యార్థులు డాక్టర్లు అవ్వడం మీకు ఇష్టం ఉండదా చంద్రబాబు అని అన్నారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై డిప్యూటీ సీఎం పవన్ సమాధానం చెప్పాలని సూచించారు.5వేల మెడికల్ సీట్లను ప్రైవేట్ పరం చేస్తున్నారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వైఎస్సార్సీపీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. పేదల తరుఫున తమ పార్టీ పోరాటం చేస్తుందని, అవసరమైతే విద్యార్ధి ఉద్యమం నడుపుతామని చంద్రబాబును హెచ్చరించారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీ నందింగ సురేష్‌ను పరామర్శకు వచ్చిన వైఎస్ జగన్‌ను కలిసేందుకు భారీ ఎత్తున ప్రజలు తరలి రావడాన్ని తట్టుకోలేకపోతున్నారు. జనానికి బుద్ధిలేదని విమర్శించే వ్యక్తిని చంద్రబాబునే చూస్తున్నాం. ఊసరవెల్లి లాంటి చంద్రబాబుతో రాజకీయం చేయాలంటే సమాజమే సిగ్గుపడుతోంది. వైఎస్ జగన్ ఛరిష్మా ఉన్న నాయకుడు. రెడ్ బుక్ పేరు చెబితే భయపడేవాళ్లు ఇక్కడెవరు లేరు. గోదావరి పుష్కరాల్లో ప్రజల ప్రాణాలను బలితీసుకున్న నేరస్తుడు చంద్రబాబు అని జూపుడి ప్రభాకర్ విమర్శలు గుప్పించారువందేళ్ల చరిత్రలో తొలిసారిగా..వైఎస్ జగన్ హయాంలో 2019లో వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రూ.8 వేల కోట్లకుపైగా నిధులతో ఒకేసారి 17 వైద్య కళాశాలలు నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. విజయనగరం, ఏలూరు, రాజమహేంద్రవరం, మచిలీపట్నం, నంద్యాల వైద్య కళాశాలలను గతేడాది ప్రారంభించి అదనంగా 750 ఎంబీబీఎస్ సీట్లలో ప్రవేశాలు కల్పించింది. 1923లో ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్రా మెడికల్ కాలేజీ ఏర్పాటైంది. అప్పటి నుంచి 2023 వరకు రాష్ట్రంలో పూర్తిగా ప్రభుత్వ రంగంలో కేవలం 11 వైద్య కళాశాలలు మాత్రమే ఉండగా వందేళ్ల చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా ఒకేసారి 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీల నిర్మాణాన్ని వైఎస్ జగన్ చేపట్టారు. -
ప్రైవేట్‌పరం కానున్న ఏపీ మెడికల్ కాలేజీలు!
అమరావతి, సాక్షి: జగన్ పాలనలో జరిగిన మంచిని నాశనం చేయాలనే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో.. ఆంధ్రప్రదేశ్‌లో మెడికల్ కాలేజీలను ప్రైవేట్‌పరం చేయాలని చంద్రబాబు ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు తొలి అడుగు పడింది కూడా. ఇవాళ జరిగిన ఏపీ కేబినెట్ భేటీలో పీపీపీ(Public–private partnership) మోడల్ అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించినట్లు తెలుస్తోంది.జగన్ హయాంలో ఏపీలో కొత్తగా 17 మెడికల్ కాలేజీల నిర్మాణం చేపట్టారు. వీటిలో ఐదు మెడికల్ కాలేజీలను గతేడాది ఆయన ప్రారంభించగా.. తరగతులు కూడా ప్రారంభం అయ్యాయి. అయితే మిగిలిన 12 కాలేజీలపై చంద్రబాబు ప్రభుత్వం దృష్టిసారించింది. వాటిని ప్రైవేట్ పరం చేసేందుకు పీపీపీ మోడల్‌ను తెరపైకి తెచ్చింది. పీపీపీ మోడల్లో మెడికల్ కాలేజీల నిర్వహణకు అధ్యయనం చేయాలని, ఇందుకుగానూ గుజరాత్ మోడల్‌ను పరిశీలిస్తామని మంత్రి పార్థసారథి ప్రకటించారు కూడా. రూ.8,480 కోట్లతో 17 కళాశాలలు ప్రజలకు ప్రభుత్వ రంగంలో మెరుగైన వైద్య వసతులు సమకూర్చడంపై ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో జగన్ మోహన్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. సుమారు రూ.8,480 కోట్లతో ప్రతి జిల్లాకు ఒక ప్రభుత్వ వైద్య కళాశాల ఉండేలా 17 కొత్త వైద్య కళాశాలలు ఏర్పాటు చేయడానికి ప్రణాళిక రూపొందించారు. ఈ కాలేజీల ద్వారా ఏకంగా 2,550 ఎంబీబీఎస్ సీట్లు కొత్తగా అందుబాటులోకి తేవాలనున్నారు. గతేడాది ఐదు కాలేజీలు ప్రారంభించగా.. ఈ ఏడాది మరో ఐదు, మిగిలిన ఏడు వైద్య కళాశాలలను 2025-26 విద్యా సంవత్సరం నుంచి ప్రారంభించాలనుకున్నారు. విజయనగరం మెడికల్ కాలేజీ ప్రారంభించినప్పటి ఫొటో -
ధాన్యం కొనుగోళ్లలో పీపీపీ విధానం!
- ప్రైవేటు భాగస్వామ్యాన్ని పెంచేలా కసరత్తు - కొనుగోళ్లకు కమిటీ ఏర్పాటు చేసిన ప్రభుత్వం సాక్షి, హైదరాబాద్: ఈ ఖరీఫ్ సీజన్ నుంచి ధాన్యం కొనుగోళ్లలో రాష్ట్ర ప్రభుత్వం పాత్ర పరిమితం కానుంది. లెవీ సేకరణ ఇకమీదట ఉండదని కేంద్రం ఇప్పటికే తేల్చిచెప్పిన నేపథ్యంలో ధాన్యం సేకరణలో ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యం (పీపీపీ) విధానాన్ని తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయానికి వచ్చింది. ధాన్యం సేకరణ మొదలు నిల్వ, మిల్లింగ్, రవాణా వరకు అన్నిరకాల వ్యవహారాలను ప్రైవేటుకు భాగస్వామ్యం కల్పించనున్నారు. ధాన్యం నాణ్యత పరీక్షల బాధ్యత సైతం ప్రైవేటు సంస్థల వ్యక్తుల్లోకి వెళ్లనుంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన ప్రతిపాదనలో పీపీపీ భాగస్వామ్య విధానాన్ని అనుసరించాలని సూచించింది. ప్రతిపాదనలో పేర్కొన్న అంశాలను అమల్లోకి తెచ్చేందుకు తగిన విధానాన్ని రూపొందించడానికి పౌరసరఫరాల శాఖ కసరత్తు ఆరంభించింది. వ్యవహారమంతా ప్రైవేటు చేతుల్లోకి.. రాష్ట్రంలో ప్రస్తుతం వరకు కొనసాగుతూ వచ్చిన ధాన్యం సేకరణ విధానాన్ని వచ్చే అక్టోబర్ నుంచి పూర్తిగా ఎత్తివేయాలని కేంద్రం నిర్ణయించిన విషయం తెలిసిందే. దీంతో మొత్తం సేకరణ భారం రాష్ట్ర ప్రభుత్వంపైనే పడనుంది. ప్రస్తుతం ధాన్యం సేకరణ చేస్తున్న పీఏసీ, ఐకేపీ, డీసీఎంఎస్‌లు ఈ మొత్తం భారాన్ని మోయాల్సి ఉంటుంది. అయితే మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్లు ఈ ఏడాది ఖరీఫ్ ధాన్యం నుంచి తప్పుకుంటామని ఇప్పటికే ఐకేపీ పౌర సరఫరాలశాఖకు తేల్చిచెప్పింది. దీంతో ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి సారించిన సమయంలో కేంద్రం పీపీపీ ప్రతిపాదనను తెరపైకి తీసుకొచ్చింది. టెండర్ విధానం ద్వారా ప్రైవేటు సంస్థ లేక వ్యక్తులను ఎంపిక చేసి ధాన్యం సేకరణ, మిల్లింగ్‌తోపాటు గోదాములు, మండల్ లెవల్ పాయింట్ (ఎంఎల్ఎస్) పాయింట్లోకి రవాణా బాధ్యతలను వారికి కట్టబెట్టాలని సూచించింది. ఈ విధానంలో కొనుగోలు కేంద్రాలు నైపుణ్యంగల సంస్థల పర్యవేక్షణలో అంటే.. ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో ఉంటాయి. ఈ ప్రైవేటు సంస్థలు లేక వ్యక్తులకు ప్రభుత్వాల తరఫున బడ్జెట్ సాయం చేయాల్సిన అవసరం ఉండదు. మొత్తం బాధ్యతను ప్రైవేటు సంస్థలే చూసుకుంటుండటంతో వారి చేతుల్లోకి వెళ్లినట్లే అవుతుంది.