సాక్షి,అమరావతి : రాష్ట్ర విద్యార్థుల వైద్య విద్య కలలను సీఎం చంద్రబాబు ప్రభుత్వం చిధ్రం చేస్తుందంటూ వైఎస్సార్‌సీపీ నేత జూపుడి ప్రభాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హయాంలో తెచ్చిన 17 మెడికల్ కాలేజీల్ని ఎలా ప్రైవేట్ పరం చేస్తారని మండిపడ్డారు.
17 మెడికల్ కాలేజీల ద్వారా 5వేల మంది డాక్టర్లు తయారవుతారు. పేదలకు వైద్యాన్ని అందిస్తారు. అలాంటి వైద్యవిద్యను అందించే మెడికల్ కాలేజీల్ని ప్రైవేట్ పరం చేస్తే పేదలకు వైద్యం ఎవరందిస్తారని ప్రశ్నించారు.
పేద విద్యార్థులు డాక్టర్లు అవ్వడం మీకు ఇష్టం ఉండదా చంద్రబాబు అని అన్నారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై డిప్యూటీ సీఎం పవన్ సమాధానం చెప్పాలని సూచించారు.5వేల మెడికల్ సీట్లను ప్రైవేట్ పరం చేస్తున్నారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వైఎస్సార్‌సీపీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. పేదల తరుఫున తమ పార్టీ పోరాటం చేస్తుందని, అవసరమైతే విద్యార్ధి ఉద్యమం నడుపుతామని చంద్రబాబును హెచ్చరించారు.
ఈ సందర్భంగా మాజీ ఎంపీ నందింగ సురేష్‌ను పరామర్శకు వచ్చిన వైఎస్ జగన్‌ను కలిసేందుకు భారీ ఎత్తున ప్రజలు తరలి రావడాన్ని తట్టుకోలేకపోతున్నారు. జనానికి బుద్ధిలేదని విమర్శించే వ్యక్తిని చంద్రబాబునే చూస్తున్నాం. ఊసరవెల్లి లాంటి చంద్రబాబుతో రాజకీయం చేయాలంటే సమాజమే సిగ్గుపడుతోంది. వైఎస్ జగన్ ఛరిష్మా ఉన్న నాయకుడు. రెడ్ బుక్ పేరు చెబితే భయపడేవాళ్లు ఇక్కడెవరు లేరు. గోదావరి పుష్కరాల్లో ప్రజల ప్రాణాలను బలితీసుకున్న నేరస్తుడు చంద్రబాబు అని జూపుడి ప్రభాకర్ విమర్శలు గుప్పించారు
వందేళ్ల చరిత్రలో తొలిసారిగా..వైఎస్ జగన్ హయాంలో
2019లో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రూ.8 వేల కోట్లకుపైగా నిధులతో ఒకేసారి 17 వైద్య కళాశాలలు నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. విజయనగరం, ఏలూరు, రాజమహేంద్రవరం, మచిలీపట్నం, నంద్యాల వైద్య కళాశాలలను గతేడాది ప్రారంభించి అదనంగా 750 ఎంబీబీఎస్ సీట్లలో ప్రవేశాలు కల్పించింది.
1923లో ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్రా మెడికల్ కాలేజీ ఏర్పాటైంది. అప్పటి నుంచి 2023 వరకు రాష్ట్రంలో పూర్తిగా ప్రభుత్వ రంగంలో కేవలం 11 వైద్య కళాశాలలు మాత్రమే ఉండగా వందేళ్ల చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా ఒకేసారి 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీల నిర్మాణాన్ని వైఎస్ జగన్ చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment