మహిళల భద్రత పట్టించుకోరా?: కూటమి సర్కార్‌పై వరుదు కల్యాణి ఫైర్‌ | Ysrcp Mlc Varudu Kalyani Fires On Chandrababu Naidu Government | Sakshi
Sakshi News home page

మహిళల భద్రత పట్టించుకోరా?: కూటమి సర్కార్‌పై వరుదు కల్యాణి ఫైర్‌

Published Tue, Nov 19 2024 1:59 PM | Last Updated on Tue, Nov 19 2024 3:17 PM

Ysrcp Mlc Varudu Kalyani Fires On Chandrababu Naidu Government

సాక్షి, గుంటూరు: కూటమి ప్రభుత్వంలో ఉద్యోగులందరూ ఇబ్బందులు పడుతున్నారని ఎమ్మెల్సీ వరుదు కల్యాణి అన్నారు.  శాసనమండలిలో ఆమె మాట్లాడుతూ, 108, 104, ఆశా వర్కర్లు, అంగన్‌వాడీ ఉద్యోగులు ఆందోళన చేస్తున్నారని.. వారి సమస్యలన్నింటిని పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు.

ఉద్యోగుల సమస్యలపై శాసన మండలిలో ప్రభుత్వాన్ని నిలదీస్తామన్న వరుదు కల్యాణి.. నిన్న హోంమంత్రి అనిత మహిళలపై జరుగుతున్న నేరాలపై అబద్దాలు చెప్పారని మండిపడ్డారు. సాక్షాత్తు హోంమంత్రి నివాసం ఉన్న విశాఖలోనే మహిళలపై నేరాలు జరుగుతున్నాయన్నారు. ఈ రోజు విశాఖలో లా విద్యార్థిపై సామూహిక లైంగిక దాడి జరిగింది. నిన్న బాపట్లలో బాలికపై వృద్ధుడు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. హోంమంత్రి ఉన్న విశాఖలో కొద్దీ రోజుల కిందట హత్యాయత్నం చేశారు. ఈ రోజుకి హత్యాయత్నం చేసిన నిందితుడిని పట్టుకోలేదు. ఈ ప్రభుత్వం ఇసుక కోసం, మద్యం కోసం ఆలోచిస్తుంది తప్ప.. మహిళల భద్రత కోసం కనీసం పట్టించుకోవడం లేదు.’’ కల్యాణి ఆగ్రహం వ్యక్తం చేశారు.

మండలిలో మంత్రులు అబద్దాలు: ఎమ్మెల్సీ అప్పిరెడ్డి
అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఎమ్మెల్సీ అప్పిరెడ్డి మాట్లాడుతూ, మండలిలో మంత్రులు, టీడీపీ శాసన మండలి సభ్యులు అబద్ధాలు మాట్లాడుతున్నారు. రుషి కొండ భవనాలను వైఎస్‌ జగన్‌ జగన్‌ వ్యక్తిగత భవనాలుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. రుషి కొండ భవనాలకు అన్ని అనుమతులు ఉన్నాయని మంత్రే మండలిలో ప్రకటించారు. ఉప ముఖ్యమంత్రి, ఇతర మంత్రులు పరిశీలనలో కూడా అత్యుద్భుతం గా ఉన్నాయని చెప్పారు. రుషి కొండ భవనం ప్రభుత్వ భవనంగా ఉంటుందే తప్ప వైఎస్‌ జగన్‌ భవనం కాదు.

..రుషి కొండ భవనాన్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలో ప్రభుత్వం ఆలోచించాలి. 2017లో నిర్మించిన అసెంబ్లీ ఎస్‌ఎఫ్‌టీ 14000తో నిర్మించారు. కనీసం మంత్రుల రూమ్‌లో వాష్ రూమ్ కూడా లేదు.. వర్షం వస్తే కారిపోయే పరిస్థితి. అబద్దాలతో కాలక్షేపం చేయడం కాకుండా వాస్తవాలపై చర్చకు రండి.. చర్చిద్దాం’’ అంటూ అప్పిరెడ్డి సవాల్‌ విసిరారు.

మహిళలకు రక్షణ లేకుండా పోయింది.. మంత్రి వంగలపూడి అనితకు కౌంటర్..

 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement