
సాక్షి, ఆమదాలవలస: మాజీ విప్ కూన రవికుమార్ ఇంకా పరారీలోనే ఉన్నారు. ఎక్కడ ఉన్నారన్న సమాచారం మాత్రం తెలియడంలేదు. అజ్ఞాతంలోనే ఉన్నట్లు అందరూ చర్చించుకుంటున్నారు. పోలీసులు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపడుతున్నామని చెబుతున్నారు. ముందస్తు బెయిల్ కోసం హైకోర్టులో పిటిషిన్ పెట్టినట్లు తెలిసింది. ముందస్తు బెయిల్ మంజూరు అయితేనే ఆయన బయటకు వస్తారని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. శ్రీకాకుళంలో గల కూన రవికుమార్ ఇంటి వద్ద మాత్రం పోలీసులు మొహరించి ఉన్నారు. ఆయన గృహానికి టీడీపీ నాయకులు, కార్యకర్తలు పలువురు అగ్రనేతలు పరామర్శలకు వచ్చి వెళ్తున్నారు. కూన రవికుమార్‌తోపాటు మరో ముద్దాయి అంబళ్ల రాంబాబు కూడా పరారీలో ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment