మాఫియా చేతిలో దెబ్బలు తిన్న వ్యక్తి అరెస్టు మీద అరెస్టు
వేధింపులు భరించలేక టీడీపీ సభ్యత్వం తీసుకున్న బాధితుడు
అయినా వదలని రాష్ట్ర ప్రభుత్వం
తమ దందాకు అడ్డొస్తే ఎవరినీ వదలబోమని ఆ పార్టీ సంకేతాలు
శ్రీకాకుళం జిల్లాలో ఇసుక మాఫియా బరితెగింపు
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: రాష్ట్రంలో ఇసుక మాఫియా ఆగడాలకు అంతులేకుండా పోతోంది. అడ్డొస్తే ఎంతకైనా తెగిస్తున్నారనడానికి శ్రీకాకుళంలో తాజాగా చోటుచేసుకున్న ఘటనే ఉదాహరణ. నగరం నడిబొడ్డున ఈనెల 16న టీడీపీ నాయకుల దాడిలో ఆమదాలవలస నియోజకవర్గానికి చెందిన సనపల సురేష్ తీవ్రంగా గాయపడ్డారు. దాడి చేసిన వారిని అరెస్టు చేయలేదుగానీ సురేష్‌ను మాత్రం అరెస్టు మీద అరెస్టు చేస్తున్నారు.
దాడికి తెగబడడమే కాక.. టీడీపీ అతనిపై ఎదురు కేసు పెట్టి శనివారం అరెస్టు చేయించింది. అలాగే, వారం రోజుల క్రితం ఓ పాత కేసులోనూ అరెస్టుచేశారు. దీంతో ఆ పార్టీ నేతల వేధింపులు భరించలేక సురేష్ టీడీపీ సభ్యత్వం తీసుకున్నా పచ్చమూకలు వదిలిపెట్టలేదు. పైగా.. ఇసుక దోపిడీకి అడ్డుతగిలితే ఎవరికైనా ఇదేగతి అని ఆ పార్టీ సంకేతాలిచ్చింది.
అసలేం జరిగిందంటే..
జిల్లాలోని ఆమదాలవలస మండలం దూసి గ్రామం ఎస్సీ కాలనీ సమీపంలోని నాగావళి నదిలో ఇసుక అక్రమార్కులు ఇసుక తవ్వి బావాజీపేట రబ్బర్ తయారీ ఇండస్ట్రియల్ యార్డులో నిల్వచేసి ఉంచారు. ఇది చూసి బూర్జ మండలం గుత్తావెల్లికి చెందిన సనపల సురేష్ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఆమదాలవలస టీడీపీ ఎమ్మెల్యే కూన రవి అనుచరుడైన తొగరాం వాసి రవికాంత్ నేతృత్వంలోనే ఈ తంతు జరుగుతున్నట్లు శ్రీకాకుళం తహసీల్దారు గణపతి కూడా తేల్చారు.
ఈ నేపథ్యంలో.. ఈనెల 16న ఇసుక నిల్వలను మీడియాకు చూపించడానికి సురేష్ వెళ్తుండగా ఆయనపై కొందరు దాడికి యత్నించారు. అక్కడి నుంచి సురేష్ తప్పించుకుని వస్తుంటే.. శ్రీకాకుళంలోని బలగ మెట్టు కూడలి వద్ద మళ్లీ అటకాయించి ఆయనను కారు నుంచి బయటకు లాగి మరీ దాడిచేశారు. సురేష్‌తో పాటు వచ్చిన చంద్రరావు అనే వ్యక్తిపైనా దాడిచేశారు. అంతకుముందు.. సెప్టెంబరు 27న కూడా కాఖండ్యాం ఇసుక ర్యాంపులో అక్రమాలను అడ్డుకున్నారని నారాయణపురం వద్ద సురేష్ కారును అడ్డగించి దాడిచేశారు.
డీఎస్పీ వద్ద విచారణకని పిలిచి అరెస్టు..
ఇసుక మాఫియాకు కొరకరాని కొయ్యగా తయారైన సురేష్‌ను శ్రీకాకుళంలో తనపై దాడి ఘటనకు సంబంధించి విచారణకని పోలీసులు పిలిచారు. టూటౌన్ పోలీసుస్టేషన్‌కు సురేష్ వచ్చారు. విచారణ పూర్తయ్యాక స్టేషన్ నుంచి బయటికి రాగానే రూరల్ పోలీసులొచ్చి అరెస్టుచేశారు. ఈనెల 16న జరిగిన ఘటనలో కారుతో గుద్దేసి ఇద్దరి ప్రమాదానికి కారణమయ్యాడనే కేసు కింద అరెస్టుచేసినట్లు ఎస్‌ఐ కె. రాము తెలిపారు.
కక్షపూరితంగా అరెస్టు చేశారు..
పోలీసులు నా భర్తను కక్షపూరితంగా అరెస్టుచేశారు. విచారణకని పిలిచి అరెస్టుచేశారు. ఈనెల 25వ తేదీ సాయంత్రం రెండో పట్టణ పోలీసులు ఫోన్ చేశారు. 26న డీఎస్పీ విచారణ ఉందని రమ్మన్నారు. దీంతో శనివారం మధ్యాహ్నం 12.30కు రెండో పట్టణ పోలీస్‌స్టేషన్‌కు సురేష్‌తో కలిసి వెళ్లాం. అక్కడ స్టేట్‌మెంట్ రాసుకుంటామని చెప్పి సాకు‡్ష్యలు ఎవరైనా ఉన్నారా అని అడిగారు. అక్కడే వందలాది మంది చూశారని చెప్పాం. సరే.. మీరు వెళ్లిపోండని సీఐ అనగానే బయటకు వచ్చేశాం. ఇంతలో రూరల్ ఎస్‌ఐ కె. రాము తమ సిబ్బందితో కలిసి నా భర్తను జీపులో ఎక్కించుకుని తీసుకుపోయారు.
– మౌనిక , సనపల సురేష్ భార్య
కక్షపూరితంగానే అరెస్టు..
పోలీసులు నా భర్తను కక్షపూరితంగా అరెస్టు చేశారు. విచారణకని పిలిచి అరెస్టుచేశారు. ఈనెల 25వ తేదీ సాయంత్రం రెండో పట్టణ పోలీసులు ఫోన్ చేశారు. 26న డీఎస్పీ విచారణ ఉందని రమ్మన్నారు. దీంతో శనివారం మ«ధ్యాహ్నం 12.30కు రెండో పట్టణ పోలీస్‌స్టేషన్‌కు సురేష్‌తో కలిసి వెళ్లాం. అక్కడ స్టేట్‌మెంట్ రాసుకుంటామని చెప్పి సాక్షులు ఎవరైనా ఉన్నారా అని అడిగారు. అక్కడే వందలాది మంది చూశారని చెప్పాం. సరే.. మీరు వెళ్లిపోండని సీఐ అనగానే బయటకు వచ్చేశాం. ఇంతలో రూరల్ ఎస్‌ఐ కె. రాము తమ సిబ్బందితో కలిసి నా భర్తను జీపులో ఎక్కించుకుని తీసుకుపోయారు.
– మౌనిక, సనపల సురేష్ భార్య
Comments
Please login to add a commentAdd a comment