sandmafia
-
ఇసుక దందాను అడ్డుకుంటే అంతే..
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: రాష్ట్రంలో ఇసుక మాఫియా ఆగడాలకు అంతులేకుండా పోతోంది. అడ్డొస్తే ఎంతకైనా తెగిస్తున్నారనడానికి శ్రీకాకుళంలో తాజాగా చోటుచేసుకున్న ఘటనే ఉదాహరణ. నగరం నడిబొడ్డున ఈనెల 16న టీడీపీ నాయకుల దాడిలో ఆమదాలవలస నియోజకవర్గానికి చెందిన సనపల సురేష్ తీవ్రంగా గాయపడ్డారు. దాడి చేసిన వారిని అరెస్టు చేయలేదుగానీ సురేష్‌ను మాత్రం అరెస్టు మీద అరెస్టు చేస్తున్నారు. దాడికి తెగబడడమే కాక.. టీడీపీ అతనిపై ఎదురు కేసు పెట్టి శనివారం అరెస్టు చేయించింది. అలాగే, వారం రోజుల క్రితం ఓ పాత కేసులోనూ అరెస్టుచేశారు. దీంతో ఆ పార్టీ నేతల వేధింపులు భరించలేక సురేష్ టీడీపీ సభ్యత్వం తీసుకున్నా పచ్చమూకలు వదిలిపెట్టలేదు. పైగా.. ఇసుక దోపిడీకి అడ్డుతగిలితే ఎవరికైనా ఇదేగతి అని ఆ పార్టీ సంకేతాలిచ్చింది. అసలేం జరిగిందంటే.. జిల్లాలోని ఆమదాలవలస మండలం దూసి గ్రామం ఎస్సీ కాలనీ సమీపంలోని నాగావళి నదిలో ఇసుక అక్రమార్కులు ఇసుక తవ్వి బావాజీపేట రబ్బర్ తయారీ ఇండస్ట్రియల్ యార్డులో నిల్వచేసి ఉంచారు. ఇది చూసి బూర్జ మండలం గుత్తావెల్లికి చెందిన సనపల సురేష్ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఆమదాలవలస టీడీపీ ఎమ్మెల్యే కూన రవి అనుచరుడైన తొగరాం వాసి రవికాంత్ నేతృత్వంలోనే ఈ తంతు జరుగుతున్నట్లు శ్రీకాకుళం తహసీల్దారు గణపతి కూడా తేల్చారు. ఈ నేపథ్యంలో.. ఈనెల 16న ఇసుక నిల్వలను మీడియాకు చూపించడానికి సురేష్ వెళ్తుండగా ఆయనపై కొందరు దాడికి యత్నించారు. అక్కడి నుంచి సురేష్ తప్పించుకుని వస్తుంటే.. శ్రీకాకుళంలోని బలగ మెట్టు కూడలి వద్ద మళ్లీ అటకాయించి ఆయనను కారు నుంచి బయటకు లాగి మరీ దాడిచేశారు. సురేష్‌తో పాటు వచ్చిన చంద్రరావు అనే వ్యక్తిపైనా దాడిచేశారు. అంతకుముందు.. సెప్టెంబరు 27న కూడా కాఖండ్యాం ఇసుక ర్యాంపులో అక్రమాలను అడ్డుకున్నారని నారాయణపురం వద్ద సురేష్ కారును అడ్డగించి దాడిచేశారు. డీఎస్పీ వద్ద విచారణకని పిలిచి అరెస్టు..ఇసుక మాఫియాకు కొరకరాని కొయ్యగా తయారైన సురేష్‌ను శ్రీకాకుళంలో తనపై దాడి ఘటనకు సంబంధించి విచారణకని పోలీసులు పిలిచారు. టూటౌన్ పోలీసుస్టేషన్‌కు సురేష్ వచ్చారు. విచారణ పూర్తయ్యాక స్టేషన్ నుంచి బయటికి రాగానే రూరల్ పోలీసులొచ్చి అరెస్టుచేశారు. ఈనెల 16న జరిగిన ఘటనలో కారుతో గుద్దేసి ఇద్దరి ప్రమాదానికి కారణమయ్యాడనే కేసు కింద అరెస్టుచేసినట్లు ఎస్ఐ కె. రాము తెలిపారు.కక్షపూరితంగా అరెస్టు చేశారు..పోలీసులు నా భర్తను కక్షపూరితంగా అరెస్టుచేశారు. విచారణకని పిలిచి అరెస్టుచేశారు. ఈనెల 25వ తేదీ సాయంత్రం రెండో పట్టణ పోలీసులు ఫోన్ చేశారు. 26న డీఎస్పీ విచారణ ఉందని రమ్మన్నారు. దీంతో శనివారం మధ్యాహ్నం 12.30కు రెండో పట్టణ పోలీస్‌స్టేషన్‌కు సురేష్‌తో కలిసి వెళ్లాం. అక్కడ స్టేట్మెంట్ రాసుకుంటామని చెప్పి సాకు‡్ష్యలు ఎవరైనా ఉన్నారా అని అడిగారు. అక్కడే వందలాది మంది చూశారని చెప్పాం. సరే.. మీరు వెళ్లిపోండని సీఐ అనగానే బయటకు వచ్చేశాం. ఇంతలో రూరల్ ఎస్ఐ కె. రాము తమ సిబ్బందితో కలిసి నా భర్తను జీపులో ఎక్కించుకుని తీసుకుపోయారు. – మౌనిక , సనపల సురేష్ భార్య కక్షపూరితంగానే అరెస్టు.. పోలీసులు నా భర్తను కక్షపూరితంగా అరెస్టు చేశారు. విచారణకని పిలిచి అరెస్టుచేశారు. ఈనెల 25వ తేదీ సాయంత్రం రెండో పట్టణ పోలీసులు ఫోన్ చేశారు. 26న డీఎస్పీ విచారణ ఉందని రమ్మన్నారు. దీంతో శనివారం మ«ధ్యాహ్నం 12.30కు రెండో పట్టణ పోలీస్‌స్టేషన్‌కు సురేష్‌తో కలిసి వెళ్లాం. అక్కడ స్టేట్మెంట్ రాసుకుంటామని చెప్పి సాక్షులు ఎవరైనా ఉన్నారా అని అడిగారు. అక్కడే వందలాది మంది చూశారని చెప్పాం. సరే.. మీరు వెళ్లిపోండని సీఐ అనగానే బయటకు వచ్చేశాం. ఇంతలో రూరల్ ఎస్ఐ కె. రాము తమ సిబ్బందితో కలిసి నా భర్తను జీపులో ఎక్కించుకుని తీసుకుపోయారు. – మౌనిక, సనపల సురేష్ భార్య -
పశ్చిమ గోదావరి జిల్లాలో విచ్చల విడిగా ఇసుక దందా
-
జగ్గయ్యపేటలో పేట్రేగిపోతున్న ఇసుకమాఫియా
-
మంత్రి ఉమ కనుసన్నలలోనే ఇసుక మాఫియా
భవానీపురం (విజయవాడ పశ్చిమ): మంత్రి దేవినేని ఉమా అండదండలతోనే అండదండలతోనే ఇసుక మాఫియా హల్చల్ చేస్తోందని ది విజయవాడ అర్బన్ శాండ్ లారీ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు అల్లు నాగరాజు, మోతుకూరి రామకృష్ణ అన్నారు. భవానీపురంలోని అసోసియేషన్ ఆఫీస్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ఇసుక రీచ్‌లన్నీ ఆయన నియోజకవర్గంలో ఉన్నందున ఇసుక అక్రమ రవాణా ఆయన కనుసన్నలలోనే జరుగుతోందని, టిప్పర్ యజమానులు ఇసుక ధరను పెంచేశారని దుష్ప్రచారం చేయడం తగదని హితవు పలికారు. ఈ నెల 15వ తేదీన నారెడ్కో విజయవాడ చాప్టర్ అధ్యక్షుడు వి.సుబ్బారావు తాము ఇసుక ధరలను అమాంతం పెంచేశామని చెప్పటాన్ని వారు ఖండించారు. నిన్న మొన్నటి వరకు టిప్పర్ ఇసుక రూ.2 వేలకే అందించామని గుర్తు చేశారు. గొల్లపూడి పరిధిలోని సూరాయిపాలెం ఇసుక రీచ్‌ను ఆధిపత్య పోరుతో వారం రోజులుగా మూసేశారని, దీంతో ఇసుక సరఫరాలో తీవ్ర అంతరాయం ఏర్పడిందని చెప్పారు. ఇక గుంటుçపల్లి రీచ్‌లో ప్రయార్టీ బళ్లు పేరుతో వారి టిప్పర్లకే ప్రాధాన్యతనిస్తున్నారని, తమలాంటి లారీ యజమానులు ఆ రీచ్‌లో ఉదయం బండి పెడితే సాయంత్రానికి ఒక లోడు వస్తుందని, అదికూడా గ్యారెంటీ లేదని వివరించారు. పెర్రి రీచ్లోకూడా ఇదే పరిస్ధితి నెలకొందని తెలిపారు. ఈ క్రమంలో ఇప్పుడు దూరా న్ని బట్టి రూ.2 వేల నుంచి రూ.3 వేలకు అమ్ముతున్నామని, అందులో రీచ్‌లో చెల్లించాల్సిన రూ.800లు, డ్రైవర్ బేటా, డీజిల్ ఖర్చులు పోను రూ.500లు మిగలటం కష్టంగా ఉందన్నారు. సుబ్బారావు చెప్పినట్లు ఎవరైనా రూ.6వేలకు అమ్మితే ఆయన ఫిర్యాదు చేయవచ్చని, అమ్ముతున్న వ్యక్తి పేరు, లారీ నెంబర్ తమకు తెలియపరిస్తే తామే పోలీసులకు అప్పగిస్తామన్నారు. తలపట్టుకున్నాం... సూరాయిపాలెం రీచ్‌లో జరుగుతున్న ఆధిపత్య పోరుపై ఆయనే ఏమీచేయలేక తలపట్టుకున్నట్ల తెలుస్తుందన్నారు. సూరాయపాలెం, గుంటుపల్లి ఇసుక రీచ్‌లలో జరుగుతున్న దందాపై ఫిర్యాదు చేసేందుకు 1100, 104 నెంబర్లకు ఫోన్‌చేస్తే ఎత్తి ఆ పేర్లు వినగానే పెట్టేస్తున్నారని తెలిపారు. గతంలో భవానీపురంలో ఇసుక రీచ్ ఉన్నప్పుడు లారీ ఇసుక రూ.15 నుంచి రూ.18వేలకే అమ్మామని గుర్తు చేశారు. ఇప్పటికీ భవానీపురంలో రీచ్‌ను తెరిచే అవకాశం ఉన్నా గొల్లపూడిలోని మంత్రి ఉమా అనుయాయులు ఒప్పుకోకపోవడంతో అధికారులు వెనకడుగు వేస్తున్నారని చెప్పారు. ఏడాది క్రితం అప్పటి సబ్ కలెక్టర్ తమకు రోజుకు నాలుగు ట్రిప్పులు ఇప్పిస్తామని హామీ ఇచ్చినా అది అమలు కావడం లేదని చెప్పారు. ఇసుక ఎక్కువ ధరలకు అమ్మి పేద, మధ్య తరగతి ప్రజలను ఇబ్బంది పెట్టడం తమ ఉద్దేశం కాదని, రీచ్‌ల నుంచి స్రక్రమంగా అందితే తక్కువ ధరకే విక్రయిస్తామని స్పష్టం చేశారు. సమావేశంలో అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు వడ్లమూడి వెంకటేశ్వరరావు, కె.లక్ష్మీనారాయణ, ఎమ్.చినవెంగయ్య తదితరులు పాల్గొన్నారు. -
ఇసుక మాఫియాపై అతివ పోరుకు నజరానా
రూ. 5 లక్షల రివార్డు ప్రకటించిన ‘వీ-గార్డ’ అధినేత కేరళలో ఇసుక మాఫియాపై ఓ మహిళ సడలని పట్టుదలతో ఒంటరిగా పోరాడుతోంది. అక్రమ వ్యాపారులు తమ రాజకీయ పలుకుబడితో ఆమె నోరు మూయించేందుకు ప్రయత్నించినా తల వంచలేదు. ఆమె సాహసాన్ని అభినందించిన కేరళ పారిశ్రామికవేత్త రూ.5 లక్షల రివార్డు ప్రకటించారు. కన్నూర్‌లోని పుథియువన్గాడికి చెందిన జజీరా(31) తమ ఊరిలో ఇసుక దందాపై ఎలుగెత్తింది. కన్నూరు, తిరువనంతపురంలో నిరసన ప్రదర్శనలు నిర్వహించి ఫిర్యాదు చేసింది. కేరళ సచివాలయం ఎదుట ఉద్యమించింది. అయితే అక్రమ వ్యాపారులు తమ పలుకుబడితో దీన్ని అణచివేసేందుకు ప్రయత్నించటంతో వేదికను దేశ రాజధానికి మార్చింది. ముగ్గురు చిన్న పిల్లలున్నా ధైర్యంగా ఢిల్లీ నుంచే పోరాడింది. వణికించే చలి సైతం ఆమె పట్టుదల ముందు తలవంచింది. తన ఊరిలో ఇసుక దందాను అరికడతామని ప్రభుత్వం ప్రకటించేవరకూ కేరళ హౌస్ ఎదుట పోరాటం కొనసాగిస్తానని ప్రకటించింది. జజీరాకు కేరళ పారిశ్రామికవేత్త, వీ-గార్డ్ ఇండస్ట్రీస్ వ్యవస్థాపక చైర్మన్, ఎండీ కోచుసెఫ్ చిట్టిలాపిళ్లై రూ.5 లక్షల రివార్డు ప్రకటించారు.