రాజీనామాకు సిద్ధం.. నాపై పోటీ చేసి గెలవగలరా..? | Sidiri Appalaraju Fires On TDP Leaders | Sakshi
Sakshi News home page

రాజధాని కోసం రాజీనామాకు సిద్ధం..

Published Mon, Oct 5 2020 7:59 AM | Last Updated on Mon, Oct 5 2020 1:05 PM

Sidiri Appalaraju Fires On TDP Leaders - Sakshi

మీడియా సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి డాక్టర్‌ సీదిరి అప్పలరాజు 

సాక్షి, శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): విశాఖ రాజధాని కోసం రాజీనామా చేయడానికి సిద్ధమని, తనపై పోటీ చేసి గెలవగలరా అని మత్స్య, పశు సంవర్ధక శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు టీడీపీ నాయకులకు సవాల్‌ విసిరారు. మంచికి బ్రాండ్‌ అంబాసిడర్‌ అయిన ధర్మాన కృష్ణదాస్‌ మాటలను వక్రీకరించడం సరికాదని హితవు పలికారు. శ్రీకాకుళంలోని వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో ఆయన ఆదివారం విలేకరులతో మాట్లాడారు. దాసన్న తన సొంత నియోజకవర్గంలో తన మనుషులతో మాట్లాడిన సంభాషణను ఎల్లో మీడియా వక్రీకరించి బూతులు మాట్లాడినట్లు చిత్రీకరించడం సరికాదన్నారు. టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు మంత్రిగా ఉన్నప్పుడు టెక్కలి నియోజకవర్గంలో ఓ మహిళతో ‘మా ప్రభుత్వం ఇచ్చిన పదివేలు తీసుకుని ఓటేయ్యవా.. అని అది నీ అమ్మ మొగుడు సొమ్మా’ అని అసభ్యకర పదజాలంతో మాట్లాడిన సంగతి అందరికీ గుర్తుందని అన్నారు. అదే పార్టీ కి చెందిన కూన రవికుమార్‌ ఫోన్‌ సంభాషణలు అందరికీ తెలుసని చురకలు అంటించారు.  

ఎవరైతే బాగా బూతులు మాట్లాడగలరో, వీధి రౌడీల్లా ప్రవర్తించగలరో అలాంటి వారిని చంద్రబాబు గుర్తించి అధ్యక్ష పదవులు కట్టబెడుతున్నారంటే ఆ పార్టీ తీరు అర్థమవుతోందని వ్యాఖ్యానించారు.  దాసన్న రాజకీయ చరిత్రలో ఎక్కడా కాంట్రవర్సీ లేదన్నారు. ఏడాదిన్నర కాలంలోనే డిప్యూటీ సీఎంగా, మంత్రిగా ఆయన తన మార్క్‌ చూపించారని తెలిపారు. భావనపాడు పోర్టు, ఉద్దానం ప్రజలకు రూ.700 కోట్లతో మంచినీటి ప్రాజెక్టు, కిడ్నీ బాధితులకు ఆస్పత్రి, నేరడి బ్యారేజీ నిర్మాణం వంటి అనేక కార్యక్రమాలతో జిల్లా అభివృద్ధికి కృషి చేస్తున్నారని చెప్పారు. అమరావతిలో రియల్‌ వ్యాపారులు పెయిడ్‌ ఆర్టిస్టులతో డ్రామాలు చేయిస్తున్నారని తీవ్రంగా విమర్శించారు. కరోనా కాలంలో కనిపించని ఎంపీ రామ్మోహన్‌నాయుడు స్టేషన్‌ వద్దకు దౌర్జన్యం చేసేందుకు రావడం విడ్డూరంగా ఉందన్నారు. 

దాసన్న అందరి కుటుంబ సభ్యుడు.. 
అనంతరం ఎచ్చెర్ల ఎమ్మెల్యే గొర్లె కిరణ్‌కుమార్‌ మాట్లాడారు. రాజధాని విషయంలో డిబేట్‌ జరిగినప్పుడు విశాఖలో రాజధాని కావాలనుకుంటున్నారా లేదా అని టీడీపీ నేతలను ప్రశ్నిస్తే కిక్కుమని సౌండ్‌ లేదన్నారు. కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో పోలీస్‌ స్టేషన్‌ వద్ద క్రమశిక్షణ లేకుండా ప్రవర్తించడం వారి రౌడీయిజానికి నిదర్శనమన్నా రు. దాసన్న అందరికీ ఓ కుటుంబ సభ్యుడితో సమానమని, ఆయన నీతి నిజాయితీలను గుర్తించే సీఎం ఆయనకు డిప్యూటీ సీఎం, మంత్రి వంటి ఉన్నత పదవులు కట్టబెట్టారన్నారు.   (క్షమాపణ చెప్పిన కబ్జా సబ్బం)

అభివృద్ధి ఓర్వలేకే.. 
రాజాం ఎమ్మెల్యే కంబాల జోగులు మాట్లాడుతూ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్‌ నిబద్ధత, క్రమశిక్షణ గల వ్యక్తి అని ఆయన నోట ఎప్పుడూ తప్పుడు మాటలు రావని అన్నా రు. కూన రవి, అచ్చెన్నాయుడుల అవినీతి అక్రమాలు గుట్టలుగుట్టలుగా ఉన్నాయన్నారు. ఎస్సీ, ఎస్టీలకు హోం శాఖ, డిప్యూటీ సీఎం, విప్‌ వంటి పదవులు ఇచ్చింది సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ఒక్కరేనన్నారు. అనంతరం ఎమ్మెల్యే విశ్వాసరాయి కళావతి మాట్లాడుతూ ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్‌పై బురద జల్లే ప్రయత్నం మానుకోవాలని హిత వు పలికారు. జిల్లాలో ప్రస్తుతం జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేని తనంతో అవాకులు చెవాకులు మాట్లాడుతున్నారని విమర్శించారు. 

మీడియా సమావేశంలో పాల్గొన్న మంత్రి సీదిరి, ఎమ్మెల్యేలు గొర్లె కిరణ్‌కుమార్, కంబాల జోగులు, విశ్వాసరాయి  కళావతి పార్టీ నేతలు పిరియా సాయిరాజ్, విక్రాంత్, దువ్వాడ శ్రీనివాస్, అంధవరపు సూరిబాబు తదితరులు  
వారికి ఆ స్థాయి లేదు.. 
వైఎస్సార్‌ సీపీ టెక్కలి నియోజకవర్గ ఇన్‌చార్జి దువ్వాడ శ్రీనివాస్‌ మాట్లాడుతూ మునిగిపోయిన నావకు డ్రైవర్‌ పదవి ఇచ్చినట్లు కాలం చెల్లిన పారీ్టలో అచ్చెన్నాయుడు, కూన రవికుమార్‌లు అధ్యక్షులుగా ఎంపికయ్యారని చమత్కరించా రు. డిప్యూటీ సీఎం దాసన్నపై విమర్శలు చేసే స్థాయి వారికి లేదన్నారు. ఈఎస్‌ఐ స్కామ్‌లో అడ్డంగా దొరికి జైలుకు వెళ్లి వచ్చిన అచ్చెన్నాయడు, ఇసుక దందా చేసుకుని, వీధి రౌడీ లా వ్యవహరించే కూన రవికుమార్‌లు దాసన్నపై ఫిర్యాదు చేయడం హాస్యాస్పదమన్నారు. డీసీఎంఎస్‌ చైర్మన్‌ పిరియా సాయిరాజ్, డీసీసీబీ చైర్మ న్‌ పాలవలస విక్రాంత్‌లు మాట్లాడుతూ దాసన్న పార్టీలో చేరినప్పటి నుంచి ఇప్పటివరకు మచ్చలేని నాయకుడిగా పేరు సంపాదించారని అన్నారు. అలాంటి వ్యక్తిపై దు్రష్పచారం చేయడం తగదన్నారు.  (విశోక సంద్రం.. నగరం మదిలో ద్రోణం'రాజే')

విశాఖలో రాజధాని వద్దంటూ కృష్ణదాస్‌పై చంద్రబాబు పోటీ చేసి గెలవగలరా అని సవాల్‌ విసిరారు. పార్టీ నేత అంధవరపు సూరిబాబు మా ట్లాడుతూ సీఎం వైఎస్‌ జగన్‌ ఆదర్శవంతమైన పాలన కొనసాగిస్తున్నారని, ఆయన ఆశయాలను డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్‌ ముందుకు తీసుకెళ్తున్నారని అన్నారు. అలాంటి నేతపై అభాండాలు వేయడం తగదన్నారు. స మావేశంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు మామిడి శ్రీకాంత్, ఎంవీ స్వరూప్, ఎన్ని ధనుంజయరావు, పొన్నాడ రుషి, హనుమంతు కిరణ్‌కుమార్, చింతాడ రవికుమార్, తంగుడు నాగేశ్వరరావు పాల్గొన్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement