అసెంబ్లీ సాక్షిగా బీసీ సబ్‌ప్లాన్ బిల్లు డ్రామా బట్టబయలు అయింది. నిధులు ఎంతిస్తారో చెప్పకుండా బీసీ సబ్‌ప్లాన్ బిల్లును ప్రభుత్వం రూపొందించింది. బీసీ సబ్‌ప్లాన్‌పై అసెంబ్లీలో ప్రభుత్వ విప్ కూన రవి కుమార్ అడిగిన ప్రశ్నకు మంత్రి అచ్చెన్నాయుడు సమాధానం చెప్పలేకపోయారు. బీసీ సబ్‌ప్లాన్ బిల్లుపై ఏపీ అసెంబ్లీలో చర్చ జరిగింది. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ కూన రవికుమార్.. బీసీ సబ్‌ప్లాన్ బిల్లుపై అభ్యంతరాలు వ్యక్తం చేశారు. సబ్‌ప్లాన్‌లోని నిధులు జనాభా ప్రాతిపదికన ఇస్తారా?, రిజర్వేషన్ ప్రకారం ఇస్తారా? అని విప్ కూన ప్రశ్నించారు.