
శ్రీకాకుళం: ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్‌కు(Kuna Ravikumar) మంగళవారం ఓ వింత అనుభవం ఎదురైంది. ఆయన పార్టీ క్యాడర్‌తో మాట్లాడుతుండగా.. ఓ ఫోన్‌కాల్(Phone call) వచ్చింది. లిఫ్ట్ చేసి చూస్తే అవతలి వారు ‘ఏపీలో చంద్రబాబు(Chandrababu) పాలన ఎలా ఉంది.. ఆమదాలవలస ఎమ్మెల్యే పాలన ఎలా ఉంది..?’ అని ప్రశ్నలు అడిగారు. దీంతో ఆయన అందరి ముందు స్పీకర్‌లో మాట్లాడారు. ‘ఆమదాలవలస ఎమ్మెల్యే మంచివారేనా’ అని అడిగిన ప్రశ్నకు ఆయన మంచివారు కాదని సమాధానం చెప్పారు. ‘మీకు పెళ్లయ్యిందా..? వయసు ఎంత..?’ అని అడిగిన ప్రశ్నలకు సరదాగా సమాధానాలు చెప్పి ఆటపట్టించారు. ఈ తంతును అక్కడున్న వారు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. టీడీపీ పాలన ఎలా ఉంది అని ఎమ్మెల్యేనే ప్రశ్నించడం అందరికీ విచిత్రంగా అనిపించింది.

Comments
Please login to add a commentAdd a comment