amudalavalasa
-
చంద్రబాబు పాలనపై ‘కూన రవికుమార్’కు ఫోన్
శ్రీకాకుళం: ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్‌కు(Kuna Ravikumar) మంగళవారం ఓ వింత అనుభవం ఎదురైంది. ఆయన పార్టీ క్యాడర్‌తో మాట్లాడుతుండగా.. ఓ ఫోన్‌కాల్(Phone call) వచ్చింది. లిఫ్ట్ చేసి చూస్తే అవతలి వారు ‘ఏపీలో చంద్రబాబు(Chandrababu) పాలన ఎలా ఉంది.. ఆమదాలవలస ఎమ్మెల్యే పాలన ఎలా ఉంది..?’ అని ప్రశ్నలు అడిగారు. దీంతో ఆయన అందరి ముందు స్పీకర్లో మాట్లాడారు. ‘ఆమదాలవలస ఎమ్మెల్యే మంచివారేనా’ అని అడిగిన ప్రశ్నకు ఆయన మంచివారు కాదని సమాధానం చెప్పారు. ‘మీకు పెళ్లయ్యిందా..? వయసు ఎంత..?’ అని అడిగిన ప్రశ్నలకు సరదాగా సమాధానాలు చెప్పి ఆటపట్టించారు. ఈ తంతును అక్కడున్న వారు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. టీడీపీ పాలన ఎలా ఉంది అని ఎమ్మెల్యేనే ప్రశ్నించడం అందరికీ విచిత్రంగా అనిపించింది. -
టీడీపీ కార్యకర్త అరాచకం.. కూల్‌డ్రింక్స్‌లో మత్తుమందు కలిపి లైంగిక దాడి
సాక్షి, ఆమదాలవలస: ఏపీలో కూటమి సర్కార్ ఏర్పడిన నాటి నుంచి పచ్చ టీడీపీ నేతలు, కార్యకర్తలు రెచ్చిపోతున్నారు. వారే అధికారంలో ఉన్నారనే కారణంగా పలు అఘాయిత్యాలు, నేరాలకు పాల్పడుతున్నారు. తాజాగా శ్రీకాకుళం జిల్లాలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. టీడీపీ కార్యకర్త ఒకరు కూల్‌డ్రింక్స్‌లో మత్తుమందు కలిపి బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. దీంతో, ఆమె గర్భవతి కాగా.. బెదిరింపులకు దిగాడు.టీడీపీ కార్యకర్త ప్రేమ పేరుతో బాలికను గర్భవతిని చేసిన ఘటన శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలసలో జరిగింది. ఈ దారుణ ఘటనపై ఎస్ఐ బాలరాజు తెలిపిన వివరాలు.. కోటిపల్లి రాజు అనే యువకుడు 9వ తరగతి విద్యార్థినికి మాయమాటలు చెప్పి ప్రేమ పేరుతో మోసం చేశాడు. బాలిక గర్భిణి అని తేలడంతో బాధితురాలి తల్లి ఆదివారం ఆమదాలవలస పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు యువకుడిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు.అయితే, తల్లిదండ్రులు బయటకు వెళ్లిన సమయంలో బాలికకు మత్తుమందు కలిపిన కూల్‌డ్రింక్ ఇచ్చి లైంగిక దాడికి పాల్పడ్డాడని, ఈ విషయాన్ని ఎవరికీ చెప్పొద్దంటూ బాలికను బెదిరించినట్టు సమాచారం. ఈ విషయమై యువకుడిని ప్రశ్నించగా తాను టీడీపీ కార్యకర్తనని, తనకు పార్టీ నేతల అండదండలున్నాయంటూ బెదిరిస్తున్నాడని బాలిక తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. -
శ్రీకాకుళంలో సామాజిక సాధికార యాత్ర
-
చారిత్రక సంపదకు రక్షణ కరువు... పొలంగా మారిన దంతపురి కోటగట్టు
సరుబుజ్జిలి: పురావస్తుశాఖ పరిధిలోని చారిత్రక సంపదకు రక్షణ లేకుండాపోతోంది. సరుబుజ్జిలి మండలం రొట్టవలస గ్రామ దంతపురి కోటగట్టుపై అక్రమ తవ్వకాలు యథేచ్ఛ సాగుతున్నాయి. కోటకు రక్షణగా నలుదిశలా విస్తరించి ఉన్న గట్టును ఇష్టారాజ్యంగా తవ్వేస్తూ ఆనవాళ్లు లేకుండా చేస్తున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొందరు ఏకంగా యంత్రాలు పెట్టి గట్టును తవ్వకం చేసి మట్టిని తరలించుకుపోతున్నారని చెబుతున్నారు. మరికొంతమంది గట్టును తవ్వేసి పొలాలుగా మార్చి వాటిపై పంటలు పండిస్తున్నారు. వీటిని నియంత్రించాల్సిన అధికార యంత్రాంగం పట్టించుకోకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఘన చరిత్ర.. శ్రీకాకుళం రోడ్(ఆమదాలవలస) రైల్వేస్టేషన్ నుంచి సుమారు 8 కిలోమీటర్లు దూరంలో రొట్టవలస, కొండవలస, పెద్దపాలెం, పాలవలస, రావివలస గ్రామాల మధ్య విస్తరించిన చారిత్రక స్థలం దంతపురి. క్రీ.పూ 261లో అశోకచక్రవర్తి జరిపిన కళింగ యుద్ధ తర్వాత ఈ క్షేత్రం ప్రాచుర్యంలోకి వచ్చింది. చేది వంశానికి రాజైన కళింగ ఖారవేలుని కాలంలో ప్రాముఖ్యత సంతరించుకుంది. కళింగరాజుల రాజధానిగా దంతపురికి విశిష్ట స్థానం ఉంది. శ్రీలంకకు చెందిన మహావంశం అనే బౌద్ధ గ్రంధంలో జంబూద్వీపానికి సప్తనగరాల్లో దంతపురి ప్రముఖమైనదిగా పేర్కొన్నారు. సింహబాహు అనే రాజు సింహపురం పట్టణాన్ని నిర్మించి బుద్ధుని జ్ఞానదంతంపై స్థూపాన్ని నిర్మించడం వల్ల దంతపురిగా వెలసినట్లు ఆధారాలు చెబుతున్నాయి. చారిత్రక ఆనవాళ్లు.. రాష్ట్ర పురావస్తు శాఖవ ఆధ్వర్యంలో 30 ఏళ్ల క్రితం చేపట్టిన తవ్వకాల్లో దంతపురి ఆనవాళ్లు బయటపడ్డాయి. ఇక్కడి కోటలో 30 అడుగుల ఎత్తయిన ప్రాకారాలు, కోటకు నలుదిక్కులా ద్వారాలు ఉండేవని గుర్తించారు. అప్పట్లో మూడు స్థూపాలు, గుర్తుపట్టలేని పాతతరం విగ్రహాలు, స్నానపు గదులు, నీటిని నిల్వ చేసే జార్లు, ఫ్లవర్ వాజులు, వంటపాత్రలు, దీపాలు, భోజనపు గిన్నెలు, రాతిరుబ్బురోలు, ఎముకతో చేసిన దువ్వెనలు, టెర్రకోట వస్తువులు బయటపడ్డాయి. ఇంతటి చారిత్రక నేపథ్యమున్న ఇక్కడి బౌద్ధస్ఫూపాలు ఇతర ఆనవాళ్లకు రక్షణ కరువైనా పట్టించుకునే వారే కరువయ్యారు. ఇప్పటికే బుద్ధుడి విగ్రహం ప్లాట్‌ఫాం శిథిలావస్థకు చేరుకుంది. ఎటువంటి ప్రహరీ సౌకర్యం లేకపోవడంతో ఆవరణలోనే మందుబాబులు హల్చల్ చేస్తుంటారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి దంతపురి కోటగట్టు ప్రదేశాన్ని రీసర్వే చేసి రక్షణ చర్యలు చేపట్టాలని పలువురు కోరుతున్నారు. చర్యలు తీసుకుంటాం.. ప్రాచీన సంపదగా విరాజిల్లుతున్న దంతపురి క్షేత్రంలో ఎటువంటి తవ్వకాలు చేయరాదు. ఇటువంటి కార్యకలాపాలు చట్టరీత్యా నేరం. కోటగట్టుపై తవ్వకాలు జరిపిన వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటాం. – సనపల కిరణ్‌కుమార్, తహసీల్దార్, సరుబుజ్జిలి (చదవండి: ఢిల్లీ హైకోర్టు జడ్జిగా వీరఘట్టం వాసి) -
కన్నుమూస్తూ.. నలుగురికి కొత్త జీవితం
డాబాగార్డెన్స్ (విశాఖ దక్షిణ): తను చనిపోతూ నలుగురికి జీవం పోశాడు ఓ వ్యక్తి. శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలసకు చెందిన యతిరాజ్యం రామారావు రోడ్డు ప్రమాదంలో బ్రెయిన్ డెడ్‌కు గురై శాశ్వత లోకాలకు వెళ్లిపోతూ నేత్రాలు, కాలేయం, గుండె, ఊపిరితిత్తులు దానం చేశారు. వివరాలిలా ఉన్నాయి. ఆమదాలవలసకు చెందిన రామారావు వ్యవసాయం చేసేవారు. ఈయనకు భార్య రూపావతి, ఒక కుమార్తె, ఒక కుమారుడు ఉన్నారు. భార్య గృహిణి, పిల్లలిద్దరికీ వివాహమైంది. కుమారుడు నగరంలోని డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్‌లో పనిచేస్తున్నారు. పదేళ్ల కిందట వ్యవసాయ పనులు చేస్తుండగా జరిగిన ప్రమాదంలో రామారావు కాలు విరిగిపోయింది. చికిత్స చేసి రాడ్లు వేశారు. అప్పటి నుంచి ఇంటి వద్దనే ఉంటున్నారు. ఇదిలా ఉండగా వ్యక్తిగత పనుల నిమిత్తం ఈ నెల 2న వేరే వ్యక్తితో ద్విచక్ర వాహనంపై వెనక కూర్చుని వెళ్తుండగా రణస్థలం మండలం కొచ్చెర్ల గ్రామం వద్ద బండి అదుపు తప్పి రామారావు కింద పడిపోయాడు. దీంతో రామారావును విశాఖలోని కేర్ ఆస్పత్రిలో చేర్పించగా, 3వ తేదీన శస్త్రచికిత్స చేశారు. అయినా ఫలితం లేకపోవడంతో బ్రెయిన్ డెడ్‌గా నిర్ధారించారు. దీంతో రామారావు అవయవాలు దానం చేసేందుకు కుటుంబసభ్యులు ముందుకొచ్చారు. ఆస్పత్రి యాజమాన్యం స్పందించి కాలేయం, ఊపిరితిత్తులను వేరే వారికి అమర్చేందుకు తీసుకున్నారు. రెండు నేత్రాలను ఎల్వీ ప్రసాద్ ఆస్పత్రికి అందజేశారు. గుండెను చెన్నైలోని ఎంజీహెచ్ ఆస్పత్రికి తరలించారు. రామారావు చనిపోతూ నలుగురికి జీవం పోయడంపై ఆయనను, ఆయన కుటుంబసభ్యులను పలువురు అభినందించారు. -
కూన అండ్ కో.. దొరికింది దోచుకో!
సాక్షి, శ్రీకాకుళం : అధికారం దక్కింది అక్రమాల కోసమే అన్నట్టు ఐదేళ్ల పాటు టీడీపీ నాయకులు సాగించిన అవినీతి యజ్ఞం ప్రజల పాలిట శాపంగా మారింది. వారి హయాంలో జరిగిన పనుల వల్ల ఇప్పటికీ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా అమదాలవలస నియోజకవర్గంలో కూన రవికుమార్ ఫ్యామిలీ దందా ఏ స్థాయిలో జరిగిందో అక్కడి పనులే చెబుతున్నాయి. నాసిరకం పనులతో రూ.కోట్లు వెనకేసుకుని ఇప్పుడు అధికార పక్షంపై విమర్శలకు దిగుతున్నారు. పనుల్లో కొన్ని.. విపత్తు నివారణ పథకం కింద బొడ్డేపల్లి జెడ్పీ రోడ్డు నుంచి సింగూరు మీదుగా ఎన్‌హెచ్–5 రోడ్డు వరకు రూ. 2.73కోట్ల నిధులుతో తారు రోడ్డు వేశారు. ఈ రోడ్డు సింగూరు వద్ద రెల్లుగెడ్డ గట్టుమీదుగా వెళ్తుంది. నాసిరకంగా పనులు చేపట్టడంతో రోడ్డు ఒక భాగం ఏకంగా కూలిపోయింది. కూన రవికుమార్ సోదరుడు విజయలక్ష్మి కన్స్ట్రక్షన్స్ అధినేత కూన వెంకట సత్యనారాయణ ఈ పనులు చేపట్టారు. చదవండి: వామ్మో.. ఒకేచోట 100కుపైగా పాములు కింతలి నుంచి సీపన్నాయుడు పేట వరకు రూ.4 కోట్లు నాబార్డ్ నిధులతో రోడ్డు పనులు చేశారు. ఈ పనుల కాంట్రాక్ట్‌ను కూన రవికుమార్ సోదరుడు వెంకట సత్యనారాయణ దక్కించుకున్నాడు. నాసిరకం పనులు చేయడంతో రోడ్డు పరిస్థితి అధ్వానంగా తయారైంది. పొందూరు గ్రామంలో జమాల్ మిల్లు నుంచి కళాశాల రోడ్డులోని అమ్మాజమ్మ టిఫిన్ దుకాణం వరకు కుడి వైపు రూ.45 లక్షలతో సుమారు వెయ్యి మీటర్లు పొడవున కాలువలను నిర్మించారు. దీని కాంట్రాక్ట్‌ను కూన సోదరుడే దక్కించుకున్నాడు. ఈ కాలువలపై పలకలను వేయలేదు. సరిగా నిర్మాణం జరగకపోవడంతో నీరు ఎక్కడ పడితే అక్కడే నిలిచిపోయి బురదగా మారిపోతోంది. రాపాక నుంచి దళ్లవలస మీదుగా కింతలి వరకు రూ.7కోట్ల ఆర్ఐడీఎఫ్ నిధులతో రోడ్డు నిర్మించారు. కూన రవి కుమార్ సోదరుడు వెంకట సత్యనారాయణ ఈ రోడ్డు కాంట్రాక్ట్‌ను తీసుకున్నారు. నాసిరకం పనులు చేపట్టడంతో ఎక్కడ పడితే అక్కడ రోడ్డుపై పెద్ద పెద్ద గుంతలు ఏర్పడ్డాయి. రోడ్డు శిథిలమైపోవడంతో ఇటీవలే ప్యాచ్‌వర్కులు చేశారు. కొత్తగా మరికొన్ని చోట్ల గోతులు ఏర్పడ్డాయి. చదవండి: వైద్యం కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్లే అవసరం ఉండకూడదు: సీఎం జగన్ వాండ్రంగి కూడలి నుంచి జోగన్నపేట వరకు రోడ్డు, కాలువల నిర్మాణానికి రూ.4 కోట్లు నిధులు మంజూరయ్యాయి. దీని కాంట్రాక్ట్‌ను కూన రవికుమార్ సోదరుడే దక్కించుకున్నాడు. 2018–19లో అర్ధంతరంగా పనులు నిలుపుదల చేసారు. ఇంకా 200 మీటర్లు మేరకు రోడ్డును జోగన్నపేట వద్ద వేయాల్సి ఉంది. కాలువలను పూర్తి చేయలేదు. కొన్ని చోట్ల కాలువలు పూడుకుపోయాయి. అరకొరగా నిర్మించిన కాలువలపై పలకలను వేయలేదు. జరిగిన పనులు కూడా బాగాలేవు. కొంతమేర బిల్లు చెల్లించాల్సి ఉన్నప్పటికీ చేసినవి కూడా నాసిరకం పనులే. ఇలా చేసిన ప్రతి పనిలోనూ అక్రమాలు కనిపిస్తూనే ఉన్నాయి. నియోజకవర్గంలో వేసిన ప్రతి రోడ్డు వాళ్లే వేశారు. ఏ కాంట్రాక్ట్‌నైనా వాళ్లే చేయాలి. వారికే దక్కాలి. ఇతరులకు కాంట్రాక్ట్‌లు దక్కిన సందర్భాలు తక్కువే. అంతా వారి కనుసన్నల్లోనే జరిగింది. టెండర్ల ప్రక్రియ నామమాత్రమే. అంతా వారి చెప్పినట్టే జరిగేవి. అధికార వర్గాలు సైతం వంతపాడాయి. సాధారణంగా టెండర్లలో అన్నీ వర్గాలు పాల్గొనాలి. ఎవరు తక్కువ కోట్ చేస్తే వారికి దక్కాలి. కానీ ఇక్కడ టెండర్ల వేయడమే అధికారుల వంతు. ఎవరికి దక్కాలో నిర్ణయించేదంతా టీడీపీ పెద్దలదే. ఎవరెక్కడ టెండర్ వేయాలో నిర్ణయించేది వీళ్లే. అంతా ఒక సిండికేట్‌గా తయారై గూడు పుఠాణి నడిపారు. మొత్తానికి మంజూరైన పనులన్నీ వారే దక్కించుకుని ఆ పనుల్లో కోట్లు కొల్లగొట్టారు. నాసిరకం పనులు చేసి ప్రజాధనాన్ని దోచేశారు. ఇప్పుడా పనులతో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే అధికార పక్షంపై విమర్శలకు దిగుతున్నారు. -
ఆసరాగా ఉంటాడనుకుంటే.. ఆయువు తీసుకున్నాడు
సాక్షి,ఆమదాలవలస: ఉన్నత చదువులు చదివి కుటుంబానికి ఆసరాగా ఉంటాడనుకున్న కుమారుడు విగతజీవిగా కనిపించడంతో ఆ తల్లిదండ్రులు తల్లడిల్లిపోతున్నారు. క్షణికావేశంతో ఆత్మహత్య చేసుకోవడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. శ్రీకాకుళం రోడ్డు(ఆమదాలవలస) రైల్వేస్టేషన్ పరిధి కుద్దిరాం – ఆమదాలవలస మధ్య ట్రాక్‌పై మంగళవారం రైలు కిందపడి యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. జీఆర్పీ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆమదాలవలస మండలం తురకపేట గ్రామానికి చెందిన మామిడి మురళీ(17) స్థానిక ప్రైవేటు కాలేజీలో ఇంటర్ సెకెండియర్ చదువుతున్నాడు. ఏదో విషయమై కుటుంబ సభ్యులు మందలించడంతో మనస్తాపానికి గురై రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నన్నాడు. ఆసరాగా నిలుస్తాడనుకున్న కుమారుడు మృత్యువు ఒడిలోకి చేరడాన్ని చూసి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. మురళీ మృతితో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. -
తెల్లారిన బతుకులు
సాక్షి, ఆమదాలవలస(శ్రీకాకుళం): వారం వారం గుంటూరు వెళతారు.. అక్కడి నుంచి బలిష్టమైన గొర్రెలను తీసుకొచ్చి ఇక్కడ వ్యాపారం చేస్తారు.. హోల్‌సేల్ మార్కెట్‌కు వెళితే నాలుగు డబ్బులు మిగులుతాయన్నది వారి ఆశ.. అందుకే రాత్రి బయలుదేరి తెల్లారేసరికల్లా అక్కడికి చేరుకోవాలనుకున్నారు. గంటలో గమ్యస్థానం చేరుతామనగా చీకటి తెరలు వీడకుండానే రోడ్డు ప్రమాదంలో జిల్లాకు చెందిన ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. నరసన్నపేట మండలం నడగాం గ్రామానికి చెందిన కోటిపల్లి శాంతారావు (25), జలుమూరు మండలం మాకివలసకు చెందిన బోర కన్నయ్య (48), శ్రీకాకుళం రూరల్ మండలం భైరివానిపేటకు చెందిన కింతలి సింహాచలం (వాహన యజమాని), శ్రీకాకుళం రూరల్ మండలం శిలగాం సింగివలసకు చెందిన కురిటి అప్పన్న, చొట్టవానిపేటకు చెందిన మురపాక శ్రీను గుంటూరులో గొర్రెలమండికి వెళ్లి గొర్రెలను కొనుగోలు చేసేందుకు టాటా మ్యాజిక్ వాహనంలో గురువారం రాత్రి బయల్దేరారు. మధ్యలో మరో యువకుడు వాహనాన్ని ఎక్కాడు. శుక్రవారం తెల్లవారుజామున మరో గంటలో గుంటూరులోని గొర్రెలమండి చేరుకోవాల్సి ఉండగా, జాతీయరహదారిపై పక్కన ఆపివున్న కంటైనర్‌ను వాహనం అదుపు తప్పి ఢీకొట్టింది. ఈ ఘటనలో డ్రైవర్ సహా ముగ్గురు మృతి చెందారు. మరో నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. మృతుల్లో ఇద్దరు ఘటనాస్థలిలో ప్రాణాలు కోల్పోగా, మరొకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు రూరల్ పోలీసులు వెల్లడించారు. మృతి చెందిన వారిలో కోటిపల్లి శాంతారావు గోరా కన్నయ్యలతో పాటు మధ్యలో ఎక్కిన గుర్తు తెలియని యువకుడు ఉన్నారు. డ్రైవర్ నిద్రమత్తులో ఉండటం వల్లే ఈ ప్రమాదం జరిగిందని బాధితులు తెలిపారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. పెళ్లయిన నాలుగు నెలలకే.. మృతుల్లో కోటిపల్లి శాంతారావుకు నాలుగు నెలల క్రితమే పెళ్లయింది. ఆమదాలవలస మండలం సొట్టోడుపేటలో ఉన్న తన భార్య మాధవి ఇంటి నుంచి దసరాకు గొర్రెలు కొనుగోలుకు లగేజి వాహనంపై బయల్దేరాడు. శాంతారావు నడగాంలో ఉంటూ ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ప్రమాద ఘటన తెలియడంతో రెండు గ్రామాల్లోనూ విషాదం అలుముకుంది. గుండె నిండా విషాదం నింపుకొని శాంతారావు తల్లిదండ్రులు బారికి వాడు, సూరమ్మలతోపాటు భార్య మాదవిలు హుటాహుటిన మంగళగిరి వెళ్లారు. -
ఎవరికివారే యమునాతీరే
సాక్షి, ఆమదాలవలస(శ్రీకాకుళం) : ఆమదాలవలస ఐసీడీఎస్ ప్రాజెక్టు అధికారిగా కొత్తూరు ప్రాజెక్టు ఏసీడీపీఓగా పనిచేస్తున్న టి. విమలారాణి కొన్ని నెలల క్రితం విధుల్లోకి చేరారు. అయితే ఆమె కొత్తూరు, ఆమదాలవలస రెండు ప్రాజెక్టులు చూస్తుండగానే మధ్యలో ఎన్నికలు వచ్చాయి. ఈ తరుణంలోనే ఆమదాలవలస ప్రాజెక్టు పరిధిలోని కొన్ని గ్రామాల్లో అంగన్వాడీ పోస్టులకు నోటిఫికేషన్‌ను అప్పటి పాలకుల మాటను కాదనలేక విడుదల చేశారు. అయితే అప్పటికి ఎన్నికల కోడ్ ఉన్నప్పటికీ ఎఫ్‌ఏసీపీఓ అత్యుత్సాహం చూపిస్తూ వంజంగి, జీకె.వలస, చిట్టివలసలతోపాటు ప్రాజెక్టు పరిధిలో మరికొన్ని గ్రామాల్లో పోస్టులను భర్తీ చేశారు. మాజీ ప్రభుత్వ విప్ కనుసన్నల్లో నియామకాలు..? ఎన్నికల ముందు మాజీ ప్రభుత్వ విప్ ఆదేశాల మేరకు కార్యకర్తల నియామకాలు పీఓ కార్యాలయానికి వచ్చినప్పటకీ కొత్తగా పోస్టింగ్‌లు వచ్చిన అభ్యర్థులకు ఆ నియామక పత్రాలు అందజేయకుండా గుట్టుగా ఉంచారు. కొత్తగా జాబ్ వచ్చిన వారికి ఎన్నికల ముందర ఆర్డర్స్ అందిస్తే కొంతమంది కార్యకర్తలు ఎదురు తిరుగుతారని, అందువలన ఎన్నికల తర్వాత ఆర్డర్లు ఇవ్వాలని విప్ చెప్పినట్లు సమాచారం. దీంతో కొత్తగా జాబ్ వచ్చిన వారికి ఎన్నికల తరువాత అనగా వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక ఎఫ్ఏసీ పీఓ స్థానిక ఎమ్మెల్యేకు సమాచారం ఇవ్వకుండా ఆర్డర్స్ అందజేసి, విధుల్లోకి అర్జెంటుగా చేరాలని ఆదేశించారు. దీంతో కొత్తగా పోస్టింగ్‌లు వచ్చిన వారు విధుల్లోకి చేరారు. ఈ విషయంలో ఎఫ్ఏసీ పీఓకు ఆయా గ్రామాల నుంచి ఒత్తిడి రావడంతో పాటు తాను తప్పు చేశాను అనే కారణంతో వెంటనే సెలవుపై వెళ్లిపోయినట్లు సమాచారం. ఆమె సెలవులో వెళ్లిపోయిన తరువాత కార్యాలయంలో ఉద్యోగులతోపాటు, ప్రాజెక్టు పరిధిలో పనిచేస్తున్న అంగన్వాడీ కేంద్రాల్లో కూడా పర్యవేక్షణ లోపించి, అధికారులంతా ఎవరికి వారే యమునా తీరే అన్న చందాన్న పనిచేస్తున్నారు. దీంతో ఆమదాలవలస ప్రాజెక్టు పరిస్థితి ప్రస్తుతం అధ్వానంగా ఉందని ఆ కార్యాలయ పరిధిలో పనిచేస్తున్న ఉద్యోగులే చర్చించుకుంటున్నారు. పీఓ పోస్టు ఖాళీ ఆమదాలవలస ఐసీడీఎస్ ప్రాజెక్టు కార్యాలయంలో పీఓ పోస్టు ఖాళీగా ఉంది. ప్రస్తుతం ప్రభుత్వం విడుదల చేసిన జీఓతో పొందూరు ఐసీడీఎస్ ప్రాజెక్టులో పనిచేస్తున్న ఏసీడీ పీఓ శాంతిశ్రీని ఆమదాలవలస ప్రాజెక్టుకు ఎఫ్ఏసీ ప్రాజెక్టు అధి కారిగా నియమిస్తూ ఉత్తర్వులు వచ్చినట్లు సమాచారం. అయితే ఆమె ఇక్కడ జాయిన్ అవకుండా వేరే చోటుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోం ది. ఆమదాలవలస ఎఫ్ఏసీ ప్రాజెక్టు అధికారిగా పనిచేస్తున్న టి.విమలారాణి కొత్తూరు ఏసీడీపీఓగా విధుల్లోకి చేరినట్లు సమాచారం. ఆమదాలవలస ప్రాజెక్టులో ఇన్చార్జి పీఓగా ఇక్కడే పనిచేస్తున్న సూపర్వైజర్ రత్నాంజలి విధులు నిర్వహిస్తున్నారు. ఇటీవల స్పీకర్ తమ్మినేని సీతారాం నిర్వహిస్తున్న సమీక్ష సమావేశాలకు హజరైన ఆమె సమాచారం లేకుండా హజరుకావడంతో స్పీకర్ ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేసిన సంఘటన కూడా జరిగింది. ప్రస్తుతం ఆమదాలవలస ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిస్థితి అయోమయంగా ఉందనే చెప్పాలి. -
రేపే ప్రజాతీర్పు
సాక్షి, ఆమదాలవలస (శ్రీకాకుళం): సార్వత్రిక ఎన్నికల ప్రజాతీర్పు రేపు వెలువడనుంది. విజయం ఎవరిని వరిస్తుందోనని అటు రాజకీయ పార్టీల అభ్యర్థులతో పాటు ఇటు ప్రజల్లో ఉత్కంఠ నెలకొంది. ఆమదాలవలసలో ఏ పార్టీ అభ్యర్థి విజయం సాధిస్తే రాష్ట్రంలో ఆ పార్టీ అధికారంలోకి వస్తుందనే సెంటిమెంట్ ఉండడంతో రాష్ట్రంలో అందరి చూపు ఆమదాలవలస నియోజకవర్గం పైనే ఉంది. పోలింగ్ జరిగి ఫలితాల వెల్లడికి మధ్య సుమారు 40 రోజుల విరామం ఉండడంతో అభ్యర్థులు ఎవరికి వారు గెలుపుపై ధీమాగా ఉన్నారు. అయితే ఇటీవల విడుదలైన ఎగ్జిట్ పోల్స్‌లో వైఎస్సార్సీపీకి అనుకూలంగా ఉండడంతో టీడీపీ నేతల్లో ఆందోళన నెలకొంది. ప్రజాతీర్పుకు మరికొద్ది గంటల సమయం మాత్రమే ఉండడంతో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. ఏ ఇద్దరు వ్యక్తులు కలిసినా ఎవరు గెలుస్తారు? ఏ పార్టీ విజయం సాధిస్తుంది? ఎవరు ముఖ్యమంత్రి అవుతారు.. అని చర్చించుకుంటున్నారు. ఆమదాలవలస నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా తమ్మినేని సీతారాం, టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా కూన రవికుమార్, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బొడ్డేపల్లి సత్యవతి, బీజేపీ అభ్యర్థిగా పాతిన గడ్డియ్య, జనసేన అభ్యర్ధిగా పేడాడ రామ్మోహన్రావు, ఇండిపెండెంట్ అభ్యర్థిగా తూలుగు సతీష్‌కుమార్ బరిలో నిలిచారు. అయితే వైఎస్సార్సీపీ, టీడీపీ అభ్యర్థుల మధ్యే ప్రధాన పోటీ నెలకొంది. పోలింగ్ సరలి బట్టి ఇక్కడ విజయం సాధిస్తారనేది స్పష్టత రాకపోవడంతో అందరిలో ఉత్కంఠ నెలకొంది. అధిక శాతం ఓట్లు వైఎస్సార్సీపీకి పడ్డాయని, ఎమ్మెల్యేగా తమ్మినేని సీతారాం గెలుపు తద్యమని ఆ పార్టీ నాయకులు ధీమా వ్యక్తం చేయగా, నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపించారని, ప్రజలు మరోసారి కూన రవికుమార్‌కు పట్టం కడతారని టీడీపీ వర్గీయులు అశాభావం వ్యక్తం చేస్తున్నారు. నియోజకవర్గంలో ఈ ఎన్నికల్లో 78.8 శాతం పోలిగ్ జరగడంతో ఎవరి అంచనాల్లో వారు ఉన్నారు. ప్రభుత్వ పథకాలు, పసుపు కుంకుమ వంటివి లాభిస్తాయని టీడీపీ భావిస్తోంది. జగన్ పాదయాత్ర, నవరత్నాలు తమను గెలిపిస్తాయని వైఎస్సార్సీపీ నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ సారి ప్రజలు నాడి పట్టుకోవడం కష్టతరంగానే ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. 2014 ఎన్నికల్లో వైఎస్సార్సీపీ – టీడీపీకి పోలైన ఓట్లు వివరాలు మండలం వైఎస్సార్సీపీ టీడీపీ మెజార్టీ ఆమదాలవలస రూరల్ 12048 13095 1047 ఆమదాలవలస పట్టణం 7541 8947 1403 బూర్జ 10825 11059 234 సరుబుజ్జలి 9616 8912 704 పొందూరు 19168 22,686 3518 2019 ఎన్నికల పోలింగ్ వివరాలు ఆమదాలవలస నియోజకవర్గం కోడ్‌నెంబర్–06, మండలాలు 4 ఆమదాలవలస, పొందూరు, సరుబుజ్జలి, బూర్జ మొత్తం పోలింగ్ కేంద్రాలు: 259, ఆమదాలవలస–82, పొందూరు–77, సరుబుజ్జలి–45, బూర్జ–55 ఓటర్లు వివరాలు: పురుషులు 94,224 స్త్రీలు 93,403 ఇతరులు 46 మొత్తం 1,87,673 -
ఏం కొనేటట్లు లేదు...ఏం తినేటట్లు లేదు
సాక్షి, ఆమదాలవలస రూరల్ : కొన్ని రోజులుగా ఎండలతో పాటు కూరగాయల ధరలు కూడా పెరుగుతుండడంతో వినియోగదారులు బెంబేలెత్తుతున్నారు. ఇదివరకు కొద్దిపాటి సొమ్ముతో మార్కెట్‌కు వెళ్తే వారం రోజులకు సరిపడా సరుకులు వచ్చేవని, ప్రస్తుతం ఆ పరిస్థితులు లేవని వాపోతున్నారు. ఇలాగే ధరలు కొనసాగితే పూట గడవడం కూడా కష్టమవుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దడ పుట్టిస్తున్న ధరలు బహిరంగ మార్కెట్లో కూరగాయల ధరలు అమాంతం పెరిగాయి. దీంతో పాటు ప్రభుత్వం నిర్వహిస్తున్న రైతు బజార్ దుకాణాల్లో కూడా అధిక ధరలే ఉన్నాయి. దీంతో అరకొరగా కూరగాయలు కొనుగోలు చేసి పొదుపుగా వాడుకోవలసిన పరిస్థితి ఏర్పడిందని వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. కానీ ధరలు నియంత్రించాల్సిన ప్రభుత్వం మాత్రం నిమ్మకునీరెత్తనట్లు వ్యవరిస్తోంది. దీంతో ప్రభుత్వ తీరుపై ప్రజలు మండిపడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ధరల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. మాంసం ప్రియులకు చేదు వార్త కూరగాయల ధరలతో పాటు చికెన్ ధరలు కూడా పెరుగుతుండడంతో మాంసం ప్రియులు చికెన్ తినే పరిస్థితి లేదు. బ్రాయిలర్ కోళ్ల ఉత్పత్తి తగ్గుతుండడంతో చికెన్ ధరలు పెరుగుతున్నట్లు తెలుస్తోంది. ఫలితంగా కిలో చికెన్ ధర రిటైల్ మార్కెట్లో రూ.160లుగా ఉంది. ఇంకా ఎండలు పెరిగే అవకాశం ఉన్నందున ధరలు మరో రూ.20 నుంచి రూ.50 పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు అంటున్నారు. ధరలు అదుపు చేయాలి ధరలు నియంత్రించడంలో ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయి. రోజురోజుకూ పెరుగుతున్న ధరలతో సామాన్యుడు మూడుపూటలా తినే పరిస్థితి లేదు. ధరల దెబ్బతో ఇంటి బడ్జెట్ తలకిందులవుతోంది. ముఖ్యంగా కూరగాయలు, పప్పుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ధరల నియంత్రణకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. -కూన రామకృష్ణ, కృష్ణాపురం ఏమీ కొనే పరిస్థితి లేదు గత నెలతో పోల్చుకుంటే ఈ నెలలో కూరగాయల ధరలు ఆమాంత పెరిగిపోయాయి. దీనివలన ఏమీ కొనుక్కోలేని పరిస్థితి నెలకొంది. ధరలను ప్రభుత్వం నియంత్రించాల్సిన అవసరం ఉంది. ఈ దిశగా ప్రభుత్వం ప్రయత్నం చేయాలి. -బొడ్డేపల్లి రవికుమార్, తిమ్మాపురం -
ఈసారైనా పరిష్కారమయ్యేనా?
సాక్షి, ఆమదాలవలస : శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మున్సిపాలిటీలో భవనాల క్రమబద్ధీకరణపై చేపట్టిన బీపీఎస్(బిల్డింగ్ పీనలైజేషన్ స్కీం) అనుకున్న ఫలితం ఇవ్వడంలేదు. ఈ స్కీం ద్వారా మున్సిపాలిటీ పరిధిలో ఎటువంటి అనుమతులు లేకుండా నిర్మించిన భవనాలను క్రమబద్ధీకరణ చేసుకునే అవకాశం ఉంటుంది. భవన యజమానులకు ఊరట కలగడంతోపాటు మున్సిపాలిటీకి కోట్ల రూపాయల్లో ఆదాయం వస్తుంది. ఇంతవరకు భాగానే ఉన్నా పథకంలో భాగంగా వచ్చిన దరఖా స్తులను పరిష్కరించడంలో అధికార యంత్రాంగం, పాలకవర్గం పట్టించుకోవడం లేదు. మరో వైపు మున్సిపల్ అధికారులు గృహాలకు కొలతలు వేసి అధిక మొత్తంలో అపరాధ రుసుం విధిస్తున్నారు. ఈ మొత్తాన్ని చెల్లించేందుకు భవన యజమానులు వెనుకంజ వేస్తుండడంతో మున్సిపాలిటీ ఆదాయానికి గండిపడుతోంది. ఇప్పటివరకు 101 దరఖాస్తులు బీపీఎస్ కింద తొలిసారిగా ఆన్లైన్ పద్ధతిలో దరఖాస్తులు ఆహ్వానించడంతో మున్సిపాలిటీ పరిధిలో 101 దరఖాస్తులు వచ్చాయి. తొలివిడతలో 46, రెండో విడతలో 21 దరఖాస్తులు పరిష్కరించారు. మున్సిపాలిటీకి సుమారు రూ.49లక్షల వరకు ఆదాయం వచ్చింది.వాస్తవంగా ప్రభుత్వం విధించిన గడువు గత ఏడాది అక్టోబరు 30తో ముగియగా నవంబరు 30వరకు గడువు పెంచు తూ మరో ఉత్తర్వులు జారీ చేశారు. గడువు పెంచడం తప్ప ఇంతవరకు దరఖాస్తుల పరిష్కారానికి చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. ఇటీవల ఈ గడువును ఏప్రిల్ నాలుగో తేదీ వరకు పెంచినట్లు మున్సిపల్ కమిషనర్ ప్రకటన విడుదల చేశారు. ప్రస్తుతం కొత్త జీవో ప్రకారం దరఖాస్తుదారుడు తొలుత రూ.10వేలు మీసేవ కేంద్రంలో అపరాధ రుసుం చెల్లించి మున్సిపల్ కార్యాలయంలో సంప్రదించాల్సి ఉంటుంది. అక్రమ నిర్మాణాలకు అడ్డా ఆమదాలవలస మున్సిపాలిటీలోని 23వార్డులలో సుమారు 12వేల గృహాలు ఉన్నాయి. ఇందులో 1985కు ముందు నిర్మించిన ఇళ్లకు మున్సిపాలిటీ నుంచి అనుమతులు అవసరం లేదు. ఆ తరువాత నిర్మించిన భవనాలకు 199లో బీఆర్ఎస్(బిల్డింగ్ రెగ్యూలైజేషన్ స్కీం) కింద, 2007లో బీపీఎస్ స్కీం కింద అక్రమ నిర్మాణాల క్రమబద్ధీకరణకు ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. మళ్లీ 2016–17లో బీపీఎస్ స్కీం కింద తమ గృహాలను క్రమబద్ధీకరించుకోవాలని కోరుతు తాజా ఉత్తర్వులు జారీ చేసింది. పట్టణంలో సుమారు 1000కు పైగా అక్రమ నిర్మాణాలు(అనుమతులు) లేని గృహాలు ఉన్నాయని అధికారిక సమాచారం. అందులో ప్రస్తుతం 101 మంది నుంచి మాత్రమే దరఖాస్తు చేసుకున్నారు. మిగిలిన వారిలో కొంతమంది యజమానులకు ప్రభుత్వ పెద్దల అండదండలు ఉన్నాయని, కొంతమందికి మున్సిపల్ అధికారుల అండదండలు ఉన్నాయని, అందుకే వారు క్రమబద్ధీకరణకు దరఖాస్తులు చేసుకోవడంలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. కొంతమంది భవన యజమానులు మున్సిపల్ పాలకులకు, అధికారులకు మామ్మూళ్లు ఇస్తూ మేనేజ్ చేసుకుంటున్నట్లు బహిరంగ ఆరోపణలు కూడా ఉన్నాయి. అధికారులు పాలకులు స్పందించి మున్సిపల్ ఆదాయాన్ని పెంపొందించేందుకు చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. -
హిజ్రాలకు పింఛన్ మంజూరు పత్రాల అందజేత
ఆమదాలవలస శ్రీకాకుళం : ఆమదాలవలస పురపాలక సంఘం 8వ వార్డులో నివసిస్తున్న ఎనిమిది మంది హిజ్రాలకు నెలకు రూ.1500 చొప్పున పింఛన్‌ను అందజేసే ఉత్తర్వులను గురువారం మున్సిపల్ చైర్పర్సన్ తమ్మినేని గీత అందించారు. జిల్లాలో తొలిసారిగా ఆమదాలవలస మున్సిపాలిటీలోనే హిజ్రాలకు పింఛన్లు మంజూరు చేశామని ఈ సందర్భంగా చైర్పర్సన్ తెలిపారు. మరో 20 మందికి వైద్య ధ్రువీకరణ పత్రాలు మంజూరు కావాల్సి ఉందని, వారికి కూడా పింఛన్లు అందేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా సేవాదళ్ అధ్యక్షడు అల్లంశెట్టి ఉమామహేశ్వరరావు, సిబ్బంది ఎ.వి.శ్రీనివాస్ పాల్గొన్నారు. -
తాగోద్దంటే చచ్చిపోతా!
తూర్పుగోదావరి: మద్యం తాగోదంటే చచ్చిపోతానని భార్యను భర్త రోజు భయపెడుతున్నాడు. ఈవిధంగానే భార్య తగోద్దని అభ్యంతరం చెప్పడంతో ఆమదాలవలస మండలంలోని కొత్తవలస గ్రామానికి చెందిన బమ్మిడి అప్పన్న(40) శుక్రవారం ఆత్మ హత్యకు పాల్పడ్డాడు. అతిగా మద్యం సేవిస్తూ ఆరోగ్యం పాడుచేసుకోవడంతోపాటు కూలి చేసుకుని దాచుకున్న డబ్బులు కూడా దుబారా చేస్తున్నావని భార్య నిలదీయడంతో ఉదయాన్నే గ్రామ శివారులో ఉన్న మామిడితోట వైపు వెళ్లి ఆయన ఉరి వేసుకున్నాడని స్థానికులు చెబుతున్నారు. గతంలో కూడా కుటుంబ కలహాలతో సుమారు ఐదు నెలలపాటు గ్రామం వదిలి వెళ్లిపోయాడని చెబుతున్నారు. మృతునిది కోటబొమ్మాళి మండలం లక్కుందిద్ది గ్రామమని, 12 సంవత్సరాల క్రితం నాగావళిని వివాహం చేసుకొని కొత్తవలసకు వచ్చి స్థిరపడ్డాడని చెబుతున్నారు. మృతునికి 11 ఏళ్ల వయస్సుగల కుమారుడు ఉన్నాడు. -
గుండెపోటుతో వైఎస్సార్సీపీ కౌన్సిలర్ మృతి
ఆముదాలవలస: శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస పురపాలక సంఘం 17వ వార్డు కౌన్సిలర్ గురుగుబెల్లి వెంకట అప్పలనాయుడు గురువారం ఉదయం గుండెపోటుతో మృతి చెందారు. ఉదయం ఛాతీనొప్పి రావడంతో శ్రీకాకుళం కిమ్స్ ఆసుపత్రికి తరలించారు. హాస్పిటల్ కు వెళ్లే లోపల ఆయన మృతి చెందారు. వైఎస్సార్సీపీలో ఆయన చాలా చురుకు నేతగా పేరుతెచ్చుకున్నారు. ఆయన అకాలమరణంతో పార్టీ నేతలు కార్యకర్తలు దిగ్ర్బాంతి వ్యక్తం చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తోందని బుధవారం జిల్లాలో నిర్వహించిన ఆందోళన కార్యక్రమంలో కూడా ఆయన పాల్గొని ప్రసంగించారు. -
శ్రీకాకుళంలో ఉద్రిక్తత
-
ఏ తల్లి కన్నబిడ్డో..!
ఆమదాలవలస : నవమాసాలు మోసి కన్న ఆడశిశువును పాలిథిన్ కవర్లో పెట్టి వదిలి వెళ్లిపోయింది ఓ తల్లి. సంచలనం రేకెత్తించిన ఈ ఘటన బుధవారం ఆమదాలవలసలో చోటుచేసుకుంది. ఈ సంఘటనకు సంబంధించి అధికారులు, స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మున్సిపాలిటీ పరిధిలోని 20వ వార్డు వెంగళరావు కాలనీలో రైల్వే ట్రాకు పక్కన ఉన్న పొట్నూరు కృష్ణ ఇంటి వద్ద బాత్రూంలో ముక్కుపచ్చలారని పసికందును బుధవారం తెల్లవారుజామును గుర్తు తెలియని మహిళ విడిచి పెట్టివెళ్లిపోయింది. కృష్ణ భార్య ఉదయాన్నే బాత్ రూం తలుపు తీయగా పసికందు కనిపించింది. వెంటనే కుటుంబ సభ్యులకు, ఇరుగు పొరుగు వారికి విషయం చెప్పి పాపకు స్నానం చేయించింది. తర్వాత వార్డు కౌన్సిలర్ రెడ్డి గౌరి దృష్టికి విషయాన్ని తీసుకెళ్లగా వెంగళరావు కాలనీకి చెందిన కోటేశ్వరరావు, ఇందిర దంపతులకు పిల్లలు లేరని వారు పెంచుకుంటామని ముందుకొచ్చారు. దీంతో వారికి పసికందును అప్పగించారు. వారు శిశువును శ్రీకాకుళంలో ఒక ప్రయివేటు ఆస్పత్రికి తీసుకెళ్లి వైద్యం అందించి తిరిగి ఇంటికి తీసుకొచ్చారు. ఇంతలో 1098కు గుర్తు తెలియని వ్యక్తులు సమాచారం అందిచడంతో ఐసీడీఎస్, చైల్డ్ లైన్, బాలల సంరక్షణ కార్యాలయాల నుంచి అధికారులు, సిబ్బంది కాలనీకి చేరుకున్నారు. పసి పాపను శిశుగృహకు అప్పగించాలని, లేకుంటే కేసు పెట్టాల్సి వస్తుందని జిల్లా బాలల సంరక్షణాధికారి కె.వి.రమణ హెచ్చరించారు. దీనికి వారు ససేమిరా అనడంతో పోలీసులకు సమాచారం అందించారు. వారి సహాయంతో శిశువును శ్రీకాకుళం శిశుగృహకు తీసుకు వెళ్లిపోయారు. బిడ్డకు రక్షణ కల్పిస్తాం.. బిడ్డకు పూర్తి స్థాయిలో రక్షణ కల్పిస్తామని బాలల సంరక్షణాధికారి తెలిపారు. పిల్లల కోసం శిశుగృహకు దరఖాస్తు చేసుకున్నవారికి బిడ్డను అందిస్తామని పేర్కొన్నారు. పసికందు కన్న తల్లిదండ్రులు పూర్తి ఆధారాలతో వస్తే సమగ్ర దర్యాప్తు జరిపి వారికే అందిస్తామని తెలిపారు. ఆయనతో పాటు ఐసీడీఎస్ సూపర్వైజర్ జె.విజయేశ్వరి, శిశుగృహ మేనేజర్ కె.నరేష్, చైల్డ్ లైన్ కో ఆర్డినేటర్ ఎం. సంతోష్, సిబ్బంది పాల్గొన్నారు. -
చదువుల తల్లి శవమైపోయింది
► అనుమానాస్పదంగా డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్య ► కొల్లివలసలో విషాదఛాయలు ► అంత్యక్రియలకు సిద్ధమవుతుండగా పోలీసుల రంగప్రవేశం ► శ్మశానంనుంచి ఆస్పత్రికి మృతదేహం తరలింపు ► పోస్టుమార్టం రిపోర్టు వచ్చేకే పూర్తి వివరాలు అమ్మవారి పండగకు తల్లిదండ్రులతో కలిసి సంతోషంగా వెళ్లిన ఓ డిగ్రీ విద్యార్థిని.. తిరిగి ఇంటికి వచ్చిన కొద్దిసేపటికీ ఇంట్లో దూలానికి ఉరివేసుకుని దర్శనమిచ్చింది. ఆమదాలవలస మండలం గాజుల కొల్లివలసలో సంచలనం రేపిన ఈ సంఘటనలో వివరాలను పోలీసులు సైతం గోప్యంగా ఉంచుతున్నారు. ఆమదాలవలస: విశాఖపట్నం జిల్లా ఆమదాలవలస మండలంలోని గాజులకొల్లివలస గ్రామానికి చెందిన టీడ భాగ్యవతి(19) బుధవారం రాత్రి ఇంట్లో పెడక దూలానికి చున్నీతో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్ఐ కూన గోవిందరావు తెలిపారు. భాగ్యవతి ప్రస్తుతం శ్రీకాకుళం మెన్స్ డిగ్రీ కళాశాలలో డిగ్రీ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. ఆయన కథనం ప్రకారం.. భాగ్యవతి బుధవారం తన తల్లిదండ్రులు లక్ష్మీకాంతం, రామయ్యలతో కలిసి పట్టణంలోని వెంగళరావు కాలనీలో జరిగిన అమ్మవారి పండగలకు హాజరై తిరిగి రాత్రి ఇంటికి చేరుకుంది. అప్పటివరకు అందరితో సరదాగా గడిపిన కుమార్తె, కొంత సేపటికి తమ ఇంట్లో వెనుకభాగంలో ఉన్న వంటగదిలో ఉరివేసుకుని వేలాడాన్ని గమించామని తల్లిదండ్రులు చెప్పినట్లు ఎస్ఐ తెలిపారు. తల్లిదండ్రులు కుమార్తె చావును గోప్యంగా ఉంచి గురువారం ఉదయాన్నే అంత్యక్రియలు చేసేందుకు ప్రయత్నించారని, ఇంతలో ‘100’ నంబర్‌కు ఆ గ్రామం నుంచి ఓ వ్యక్తి సమాచారం అందించడంతో ఎస్ఐ సిబ్బందితో హుటాహుటిన గ్రామానికి వెళ్లారు. అప్పటికే శ్మశానానికి తరలించిన మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు. యువతి మృతికి కారణాలు తెలియాల్సి ఉందని పోస్టుమార్టం నివే దిక ప్రకారం కారణాలు వెల్లడిస్తామని ఎస్ఐ తెలిపారు. డిగ్రీ పూర్తియిన తరువాత బ్యాంకు టెస్టుకు ప్రిపేరై బ్యాంకు జాబ్ పొందేందుకు నిరంతరం శ్రమిస్తానని చెప్పేదని, తెలివైన విద్యార్థిని ఇలా ఆత్మహత్యకు పాల్పడడాన్ని జీర్ణించుకోలేకపోతున్నామని గ్రామస్తులతో పాటు కుటుంబ సభ్యులతో చెబుతున్నారు. భాగ్యవతి మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. -
ఢీకొన్న వాహనంపైనే ఎగిరిపడ్డారు!
వాహనం ఢీకొని ఇద్దరు విద్యార్థినులకు తీవ్ర గాయాలు రిమ్స్‌కు తరలింపు ఆమదాలవలస: మండలంలోని శ్రీహరిపురం వద్ద అలికాం బత్తిలి రహదారిపై ఆదివారం మధ్యాహ్నం జరిగిన వాహన ప్రమాదంలో ఇద్దరు బాలికలకు తీవ్ర గాయాలయ్యాయి. వివరాలివీ.. మున్సిపాలిటీ పరిధి కృష్ణాపురం సమీప సీపానోడిపేటకు చెందిన గురుగుబెల్లి సంధ్య, అన్నెపు శ్రావణి అనే విద్యార్థినులు ఆమదాలవలస ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు 8వ తరగతి చదువుతున్నారు. ఆదివారం కావడంతో సైకిల్‌పై శ్రీహరిపురంలో ఉన్న తమ బంధువులు ఇంటికి బయలుదేరారు. అదేమార్గంలో ఎదురుగా సరుబుజ్జలి మండలం కూనజమ్మవాని పేట నుంచి నూతన వధూవరులతో ప్రయాణిస్తున్న టాటా సుమో కారు వీరిని ఢీకొట్టింది. బాలికలిద్దరూ ఎగిరి వాహనం ముందుభాగంలో ఉన్న అద్దంపైకి పడ్డారు. దీంతో ఇద్దరికీ తీవ్రగాయాలయ్యాయి. డ్రైవర్ పరారయ్యాడు. వాహనంలోని నూతన వధూవరులు, వారి బంధువులు స్థానికులు 108కు సమాచారం అందించినా ఆమదాలవలసలో లేదని, బూర్జవాహనానికి సమాచారం అందించారు. బూర్జవాహనం కూడా దూర ప్రాంతంలో ఉండడంతో శ్రీకాకుళం రిమ్స్ అంబులెన్సుకు సమాచారం అందిచారు. ప్రమాదం జరిగిన 45 నిమిషాలకు మూడు 108 వాహనాలు ఒకేసారి సంఘటన స్థలానికి చేరుకోగా, అప్పటికే క్షతగాత్రులను స్థానికులు ప్రైవేటు వాహనంలో రిమ్స్‌కు తరలించారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. రిమ్స్ ఔట్‌పోస్టు పోలీసులు కేసు నమోదు చేశారు. అక్కడి నుంచి వచ్చిన వివరాలను బట్టి తాము కూడా కేసు నమోదు చేస్తామని ఆమదాలవలస పోలీసులు తెలిపారు. -
ఆముదాలవలసలో చైన్ స్నాచింగ్
ఆముదాలవలస (శ్రీకాకుళం జిల్లా) : వాకింగ్ కు వెళ్తున్న ఓ మహిళ మెడలో నుంచి గొలుసు లాక్కెళ్లిన సంఘటన ఆముదాలవలస మండలం కొర్లకోట గ్రామంలో జరిగింది. గురువారం సాయంత్రం గ్రామానికి చెందిన సంపాదరావు జ్యోతి(40) వాకింగ్‌కు వెళ్తుండగా గుర్తుతెలియని ఇద్దరు వ్యక్తులు బైక్‌పై వచ్చి చోరీకి పాల్పడ్డారు. చోరీ అయిన గొలుసు విలువ రూ.లక్ష ఉంటుందని బాధితురాలు తెలిపింది.ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
వైభవంగా సంగమేశ్వర జాతర
ఆముదాలవలస (శ్రీకాకుళం జిల్లా) : శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస మండలంలోని సంగమేశ్వర కొండలో కొలువైన సంగమేశ్వర స్వామి జాతర శనివారం వైభవంగా జరిగింది. దాదాపు లక్షమంది భక్తులు జాతరలో పాల్గొని స్వామివారిని దర్శించికున్నారు. జిల్లా నుంచే కాక పొరుగు జిల్లాల నుంచి కూడా భక్తులు తరలివచ్చారు. -
అగ్నిప్రమాదంలో 18 ఇళ్లు దగ్ధం
ఆముదాలవలస (శ్రీకాకుళం) : గ్యాస్ సిలిండర్ లీక్ కావడంతో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో 18 ఇళ్లు దగ్ధమయ్యాయి. ఈ సంఘటన శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస మండలం తురకపేట గ్రామంలో శనివారం సాయంత్రం చోటుచేసుకుంది. గ్రామంలోని ఓ ఇంట్లో ప్రమాదవశాత్తూ గ్యాస్ లీక్ అవడంతో మంటలు ఎగసిపడ్డాయి. మంటలకు గాలి తోడవడంతో.. 18 ఇళ్లు కాలిపోయాయి. ఇది గుర్తించిన స్థానికులు ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. ప్రమాదంలో సుమారు 20 లక్షల వరకు ఆస్తి నష్టం వాటిల్లినట్లు స్థానికులు భావిస్తున్నారు. -
సేంద్రీయ వ్యవసాయంతో అధిక దిగుబడులు
ఆముదాలవలస (శ్రీకాకుళం జిల్లా) : సేంద్రీయ వ్యవసాయం చేయడం ద్వారా రైతులు అధిక దిగుబడులు సాధించవచ్చని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ స్పెషల్ ఛీప్ సెక్రటరీ విజయ్‌కుమార్ అన్నారు. శుక్రవారం ఆముదాలవలస మండలం నిమ్మతుర్లివాడ గ్రామంలో వ్యవసాయ జీడీ అప్పల స్వామి ఆధ్వర్యంలో జరిగిన సేంద్రియ వ్యవసాయంపై అవగాహన సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా విజయ్‌కుమార్ మాట్లాడుతూ.. రసాయనిక ఎరువుల వాడకం ద్వారా వ్యవసాయ ఉత్పత్తులు విషపూరితం అవుతున్నాయన్నారు. వీటిని వినియోగించిన ప్రజలు రోగాల బారిన పడుతున్నారని ఆయన చెప్పారు. సేంద్రీయ ఎరువుల వాడకం ద్వారా నాణ్యమైన ఆహార పదార్థాలను ఉత్పత్తి చేయవచ్చని, తద్వారా ప్రజలు రోగాలకు దూరంగా ఉండవచ్చని ఆయన సూచించారు. పాడి పరిశ్రమలను రైతులు అభివృద్ధి చేయాలని ఆయన కోరారు. -
ఇసుకాసురులు బౌండరీ దాటేశారు !
ఆమదాలవలస: ఇసుక కోసం కొంతమంది నిబంధనలను అతిక్రమిస్తున్నారు. అనుమతి ఒకచోట ఇవ్వగా..మరోచోట యథేచ్ఛగా తవ్వకాలు చేపట్టేస్తున్నారు. నిబంధనలు అతిక్రమించడంతోపాటు..బౌండరీలు (హద్దులు) దాటేస్తున్నా అధికారులు మాత్రం కనీసం పట్టించుకోవడం లేదు. రాజకీయ నాయకుల తీరు కారణంగానే ఈ పరిస్థితి నెలకుందనే విమర్శలు వస్తున్నాయి. పొందూరు మండలం సింగూరు ర్యాంపు పేరతో ఆమదాలవలస మండలం దూసి పంచాయతీ పరిధి నాగావళి నదిలో ఇసుక అక్రమ త వ్వకాలు యథేచ్ఛగా జరిగిపోతున్నాయి. వాస్తవంగా సింగూరు గ్రామం వద్ద ఇసుక ర్యాంపునకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అయితే నిబంధనలకు విరుద్ధంగా దూసి గ్రామం వద్ద విచ్చలవిడిగా ఇసుకను తవ్వి తరలించేస్తుండడంతో ఈ గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. వివరాల్లోకి వెళితే...గతంలో దూసి వద్ద ఇసుక ర్యాంపును ప్రభుత్వం మంజూరు చేసింది. దీంతో ఆ గ్రామస్తులు హైకోర్టులో పిటిషన్ వేయడంతో అధికారులు ఈ ప్రాంతాన్ని పరిశీలించి ర్యాంపు నిర్వాహణకు వీల్లేదని ఆదేశాలు జారీ చేశారు. అయితే రాజకీయ నాయకుల అండతో సింగూరు ర్యాంపును నిర్వహిస్తున్న మహిళా సంఘాల సభ్యులు దూసి వద్ద ఇకసును తవ్వేస్తున్నట్టు స్థానికులు చెబుతున్నారు. సింగూరు ఇసుక ర్యాంపు పేరుమీద వచ్చిన చలానాలకు దూసిలో ఇసుకను లోడింగ్ చేస్తూ రాత్రి వేళల్లో దర్జాగా రవాణా చేస్తున్నారు. దూసి గ్రామం నుంచి తోటాడ వరకు రహదారిపై సుమారు 200 లారీలు ఇసుక కోసం బారులు దీని దర్శనమిస్తున్నాయి. పొక్లయినర్లతో బహిరంగంగా తవేస్తున్న ఇసుకను సుమారు 60 ట్రాక్టర్లలో లోడు చేసి రోడ్డుపైకి తీసుకొచ్చి లారీలకు లోడు చేస్తున్నారు. ఈ విషయంపై దూసి గ్రామస్తులు తహశీల్దారు, పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే అధికార పార్టీకి చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడి ఒత్తిడి కారణంగా అధికారులు ఎటువంటి చర్యలు చేపట్టకుండా చోద్యం చూస్తున్నారని దూసి సర్పంచ్ ప్రతినిధి దశరధరావు, గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. అక్రమ వసూళ్లు, రవాణా ర్యాంపు వద్ద ఉన్న లారీలు, ట్రాక్టర్లు చలానాలు కట్టి ఇసుకను తీసుకెళ్లేందుకు వచ్చినప్పటికీ వారి వద్ద నుంచి లారీకి రూ. 200, ట్రాక్టర్‌కు వంద రూపాయలు అక్రమంగా వసూళ్లు చేస్తున్నారని డ్రైవర్లు ఆరోపిసుతన్నారు. డబ్బులు ఇవ్వనివారి వాహనాలను క్యూలైన్ల నుంచి తప్పించి వెనుక వచ్చిన వారికి లోడింగ్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని లోకల్ వాహనాలతో ఒకే చలానా, ఒకే బిల్లుతో మూడు, నాలుగు సార్లు ఇసుకను లోడ్ చేస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారని దూసి గ్రామస్తులు చెబుతున్నారు. మహిళా సంఘాలతో నడిపిస్తున్న ఇసుక ర్యాంపు వద్దకు రాజకీయ నాయకులు, గ్రామ సర్పంచ్‌లు రావాల్సిన పనేంటని ప్రశ్నిస్తున్నారు. చీకటి పడిన తరువాత ఇసుక ర్యాంపు నిర్వాహణ నిలిపి వేయాలన్న నిబంధనలు ఉన్నప్పటికీ అర్ధరాత్రి వరకు తవ్వకాలు చేస్తున్నట్టు చెబుతున్నారు. సంబంధిత ఉన్నతాధికారులు స్పందించి ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్న ఇసుక అక్రమరవాణాకు అడ్డకట్ట వేయాలని ప్రజలు కోరుతున్నారు. -
మూడు బైక్‌లు ఢీ..ఇద్దరి దుర్మరణం
ఆమదాలవలస, న్యూస్‌లైన్ : తాళ్లవలస వద్ద మూడు బైక్‌లు ఢీకొన్న ప్రమాదంలో ఓ వృద్ధురాలు, మరో పోస్ట్‌మాస్టర్ దుర్మరణం పాలయ్యారు.. ఐదుగురు క్షతగాత్రులుగా మిగిలారు.వృద్ధురాలు సంఘటన స్థలంలోనే ప్రాణాలు కోల్పో గా..పోస్ట్‌మాస్టర్ మాత్రం విశాఖ కేజీహెచ్‌లో చికిత్స పొ పోలీసులు, ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. బూర్జ మండలం తోటవాడ గ్రామానికి చెందిన పోస్టుమాస్టర్ తోట అప్పారావు, మనమడు చిన్నితో కలిసి శ్రీకాకుళం వెళ్లి..బజాజ్ చేతక్ వాహనంపై తోటవాడకు వస్తున్నారు. వారికి ఎదురుగా చింతలపేట గ్రామానికి చెందిన సిమ్మ యోగేశ్వరరావు..తన బైక్‌పై అమ్మమ్మ దండకల అప్ప మ్మ, తల్లి సిమ్మ రత్నాలమ్మలను ఎక్కించుకుని ఆమదాలవలస వైపు వస్తున్నాడు. అదే వైపు నుం చి సారవకోటకు చెందిన సిమ్మ లక్ష్మీనారాయణ, సిమ్మ నారాయణరావులు కూడా బైక్‌పై వస్తున్నారు. సరిగ్గా..తాళ్లవలస గ్రామం వద్దకు వచ్చేసరికి.. ఎదురెదురుగా వచ్చిన తోట అప్పారావు చేతక్ వాహ నం, యోగేశ్వరరావు బైక్‌ను ఢీకొట్టింది. దీం తో అప్పమ్మ(75) బైక్ నుంచి జారిపడి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. మిగిలిన నలుగురికి గాయాలయ్యాయి. అదే రూట్ వచ్చిన లక్ష్మీనారాయణ బైక్ సైతం వీరి వాహనాలను ఢీకొట్టడంతో..దానిపై ఉన్న ఇద్దరికీ గాయాలయ్యాయి. సంఘటన స్థలంలో భయానక వాతావరణం నెలకొంది. క్షణాల్లో ప్రమాదం జరగడం..ప్రాణాలు గాలిలో కలిసిపోవడాన్ని చూసిన స్థానికులు విస్తుపోయారు. వెంటనే 108 వాహనానికి సమాచారమందించారు. గాయపడ్డ అరుగురిని శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు. అప్పా రావు పరిస్థితి విషమించడంతో విశాఖపట్నం కేజీహెచ్ కు తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ ఆయన ప్రాణాలు కోల్పోయారు. అప్పమ్మ మృతదేహానికి శవపంచనామా నిర్వహించి, పోస్టుమార్టం నిమిత్తం శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై ఎన్.సునీల్ చెప్పారు. విషాదఛాయలు ప్రమాద విషయం తెలుసుకున్న చింతలపేట గ్రామస్తులు, మృతురాలి కుటుంబ సభ్యులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. మృతదేహం వద్ద గుండెలు బాదుకుని విలపించారు. గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మనుమడితో కలిసి..ఆస్పత్రికి వెల్లిన అప్పమ్మ ఇలా తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయిందంటూ.. వారు విలపిస్తున్నతీరు స్థానికులను సైతం కంటతడి పెట్టించింది.