వాకింగ్ కు వెళ్తున్న ఓ మహిళ మెడలో నుంచి గొలుసు లాక్కెళ్లిన సంఘటన ఆముదాలవలస మండలం కొర్లకోట గ్రామంలో జరిగింది.
ఆముదాలవలస (శ్రీకాకుళం జిల్లా) : వాకింగ్ కు వెళ్తున్న ఓ మహిళ మెడలో నుంచి గొలుసు లాక్కెళ్లిన సంఘటన ఆముదాలవలస మండలం కొర్లకోట గ్రామంలో జరిగింది. గురువారం సాయంత్రం గ్రామానికి చెందిన సంపాదరావు జ్యోతి(40) వాకింగ్‌కు వెళ్తుండగా గుర్తుతెలియని ఇద్దరు వ్యక్తులు బైక్‌పై వచ్చి చోరీకి పాల్పడ్డారు. చోరీ అయిన గొలుసు విలువ రూ.లక్ష ఉంటుందని బాధితురాలు తెలిపింది.ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.