సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని వెనుకబడిన వర్గాల ప్రజల సమస్యలను చర్చించి భవిష్యత్ కార్యాచరణ రూపొందించేందుకు ఈనెల 31న హైదరాబాద్‌లో రాష్ట్ర స్థాయి విస్తృత సమావేశం నిర్వహించాలని బీసీ సంఘాలు నిర్ణయించాయి. ఈ సమావే శంలో ప్రధానంగా వచ్చే ఎన్నికలలో అన్ని రాజకీయ పార్టీల నుంచి బీసీలకు 150 అసెంబ్లీ, 22 ఎంపీ సీట్ల కేటాయింపు, చట్టసభల్లో రిజర్వేషన్లు, బీసీ సబ్‌ప్లాన్ తదితర అంశాలు ఎజెండాగా ఉంటాయని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ సమావేశానికి ఎనిమిది మంది బీసీ మంత్రులు, 9 మంది ఎంపీలు, 70 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వివిధ యూనివర్సిటీల ప్రొఫెసర్లు, కులసంఘాల ముఖ్యులు హాజరవుతారని ఆయన వెల్లడించారు.