bc community
-
Margani Bharat: బీసీలంటే లోకువా..?
-
బీసీల చుట్టూ టీడీపీ రాజకీయ క్రిడ
-
కులగణన జరిపిస్తానని సీఎం జగన్ చెప్పారు
-
ఫస్ట్ లిస్టులో బీసీలకు మొండి చెయ్యి..
-
గోనె ప్రకాష్ రావుపై దాడికి యత్నం
సాక్షి, ఢిల్లీ: మాజీ ఎమ్మెల్యే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ మాజీ చైర్మన్ గోనె ప్రకాష్ రావు (Gone Prakash rao)పై దాడికి యత్నం జరిగింది. ఢిల్లీలో గోనెను బీసీ సంఘాల నేతలు కొందరు కొట్టేందుకు యత్నించారు. ఢిల్లీ ఏపీ భవన్లో ప్రెస్ మీట్ నిర్వహించిన గోనె.. ఆ క్రమంలో కాంగ్రెస్ నేత మధుయాష్కీ గౌడ్‌ను తీవ్ర స్థాయిలో విమర్శించారు. అది గమనించిన బీసీ సంఘాల కార్యకర్తలు కొందరు.. గోనె ప్రకాశ్‌ను నెట్టేసి దాడికి యత్నించారు. -
కాంగ్రెస్ టికెట్ సొంతం చేసుకునే బీసీ నేతలు ఎవరు?
-
సీఎం జగన్ నిర్ణయం చరిత్రాత్మకం
ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలోకి వచ్చింది మొదలు అట్టడుగు వర్గాల అభ్యున్నతి కోసం వినూత్నమైన, సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో బీసీల కుల గణనకు సంకల్పించి ఆ వర్గాల చిరకాల వాంఛ నెరవేర్చారు. గద్దెనెక్క దల్చుకున్న ప్రతి పార్టీ అట్టడుగు వర్గాల ఉద్ధరణే ధ్యేయమని ప్రకటించటం మన దేశంలో రివాజు. అధికారం వస్తే గిస్తే ఆ వర్గాల నేతల్లో కొందరికి మొక్కుబడిగా పదవులివ్వటం, ఆ వర్గాల ప్రజలను ఆర్థికంగా ఆదుకునే పేరుతో నామమాత్రంగా నిధులు విదల్చటం కూడా షరా మామూలే. కానీ జగన్మోహన్ రెడ్డి ఇందుకు భిన్నంగా సాధారణ ప్రజానీకానికి అన్ని రకాల సంక్షేమ పథకాలు అమలు చేస్తూనే తన కేబినెట్లో 68 శాతం పదవులు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు కేటాయించి ఔరా అనిపించారు. సామాజిక న్యాయానికి పెద్ద పీట వేస్తూ చట్టసభల్లో, స్థానిక సంస్థల పదవుల్లో అట్టడుగు కులాలకు ప్రాతినిధ్యం గణనీయంగా పెంచటమే కాదు... అన్ని రకాల నామి నేటెడ్ పదవుల్లో, నామినేషన్లపై ఇచ్చే పనుల్లో కూడా ఆ వర్గాలకు 50 శాతం కేటాయించాలని నిర్దేశించారు. వెనకబడిన కులాల్లో ఇంతవరకూ ఎవరి దృష్టీ పడని కులాలకు సైతం ప్రత్యేక కార్పొరేషన్లు ఏర్పాటు చేసి వారి సామాజిక ఆర్థిక ప్రగతికి అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు. ఆ క్రమంలో బీసీల కుల గణనకు పూనుకోవాలనుకోవటం అత్యంత కీలక నిర్ణయం. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లవుతున్నా, జనాభాలో 56 శాతంగా ఉన్న బీసీ కులాలకు విద్య, ఉపాధి, రాజకీయ రంగాల్లో పెద్దగా ప్రాధాన్యత లేదు. వివక్ష కారణంగా వెనకబాటుతనానికి గురవుతున్న కులాలను గుర్తించేందుకు 1979లో కేంద్రంలోని అప్పటి జనతా పార్టీ ప్రభుత్వం మండల్ కమిషన్ ఏర్పాటు చేసింది. ఆ కమిషన్ ఇచ్చిన సమగ్రమైన నివేదికను పట్టించుకుని తగిన చర్యలు తీసుకోవాలన్న స్పృహ ఎవరికీ లేని కారణంగా దశాబ్దంపాటు అది మూలనపడింది. 1989లో అప్పటి ప్రధాని వీపీ సింగ్ నేతృత్వంలోని సర్కారు ఆ నివేదిక దుమ్ము దులిపి ఓబీసీలకు 27 శాతం రిజర్వేషన్లు కల్పించాలని నిర్ణయించటం ఆ వర్గాల వారికి విద్య, ఉద్యోగావకాశాలను కల్పించటం మాత్రమే కాదు... దేశ రాజకీయాల గతినే మార్చేసింది. ఆ తర్వాత నుంచి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏదోమేరకు ఆ వర్గాల వారికి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాయి. అరకొరగానైనా ఆ వర్గాలకు రాజకీయ పదవులు దక్కుతున్నాయి. విద్య, ఉపాధి రంగాల్లో రిజర్వేషన్లు ఇంకా పూర్తి స్థాయిలో అమలుకావటం లేదు. ఉన్నతశ్రేణి విద్యాసంస్థల్లోనూ, ఇతరత్రా ప్రభుత్వరంగ సంస్థ ల్లోనూ కోటా అమలు అంతంతమాత్రంగానే ఉన్నదని బీసీ వర్గాలు తరచు ఆరోపిస్తున్నాయి. జనాభాలో మెజారిటీ వర్గ ప్రజలు అభ్యున్నతి సాధించకుండా దేశం ఉన్నత స్థాయికి చేరుకోవటం సాధ్యమవుతుందా? దేశంలో చివరిసారి కులగణన బ్రిటిష్ పాలకుల హయాంలో 1931లో జరిగింది. స్వతంత్ర భారతదేశంలో పదేళ్లకోసారి నిర్వహించే జనాభా లెక్కల సేకరణ 1951లో మొదలు కాగా, 2011లో జరిగిన జనాభా లెక్కల సేకరణ వరకూ బీసీ కులాల గణన జోలికే మన పాలకులు పోలేదు. పశుపక్ష్యాదుల లెక్కలు సైతం తెలుసుకోవాలనుకునే ప్రభుత్వాలకు బీసీ జనాభా గణన పట్టకపోవటం దిగ్భ్రాంతి కలిగిస్తుంది. ఒకపక్క అట్టడుగు వర్గాల ఉద్ధరణ ధ్యేయమంటూ పథకాలు రూపొందించిన పాలకులు అవి లక్షిత వర్గాలకు చేరుతున్నాయో లేదోనన్న స్పృహ లేకుండా గడిపారు. అందువల్లే ఇన్నేళ్లుగా ఆశించిన ఫలితాలు రాలేదన్నది వాస్తవం. వేళ్లమీద లెక్కించదగ్గ కులాలు మినహా ఇప్పటికీ చాలా బీసీ కులాలు సంక్షేమ పథకాల మాట అటుంచి కనీస అవసరాలు కూడా దక్కించుకోలేకపోతున్నాయి. మండల్ కమిషన్ నివేదిక ప్రకారం బీసీ కులాలు 2,666 కాగా సంక్షేమ ఫలాలు అందుకునే కులాలు అందులో పట్టుమని పదిశాతం కూడా ఉండటం లేదు. బీసీ జనాభా సంఖ్య ఎంతన్నది మిస్టరీగా మిగిలిపోవటం వల్ల ఆర్థికంగా, విద్యాపరంగా, ఉపాధిపరంగా ఆ వర్గాల స్థితిగతులేమిటన్నది ప్రభుత్వాలకు తెలియటం లేదు. రూపొందించే పథకాలు, అందు కోసం కేటాయించే నిధుల వ్యవహారం చీకట్లో తడుములాటగా సాగుతోంది. ఆంధ్రప్రదేశ్‌లో 341 రోజులపాటు సాగించిన 3,641 కిలోమీటర్ల ప్రజా సంకల్పయాత్రలో కోట్లాదిమంది అట్టడుగు ప్రజానీకం కష్టాలనూ, కడగళ్లనూ జగన్ కళ్లారా చూసినందువల్లే నవరత్నాల పేరిట అనేక సంక్షేమ పథకాలు పొందుపరిచి మేనిఫెస్టో రూపొందించారు. వాటిని అమలు చేస్తూనే ఇతరేతర వర్గాలకు లబ్ధి చేకూరేలా మరిన్ని పథకాలను ఆచరణలోకి తీసుకొచ్చి సంక్షేమ ఫలాలు సంపూర్ణంగా అందేలా చర్యలు తీసుకున్నారు. బీసీల జనాభా గణన పూర్తయితే ఇది మరింత పదునుతేరుతుందన్న ఆలోచన ఆయనది. అందువల్లే ఈసారి జనాభా లెక్కల్లో బీసీ కులాలను గణించాలన్న బీసీ వర్గాలకు అందరికన్నా ముందు మద్దతు పలకటమేకాక, ఆ డిమాండ్‌ను సమర్థిస్తూ పార్లమెంటులో తమ పార్టీ ఎంపీలతో మాట్లాడించారు. రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం ఆమోదింపజేశారు. బీసీల కుల గణన నిర్ణయానికి అనువుగా ఇప్పటికే ఆ దిశగా అడుగులేసిన రాష్ట్రాల్లో కార్యాచరణ ఏ విధంగా ఉందన్న అంశాన్ని అధ్యయనం చేసేందుకు, మార్గదర్శకాలు రూపొందించేందుకు కమిటీ ఏర్పాటు చేశారు. జాతీయ పక్షాలుగా ముద్రపడిన పార్టీలు సైతం బీసీ వర్గాల డిమాండ్‌పై నికరమైన విధానం ప్రకటించలేని నిస్సహాయతలో పడగా ఆదినుంచీ అందుకు మద్దతిస్తున్న జగన్మోహన్ రెడ్డి తన తాజా నిర్ణయంతో ఆ వర్గాలకు మరింత చేరువయ్యారు. -
AP: కొప్పుల వెలమలకు తొలిసారి గుర్తింపు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కొప్పుల వెలమ సామాజికవర్గానికి తొలిసారి గుర్తింపునిచ్చింది సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అని కొప్పుల వెలమ కార్పొరేషన్ చైర్మన్ నెక్కల నాయుడుబాబు చెప్పారు. ఎమ్మెల్యే బూడి ముత్యాలనాయుడుని గతంలో ప్రభుత్వ విప్‌గా నియమించారని, ఇప్పుడు కీలకమైన ఉప ముఖ్యమంత్రిగా, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా నియమించడం తమకు జగన్ ఇచ్చిన గౌరవమని అన్నారు. ఆయన సోమవారం విజయవాడలో విలేకరులతో మాట్లాడుతూ.. రాష్ట్ర జనాభాలో 25 లక్షల మందికి పైగా ఉన్న తమ సామాజికవర్గం కోసం మొదటిసారి సీఎం జగన్ కార్పొరేషన్ ఏర్పాటు చేశారని తెలిపారు. కొప్పుల వెలమలు వైఎస్ జగన్ వెంట నడుస్తారని చెప్పారు. చదవండి: ఏపీ మంత్రుల ప్రమాణ స్వీకారోత్సవంలో ఆసక్తికర దృశ్యాలు -
రాజకీయ రిజర్వేషన్ల సాధనే ధ్యేయం
ముషీరాబాద్(హైదరాబాద్): చట్లసభల్లో బీసీలకు 50 శాతం రాజకీయ రిజర్వేషన్ల సాధన తన జీవితాశయమని బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య అన్నారు. ఇప్పటి వరకు విద్య, ఉద్యోగ, ఆర్థిక రంగాల్లో బీసీల వాటాకోసం పోరాటాలు చేసి అనేక విజయాలు సాధించామన్నారు. సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ కృష్ణ, లాల్ కృష్ణ ఆధ్వర్యంలో ఆదివారం ఆర్.కృష్ణయ్య జన్మదిన వేడుకలు విద్యానగర్‌లోని బీసీ భవన్లో జరిగాయి. ఈ సందర్భంగా పేద విద్యార్థులకు నోటు పుస్తకాలు, పెన్నులు, మిఠాయిలు పంపిణీ చేశారు. అనంతరం కృష్ణయ్య మాట్లాడారు. బీసీలను విద్య, విజ్ఞానం, పరిపాలనకు దూరంగా ఉంచారని, అలాంటి సమయంలో సంఘం స్థాపించి వేలాది ఉద్యమాలు, ధర్నాలు నిర్వహించి విజయం సాధించామన్నారు. మండల్ కమిషన్, మురళీధర్ రావు కమిషన్ సిఫార్సుల అమలు కోసం చేసిన పోరాటం ఎప్పటికీ మరిచిపోలేనని చెప్పారు. వసతి గృహాలు, రెసిడెన్షియల్ పాఠశాలలు, స్థానిక సంస్థల్లో రాజకీయ రిజర్వేషన్లు, రీయింబర్స్మెంట్ సాధించి బీసీలకు సాధికారత కల్పించగలిగామన్నారు. చట్టసభల్లో బీసీలకు 50% రిజర్వేషన్ల సాధనకు రెట్టింపు శక్తితో పోరాడతామన్నారు. కార్యక్రమంలో సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి కోలా జనార్ధన్, విద్యార్థి నేత వేముల రామకృష్ణ, మహిళా రక్షకదళ చైర్మన్ ముట్ట జయంతిగౌడ్, బీసీ రక్షకదళ్ నాయకుడు ఉదయ్ పాల్గొన్నారు. -
బీసీ విజ్ఞాన సూర్యోదయం
తెలంగాణ రాష్ట్రంలో బహుజనుల జీవన విధానాన్ని మార్చి అన్నీ రంగాల్లో వారిని సమోన్నతంగా నిలపడానికి విద్యా విప్లవాలు విజయవంతమవుతున్నాయి. ఇపుడు తెలంగాణలో విద్యా విప్లవాలు అట్టడుగువర్గాల బహుజన వాకిళ్ల నుంచి విరబూస్తున్నాయి. రాష్ట్ర అవతరణ తర్వాత జరిగిన పెద్దమార్పు ఇది. కార్పొరేట్ విద్యావ్యవస్థను పారద్రోలాలని నినాదాలిస్తే సరిపోదు. అందుకు ప్రత్యామ్నాయంగా తెలంగాణలో 959 గురుకుల విద్యాలయాలు కేసీఆర్ దార్శనికతతో ప్రారంభించారు. ఇపుడు 10వ తరగతి, ఇంటర్మీడియట్లలో ఫలితాలన్నీ గురుకులాల విద్యావ్యవస్థకే దక్కాయి. ప్రధానంగా సమాజంలో సగభాగమైన బీసీల జీవితాలు సంపూర్ణంగా మారాలంటే విద్యాపరంగా ఈ వర్గాలు దూసుకుపోయేందుకు బీసీ గురుకులాలు ఎంతో దోహదం చేస్తాయి. పదవ తరగతి, ఇంటర్మీడియట్ ఫలితాల్లో బీసీ గురుకులాలే అగ్రభాగాన నిలిచి అత్యధిక ఫలితాలు సాధించాయి. ఇది బీసీ వర్గాలకు పలవరింతల పరవశం. తెలంగాణ రాష్ట్రం అవతరణకు ముందు బీసీలకు 19 గురుకులాల విద్యాసంస్థలు మాత్రమే ఉన్నాయి. ఇపుడవి 281 సంస్థలుగా వెలుగొందుతున్నాయి. 2015 నుంచి జూనియర్ కాలేజీలు ప్రారంభిస్తే ప్రతి ఏడాది ఈ విద్యాసంస్థలే అత్యధిక ఫలి తాలు సాధిస్తున్నాయి. ఒక బీసీ గురుకుల డిగ్రీ కాలేజీ ఉంది. అది కూడా ఉస్మానియా విశ్వవిద్యాలయ ఫలితాల్లో ఫస్ట్‌గా నిలిచింది. ఈ డిగ్రీ కాలేజీ నుంచి బైటకు వచ్చిన విద్యార్థులు దేశంలోని ప్రముఖ సంస్థల్లో పైచదువులు, శిక్షణ పొందుతున్నారు. ప్రతిష్ఠాత్మకమైన విశ్వవిద్యాలయాల్లో చదువుతున్నారు. ఈ ఫలితాలను చూసిన తర్వాతనే ముఖ్యమంత్రి కేసీఆర్ ఎస్సీల పిల్లలకోసం 30 డిగ్రీ కాలేజీలు, ఎస్టీ పిల్లలకోసం 22 డిగ్రీ కాలేజీలు ప్రారంభించారు. ట్రైబల్ వెల్ఫేర్‌లో 7 ఉమెన్స్ డిగ్రీ, 15 మెన్స్ డిగ్రీ కాలేజీలు నెలకొల్పారు. ఎస్సీ, ఎస్టీలకు ఒక్కొక్క ఆర్మీ డిగ్రీ కాలేజీ పెట్టాలని నిర్ణయించారు. తెలంగాణలో 2023–24కు 119 బీసీల గురుకుల పాఠశాలలు జూనియర్ కాలేజీలుగా అప్‌గ్రేడ్ అవుతాయి. ప్రతి ఏడాది 20 వేల మంది విద్యార్థులు ఈ సంస్థల నుంచి ఇంటర్ పూర్తి చేసుకుని వస్తారు. అదే ఐదేళ్లలో ఒక లక్షమంది వస్తారు. వీళ్లు తెలంగాణలో అన్నిరంగాల్లోకి ఒక బలమైన శక్తిగా వెళ్లగలుగుతారు. తెలంగాణలో 125 బాలికల గురుకులాల విద్యాసంస్థలవల్ల భవిష్యత్తులో వీళ్లు జీవితంలో ఉన్నతంగా స్థిరపడుతున్న విశ్వాసం వ్యక్తమవుతుంది. బీసీ గురుకులాల్లోని 281 విద్యాసంస్థల్లో 2019–20కి గాను 90 వేలమంది విద్యార్థులుంటే 2020–21కి ఆ సంఖ్య ఒక లక్షా 11వేలకు పెరిగింది. వచ్చే ఏడాదికి 20 వేలమంది పెరుగుతారు. 2024–25 నాటికి ఒక లక్షా 70 వేలమంది బీసీ వర్గాలకు చెందిన పిల్లలు విద్యనభ్యసిస్తారంటే మొత్తం బీసీ కుటుంబాలను అవి ప్రభావితం చేస్తాయి. ప్రతి ఏడాది 10వ తరగతి, ఇంటర్ పూర్తిచేసిన 20వేల మంది ప్రతిభావంతులైన బీసీ విద్యార్థులు పైచదువులకు ఇతర కోర్సుల్లోకి వెళుతున్నారు. కేసీఆర్ ఆలోచనల్తో వెలిసిన 959 బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, ఆదివాసీల గురుకులాలలో 4 లక్షలమంది విద్యనభ్యసిస్తున్నారు. 2024–25 నాటికి ఆ సంఖ్య వూహించని విధంగా పెరుగుతుంది. ఇది విద్యావిప్లవమే. దేశంలో ఎక్కడాలేని విధంగా 959 విద్యాసంస్థలు నెలకొల్పింది తెలంగాణ రాష్ట్రమే. రాబోయే ఐదేళ్లలో మొత్తం తెలంగాణ సమాజాన్ని ప్రభావితం చేసే మహాశక్తులుగా ఈ గురుకుల విద్యార్థులే అన్నిరంగాల్లో అగ్రభాగాన నిలుస్తారనటంలో సందేహం లేదు. ఇది సి.ఎం.కేసీఆర్కున్న దూరదృష్టి. ఇప్పటికే తెలంగాణ సీడ్స్హబ్, ఫార్మాహబ్, ఐటీహబ్, దేశానికి తిండిపెట్టే ధాన్యాగారంగా అగ్రభాగాన నిలిచింది. త్వరలో విద్యాహబ్‌గా తెలంగాణ తయారై తీరుతుంది. రాష్ట్రంలోని 24 లక్షలమంది విద్యార్థులకు విద్యనందించే ప్రభుత్వ స్కూళ్లను సెమి రెసిడెన్షియల్ స్కూళ్లుగా నిర్వహిస్తున్నారు. వీటిని కూడా పకడ్బందీగా నిర్వహించేందుకు అన్నివర్గాల, అన్నికులాల పేదపిల్లలకు ఉచిత చదువునందిం చేందుకు కేసీఆర్ దూరదృష్టితో అడుగులు వేస్తున్నారు. వూహించని విధంగా బీసీ డిగ్రీకాలేజీల సంఖ్యకూడా గణనీయంగా పెంచే ఆలోచనల్లోనే ప్రభుత్వం దృష్టిసారిస్తుంది. తెలంగాణను ఎడ్యుకేషన్ హబ్‌గా తీర్చిదిద్దే కీలకమైన పనిని కేసీఆర్ తన భుజస్కంధాలపై వేసుకున్నారు. తెలంగాణలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, ఆదివాసీలు 85శాతంగా వున్న ఆ వర్గాలు అన్నిరంగాల్లో శిరసెత్తుకుని నిలవాలంటే అందుకు బలమైన పునాది అయిన విద్యారంగాన్ని తీర్చిదిద్దాలన్న తలం పుతోనే కేసీఆర్ అడుగులు వేస్తున్నారు. సమాజంలో సగభాగమైన బీసీ పిల్లలు జ్ఞానసూర్యులుగా తయారుకావడం బీసీలకు ఇక ఆకాశమే హద్దు. ఇవే జ్ఞానతెలంగాణకు బలమైన పునాదులు. జూలూరు గౌరీశంకర్ వ్యాసకర్త ప్రముఖ కవి, సామాజిక విశ్లేషకులు మొబైల్ : 94401 69896 -
సీఎం జగన్ సమీక్ష.. కీలక ఆదేశాలు
-
సీఎం జగన్ సమీక్ష.. కీలక ఆదేశాలు
సాక్షి, అమరావతి : వెనుకబడిన బీసీ సామాజిక వర్గాలకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేసేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మరో ముందడుగు వేశారు. ఈ మేరకు బీసీ అధ్యయన కమిటీ సభ్యులు, బీసీ మంత్రులు, ఆ సామాజిక వర్గాల ప్రతినిధులతో క్యాంపు కార్యాలయంలో సీఎం శనివారం సమీక్ష చేపట్టారు. గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల ముందు బీసీల సమస్యలపై జంగా కృష్ణమూర్తి ఆధ్వర్యంలో అధ్యయన కమిటీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. సుదీర్ఘ చర్చలు, పరిశీలన అనంతరం కమిటీ నివేదినకు సమర్పించింది. దీంతో నేటి సమీక్షలో నివేదిక, అందులోని అంశాలపై ప్రభుత్వ పరంగా తీసుకోవాల్సిన చర్యలపైనా సమావేశంలో విస్తృతంగా చర్చించారు. ఎన్నో ఏళ్లుగా నిరాదరణకు, నిర్లక్ష్యానికి గురైన సంచార వర్గాల వారి అభ్యున్నతికి కృషి చేయాలని ఈ సందర్భంగా సీఎం జగన్ నిర్ణయించారు. బీసీల జీవన ప్రమాణాలు పెంచేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సమీక్ష సమావేశంలో చర్చించారు. 10వేల నుంచి లక్ష జనాభా ఉన్న బీసీ వర్గాల వారిని ఒక కేటగిరిగా, లక్ష నుంచి 10 లక్షల వరకు ఉన్న బీసీ వర్గాల వారిని రెండో కేటగిరిగా, 10లక్షలు ఆ పైబడి జనాభా ఉన్న బీసీ వర్గాల వారిని మూడో కేటగిరిగా విభజించి.. ఆ మేరకు కార్పొరేషన్లు ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఆయా వర్గాల అభ్యున్నతి కోసం కార్పొరేషన్ల ద్వారా విస్తృత చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. పదివేల లోపు ఉన్న సంచారజాతులు, గుర్తింపునకు నోచుకోని వర్గాల వారికి సరైన గుర్తింపునిచ్చి.. వారు కూడా సమాజంలో నిలదొక్కుకునేలా ప్రభుత్వ పరంగా చేయూతనివ్వాల్సిన చర్యలపై సమావేశంలో సీఎం పలు సూచనలు చేశారు. గృహనిర్మాణం, పెన్షన్లు, రేషన్ కార్డులు, కులవృత్తులు చేసుకోవడానికి అవసరమైన ఆర్థిక వెసులుబాట్లు కల్పించాలన్న దిశగా చర్యలు తీసుకోవాలని అధికారులతో చెప్పారు. ఈ మేరకు ప్రభుత్వ కార్యక్రమాలు కొనసాగాలని, అవసరమైన మరోసారి విస్తృత సమావేశం ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు. ఈ సమావేశంలో మంత్రులు, శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యులు, బీసీ సమాజిక వర్గాల ప్రతినిధులతో విస్తృత స్థాయిలో సమావేశం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. మరోసారి నిర్వహించే సమావేశంలో.. బీసీల అభ్యున్నతి కోసం తీసుకోవాల్సిన చర్యలపై సూచనలు, సలహాలు స్వీకరించాలని సీఎం అన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు బొత్స సత్యన్నారాయణ, మోపిదేవి వెంకటరమణ, అనిల్‌కుమార్ యాదవ్, ధర్మాన కృష్ణదాస్, శంకరనారాయణ, బీసీ వర్గాల ప్రతినిధులు పొల్గొన్నారు. -
రాజంపేటలో వైఎస్ఆర్సీపీ బీసీల ఆత్మీయ సభ
-
బీసీలకు చంద్రబాబు చేసిందేమీ లేదు
సాక్షి, విజయవాడ: ఎన్నికలు సమీపించడంతోనే చంద్రబాబు జయహో బీసీ సభ అంటున్నారని, కానీ ఆయన బీసీలకు చేసిందేమీ లేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయవాడ పార్లమెంటు బీసీ సెల్ అధ్యక్షుడు కసగోని దుర్గారావు విమర్శించారు. విజయవాడలోని పార్టీ కార్యాలయంలో ఆయన శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. బీసీల విషయంలో చంద్రబాబు మరో కపట నాటకం ఆడుతున్నారని మండిపడ్డారు. వైఎస్సార్సీపీ వచ్చే నెలలో బీసీ గర్జన సభ నిర్వహించి బీసీ డెక్లరేషన్‌ను ప్రకటించబోతోందని వెల్లడించారు. బీసీ కులాలను చట్టసభల్లో కూర్చోపెట్టేది వైఎస్ జగన్ మాత్రమేనని ఆయన స్పష్టం చేశారు. తమ పార్టీ బీసీ అధ్యయన కమిటీ తుది ముసాయిదా నివేదికను ఈ నెల 28న పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌కు అందజేస్తుందని తెలిపారు. వైఎస్సార్సీపీ బీసీ విభాగం రీజినల్ కో-ఆర్డినేటర్లు వీరే.. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ బీసీ విభాగం రీజినల్ కో-ఆర్డినేటర్లను నియమించినట్టు పార్టీ కేంద్ర కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. బీసీ విభాగం రాయలసీమ రీజినల్ కో-ఆర్డినేటర్‌గా తొండమల్ల పుల్లయ్య, బీసీ విభాగం కోస్తాంధ్ర రీజినల్ కో-ఆర్డినేటర్‌గా అంగిరేకుల ఆదిశేషు, బీసీ విభాగం ఉత్తరాంధ్ర రీజినల్ కో-ఆర్డినేటర్‌గా పక్కి వెంకటసత్య దివాకర్‌ను నియమించినట్టు తెలిపింది. -
ఓట్ల కోసం బీసీలను వాడుకుంటున్న పార్టీలు..
సాక్షి, అమరావతి: బీసీ న్యాయవాదులను న్యాయమూర్తులు కాకుండా ముఖ్యమంత్రి చంద్రాబాబు నాయుడు అడ్డుకుంటున్నారని, ఇంతకంటే దౌర్భాగ్యం మరొకటి ఏముంటుందని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య అన్నారు. ఈ ప్రభుత్వానికి బీసీలు మద్దతు ఇచ్చారని, ప్రభుత్వం బీసీలకు అన్యాయం చేస్తోందన్నారు. గురువారం విజయవాడలోని ఐలాపురం హోటల్లో జరిగిన బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. బీసీలంటే ఉన్నత ఉద్యోగాల్లో ఉండకూడదనే కుట్ర సీఎం మనసులో ఉండటం ఏమిటని ప్రశ్నించారు. బీసీలకు అన్యాయం చేస్తే ఒప్పుకునేది లేదని, బీసీ కార్యకర్తలందరూ పార్టీ పెట్టాలని కోరుతున్నారన్నారు. బీసీ న్యామవాదులు తీవ్ర స్థాయిలో సీఎం లేఖను వ్యతిరేకిస్తున్నారని, బీసీ సంఘాలు కూడా అదే స్థాయిలో వ్యతికేకిస్తున్నట్లు చెప్పారు. ఆరుగ్గురు బీసీ న్యాయవాదులు న్యాయమూర్తులు కాకుండా అడ్డుకోవడం అంటే బీసీలకు అన్యాయం చేయడమేనన్నారు. కొలీజియం తీసుకున్న నిర్ణయం తొందరపాటు చర్యగా సీఎం చెప్పడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు చెప్పారు. కేంద్రానికి లేఖ రాసిన చంద్రబాబు ఏకంగా హైకోర్టునే తప్పుపట్టారంటే ఏ విధమైన ఆలోచనా విధానంతో ఉన్నారో అర్థమవుతుందన్నారు. దేశంలో ఓట్ల కోసం బీసీలను రాజకీయ పార్టీలు వాడుకుంటున్నాయని, జాతీయ బీసీ కమిషన్‌కు రాజ్యాంగ బద్ధమైన హక్కు కల్పించాలని కోరుతున్నా కేంద్రం స్పందించడం లేదన్నారు. ఎన్నో పోరాటాల ద్వారా బీసీల హక్కులు సాధించుకున్నట్లు చెప్పారు. బీసీల హక్కులు, సమస్యల పరిష్కారానికి పార్టీలు ఆసక్తి చూపడం లేదన్నారు. చట్ట సభల్లో నామినేటెడ్ పదవులకు 50 శాతం కేటాయించాలని డిమాండ్ చేశారు. బీసీలకు రాజ్యాంగాధికారం లక్ష్యంగా కొత్త పార్టీ ఏర్పాటుకు తగిన సన్నాహాలు చేస్తున్నట్లు వెల్లడించారు. ఏపీలో బీసీలకు చంద్రబాబు నాయుడు పూర్తిగా అన్యాయం చేశారన్నారు. ఇప్పుడు మాలో రాజకీయ చైతన్యం వచ్చినందున రాజ్యాధికారం కోసం పోరాటాలు చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. బీసీ సంఘాలతో చర్చించి త్వరలోనే రాజకీయ పార్టీ విధి విధానాలు రూపొందిస్తామన్నారు. గ్రామ స్థాయి నుంచి సంఘాన్ని పటిష్ట పరిచేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. -
వాళ్లు చెబుతుంటే నా గుండె తల్లడిల్లింది: వైఎస్ జగన్
సాక్షి, గుంటూరు : బీసీలపై నిజమైన ప్రేమ చూపించింది దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఒక్కరేనని వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా సత్తెనపల్లి నియోజకవర్గం గుడిపూడి కాలనీలో ఏర్పాటు చేసిన బీసీల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన బుధవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మోసాలను ఎండగట్టి, వైఎస్ఆర్ సీపీ అధికారంలోకి వచ్చాక అందరికీ తోడుగా ఉంటామని భరోసా ఇచ్చారు. కుటుంబం పేదరికం నుంచి బయటపడాలంటే వారి పిల్లలను ఉన్నత చదువులు చదివించాలి. పిల్లలు బాగా స్థిరపడాలంటే పిల్లలు పేదరికం పోవాలని అన్నారు. ఆత్మీయ సమ్మేళనం జరుపుకోవడం ఆనందంగా ఉంది.. ఈ రోజు గుంటూరు జిల్లాలో పాదయాత్రలో సందర్భంగా బీసీ సోదరులతోనూ, అక్క చెల్లెమ్మలతో ఆత్మీయ సమ్మేళనం జరుపుకోవడం చాలా చాలా సంతోషంగా ఉంది. నాలుగేళ్ల చంద్రబాబు పాలన చూశాం. మరో సంవత్సరంలో ఎన్నికలు జరుగబోతున్నాయని ఈ పెద్ద మనిషి ఊదరగొడుతున్నారు. ఇలాంటి సమయంలో మనమంతా కూడా గుండెలపై చేతులు వేసుకొని ఆలోచన చేయాలి. మనకు ఎలాంటి నాయకుడు కావాలని మనమందరం ఆలోచన చేయాలి. ఈ నాలుగేళ్ల పరిపాలన మనమంతా చూశాం కాబట్టి..ఈ పెద్ద మనిషి చంద్రబాబు మాటిమాటికి అభివృద్ధి అంటున్నారు. మనందరికి తెలిసిన అభివృద్ధి ఏంటంటే..నిన్నటి కంటే ఇవాళ బాగుంటే దాన్ని అభివృద్ధి అంటారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి పాలనను చూశాం. ఇవాళ చంద్రబాబు పాలనను చూసిన తరువాత మనం అభివృద్ధి చెందామా? ఏ ఒక్కరూ కూడా సంతోషంగా లేరు. ఫోటోలకు ఫోజులు చంద్రబాబు ఎన్నికల సమయంలో బీసీల గురించి ఏం మాట్లాడారో గుర్తుకు తెచ్చుకోవాలి. ఎన్నికల ప్రణాళిక చంద్రబాబు విడుదల చేశారు. ఇందులో చంద్రబాబు రకరకాలుగా ఫోజులు ఇస్తారు. గౌడ సోదరులు కనిపిస్తే వారి వద్ద ఉన్న తాడు ఈయన మీద వేసుకొని ఫోజు కొడతారు. ఆ పక్కనే బుట్టలు వేస్తున్నారు. వారి పక్కన కూర్చోని బుట్టలు వేస్తున్నట్లు ఫోటోలు దిగారు. చేనేతల ఇళ్లకు పోయి మగ్గం నేస్తున్నట్లు ఫోటోలు దిగారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన ఫోటోలు, స్టంట్లూ అన్ని బాగున్నాయి. ఎన్నికల ప్రణాళికలో ఏదైతే చెప్పారో అవి చేయకపోవడం మోసం కాదా చంద్రబాబు? మంచి కన్న చెడే ఎక్కువ.. రాజకీయాల్లో నలబై సంవత్సరాల అనుభవం ఉందని చంద్రబాబు చెబుతుంటారు. ప్రజలను మోసం చేయడంలోనా? వెన్నుపోటు పొడవటంలోనా నీ అనుభవం అని అడుగుతున్నాను. చంద్రబాబు నాలుగేళ్ల పాలనలో మంచి కన్న చెడు ఎక్కువగా జరిగింది. ఈ మనిషి చివరకు ఏ స్థాయిలో దిగజారిపోయారంటే..సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి చెబితే దాన్ని చేయగలిగే అవకాశాలు ఉన్నాయి. రాష్ట్రం పరిధిలో లేనివి కూడా టీడీపీ మేనిఫెస్టోలో పెట్టారు. కురవలు, కురబలను ఎస్టీల్లో చేర్చుతానన్నారు. రజకులను ఎస్సీలుగా చేస్తానని చర్యలు తీసుకుంటానని చెప్పారు. ఇవాళ ఇదే పెద్ద మనిషిని అడిగితే ఆయన ఏమంటారో తెలుసా? ఇది రాష్ట్రం పరిధిలో లేదని, కేంద్రం చేయాల్సి ఉందని చేతులు దులుపుకుంటారు. కేంద్రంపై నేరాన్ని నెట్టడం ఆయన చేతులు కడుక్కోవడం ఒక పద్ధతి ప్రకారం 40 ఏళ్ల అనుభవంతో ప్రజలను మోసం చేస్తున్నారు. ఇలాంటి మోసాలు చాలానే టీడీపీ మేనిఫెస్టోలో కనిపిస్తాయి. నాలుగు ఇస్త్రీ పెట్టెలు ఇస్తే సరిపోతుందా? ఎన్నికల సమయంలోనే చంద్రబాబుకు బీసీలు గుర్తుకు వస్తారు. నాలుగు ఇస్త్రీ పెట్టెలు, నాలుగు కత్తెర్లు ఇస్తే అదే బీసీల మీద ప్రేమ అనుకుంటారు. బీసీలపై నిజంగా ప్రేమ చూపించింది దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి ఒక్కరే అని నేను గర్వంగా చెబుతానున. నిజంగా పేదవాళ్లు పేదరికం నుంచి ఎలా బయటకు వస్తారంటే..నాలుగు ఇస్తీ్ర పెట్టెలు, కత్తెర్లు ఇస్తే పేద రికం నుంచి బయటకు రారు. ఆ కుటుంబం నుంచి డాక్టర్లు, ఇంజినీర్లుగా, కలెక్టర్లుగా బయటకు వస్తే పేదరికం పోతుంది. ఆ చదువులకు అప్పులపాలు కాకుంటే అప్పుడు ఆ కుటుంబాలు పేదరికం నుంచి బయటకు వస్తాయి. దీన్ని మహానేత గొప్పగా నమ్మారు. పేదవాడు పేదరికంలో ఎందుకు వెళ్తారంటే విద్యా, వైద్యం కోసం అప్పులు చేస్తే అప్పులు చేసినప్పుడే. వడ్డీలకు పరుగెత్తినప్పుడు అప్పులపాలు అవుతారు. ఈ రెండు కారణాలను దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి గొప్పగా చేశారు. నాన్నగారి హాయంలో ఏ పేదవాడు కూడా తన పిల్లలను పెద్ద పెద్ద చదువులు చదివించేందుకు ముఖ్యమంత్రిగా వైయస్ రాజశేఖరరెడ్డి తోడుగా ఉండి భరోసా కల్పించారు. నాన్నగారి హయాంలో పేదవారు తమ పిల్లలను చదివించేందుకు అవస్థలు పడలేదు. నాన్నగారు చనిపోయిన తరువాత ఇవాళ పరిస్థితి ఏంటీ? మన పిల్లలను ఇంజినీర్లుగా, డాక్టర్లుగా చదివించే స్థితిలో ఉన్నామా? ఇంజినీరింగ్ చదువులుకు ఏడాదికి లక్షలు ఖర్చు అవుతాయి. ప్రభుత్వం మాత్రం ముష్టి వేసినట్లు రూ.35 వేలు మాత్రమే ఇస్తున్నారు. మిగిలిన డబ్బుల కోసం తమ పిల్లలను చదివించేందుకు ఆ పేదవాడు అప్పులు చేయాల్సి వస్తోంది. ఇక్కడికి రాకముందు నెల్లూరు జిల్లాలో ఒక ఘటన చూశాను. ఓ పేదవాడు తన పిల్లలను చదివించేందుకు ఆరాటపడ్డాడు. ఇంజినీరింగ్ చదివించేందుకు మొదటి సంవత్సరం రూ.70 వేలు అప్పు చేశాడు. రెండో ఏడాది మళ్లీ అప్పులు చేస్తూ, వాళ్ల నాన్న బాధ చూడలేక ఆ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న దుస్థితి చూశాను. వారు చెబుతుంటే నా గుండె తల్లడిల్లిపోయింది. నాన్నగారి హయంలో మంచి రోజులు చూశాం. మహానేత చనిపోయాక మళ్లీ పరిస్థితులు మొదటికి వచ్చాయి. మీ పిల్లలను ఏం చదివిస్తారో మీ ఇష్టం రేపొద్దున మనందరి ప్రభుత్వం వచ్చాక మనం ఏం చేస్తామో చెబుతున్నాను. నాన్నగారు పేదవారి కోసం ఒక అడుగు ముందుకు వేస్తే..ఆయన కొడుకుగా నేను రెండు అడుగులు ముందుకు వేస్తాను. మీ పిల్లలను ఏం చదివిస్తారో మీ ఇష్టం. ఎన్ని లక్షలు ఖర్చైనా ఫర్వాలేదు..నేను చదివిస్తాను. ఏ తల్లిదండ్రులు అప్పులపాలు కాకుండా నేను తోడుగా ఉంటాను. మన పిల్లలను ఇంజినీరింగ్, డాక్టర్‌గా చదివించాలంటే హాస్టల్లో ఉండాలి. వీటి కోసం ఏడాదికి రూ.15 వేలు ఖర్చు అవుతుంది. ఈ డబ్బు కూడా పంపించలేని స్థితిలో చాలా మంది ఉన్నారు. అలాంటి ప్రతి పిల్లాడికి ఏడాదికి రూ.20 వేలు ఇస్తామని ఆ తల్లిదండ్రులకు చెబుతున్నాను. దీని వల్ల ఏ తల్లి తండ్రి అప్పుల పాలు కాకుండా భరోసా ఇస్తున్నాను. అప్పుడే మన తలరాతలు మారుతాయి.. ఇవాళ మన పిల్లలు ఉన్నత చదువులు చదవాలంటే వారికి పునాదులు ఆ చిట్టి పిల్లలు బడులకు వెళ్లి చక్కగా చదివితేనే మన తలరాతలు మారుతాయి. వీరు బడులకు వెళ్లేందుకు తల్లులు తమ పిల్లలను బడులకు పంపించాలి. నాన్నగారు పేదవారి కోసం ఒక అడుగు ముందుకు వేస్తే..నాన్నగారి కొడుకుగా నేను రెండు అడుగులు ముందుకు వేస్తున్నాను. పిల్లలను బడికి పంపించినందుకు ఆ తల్లికి ఏడాదికి రూ.15 వేలు ఇస్తాను. అక్కా చెల్లెమ్మలకు భరోసా ఇస్తున్నా.. బీసీల కోసం మనం చేయబోయే అతిపెద్ద కార్యక్రమం ఏంటంటే పింఛన్ల పెంపు. ఈ ప్రభుత్వానికి అవ్వతాతల పింఛన్లు పెంచాలనే ఆలోచన లేదు. కాంట్రాక్టర్లకు మాత్రం చంద్రబాబు రేట్లు బాగా పెంచుతారు. కారణంగా కాంట్రాక్టర్లు బాగా చంద్రబాబుకు లంచాలు ఇస్తారు కాబట్టి వారికి రేట్లు పెంచుతారు. అవ్వతాతల నుంచి చంద్రబాబుకు లంచాలు వెళ్లవు..జన్మభూమి కమిటీలకే ఈ లంచాలు అందుతాయి కాబట్టి పింఛన్లు పెంచడం లేదు. అవ్వతాతలకు వయసు పెరిగే కొద్ది చిన్న చిన్న ఖర్చులు పెరుగుతాయి. అవ్వతాతలకు చెబుతున్నాను..మనందరి ప్రభుత్వం రాగానే పింఛన్ వయసు 65 ఏళ్ల నుంచి 60 ఏళ్లకే తగ్గిస్తాం. పింఛన్ రూ.2 వేలుకు పెంచుతాను. ఇవాళ బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీల అక్కా చెల్లెమ్మల పరిస్థితి దారుణంగా ఉంది. ఒక్క వారం పనులు చేయకపోతే ఇంట్లో జరిగే పరిస్థితి లేదు. అలాంటి వారి కోసం పింఛన్ వయస్సు 45 ఏళ్లకే తగ్గిస్తున్నాను. రూ.2 వేలు పింఛన్ ఖచ్చితంగా ఇ స్తాం కాబట్టి రేపటి గురించి భరోసా ఉంటుంది. మనం వచ్చిన తరువాత మంచి చేసే కార్యక్రమాలు కొన్ని చెప్పాను. ఇంకా మనం ఏం చేయాలో మీరే సూచనలు, సలహాలు చెప్పండి. మీరు చెప్పేవాటిని పరిశీలించి మన మేనిఫెస్టోలో చేర్చుతాం. మన మేనిఫెస్టో కేవలం రెండు పేజీల్లో మాత్రమే ఉంటుంది. చెప్పినవే కాకుండా చెప్పనివి కూడా చేసి చూపిస్తానని మాట ఇస్తున్నాను. అని వైఎస్ జగన్ తెలిపారు. -
సర్కారు బీసీ విజన్
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో బీసీ కులాలను ఆకట్టుకునే వ్యూహాలకు ప్రభుత్వం పదును పెడుతోంది. వెనుకబడిన కులాల (బీసీల) అభివృద్ధి ప్రణాళికను ప్రకటించేందుకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆధ్వర్యంలో ఆదివారం ప్రత్యేక సమావేశం జరగనుంది. ఉదయం 11.30 గంటలకు అసెంబ్లీలోని కమిటీ హాల్లో జరిగే ఈ సమావేశానికి ప్రభుత్వం ఐదు అంశాలతో ఎజెండాను సిద్ధం చేసింది. ఈ భేటీకి హాజరు కావాలని అన్ని పార్టీల్లోని బీసీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలను బీసీ సంక్షేమశాఖ ఆహ్వానించింది. బీసీల అభివృద్ధికి ఇప్పటివరకు చేపట్టిన కార్యక్రమాలు, వాటి పురోగతిపై ముఖ్యమంత్రి ఈ భేటీలో విశ్లేషించనున్నారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ రూపంలో నివేదికను ప్రదర్శించే అవకాశాలున్నాయి. దీంతోపాటు హాజరైన ప్రజాప్రతినిధులందరికీ నివేదికను హ్యాండవుట్ల రూపంలో అందించనున్నారు. అనంతరం ఈ ఆర్థిక సంవత్సరపు బడ్జెట్లో బీసీ కులాలకు ప్రభుత్వం నిర్దేశించిన నిధులు, కేటాయింపులు, వాటి అమలు తీరుపై ప్రధానంగా చర్చ జరగనుంది. ప్రధానంగా నాయీ బ్రాహ్మణులకు రూ. 250 కోట్లు, రజకులకు రూ. 250 కోట్లు, ఎంబీసీ (అత్యంత వెనుకబడిన కులాలు)లకు రూ. వెయ్యి కోట్ల మేరకు చేసిన కేటాయింపులపై సమావేశంలో చర్చించి అభివృద్ధి ప్రణాళికను తయారు చేయడంపై దృష్టి సారిస్తారు. అలాగే సంచార జాతులు, విశ్వబ్రాహ్మణులు, కుమ్మరి/శాలివాహన, ఇతర కులాల ఫెడరేషన్లు, వడ్డెర, సంగెర (ఉప్పర) వాల్మీకి (బోయ), కృష్ణ బలిజ, పూసల, భట్రాజ, మేదర, గీత కార్మిక, ఇతర ఎంబీసీల అభివృద్ధిపైనా చర్చించనున్నట్లు ఎజెండాలో ప్రస్తావించారు. వీటితోపాటు ఫెడరేషన్ల భవిష్యత్తు ప్రణాళికలపై ఇందులో చర్చిస్తారు. రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ సమావేశాల అనంతరం ఎంబీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేయటం తప్ప ఎంబీసీల పరిధిలోకి వచ్చే కులాలేమిటో ఇప్పటివరకు గుర్తించలేదు. దీంతో నిధులేవీ ఖర్చు కాలేదు. ఈ నేపథ్యంలో ఎంబీసీ కులాల గుర్తింపునకు అనుసరించాల్సిన ప్రాతిపదిక, ఏయే కులాలకు ప్రాధాన్యం ఇవ్వాలి వంటి అంశాలపై ఈ భేటీలో నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయి. ముందుగా చెప్పినట్లుగానే... గత నెలలో జరిగిన శాసనసభ సమావేశాల్లోనే ముఖ్యమంత్రి కేసీఆర్ బీసీల అభివృద్ధి ప్రస్తావన వచ్చిన సందర్భంలో డిసెంబర్ 3న అన్ని పార్టీల బీసీ ప్రజాప్రతినిధులతో ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేసి ప్రణాళికకు కసరత్తు చేస్తామని చెప్పారు. బీసీల సమస్యలను తమ దృష్టికి తీసుకురావాలని, అవసరమైన సలహాలను అందించాలని అన్ని పార్టీల ప్రజాప్రతినిధులకు అదే రోజున సీఎం సూచించారు. ఈ నేపథ్యంలో ఆదివారం జరుగనున్న సమావేశం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. ప్రజాప్రతినిధులు ప్రస్తావించే అంశాలతోపాటు ప్రభుత్వపరంగా తీసుకునే నిర్ణయాలను సీఎం ఈ సమావేశంలో ప్రకటించే అవకాశముంది. మొత్తం 50 మందితో సమావేశం... సీఎం ఆధ్వర్యంలో జరిగే సమావేశంలో బీసీ కులాలకు చెందిన 20 మంది ఎమ్మెల్యేలు, 12 మంది ఎమ్మెల్సీలు, ఏడుగురు ఎంపీలు పాల్గొననున్నారు. అలాగే స్పీకర్ మధుసూదనాచారి, డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి, శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్, బీసీ కులాలకు చెందిన మంత్రులు ఈటల రాజేందర్, జోగు రామన్న, తలసాని శ్రీనివాస్ యాదవ్, పద్మారావుగౌడ్, బీసీ సంక్షేమశాఖ అధికారులు ఈ భేటీకి హాజరుకానున్నారు. మొత్తం 50 మందితో సమావేశం జరిగేలా అసెంబ్లీ మీటింగ్ హాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. మంత్రి జోగు రామన్న శనివారం అసెంబ్లీకి వెళ్లి స్పీకర్‌ను కలసి సమావేశం ఏర్పాట్లను పరిశీలించారు. అలాగే పోలీసు అధికారులు స్పీకర్‌తో సమావేశమై బందోబస్తు ఏర్పాట్లపై చర్చించారు. -
‘కాపు రిజర్వేషన్లపై శాస్త్రీయంగా అధ్యయనం’
విజయవాడ: కాపు రిజర్వేషన్లపై శాస్త్రీయంగా అధ్యయనం చేస్తున్నామని బీసీ కమిషన్ చైర్మన్ జస్టిస్ మంజునాథ్ తెలిపారు. ఇందుకు సంబంధించి 13 జిల్లాల్లో ప్రజాభిప్రాయాన్ని సేకరించామని ఆయన శుక్రవారమిక్కడ పేర్కొన్నారు. నివేదిక తుది దశలో ఉందని, అయితే తాము సమర్పించే నివేదికపై ప్రభుత్వమే నిర్ణయం తీసుకుంటుందన్నారు. రాజ్యాంగానికి మించి రిజర్వేషన్లు చేయడం వీలుకాదని, 64 కులాలకు సంబంధించిన కేసులు పెండింగ్‌లో ఉన్నాయని, వీటిని పరిష్కరించేందుకు కమిషన్ జిల్లాల్లో పర్యటించిందన్నారు. కొన్ని కులాలు బీసీలో నుంచి ఎస్టీల్లో చేర్చాలని అడుగుతూ అర్జీలు ఇస్తున్నారని, వారి సామాజిక, ఆర్థిక జీవన విధానాలను పరిగణలోకి తీసుకుని నివేదికను ప్రభుత్వానికి అందజేస్తామన్నారు. మూడు నెలల్లో ప్రభుత్వానికి నివేదిక ఇచ్చేందుకు యత్నిస్తామని తెలిపారు. -
రాజ్యాధికారం దిశగా బీసీలు ఐక్య పోరాటం చేయాలి
అఖిల భారత యాదవ సంఘ జిల్లా అధ్యక్షుడు మాధవపట్నం (సామర్లకోట) : బీసీలు రాజ్యాధికారం దిశగా ఐక్యతతో పోరాటం చేయాలని అఖిల భారత యాదవ సంఘ జిల్లా అధ్యక్షుడు కుండల సాయికుమార్ పిలుపు నిచ్చారు. మాధవపట్నం గ్రామంలో సోమవారం సాయంత్రం ఏర్పాటు చేసిన బీసీ కులాల సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. బీసీ కులాల వారికి పల్లకి మోయడానికే ఉపయోగించుకొంటున్నారని, ఎన్నికలు పూర్తయిన తరువాత ఉపయోగించుకొని వదలి వేస్తున్నారన్నారు. బీసీల్లోని అన్ని కులాలకు చెందిన వారు ఐక్యంగా ఉండటంతో రాజ్యాధికారం వస్తుందని చెప్పారు. బీసీ కులాల పెద్దాపురం నియోజక వర్గ కన్వీనర్‌గా పెంకే వెంకటేష్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. రజక చైతన్య సంస్థ జిల్లా కార్యదర్శి కురుమళ్ల రాజబాబు, సమాజ్‌వాది పార్టీ జిల్లా అధ్యక్షుడు సీహెచ్ వెంకటే«శ్వర్లు, అఖిల భారత పద్మశాలి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి స్వర్ణగంట సత్యనారాయణ, బీజీ ఐక్య వేదిక కార్యదర్శి రాయుడు మోజెస్, 93 బీసీ కులాల ఐక్యవేదిక జిల్లా అధ్యక్షుడు, ఏపీ జేఏసీ కో కన్వీనర్ మాకిరెడ్డి భాస్కరగణేష్బాబు తదితరులు పాల్గొన్నారు. -
'చంద్రబాబుపై విచారణ వేగవంతం చేయాలి'
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుపై పోలీసు విచారణను వేగవంతం చేయాలని డిమాండ్ చేస్తూ బీసీ సంఘం నేతలు మంగళవారం మానవ హక్కుల కమిషన్ (హెచ్చార్సీ) కార్యాలయం ముందు ధర్నా చేశారు. కులాల మధ్య చిచ్చుపెట్టే విధంగా చంద్రబాబు వ్యాఖ్యలు చేసి రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడ్డారని ఏప్రిల్ నెలలో బీసీ సంఘం నేతలు హెచ్చార్సీలో ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన హెచ్చార్సీ విచారణ చేయాలని డీజీపీని ఆదేశించింది. విచారణ చేయకుండా పోలీసులు తాత్సారం చేస్తున్నారని బీసీ సంఘం నేత డేరంగుల ఉదయ్‌కిరణ్ ఆరోపించారు. పోలీసుల నిర్లక్ష్యంపై హెచ్చార్సీ చైర్మన్ కక్రూకు మరోసారి ఫిర్యాదు చేశారు. ఈ కేసును సీబీసీఐడీకి బదలాయించాలని కోరారు. -
బీసీలను అణగదొక్కుతున్న ప్రభుత్వం
బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పోతిన వెంకట మహేష్ గాంధీనగర్ : రాష్ట్రంలోని టీడీపీ ప్రభుత్వం బీసీలను అణగొక్కేం దుకు ప్రయత్నిస్తోందని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పోతిన వెంకట మహేష్ అన్నారు. ఎన్నికల ముందు బీసీలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతూ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ధర్నా చౌక్‌లో శనివారం మహాధర్నా నిర్వహించారు. మహేష్ మాట్లాడుతూ ఎన్నికల ముందు చెప్పిన బీసీ డిక్లరేషన్, బీసీ సబ్‌ప్లాన్‌కు చట్టబద్దత వంటివి అటకెక్కించారని చెప్పారు. అగ్రవర్ణాలను, అర్హత లేని కులాలను బీసీ జాబితాలో చేరిస్తే సహించేది లేదని హెచ్చరించారు. రాష్ట్రంలో 56 శాతం ఉన్న బీసీలకు కార్పొరేషన్ ద్వారా రూ. 240 కోట్లు ప్రకటించిన ప్రభుత్వం కేవలం 6 శాతం ఉన్న కాపులకు రూ. 1000 కోట్లు కేటాయించి వివక్ష చూపుతోందన్నారు. విదేశీ విద్యా పథకం లోనూ బీసీలకు తీరని అన్యాయం జరిగిందని చెప్పారు. ఈ పథకం కింద 500 మందిని విదేశాలకు పంపాల్సి ఉండగా కేవలం 13మంది బీసీ విద్యార్థులనే ఎంపిక చేశారన్నారు. కాపు సామాజికవర్గానికి చెందిన 145 మందిని ఎంపిక చేయడం వివక్ష కాదా? అని ప్రశ్నించారు. ఆదరణ పథకాన్ని అటకెక్కించారన్నారు. బీసీ సబ్‌ప్లాన్‌కు చట్టబద్దత కల్పించాలని, బీసీ డిక్లరేషన్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. ధర్నాలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నూకాలమ్మ, కామరాజ్ హరీష్, చెరుకూరి సత్య, బీసీ విద్యార్థులు పాల్గొన్నారు. -
'లోకాయుక్త ఉంటే చంద్రబాబు జైలుకే'
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో రామరాజ్యం స్థాపిస్తానని చెప్పి అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రస్తుతం రావణ రాజ్యాన్ని కొనసాగిస్తున్నారని ఆంధ్రప్రదేశ్ బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డేరంగుల ఉదయ్‌కిరణ్ దుయ్యబట్టారు. శుక్రవారం ఆయనిక్కడ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ సొంత ప్రచారం కోసం కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని వృధాగా ఖర్చు పెడుతున్న బాబు వైఖరిపై రాష్ట్రపతి జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేశారు. దేశంలో ఏ ముఖ్యమంత్రికి లేనంత భద్రత చంద్రబాబుకు ఉందని, ఇంత ఖర్చు అవసరమా అని ఆయన ప్రశ్నించారు. అన్ని రాష్ట్రాల్లో సీఎం పైన కేసు నమోదు చేసేందుకు లోకాయుక్త ఉండగా ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం లోకాయుక్త లేకుండా చూస్తున్నారని అన్నారు. లోకాయుక్త ఉంటే బాబు జైలుకు వెళ్లడం ఖాయమని చెప్పారు. -
నిమిషం ఆలస్యమైనా తీసుకోం
‘కానిస్టేబుల్’ దరఖాస్తులపై పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు సాక్షి, హైదరాబాద్: పోలీస్ కానిస్టేబుల్ పోస్టుల కోసం ఫిబ్రవరి 4 అర్ధరాత్రి 12 గంటల లోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు తెలిపింది. ఒక్క నిమిషం ఆలస్యమైనా దరఖాస్తులను స్వీకరించబోమని స్పష్టం చేసింది. అలాగే దరఖాస్తు కోసం మీసేవా, ఆన్లైన్లలో డీడీలు తీసి, ఆ తర్వాత తీరిగ్గా ఆన్లైన్లో సబ్మిట్ చేస్తామన్నా కుదరదంది. ఒక వేళ డీడీలు తీసి, సబ్మిట్ చేయడంలో ఆలస్యం అయితే డబ్బులు తిరిగి చెల్లిం చబడవని రిక్రూట్‌మెంట్‌బోర్డు చైర్మన్ జె.పూర్ణచందర్రావు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. కాగా, ఇప్పటి వరకు వచ్చిన మొత్తం 3.78 లక్షల దరఖాస్తుల్లో బీసీ సామాజిక వర్గం నుంచే అత్యధికంగా 1,98,998 అందినట్టు బోర్డు వెల్లడించింది. అయితే ఖమ్మం జిల్లాలో మాత్రం అత్యధికంగా ఎస్టీ అభ్యర్థుల నుంచే దరఖాస్తులు అందాయంది. ఈ జిల్లాలో బీసీల నుంచి 11,304, ఎస్టీల నుంచి 15,978 దరఖాస్తులు వచ్చాయని బోర్డు పేర్కొంది. -
ఫీజులు, స్కాలర్‌షిప్పుల కోసం ఆందోళన
ఫీజు రీయింబర్స్మెంట్, ఉపకార వేతనాలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు ఆందోళనకు దిగారు. నల్లగొండ జిల్లా మోత్కూర్‌లోని కళాశాలల విద్యార్థులు శనివారం తరగతులు బహిష్కరించి, తహశీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. బీసీ సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సంఘం రాష్ట్ర కార్యదర్శి బుర్రా శ్రీనివాస్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
కాపులకు కుచ్చుటోపి!
-
బీసీల సీట్లను తగ్గించ డం బాధాకరం
హన్మకొండ చౌరస్తా, న్యూస్‌లైన్ : బీసీ సామాజికవర్గం నుంచి తెలంగాణ పీసీసీ చీఫ్‌గా నియమితులైన పొన్నాల లక్ష్మయ్య బీసీల సీట్లను తగ్గించ డం బాధాకరమని పీసీసీ సభ్యుడు డాక్టర్ బండా ప్రకాష్ ఆవేదన వ్యక్తం చేశారు. హన్మకొండలోని అశోకా కాన్ఫరెన్స్‌హాల్ లో మంగళవారం కాంగ్రెస్ ఓబీసీ సెల్ జిల్లా చైర్మన్ పసునూటి లింగస్వామి, పరకాల ఇన్చార్జ్ సాంబారి సమ్మారావు, బీసీ సంఘాల నాయకులతో కలిసి విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా బండా ప్రకాష్ మాట్లాడా రు. పొన్నాల లక్ష్మయ్య జిల్లా రాజకీయాల్లోకి రాకముందే దేశ్‌ముఖ్, దొరలు, గడీల పాలనకు వ్యతిరేకంగా బీసీలు పోరాడి ఆనాడే మూడు నుంచి నాలుగు స్థానాలు సాధించుకున్నారని గుర్తుచేశారు. నాటి నుంచి నేటి వరకు ఎక్కడ బీసీ అభ్యర్థి పోటీలో ఉన్నా ఓడిన దాఖ లాలు లేవని తెలిపారు. 2004లో టీఆర్ఎస్ పొత్తులో భాగంగా బీసీలు మూడు చోట్ల గెలిచారని వివరించారు. 2009లో కూడా కాంగ్రెస్ పార్టీ ముగ్గురు బీసీలకు సీట్లు కేటాయించిందని, ఎవరి ఒత్తిడితో మూడు నుంచి రెండు స్థానాలకు కుదించారో చెప్పాల్సిన బాధ్యత పీసీసీ చీఫ్‌పై ఉందని అన్నారు. 52 శాతం ఉన్న బీసీలకు 32 సీట్లను కేటాయించడం అన్యాయమన్నారు. రెండేళ్ల వరకు ఎవరో తెలియని అనామకుడికి టికెట్ కేటాయించడం సరైంది కాదని పరకాల అభ్యర్థి వెంకట్రాంరెడ్డి ని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఇప్పటికైనా పొన్నాల లక్ష్మయ్య మనసు మార్చుకుని బీసీలకు మరో స్థానం కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. లేదంటే బీసీల భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ పరకాల ఇన్చార్జ్ సాంబారి సమ్మారావు మాట్లాడుతూ 2014 ఎన్నికల టికెట్ తనకే అని హామీ ఇచ్చారని.. ఇప్పుడు హామీని మరిచి, 30 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తిని కాదని ఏడాది క్రితం వరకు ఎవరికి తెలియని వ్యక్తికి సీటు కేటాయించడం సరికాదని వివరించారు. పరకాల టికెట్ తనకే కేటాయిస్తానని హామీ ఇవ్వలేదని అంటే.. భద్రకాళి గుడిలో తన భార్య, పిల్లలతో ప్రమాణం చేస్తానని, లేదంటే మాటిచ్చిన నాయకులు చేస్తారా అని సవాల్ విసిరారు. పరకాల టికెట్ పొందిన వ్యక్తి తాను కింది నుంచి పై వరకు అందరికి ముడుపులు చెల్లించాలని బాహాటంగా చెబుతున్నాడు.. అది పార్టీకి అపఖ్యాతి తీసుకురాదా అని ప్రశ్నించారు. చైతన్య వంతులైన బీసీలను ఓటు బ్యాంకుగా వాడుకుంటే కాంగ్రెస్ పార్టీ తగిన మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు. సమావేశంలో పీసీసీ రాష్ట్ర కోఆర్డినేటర్ ఉల్లెంగుల యాదగిరి, నారగోని కుమార్‌గౌడ్, పులి శ్రీనివాస్, ఏదునూరి రాజమొగిలి, పరకాల నియోజకవర్గ మండలాల అధ్యక్షులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
31న బీసీల రాష్ట్ర స్థాయి సమావేశం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని వెనుకబడిన వర్గాల ప్రజల సమస్యలను చర్చించి భవిష్యత్ కార్యాచరణ రూపొందించేందుకు ఈనెల 31న హైదరాబాద్‌లో రాష్ట్ర స్థాయి విస్తృత సమావేశం నిర్వహించాలని బీసీ సంఘాలు నిర్ణయించాయి. ఈ సమావే శంలో ప్రధానంగా వచ్చే ఎన్నికలలో అన్ని రాజకీయ పార్టీల నుంచి బీసీలకు 150 అసెంబ్లీ, 22 ఎంపీ సీట్ల కేటాయింపు, చట్టసభల్లో రిజర్వేషన్లు, బీసీ సబ్‌ప్లాన్ తదితర అంశాలు ఎజెండాగా ఉంటాయని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సమావేశానికి ఎనిమిది మంది బీసీ మంత్రులు, 9 మంది ఎంపీలు, 70 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వివిధ యూనివర్సిటీల ప్రొఫెసర్లు, కులసంఘాల ముఖ్యులు హాజరవుతారని ఆయన వెల్లడించారు.