
రాష్ట్రంలో కొప్పుల వెలమ సామాజికవర్గానికి తొలిసారి గుర్తింపునిచ్చింది సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అని కొప్పుల వెలమ కార్పొరేషన్ చైర్మన్ నెక్కల నాయుడుబాబు చెప్పారు.
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కొప్పుల వెలమ సామాజికవర్గానికి తొలిసారి గుర్తింపునిచ్చింది సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అని కొప్పుల వెలమ కార్పొరేషన్ చైర్మన్ నెక్కల నాయుడుబాబు చెప్పారు. ఎమ్మెల్యే బూడి ముత్యాలనాయుడుని గతంలో ప్రభుత్వ విప్‌గా నియమించారని, ఇప్పుడు కీలకమైన ఉప ముఖ్యమంత్రిగా, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా నియమించడం తమకు జగన్ ఇచ్చిన గౌరవమని అన్నారు. ఆయన సోమవారం విజయవాడలో విలేకరులతో మాట్లాడుతూ.. రాష్ట్ర జనాభాలో 25 లక్షల మందికి పైగా ఉన్న తమ సామాజికవర్గం కోసం మొదటిసారి సీఎం జగన్ కార్పొరేషన్ ఏర్పాటు చేశారని తెలిపారు. కొప్పుల వెలమలు వైఎస్ జగన్ వెంట నడుస్తారని చెప్పారు.
చదవండి: ఏపీ మంత్రుల ప్రమాణ స్వీకారోత్సవంలో ఆసక్తికర దృశ్యాలు