
సాక్షి, విజయవాడ: ఎన్నికలు సమీపించడంతోనే చంద్రబాబు జయహో బీసీ సభ అంటున్నారని, కానీ ఆయన బీసీలకు చేసిందేమీ లేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయవాడ పార్లమెంటు బీసీ సెల్ అధ్యక్షుడు కసగోని దుర్గారావు విమర్శించారు. విజయవాడలోని పార్టీ కార్యాలయంలో ఆయన శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. బీసీల విషయంలో చంద్రబాబు మరో కపట నాటకం ఆడుతున్నారని మండిపడ్డారు. వైఎస్సార్‌సీపీ వచ్చే నెలలో బీసీ గర్జన సభ నిర్వహించి బీసీ డెక్లరేషన్‌ను ప్రకటించబోతోందని వెల్లడించారు. బీసీ కులాలను చట్టసభల్లో కూర్చోపెట్టేది వైఎస్ జగన్ మాత్రమేనని ఆయన స్పష్టం చేశారు. తమ పార్టీ బీసీ అధ్యయన కమిటీ తుది ముసాయిదా నివేదికను ఈ నెల 28న పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌కు అందజేస్తుందని తెలిపారు.
వైఎస్సార్‌సీపీ బీసీ విభాగం రీజినల్ కో-ఆర్డినేటర్లు వీరే..
వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ బీసీ విభాగం రీజినల్ కో-ఆర్డినేటర్లను నియమించినట్టు పార్టీ కేంద్ర కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. బీసీ విభాగం రాయలసీమ రీజినల్ కో-ఆర్డినేటర్‌గా తొండమల్ల పుల్లయ్య, బీసీ విభాగం కోస్తాంధ్ర రీజినల్ కో-ఆర్డినేటర్‌గా అంగిరేకుల ఆదిశేషు, బీసీ విభాగం ఉత్తరాంధ్ర రీజినల్ కో-ఆర్డినేటర్‌గా పక్కి వెంకటసత్య దివాకర్‌ను నియమించినట్టు తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment