'లోకాయుక్త ఉంటే చంద్రబాబు జైలుకే' | ap BC community president derangula uday kiran slams chandrababu | Sakshi
Sakshi News home page

'లోకాయుక్త ఉంటే చంద్రబాబు జైలుకే'

Published Fri, May 13 2016 7:42 PM | Last Updated on Mon, Sep 4 2017 12:02 AM

ఆంధ్రప్రదేశ్‌లో రామరాజ్యం స్థాపిస్తానని చెప్పి అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రస్తుతం రావణ రాజ్యాన్ని కొనసాగిస్తున్నారని..

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో రామరాజ్యం స్థాపిస్తానని చెప్పి అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రస్తుతం రావణ రాజ్యాన్ని కొనసాగిస్తున్నారని ఆంధ్రప్రదేశ్ బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డేరంగుల ఉదయ్‌కిరణ్ దుయ్యబట్టారు. శుక్రవారం ఆయనిక్కడ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ సొంత ప్రచారం కోసం కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని వృధాగా ఖర్చు పెడుతున్న బాబు వైఖరిపై రాష్ట్రపతి జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేశారు. దేశంలో ఏ ముఖ్యమంత్రికి లేనంత భద్రత చంద్రబాబుకు ఉందని, ఇంత ఖర్చు అవసరమా అని ఆయన ప్రశ్నించారు. అన్ని రాష్ట్రాల్లో సీఎం పైన కేసు నమోదు చేసేందుకు లోకాయుక్త ఉండగా ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం లోకాయుక్త లేకుండా చూస్తున్నారని అన్నారు. లోకాయుక్త ఉంటే బాబు జైలుకు వెళ్లడం ఖాయమని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement