రూ.10 వేల కోట్లతో బీసీ సబ్‌ప్లాన్‌ | BC subplan should be set up with Rs 10000 crore Says R krishnaiah | Sakshi
Sakshi News home page

రూ.10 వేల కోట్లతో బీసీ సబ్‌ప్లాన్‌

Published Sat, Sep 14 2019 5:46 AM | Last Updated on Sat, Sep 14 2019 5:46 AM

BC subplan should be set up with Rs 10000 crore Says R krishnaiah - Sakshi

కవాడిగూడ:  పదివేల కోట్ల రూపాయలతో బీసీ సబ్‌ప్లాన్‌ ఏర్పాటు చేయాలని, బీసీలకు చట్టసభల్లో 50 శాతం రిజర్వేషన్లు కలి్పంచాలని బీసీ సంక్షేమ సంఘం నేత ఆర్‌.కృష్ణయ్య డిమాండ్‌ చేశారు. అన్నిరంగాల్లో బీసీల వాటా, కోటా తగ్గించి బీసీల అణిచివేతకు పాల్పడటాన్ని నిరసిస్తూ శుక్రవారం ఇక్కడి ఇందిరాపార్కు ధర్నాచౌక్‌ వద్ద సంఘం జాతీయ ఉపాధ్యక్షులు గుజ్జ కృష్ణ, నీల వెంకటేశ్‌ ఆధ్వర్యంలో మహాధర్నా నిర్వహించారు. ధర్నానుద్దేశించి ఆర్‌.కృష్ణయ్య మాట్లాడుతూ   బడ్జెట్‌లో బీసీల నిధుల్లో 50 శాతం కోత విధించడం ఎంతవరకు న్యాయమని ప్రశ్నించారు.

ఏపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి 50 శాతం నామినేటెడ్‌ పదవులను బీసీలకు ఇస్తున్నారని, కానీ కేసీఆర్‌ మాత్రం బీసీలను అడుగడుగునా తొక్కడానికి ప్రయతి్నస్తున్నారని విమర్శించారు. టీజేఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు ప్రొ.కోదండరాం మాట్లాడుతూ ఆర్థిక మాంద్యం పేరుతో బడ్జెట్‌లో భారీగా కోతపెట్టారని, బీసీలకు అన్యా యం జరుగుతోందని అన్నారు. సంఘటితంగా ఉద్యమించపోతే హక్కులు పోతాయని అన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ నాయకులు మల్లు రవి, బీసీ  నేతలు భూపే‹Ù, సాగర్, అంజి, నందగోపాల్, కోలా శ్రీనివాస్, మల్లేష్‌ యాదవ్, ఏపీ నేత వెంగళరావు, 32 కుల, 25 బీసీ, ఎంబీసీ, విద్యార్థి, యువజన సంఘాలు పాల్గొన్నాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement