కేసీఆర్‌కు అభివాదం చేస్తున్న ఆర్. కృష్ణయ్య
సాక్షి, హైదరాబాద్: జనగణన ప్రక్రియలో బీసీ కులాల వారీగా జనాభాను లెక్కించాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. ఈమేరకు ఆర్.కృష్ణయ్య నేతృత్వంలో బీసీ సంక్షేమసంఘం నేతలు శుక్రవారం సీఎం కేసీఆర్‌కు వినతిపత్రం సమర్పించారు. కృష్ణయ్య మాట్లాడుతూ..బీసీలకు కేంద్రంలో కనీసం మంత్రిత్వ శాఖ కూడా లేదని, అదేవిధంగా వారికి సంక్షేమపథకాలు కూడా లేవని ఆవేదన వ్యక్తం చేశారు.
కులాలవారీగా జనగణన చేయాలని కేంద్రానికి ఎన్నిసార్లు వినతిపత్రాలు ఇచ్చినా సరైన స్పందన లేదని, ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపి కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని కోరారు. కాగా, దీనిపై అసెంబ్లీలో తీర్మానం చేయడంతోపాటుగా ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కూడా మాట్లాడి కేంద్రంపై ఒత్తిడితెస్తామని సీఎం కేసీఆర్ హామీనిచ్చినట్లు కృష్ణయ్య తెలిపారు. సీఎంను కలసినవారిలో బీసీ సంక్షేమసంఘం ఉపాధ్యక్షుడు గుజ్జకృష్ణ తదితరులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment